panama papers
-
Pandora Papers: రహస్య లావాదేవీల కుంభకోణం.. సచిన్‌కు క్లీన్చిట్!
Pandora Papers 2021 Sachin Name: లక్షల మంది ప్రముఖుల గోప్యపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ‘పండోరా పేపర్స్-2021’ స్కాండల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశ అధ్యక్షుల మొదలు.. సినీ తారల దాకా లక్షల మంది విదేశీ రహస్య ఆస్తులు, లావాదేవీలకు సంబంధించిన రహస్య డాక్యుమెంట్లను ఇంటర్నేషనల్ కన్సోర్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖులకు డాక్యుమెంట్లలో క్లీన్చిట్ దక్కగా.. ఆ పేర్లలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఉన్నారు. Pandora Papers 2021 వ్యవహారంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు పరోక్షంగా క్లీన్చిట్ ఇచ్చింది ఐసీఐజే నివేదిక. సచిన్ విదేశీ పెట్టుబడులు సక్రమేనని, ఈ విషయాన్ని ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు సైతం ధృవీకరించినట్లు ఆయన తరపు అటార్నీ స్టేట్మెంట్ను పండోరా పేపర్స్ నివేదిక స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు కేవలం సచిన్ పేరును మాత్రమే పత్రాల్లో పేర్కొన్నామని, ఆయన రహస్య లావాదేవీలకు సంబంధించి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని తెలిపింది . ఇక పాప్ సింగర్ షకీరా, సూపర్ మోడల్ మిస్ షిఫ్ఫర్‌లకు సైతం క్లీన్ చిట్ లభించింది. ఏమిటీ పనామా పేపర్స్.. నల్ల ధనవంతుల గుట్టురట్టు! ఇమ్రాన్ సర్కార్‌పై విమర్శలు మరోవైపు అధికారికంగా వెల్లడించని ఆర్థిక లావాదేవీల వివరాలతో కూడిన పండోరా పేపర్స్ ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. నేతలు, మాజీ నేతలు, అధికారులు, ఇతరత్ర సెలబ్రిటీల పేర్లు మొత్తంగా 91 దేశాల నుంచి(భారత్ నుంచి 300 మంది పేర్లు) అందులో పేర్కొని ఉన్నాయి. మొత్తం పద్నాలుగు రంగాల్లో, దాదాపు 956 కంపెనీల్లో వీళ్లంతా రహస్య పెట్టుబడులు పెట్టడం లేదంటే ఆస్తుల్ని కలిగి ఉన్నట్లు సమాచారం. భారత్ నుంచి ఆరుగురు, పాక్ నుంచి ఏడుగురు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ నివేదిక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇరకాటంలో పడేసింది. ఆయన సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు, ఆయన కేబినెట్ మంత్రులకు కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నాయని పండోరా పేపర్స్ వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు, పీఎంల్–క్యూ పార్టీ నేత చౌదరి మూనిస్ ఎలాహీకి అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉందని పత్రాల్లో బహిర్గతమైంది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాకే దర్యాప్తునకు ముందుకెళ్తామని పాక్ ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలు, 150 మీడియా ఔట్లెట్స్, 600 మంది జర్నలిస్టుల నుంచి సమగ్ర దర్యాప్తు చేపించుకుని ఈ వివరాలను సేకరించి బట్టబయలు చేసినట్లు ప్రకటించుకుంది ఇంటర్నేషనల్ కన్సోర్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్. ధనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించిన 12 మిలియన్ల (1.20 కోట్లు) పత్రాలను తాము సేకరించినట్లు ఐసీఐజే వెల్లడించింది. పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ తదితర దేశాల్లో వారు నల్ల ధనాన్ని దాచుకోవడానికి, రహస్యంగా ఆస్తులు పోగేసుకోవడానికి డొల్ల కంపెనీలను సృష్టించారని తెలిపింది. ఇదిలా ఉంటే పండోరా పేపర్స్ వివరాలు కేవలం ఆరోపణలు మాత్రమే. వీటిపై దర్యాప్తు చేయించడం, చేయించకపోవడం సంబంధిత ప్రభుత్వాల ఇష్టం. -
పనామా పేపర్లు : మళ్లీ సంచలనం
న్యూఢిల్లీ : పనామా పేపర్ల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండేళ్ల తర్వాత లా కంపెనీ మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన మరికొన్ని పరిశోధనాత్మక పత్రాలు బయటకు వచ్చాయి. దాదాపు 12 లక్షలకు పైగా సరికొత్త పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) అధ్యాయనం చేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం బయటపెట్టిన పత్రాలన్నింటిని దక్షిణ జర్మనీ వార్తాపత్రిక సేకరించింది. వీటిలో దాదాపు 12 వేల పత్రాలు భారతీయులకు సంబంధించినవి కావడం గమనార్హం. 2016లో దాదాపు 500 మంది భారతీయుల పేర్లు మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన పత్రాల్లో ఉన్నాయి. వీటిపై విచారణ జరిపేందుకు భారత ప్రభుత్వం మల్టీ ఏజెన్సీ గ్రూప్(ఎమ్‌ఏజీ)ను ఏర్పాటు చేసింది. 2016 లీక్‌ల ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఎమ్‌ఏజీ గుర్తించింది. కొత్త లీక్‌లో ఉన్న విషయాలేంటి..? కొత్త పత్రాల్లో భారత్‌కు చెందిన పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయి. వీరి పేర్లు 2016 లీక్స్‌లో లేవు. - పీవీఆర్ సినిమా యజమాని అజయ్ బిజ్లీ, ఆయన కుటుంబ సభ్యులు - సునీల్ మిట్టల్ కుమారుడు, హైక్ మెసేంజర్ సీఈవో, భారతీ ఎయిర్టెల్ సీఈవో కవిన్ భారతి మిట్టల్ - ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ అశ్విన్ దాని కుమారుడు జలాజ్ అశ్విన్ దాని వీరికి లింక్‌లు ఉన్నాయని తేలింది.. పనామా పేపర్లలో తమ పేర్లు రావడాన్ని ఖండించిన కొందరు ప్రముఖుల పేర్లు మళ్లీ బయటకు వచ్చాయి. వీరికి ఆఫ్ షోర్ కంపెనీలతో బిజినెస్ లింక్స్ ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలను ఐసీఐజే జర్నలిస్టులు సంపాదించారు. సదరు ప్రముఖుల పేర్లు ఇవే.. - శివ్ విక్రమ్ ఖేమ్కా - నటుడు అమితాబ్ బచ్చన్ - మాజీ సొలిసిటర్ జనరల్ తనయుడు జహంగీర్ సోరబ్జీ - డీఎల్ఎఫ్ గ్రూప్‌కు చెందిన కేపీ సింగ్, ఆయన కుటుంబం - అనురాగ్ కేజ్రీవాల్ - మెహ్రాసన్స్ జ్యువెల్లర్స్‌కు చెందిన నవీన్ మెహ్రా - అండర్ వరల్డ్ డాన్ ఇక్బాల్ మిర్చి భార్య హజ్రా ఇక్బాల్ మెమన్ -
విండోస్ 2017
కొన్ని తీపి గురుతులు.. మరికొన్ని చేదు గుళికలు.. ఎన్నో మధుర స్మృతులు.. మరెన్నో పీడ కలలు.. మొత్తంగా 2017 ఎన్నో జ్ఞాపకాలను మిగులుస్తూ వీడ్కోలుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో 2017కి వీడ్కోలు పలికి 2018 సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ తరుణంలో గడిచిన 2017లో దేశంలోనూ, ప్రపంచంలోనూ చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు, పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ మేలో ప్రపంచాన్ని వాన్నాక్రై వణికించింది.150 దేశాల్లో విండోస్ ఓఎస్ ఉపయోగించే కంప్యూటర్లు, సంస్థలు లక్ష్యంగా సైబర్ దాడులు సాగాయి. ఈ కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని తిరిగి ఇచ్చేందుకు బిట్‌కాయిన్ క్రిప్టో కరెన్సీతో చెల్లింపులు చేయాలని బెదిరింపులకు పాల్పడ్డారు. వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తరకొరియా సైనిక పాలకుడు కిమ్ జోంగ్–ఉన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ చర్యలతో ట్రంప్, కిమ్ మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. ట్రంప్ హెచ్చరికలు.. కిమ్ ప్రతి హెచ్చరికలతో ఇరుదేశాల మధ్యా యుద్ధ వాతావరణం నెలకొంది. జనవరి 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. అమెరికాను మరోసారి శక్తివంతమైన, సంపన్న దేశంగా మారుస్తానంటూ వాగ్దానం చేశారు. అధికారాన్ని చేపట్టిన కొద్ది కాలంలోనే తన వ్యవహారశైలి, మాట్లాడే ధోరణి, ముఖ్యమైన సమస్యలపై స్పందించే తీరుతో ట్రంప్ అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. 37 ఏళ్ల పాటు జింబాబ్వే అధ్యక్షుడిగా ఉన్న రాబర్ట్ ముగాబేకు రాజకీయ చరమాంకంలో చేదు అనుభవం ఎదురైంది. సైనిక తిరుగుబాటు ద్వారా ఆయన బలవంతంగా రాజీనామా చేసే వరకు పరిస్థితులు దారితీశాయి. తన భార్య గ్రేస్ ముగాబేను తొలుత ఉపాధ్యక్షురాలిని చేసి, తన తర్వాత అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టాలని ముగాబే చేసిన ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత దీనికి కారణమైంది. ఆరురోజుల పాటు దిగ్బంధం ఫలితంగా ఆ దేశ తర్వాతి అధ్యక్షుడిగా ఎమార్సన్ నాన్‌గాగ్వా బాధ్యతలను స్వీకరించారు. పనామా పేపర్ల పేరిట జర్మనీ వార్తాపత్రిక విడుదల చేసిన లక్షలాది పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తల సందేహాస్పద ఆర్థిక వ్యవహారాలు బయటకు వచ్చాయి. ఈ వివాదాల్లో చిక్కుకున్న వారిలో ఎలిజబెత్ రాణి–2 మొదలుకుని, బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఐర్లాండ్‌కు చెందిన పాల్ డేవిడ్ హ్యూసన్(బోనో) తదితరులున్నారు. ఆగస్టు చివర్లో మయన్మార్‌లో రోహింగ్యాలపై అక్కడి సైన్యం హత్యాకాండతో బంగ్లాదేశ్ తదితర దేశాలకు పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా దాడుల బారిన పడిన తెగగా రోహింగ్యాలను పరిగణిస్తున్నారు. రోహింగ్యా శరణార్థుల సమస్యకు ఇంకా ఎలాంటి పరిష్కారం లభించలేదు. దేశ 14వ రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్ జూలై 17న, 13వ ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు ఆగస్ట్ 5న ఎన్నికయ్యారు. వారు వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులు మీరాకుమార్, గోపాలకృష్ణ గాంధీని ఓడించారు. బీజేపీ నేపథ్యమున్న మొదటి రాష్ట్రపతిగా కోవింద్(72) చరిత్రకెక్కారు. బిహార్ గవర్నర్‌గా పనిచేసిన కోవింద్‌కు 65 శాతం ఓట్లు లభించాయి. వరుసగా దాదాపు 19 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన వెంకయ్య ఆ సభకే అధ్యక్షుడయ్యారు. 1997లో నాసా ప్రయోగించిన కాసిని అంతరిక్షనౌక 2004లో శనిగ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. నాలుగున్నర లక్షల ఉపగ్రహ చిత్రాల ద్వారా విలువైన సమాచారాన్ని అందించింది. 2017 సెప్టెంబర్ 15న సేవలు చాలించింది. అక్టోబర్ 1న లాస్వేగాస్లో ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకుని స్టీఫెన్ పాడాక్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 58 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్ష ప్రకటన. దాదాపు 7 దశాబ్దాల పాటు అగ్రరాజ్యం అనుసరించిన వైఖరికి భిన్నంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో పశ్చిమాసియాలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాను ‘హరికేన్ హార్వే’ అల్లాడించింది. దీని ధాటికి టెక్సాస్ తదితర ప్రాంతాల్లో 90 మంది వరకు చనిపోవడంతో పాటు దాదాపు 200 బిలియన్ డాలర్లపై చిలుకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఏడాది బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్‌లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. గోవా, మణిపూర్‌లో సగానికన్నా ఎక్కువ సీట్లు రాకున్నా కొద్ది రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. పంజాబ్‌లో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి కష్టం మీద మెజారిటీ సంపాదించింది. ఐదేళ్ల కాంగ్రెస్ పాలన సాగిన హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జూలై 1న ఏకీకృత పన్నుల విధానం జీఎస్టీ అమలులోకి వచ్చింది. ప్రధాని మోదీ ‘గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్’ అని పిలిచిన జీఎస్టీ కేంద్ర, రాష్ట్రాలు వసూలు చేస్తున్న 15 రకాల పన్నులు, సుంకాల స్థానంలో జీడీపీని పెంచే సాధనంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో దాదాపు రెండు దశాబ్దాలు కొనసాగిన సోనియాగాంధీ ఆరోగ్య కారణాలతో వైదొలిగారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సోనియా కుమారుడు రాహుల్‌గాంధీ పోటీ లేకుండా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేపట్టిన నెహ్రూ–గాంధీ కుటుంబంలో ఆయన ఆరో సభ్యుడిగా చరిత్రకెక్కారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో రాజకీయ బంధం తెంచుకున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేసిన వెంటనే అప్పటి వరకూ శత్రువైన బీజేపీతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కొన్ని నెలలుగా ఈ పరిణామం జరుగుతుందని ఊహించినా నితీశ్ చూపిన తెగువ, వేగం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ముస్లిం సమాజంలో మహిళలకు వారి భర్తలు ఇచ్చే ముమ్మారు తలాక్ పద్ధతి చెల్లదని ఈ ఏడాది ఆరంభంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సంచలనం సృష్టించిన ఈ తీర్పు అమలుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ముమ్మారు తలాక్‌ను రద్దు చేస్తూ ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లు రూపొందించింది. లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా మెజారిటీ సభ్యుల ఆమోదం పొందాక చట్టం కావడానికి అడ్డంకులేవీ ఉండవు. 1962లో యుద్ధానికి దిగిన ఆసియా పెద్దన్నలు ఇండియా, చైనా మధ్య జూన్ 16 నుంచి కొన్ని నెలలపాటు పశ్చిమ భూటాన్‌లోని వివాదాస్పద ప్రాంతమైన డోక్లామ్ పీఠభూమిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తత ముదిరి రెండోసారి రెండు పెద్ద దేశాల మధ్య పోరుకు దారితీస్తుందేమోననే భయాందోళనలు తలెత్తాయి. డోక్లామ్ ప్రాంతంలోకి చైనా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఈ వివాదం రాజుకుంది. చివరికి నిర్మాణం ఆపేసిన చైనాకు, భారత్‌కు మధ్య ఉద్రిక్తత సడలించడానికి ఆగస్ట్ 28న అవగాహన కుదిరింది. ఇస్రోకు మరిచిపోలేని విజయాలు అందించిన సంవత్సరం ఇది. ఇస్రో తన ఉపగ్రహవాహక నౌక(పీఎస్ఎల్వీ) ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఫిబ్రవరి 15న 714 కిలోల ఉపగ్రహం కార్టోస్టాట్–2ను మరో 103 ఉపగ్రహాలతోపాటు ఇస్రో ప్రయోగించింది. బెంగళూరుకు చెందిన ప్రసిద్ధ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్య దేశంలో కుచించుకుపోతున్న భావ ప్రకటనా స్వాతంత్య్రానికి, పత్రికా స్వేచ్ఛకు అద్దం పట్టింది. సెప్టెంబర్ 5 సాయంత్రం ఇంటి దగ్గరే గౌరిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అవినీతి, నియంతృత్వ పోకడలను ప్రతిఘటించే గౌరీ లంకేశ్ పత్రిక నడుపుతున్నారు. వివిధ రంగా ల్లో ప్రముఖులు తమ కింద పనిచేసే మహిళలపై సాగించిన లైంగిక వేధింపులు, దోపిడీకి వ్యతిరేకంగా పాశ్చాత్య ప్రపంచం లో ఆలిసా మిలానో అనే స్త్రీ ప్రారంభించిన ‘నేను సైతం’ ఉద్యమంలో వేలాది మంది భారత మహిళలు పాల్గొన్నారు. -
సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు
వివాదస్పద వ్యాఖ్యలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచే బీజేపీ ఫైర్ బ్రాండు, సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. పనామా పేపర్లలో ప్రముఖ టాటా సన్స్ డైరెక్టర్లలో చాలా మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. తనకు సమయమిస్తే, అందరి వివరాలను ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. ట్విట్టర్ ద్వారా సుబ్రహ్మణ్యస్వామి ఈ ఆరోపణలు చేశారు. పనామా పేపర్ల లీక్ ప్రపంచాన్నే కుదిపేసిన సంగతి తెలిసిందే. విదేశాల్లో నల్లధనం దాచుకున్న నల్ల కుబేరుల జాబితాను ఈ పేపర్లు బయటపెట్టాయి. చాలా మంది ప్రముఖులే ఈ పేపర్లలో ఉన్నారు. ఇటీవల పనామా పేపర్ల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన పదవివే పోగొట్టుకున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో, ప్రభుత్వ పదవులు చేపట్టకుండా ఆయనపై ఆ దేశ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. నేడు సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. Many prominent Tata&Sons Directors figure in Panama Papers. Will publish details when time permits — Subramanian Swamy (@Swamy39) December 16, 2017 -
‘ప్యారడైజ్ పేపర్స్’పై బిగ్ బి స్పందన
న్యూఢిల్లీ : పనామా పేపర్లలో, బోఫోర్స్ కుంభకోణంలో తాజాగా ప్యారడైజ్ పేపర్స్‌లో తన పేరు వెలుగులోకి రావడంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ స్పందించారు. తాను ఎల్లవేళలా వ్యవస్థకు సహకరిస్తానని, కానీ ఈ వయసులో తనని ఒంటరిగా వదిలివేయాలని కోరారు. తన బ్లాగ్‌లో అమితాబ్ ఓ బాధాకరమైన పోస్టును పెట్టారు. '' రేపు మరింత ఎక్కువుంటుంది. ఈ ప్రక్రియకు సహకారం అందిస్తుంటా..'' అని తెలిపారు. పన్నులను తప్పించుకుంటూ విదేశాల్లో అక్రమంగా సొమ్మును దాచుకుంటున్న కుబేరుల బండారాన్ని ప్యారడైజ్ పేపర్స్ పేరుతో ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లీకేజీల్లో 714 మంది భారతీయులున్నారని వెల్లడైంది. వారిలో అమితాబ్ పేరు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ ప్యారడైజ్ పేపర్లలో తన పేరు ఉన్నట్టు అమితాబ్‌కు తెలుసో? లేదో? ఇంకా స్పష్టత లేదు. అమితాబ్ పోస్టు చేసిన బ్లాగ్‌లో కేవలం అక్రమంగా ప్రాపర్టీని నిర్మించినందుకు గాను బీఎంసీ జారీచేసిన నోటీసులు, పనామా పేపర్లలో తన పేరు, బోఫోర్స్ కుంభకోణాన్ని మాత్రమే ప్రస్తావించారు. ప్యారడైజ్ పేపర్లలో తన పేరు ఉన్నట్టు వచ్చిన వార్తలపై ఆయన స్పందించలేదు. ఈ వయసులో, ఈ సమయంలో తనకు శాంతి, స్వేచ్ఛను మాత్రమే కోరుకుంటున్నానని తెలిపారు. నాకోసం, నా జీవితం కోసం గడపడానికి కొన్ని సంవత్సరాలు వదిలి పెట్టాలంటూ అమిత్ తన పోస్టులో అభ్యర్థించారు. ఇటీవల కాలంలో పనామా పేపర్లలో మరోసారి తన పేరు వచ్చిందన్నారు. తన పేరును దుర్వినియోగం చేసినందుకు వెనువెంటనే సమాధానమిచ్చానని, అయినప్పటికీ ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 6 సమన్లను అందుకున్నానని, ఇంకా వస్తున్నాయని బాధాకరం వ్యక్తంచేశారు. -
మాల్యాకు మరో చిక్కు: పనామాతో లింకులు
ముంబై : బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో నక్కిన విజయ్ మాల్యాకు చిక్కుల మీద చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఆయన అప్పగింత కేసును మరింత బలోపేతం చేస్తూ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయ్‌మాల్యా ప్రమోటెడ్ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, పనామా పేపర్లో ఉన్న లిబేరియన్కు చెందిన రెండు కంపెనీలతో లావాదేవీలు జరిపినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు చేసింది. 2,14,488పైగా ఆఫ్సోర్ కంపెనీల ఫైనాన్సియల్, అటార్ని క్లయింట్ సమాచారానికి చెందిన 11.5 మిలియన్ లీక్డ్ డాక్యుమెంట్లే ఈ పనామా పేపర్లు. తాజా విచారణలో భాగంగా ఓ రెండు సంస్థలు, ప్రస్తుతం పనిచేయని దేశీయ క్యారియర్‌లో వాటాలు కలిగి ఉన్నట్టు తెలిసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు(సీఎఫ్ఐఓ) నిర్వహించిన తాజాగా విచారణల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ రెండు సంస్థలు మారిసస్‌కు చెందిన ఐక్యూ బ్రిడ్జ్ లిమిటెడ్, తన దేశీయ సబ్సిడరీ ఐక్యూ బ్రిడ్జ్ లిమిటెడ్, బెంగళూరు అని తెలిసింది. వీటిని విజయ్‌మాల్యా, యూబీ గ్రూప్ తన ఆధీనంలో నడిపించేదని తేలింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, డెక్కన్ ఏవియేషన్‌లో విలీనం కాకముందు ఈ రెండు సంస్థలు 15 లక్షలు, 52 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్టు రిపోర్టు పేర్కొంది. 2007-08 కాలంలో ఐక్యూ బ్రిడ్జ్ మారిసస్లో ఉన్న 99 షేర్లలో మాల్యా 89ని లిబేరియా రిజిస్ట్రేషన్ కలిగి లోమ్బార్డ్ వాల్ కార్పొరేట్ సర్వీసెస్ ఇంక్‌కు ట్రాన్సఫర్ చేసినట్టు సీఎఫ్ఐఓ నివేదికలో తెలిసిందని ఇండియన్స్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. అంతేకాక యూనైటెడ్ బెవరీస్ హోల్డింగ్ లిమిటెడ్‌కు చెందిన ఓవర్సీస్ సబ్సిడరీ యూబీ ఓవర్సీస్ లిమిటెడ్, కింగ్ఫిషర్కు చెందిన 1.67 కోట్ల షేర్లను కొనుగోలుచేసినట్టు కూడా విచారణ నివేదికలు పేర్కొన్నాయి. వీటి విలువ రూ.50.02 కోట్లు. -
ప్రధానమంత్రి కుమార్తెకు సమన్లు
ఇస్లామాబాద్: పనామా పత్రాలపై విచారణకు గాను పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె సమన్లు అందుకున్నారు. మనీలాండరింగ్ కేసులో జూలై 5వ తేదీన విచారణకు రావాల్సిందిగా కోరుతూ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం(జేఐటీ) నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్‌కు సమన్లు జారీ చేసింది. కుమార్తె చదువుకుంటున్న యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గాను మరియం ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. జూన్ 15వ తేదీన ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా జేఐటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇలాంటి విచారణకు హాజరైన మొదటి ప్రధాని ఆయనే. ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్ కూడా జూలై 3, 4 తేదీల్లో జేఐటీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. పెద్ద కుమారుడైన హసన్‌ను ఇప్పటికే ఐదు సార్లు జేఐటీ విచారించింది. వీరితోపాటు నవాజ్ షరీఫ్ బంధువు తారిఖ్ షఫీను కూడా రెండోసారి జూలై 2 వ తేదీన విచారణకు రావాల్సిందిగా జేఐటీ సమన్లు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన జేఐటీ జూలై 10వ తేదీన సుప్రీంకోర్టుకు విచారణ నివేదిక సమర్పించాల్సి ఉంది. మనీలాండరింగ్ ద్వారా అక్రమంగా విదేశాలకు తరలించిన డబ్బుతో నవాజ్ షరీఫ్ కుటుంబం లండన్ నగరం పార్క్‌లేన్ ఏరియాలో నాలుగు అపార్టుమెంట్లు కొనుగోలు చేసినట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. ఏప్రిల్ 20 వ తేదీన ఈ కేసును విచారణకు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ప్రధానమంత్రితో పాటు ఆయన కుమారులను.. ఇంకా సంబంధం ఉన్న ఇతరులను కూడా విచారించే అధికారం కల్పిస్తూ జేఐటీని ఏర్పాటు చేసింది. -
పనామా లీక్స్ నిందితులకు పేపర్ జైలు
ఏమిటీ షిప్పు.. ఏమిటీ డిజైన్.. కాసింత వెరైటీగానే ఉంది కదూ..ఇది వెరైటీయే.. ఎందుకంటే ఇది ఓ జైలు డిజైన్. ఎవరి కోసమో తెలుసా? గతేడాది సంచలనం సృష్టించిన పనామా పేపర్ల నిందితుల కోసమట! 1.1 కోట్ల పత్రాలు లీకైన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన సంపన్నులు పన్నులు ఎగ్గొట్టి.. తమ సంపదను దాచుకున్న వైనమూ వెల్లడైంది. అలాంటి ఆర్థిక నేరస్తుల కోసమే ఈ జైలు అని దీన్ని రూపొందించిన డిజైనర్లు(ఫ్రాన్స్) చెబుతున్నారు. అందుకే ఈ నౌకకు పనామా పేపర్స్ జైలు అని పేరు పెట్టారు. అంతేకాదు.. పై భాగంలో గడుల్లా కనిపిస్తున్నవి జైలు గదులన్నమాట. వీటిని తయారుచేసేది కూడా పేపర్స్‌తోనే.. అంటే కాగితంతో.. మొత్తం 3300 మంది ఖైదీలను ఉంచొచ్చు. ఈ నౌకలో సముద్రపు నీళ్లను రీసైకిల్ చేసి.. వినియోగించుకునే సదు పాయంతోపాటు జిమ్, వర్క్‌షాపులు, పంటలను పండించే ఏర్పాట్లు ఉంటా యట. పనామా సిటీకి దగ్గర్లోని సముద్రపు జలాల్లో తిరుగుతూ ఉంటుందట. వన్‌వీక్ వన్ ప్రాజెక్ట్ అనే వెబ్సైట్ ప్రతి వారం ఓ వినూత్నమైన కాన్సెప్ట్‌ను విడుదల చేస్తుంది. అందులో భాగంగా ఈ డిజైన్‌ను విడుదల చేసింది. -
పాక్ ప్రధానికి వ్యతిరేకంగా సుప్రీంకు ఆధారాలు!
ఇస్లామాబాద్: పనామా పత్రాల వివాదంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఉచ్చుబిగుస్తోంది. ఈ వ్యవహారంలో ఆయనకు వ్యతిరేకంగా తాజాగా మాజీ క్రికెటర్, ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పించారు. 1988 నుంచి షరీఫ్ కుటుంబం అక్రమ వ్యాపారాలు చేస్తూ, పన్ను ఎగ్గొడుతూ రూ. 14.5 కోట్ల సొమ్మును మనీలాండరింగ్ చేసిందని పత్రాలు న్యాయస్థానానికి అందజేశారు. షరీఫ్ కుటుంబానికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు, రుణాలను ఎగ్గొట్టిన వివరాలను తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు సమర్పించిన పత్రాలను విశ్లేషించిన పాక్ పత్రిక డాన్.. 1988 నుంచి షరీఫ్ కుటుంబం పన్నులు ఎగ్గొట్టి హవాలా వ్యాపారం ద్వారా విదేశాలకు రూ. 145 మిలియన్ల సొమ్మును తరలించిందని తెలిపింది. ఈ కాలంలో షరీఫ్ కుటుంబం కేవలం రూ. 897 పన్నును మాత్రమే చెల్లించిందని పేర్కొంది. ప్రధాని షరీఫ్ ఆస్తులపై జర్నలిస్టు అసద్ ఖరాల్ రాసిన పుస్తకంలోని వివరాలను కూడా ప్రతిపక్షనేత ఇమ్రాన్‌ఖాన్ సుప్రీంకోర్టుకు సమర్పించారు. -
పాక్ ప్రధాని షరీఫ్ కు షాక్
ఇస్లామాబాద్: పనామా పేపర్ల కేసులో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబసభ్యులకు ఆ దేశ సుప్రీం కోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. షరీఫ్ అవినీతికి పాల్పడ్డారని, విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కలిగివున్నారని ఆయన ప్రధానమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ పార్టీ లీడర్ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ సైతం కోర్టు విచారణకు స్వీకరించింది. పనామా పేపర్ల లీక్ అనంతరం షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ధనాన్ని విదేశాలకు తరలించినట్లు, యూకేలో ఆస్తులు కూడా ఉన్నట్లు ఇమ్రాన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. షరీఫ్ తో పాటు ఆయన తనయ మార్యామ్, తనయులు హాసన్, హుస్సేన్, మేనల్లుడు మొహమ్మద్ సఫ్దార్, ఆర్ధిక శాఖ మంత్రి ఇషాక్ దార్, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్, ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ చైర్మన్, అటార్నీ జనరల్ లకు కోర్టు నోటీసులు పంపింది. కాగా పిటిషన్లపై ప్రాథమిక విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి అన్వర్ జహీర్ జమాలీ, జస్టిస్ జాజుల్ అషాన్, జస్టిస్ ఖిజి ఆరిఫ్ హుస్సేన్ లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. -
అమితాబ్ తప్ప ఎవరూ దొరకలేదా?
పనామా పేపర్ల వ్యవహారంలో అపప్రథకు గురైన అమితాబ్ బచ్చన్‌ను ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణకు వ్యాఖ్యాతగా పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మోదీ సర్కారు రెండేళ్ల పాలన ముగిసిన సందర్భంగా ఇండియాగేట్ వద్ద శనివారం నిర్వహించే మెగా కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్‌ను వ్యాఖ్యాతగా ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. నల్లధనాన్ని వెనక్కి తెస్తానని, ఆ వ్యవహారంలో ఎవరున్నా శిక్షిస్తానని ప్రధాని మోదీ గతంలో చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదేమని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. మనీలాండరింగ్‌లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలొచ్చిన వ్యక్తికి అంత పెద్దపీట వేయడం దర్యాప్తు సంస్థలకు ఎలాంటి సంకేతాన్ని పంపుతుందని నిలదీశారు. అమితాబ్‌ను మంచి నటుడిగా, పెద్దమనిషిగా దేశంలోని అందరూ ప్రేమిస్తారని, అయితే.. ఆయన పేరు పనామా పేపర్లలో ఉందన్న విషయం మాత్రం మర్చిపోకూడదని అన్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి ఇప్పటివరకు ప్రత్యక్ష ప్రసారం చేసిన కార్యక్రమాల్లో ఇదే అతి పెద్దదని చెబుతున్నారు. ఈ కార్యక్రమం చివర్లో మోదీ పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి 'ఓ కొత్త ఉదయం' అని పేరుపెట్టారు. ఇందులో అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, జూహీ చావ్లా లాంటి బాలీవుడ్ ప్రముఖులు పలువురు పాల్గొంటారు. అయితే.. కాంగ్రెస్ ఆరోపణలను అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఖండించారు. తన తండ్రి ఏమీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని, ఇండియాగేట్ వద్ద జరిగే కార్యక్రమంలో బాలికల విద్య ఆవశ్యకత మీద మాత్రమే ఆయన మాట్లాడతారని, దీన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు. -
పనామా దెబ్బ..
- హెరిటేజ్‌కు మోటపర్తి రాజీనామా సాక్షి, హైదరాబాద్: తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా ఉన్న మోటపర్తి శివరామ వరప్రసాద్‌కు విదేశాల్లోని అనుమానాస్పద కంపెనీలతో ఉన్న లింకుల్ని పనామా పత్రాలు వెల్లడించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు నష్టనివారణ చర్యలకు దిగారు. మోటపర్తితో తక్షణం పదవికి రాజీనామా చేయించారు. ఆఫ్రికా ఖండంలోని ఘనా, టోగో దేశాల్లో ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్ లిమిటెడ్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్‌కెమీ వెంచర్స్ వంటి ఆఫ్‌షోర్ కంపెనీలతో ప్రసాద్‌కున్న లింకుల్ని పనామా పత్రాలు వెల్లడించడం రాష్ట్ర రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించడం తెలిసిందే. మనీలాండరింగ్ కోసం, పన్నుల ఎగవేతకోసం ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న కంపెనీలపై పనామా పేపర్స్ లీకులిస్తున్న విషయం విదితమే. ఈ వరసలోనే హెరిటేజ్‌లో డెరైక్టర్‌గా ఉన్న మోటపర్తి శివరామ వరప్రసాద్ అల్లిబిల్లి కంపెనీల వ్యవహారం కూడా వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో.. కుటుంబసభ్యులతోసహా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన మోటపర్తితో హెరిటేజ్ డెరైక్టర్ పదవికి హుటాహుటిన రాజీనామా చేయించారు. మోటపర్తి గురువారం తన పదవికి రాజీనామా చేశారని హెరిటే జ్ కంపెనీ కార్యదర్శి ఉమాకాంత్ బారిక్ ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు రాసిన లేఖలో తెలిపారు. ఈనెల 23న జరిగే కంపెనీ డెరైక్టర్ల సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదిస్తామని కూడా అందులో పేర్కొన్నారు. బాబుతో అత్యంత సాన్నిహిత్యం..: చంద్రబాబుకు, మోటపర్తి శివరామ వరప్రసాద్‌కు మధ్య ఎంతోకాలం నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. చంద్రబాబుతో మోటపర్తి అనేక సందర్భాల్లో సమావేశమయ్యారు. 2014, జూన్‌లో చంద్రబాబు రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే మోటపర్తిని ఐదేళ్ల కాలానికి హెరిటేజ్ ఫుడ్స్‌కు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో పనామా పత్రాల్లో మోటపర్తి పేరు వెలుగులోకి రావటం ఏపీ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. -
పనామా పేపర్స్‌లో మరో హీరోయిన్!
లాస్ఎంజిల్స్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న పనామా పేపర్స్ లీకేజీ వ్యవహారంలో మరో హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ పేరు ఈ జాబితాలో కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా 'హ్యారీపోటర్ అండ్ ద గొబ్లెట్ ఆఫ్ ఫైర్'లో నటించిన బ్రిటీష్ నటి ఎమ్మా వాట్సన్(26) పేరు పన్ను ఎగవేత కోసం విదేశాల్లో సంస్థలను స్థాపించిన వారి జాబితాతో కూడిన పనామా పత్రాల లీకేజీలో ఉన్నట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. దీనిపై ఎమ్మా ప్రతినిధి మాట్లాడుతూ.. సంస్థను నెలకొల్పిన విషయం వాస్తవమే అని తెలిపాడు. అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయలేదని తెలిపాడు. అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల కన్సార్టియం(ఐసీఐజే) తాజాగా 2 లక్షలకు పైగా విదేశీ సంస్థల వివరాలను తన వెబ్సైట్లో ఉంచింది. ఇందులో వివిధ కంపెనీలు, ట్రస్ట్‌లు, ఫౌండేషన్స్‌కు సంబంధించిన వివరాలున్నాయి. వివిధ విదేశీ సంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్‌ను సైతం ఐసీఐజే వెల్లడించింది. -
పనామా లీకుల్లో హెరిటేజ్ 'లింకు'
- అనుమానాస్పద కంపెనీలతో హెరిటేజ్ ఫుడ్స్ ఇండిపెండెంట్ డెరైక్టర్ మోటపర్తి శివరామ వరప్రసాద్‌కు సంబంధాలు - ప్రసాద్‌కు చిన్న దేశాల్లో పలు కంపెనీలు, కొన్ని బినామీలతో నడుస్తున్నాయని పనామా పేపర్స్ అభియోగాలు - చంద్రబాబు సీఎం అయిన నెలరోజులకే హెరిటేజ్ డెరైక్టర్‌గా మోటపర్తి నియామకం - ఘనాలో ఉంటున్న ఎన్నారై ప్రసాద్‌ను డెరైక్టర్‌గా నియమించడంపై విస్మయం - బాబుకు అత్యంత సన్నిహితుడు, ఏపీ బ్రాండ్ అంబాసిడర్ అజయ్‌దేవ్‌గణ్ పేరు పనామాలో వచ్చిన వారానికే ఇప్పుడీ ప్రసాద్ పేరు రావడంపై చర్చ సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పనామా పేపర్స్ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్‌లో ఇండిపెండెంట్ డెరైక్టర్ అయిన మోటపర్తి శివరామ వరప్రసాద్‌కు అనుమానాస్పద కంపెనీలతో వున్న లింకుల్ని వెల్లడించింది. పన్నులు ఎగవేసేందుకు చిన్న చిన్న దేశాల్లో, ద్వీపాల్లో నెలకొల్పుతున్న కంపెనీల భాగోతాల్ని, బినామీల పేర్లతో నెలకొంటున్న కంపెనీల గుట్టురట్టుల్ని విప్పిచెపుతున్న పనామా పేపర్స్ తాజాగా బయటపెట్టిన ప్రసాద్ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల రాజకీయవర్గాలు ఒక్కసారిగా నివ్వెరపోయాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ మోటపర్తి ప్రసాద్ పేరును తాజా పనామా పత్రాల్లో మూడు దఫాలు ప్రస్తావించారు. ఆఫ్రికా ఖండంలోని ఘనా, టోగో దేశాల్లో ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్ లిమిటెడ్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్‌కెమీ వెంచర్స్ వంటి ఆఫ్‌షోర్ కంపెనీలతో ఆయనకున్న లింకుల్ని పనామా పేపర్స్ వెల్లడించింది. నామమాత్రపు కంపెనీల పేర్లమీద పన్నులు ఎగవేసారన్న అభియోగాల్ని మోపింది. బ్రిటిష్ వర్జిన్ ఐలెండ్స్, ఈక్వడార్, ఘనా, పనామా దేశాల్లో రిజిష్టర్ అయి వున్న పలు కంపెనీల్లో ప్రసాద్‌కు వాటాలున్నాయి. ఎన్నెన్నో అనుమానాలు... పనామా పత్రాల వ్యవహారం తొలిసారిగా బయటపడ్డపుడే ప్రసాద్ పేరు ప్రస్తావనకు వచ్చింది. టోగో దేశంలోని వాసెమ్ అనే కంపెనీ గురించి పనామా పేపర్స్ విస్త్రతంగా కథనాలు వెలువరించింది. వాసెమ్ యజమానుల గురించి పనామా పేపర్స్‌లో ప్రస్తావిస్తూ దానిలో బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కెన్లెమ్ లిమిటెడ్‌కు 40 శాతం వాటా వున్నట్లు పేర్కొంది. ఆ కెన్లెమ్ యజమాన్యంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ అసలు వ్యక్తుల పేర్లు యజమానులుగా ఆ కంపెనీ చూపించడం లేదని, బినామీ పేర్లతో నడుస్తోందన్న అభియోగాల్ని పనామా పేపర్స్ మోపింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... మోటపర్తి ప్రసాద్‌కు కెన్లెమ్‌లో 24 శాతం వాటా వుంది. అలాగే కెన్లెమ్‌లో మరో 17 శాతం వాటా రఫెల్ హోల్డింగ్స్‌కు వుంది. ఈ రఫెల్ హోల్డింగ్స్ అసలు యజమానులు కూడా వేరే వ్యక్తులని పనామా పేపర్స్ వెల్లడించింది. టోగోలోని వాసెమ్ సిమెంటు కంపెనీలో 89 శాతం షేర్లు ఆ దేశానికి చెందినవారికి కావు. ఈ కంపెనీ ప్రధాన వాటాదారుల్లో మోటపర్తి ప్రసాద్ ఒకరు. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే.... హెరిటేజ్ ఫుడ్స్ ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా 2014 జూలై నెలలో ఐదేళ్ల కాలానికి ప్రసాద్ నియమితులయ్యారు. ఆయన కంపెనీకి ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. 2014 జూన్ నెలలో కొత్త ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. బాబు పదవిలోకి వచ్చిన నెలరోజులకే ప్రసాద్‌కు హెరిటేజ్ ఫుడ్స్‌లో డెరైక్టర్‌గా కూర్చోబెట్టడంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఘనా, టొగో తదితర దేశాల్లో పలు కంపెనీలు స్థాపించిన ప్రసాద్ ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆయన దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నపుడు చంద్రబాబు నిర్వహించే ప్రతి సమావేశంలో పాల్గొనే వారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఆయన హెరిటేజ్‌లో ఉన్నతోద్యోగి అని చెప్తుండేవారని, చంద్రబాబుకు, ఆయనకు మధ్య ఇంత పెద్ద వ్యాపార, బినామీ సంబంధాలున్నాయని తమకు తెలియదని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నా యి. అయితే ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా ఈ దేశంలో వుండే ఒక వృత్తినిపుడినో, పారిశ్రామికవేత్తనో ఎంచుకోకుండా, ఎక్కడో ఘనా దేశంలో వుంటున్న ఒక ఎన్నారైని నియమించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ ఎన్నో కంపెనీలు ప్రసాద్‌కు హైదరాబాద్‌లో సైతం పలు రిజిష్టర్డ్ కంపెనీలున్నాయి. చాలా కంపెనీలకు ఆయన చైర్మన్‌గా, డెరైక్టరుగా, భాగస్వామిగా ఉంటున్నారు. డిజైన్ ట్రయిబ్, విండ్సర్ ఎడిఫిసెస్, వోల్టా ఫ్యాషన్స్, వోల్టా ఎస్టేట్స్ , వోల్టా ఇంపాక్స్, తోషాలి సిమెంట్స్, ప్రకృతి సిమెంట్స్, పేపర్ ఇంజనీరింగ్ సర్వీసెస్, దక్కన్ ఆటో, పృధ్వీ అసెట్ రీకన్‌స్ట్రక్షన్స్ వీటిలో కొన్ని. ఇందులో చాలావరకూ హైద రాబాద్ సంజీవరెడ్డి నగర్‌లోని హౌస్ నంబర్ 123/3, మూడో ఫ్లోర్లో వున్నట్లు ఆల్ కంపెనీ డేటా.కామ్ సైట్ వెల్లడిస్తోంది. అయితే ఆ భవనంలో ఇప్పుడు అవేవీ లేవు. మరో కార్పొరేట్ గ్రూప్ కంపెనీలు అక్కడ వుండటం గమనార్హం. పనామా పేపర్స్‌లో ఆయన పేరు ప్రస్తావనకు రావడంపై ప్రసాద్ స్పందిస్తూ ఘనా, టోగో దేశాలతో సహా పలు దేశాల్లో తనకు పలు కంపెనీలున్నాయని, అవన్నీ హోల్డింగ్ కంపెనీలని, చట్టబద్దమైనవేనన్నారు.తాను హెరిటేజ్ ఫుడ్స్‌లో ఇండిపెండెంట్ డెరైక్టర్నని ఆయన పేర్కొన్నారు. మోటపర్తి ప్రసాద్ కుమారుడు సునీల్ అమెరికా, హైదరాబాద్‌ల్లోని స్టార్టప్ కంపెనీల్లో దాదాపు రూ. 40 కోట్లు పెట్టుబడి చేశారు. ఎవరీ ప్రసాద్... కృష్ణాజిల్లాకు చెందిన మోటపర్తి ప్రసాద్ చాలా కాలం క్రితం ఆఫ్రికా దేశాలకు వెళ్లి వ్యాపారాలతో బాగా సంపాదించారు. వరంగల్ నిట్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. ముంబై, గుజరాత్‌ల్లో ఇనుము, ఉక్కు ఫౌండ్రీల నిర్వహణకు సంబంధించి అనుభవం సంపాదించారు. 1985లో పటాన్చెరు వద్ద మార్టోపెరల్ అల్లాయిస్ అనే కంపెనీని స్థాపించి, దాని టర్నోవర్‌ను నాలుగేళ్లలో రూ. 5 కోట్లకు తీసుకెళ్లారంటూ ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించే వోల్టాస్ ఫ్యాషన్ ప్రొఫైల్‌లో వివరించారు. అటుతర్వాత సిమెంటు తదితర రంగాల్లోకి ప్రవేశించి, పలు దేశాల్లో వివిధ కంపెనీలను నిర్వహిస్తున్నట్లు ఆ ప్రొఫైల్‌లో వివరించారు. దీని సంగతి పక్కనబెడితే...ఆయన చంద్రబాబునాయుడుకి సన్నిహితుడంటూ పారిశ్రామిక, రాజకీయ వర్గాలు చెపుతుంటాయి. అందుకే ఘనా దేశంలో వుంటున్న ఎన్నారైను ఏరికోరి తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్‌లో డెరైక్టరుగా నియమింపచేశారని చెప్పుకుంటుంటారు. ప్రసాద్ కుమారుడికి రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ దివిస్ లేబరోటరీస్ యజమాని మురళీ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. అజయ్ దేవ్‌గణ్ తర్వాత.... ఆంధ్రప్రదేశ్‌తో ఏ విధమైన సంబంధం, అనుబంధం లేని బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్‌ను ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపికచేసుకున్న కొద్దిరోజులకే ఆ హీరో పేరు పనామా పేపర్స్‌లో ప్రముఖంగా వెల్లడయ్యింది. హిందీ సినిమాల విదేశీ ప్రదర్శనా హక్కుల్ని పొందేందుకు బ్రిటిష్ వర్జిన్ ఐలెండ్స్‌లో ఒక కంపెనీని నెలకొల్పడంపై జరిగిన భాగోతాన్ని పనామా పేపర్స్ ఈ నెల మొదటివారంలో బయటపెట్టింది. ఇది జరిగి వారం తిరక్కుండానే బాబు కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ డెరైక్టర్ ప్రసాద్ పేరు పనామాలో పొక్కడంపై రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. -
అవును.. ఆయన మా డైరెక్టరే
పనామా పేపర్లలో ప్రస్తావనకు వచ్చిన ఎం.శివరామప్రసాద్ తమ సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టరని హెరిటేజ్ ఫుడ్స్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. 2014 జూలై 30వ తేదీన ఆయనను ఐదేళ్ల కాలానికి డైరెక్టర్‌గా నియమించామన్నారు. అయితే ఆయనకు హెరిటేజ్ ఫుడ్స్‌లో ఎలాంటి ఆర్థికపరమైన ఆసక్తి లేదని చెప్పారు. ఆయనకు కంపెనీలో షేర్లు గానీ, పెట్టుబడులు గానీ ఏమీ లేవన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు, ఆయన సొంత కంపెనీలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమీ లేవని కూడా సాంబశివరావు చెప్పారు. -
పనామాలో బాబు బినామీ
పనామా పేపర్స్ తాజాగా విడుదల చేసిన జాబితాతో టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ మోటపర్తి శివరామ వర ప్రసాద్ (67) పేరు బయటపడింది. (చదవండి...పనామా లీకుల్లో హెరిటేజ్ 'లింకు') ఈయన వృత్తిరీత్యా వ్యాపారి. ప్రవృత్తి రీత్యా చంద్రబాబు అనుయాయుడు. ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలతో సంబంధం ఉన్నట్లు తేలింది. పనామాలో మూడుసార్లు ప్రసాద్ పేరు ప్రస్తావవకు వచ్చింది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, పనామా, ఈక్వెడార్‌లో మూడు కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా పన్నులు ఎగవేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలతో సంబంధమున్న ఆయన పేరు పనామా పేపర్స్‌లో మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. వర ప్రసాద్ పేరు బయటకు రావడంతో... చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితిలో పడ్డారు. వరప్రసాద్ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపితే.... ఆయన బినామీ ఎవరో తెలిసే అవకాశం ఉంటుంది. అటు వరప్రసాద్ పేరు బయటకు రావడంతో... టీడీపీ నేతల్లోనూ ఆందోళన మొదలైనట్లు సమాచారం. ప్రసాద్ కుమారుడు సునీల్ కూడా బిట్ కెమీ వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు పనామా వెల్లడించింది. సునీల్.. అమెరికా, హైదరాబాద్‌లో స్టార్టప్ కంపెనీల్లో ఈ డబ్బును ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రసాద్ ప్రవాస భారతీయుడు కాగా... హైదరాబాద్‌లో కొన్ని కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటు ఘనా, టోగో, అమెరికాలో ప్రసాద్‌కు వ్యాపారాలు ఉన్నాయి. ప్రసాద్ 2014 నుంచి హెరిటేజ్ ఫుడ్స్‌కు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. పనామా లిస్ట్‌లో తన పేరు రావడంపై ప్రసాద్ స్పందించారు. తాను ప్రవాస భారతీయుడునని... గత 30 ఏళ్లుగా విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్‌లో కూడా కంపెనీలు ఉన్నాయన్నారు. పనామా వ్యవహారం గురించి తనకు తెలియదన్నారు. ఈ వ్యవహారాన్ని కంపెనీ సిబ్బంది, లాయర్లు చూసుకొంటారని చెప్పారు. తన వ్యాపార లావాదేవీలన్నీ చట్టబద్దంగా ఉన్నాయన్నారు. కాని పనామా ప్రకటించిన లిస్ట్‌లో మాత్రం పన్ను ఎగవేసే కంపెనీలతో సంబంధం ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. కాగా ఈ వ్యవహారంపై శివరామ వరప్రసాద్ కుమారుడు సునీల్ మాట్లాడుతూ తమ కంపెనీలు చట్టబద్దమైనవని తెలిపారు. -
ఇక ఆన్ లైన్ లో పనామా 'నల్ల' పేర్లు!
పనామా సిటీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్లు తాజాగా ప్రజలకు ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో గొప్ప స్థానాల్లో ఉన్న కొందరి అక్రమాలను పనామా పేపర్లు బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఇన్వేస్టిగేటివ్ జర్నలిజంలో ముఖ్య పాత్ర పోషించిన ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వేస్టిగేటివ్ జర్నలిజం (ఐసీఐజే) కోటికిపైగా ఉన్న ఈ డాక్యుమెంట్లన్నింటినీ డిజిటల్ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చేసేవిధంగా నిర్ణయించింది. భారతకాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆరుగంటల నుంచి పనామా పేపర్లన్నీ ఆఫ్ షోర్ లీక్స్.ఐసీఐజే.ఓఆర్జీ లో అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో సంపద కలిగి ఆఫ్ షోర్ కంపెనీలను కలిగివున్న 2,00,000 మంది పేర్లను ఇందులో వెల్లడించనున్నట్లు ఐసీఐజే తెలిపింది. ఇప్పటివరకు కేవలం పెద్ద ప్రొఫెల్ ఉన్న వ్యక్తుల వివరాలను(ఐస్ ల్యాండ్ ప్రధానమంత్రి, బ్రిటన్ ప్రధాని, రష్యా ప్రెసిడెంట్, అర్జెంటీనా ప్రధానమంత్రి, చైనా రాజకీయ నాయకులు) మాత్రమే న్యూస్ పేపర్ల ద్వారా బయటపెట్టిన ఐసీఐజే తాజాగా తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరుల జాబితా బయటకు రానుంది. అయితే, సమాచారాన్ని ప్రజలకు తెలియజేయండం తప్పంటూ మొస్సాక్ ఫోన్సెకా ఐసీఐజే మీద పిటిషన్ దాఖలు చేసేందుకు లాయర్ ను నియమించుకుంది. దీనికి సంబంధించి ఐసీఐజే ఎటువంటి ప్రకటనా చేయలేదు. డాక్యుమెంట్లను బయటపెట్టడంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. -
అమితాబ్ నన్ను అప్పుడే హెచ్చరించాడు!
ముంబై: పనామా ప్రకంపనల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అజయ్ దేవగణ్ చిక్కడం హిందీ సినీ పరిశ్రమను కుదిపేసింది. పన్ను ఎగవేతకు స్వర్గధామల్లాంటి దేశాల్లో బోగస్ కంపెనీలు తెరిచి.. అక్రమంగా డబ్బు దాచుకునేందుకు పనామాలోని 'మోసాక్ ఫొన్సెకా' అనే లా కంపెనీ సేవలు వీరు వాడుకున్నారన్నది ప్రధాన అభియోగం. అయితే ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, తన పేరును దుర్వినియోగం చేసి విదేశాల్లో బోగస్ కంపెనీలు తెరిచినట్టు కనిపిస్తున్నదని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై ఇటీవల ఒకప్పటి బిగ్ బీ సన్నిహితుడు, యూపీ రాజకీయ నేత అమర్‌సింగ్ ఒకింత ఆగ్రహంగా స్పందించారు. అమితాబ్ పనామా పత్రాల వివాదంలో చిక్కుకోవడంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడుగగా.. 'రెండురోజుల కిందటే నేను పబ్లిగ్గా చెప్పాను. ఐశ్వర్య గానీ, అభిషేక్గానీ నా పట్ల అమితమైన గౌరవం చూపుతారు. అమితాబ్ తోనూ నాకెలాంటి గొడవ లేదు. నిజానికి ఆయనే నన్ను ఓసారి హెచ్చరించాడు. జయాబచ్చన్‌కు స్థిరచిత్తం ఉండదని, ఆమెను మీ రాజకీయాల్లోకి (పార్టీలోకి) తీసుకోవద్దని సూచించాడు. కానీ, నేను ఆయన ఉదాత్తమైన సలహాను వినలేదు. జయ అలవాట్లు, అస్థిరమైన ధోరణి కారణంగా ఆమె నుంచి ఎలాంటి కచ్చితత్వాన్ని ఆశించవద్దని అమితాబ్ నన్ను హెచ్చరించాడు. ఆమె తరఫున నాకు ఆయన క్షమాపణలు చెప్పాడు కూడా. అక్కడితో ఈ విషయం ముగిసిపోయింది. కానీ ఆ తర్వాత అనిల్ అంబానీ నివాసంలో డిన్నర్ సందర్భంగా జయాబచ్చన్ వల్ల ఓ గొడవ జరిగింది. ఈ వివాదంలో బచ్చన్ కూడా తలదూర్చారు. కాబట్టి (పనామా వివాదంపై) ప్రశ్నలను అరుణ్ జైట్లీని అడగండి. లేదా ఈ వివాదాన్ని దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలను అడగండి. అదీ కుదరకపోతే అమితాబ్‌నే నేరుగా అడగండి. నన్ను వదిలేయండి. అమితాబ్ ప్రసక్తి లేకుండా శాంతియుతంగా ఉండనివ్వండి' అని అమర్ చెప్పుకొచ్చారు. -
పనామా పేపర్లలో మరో బాలీవుడ్ నటుడు
ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన మోసాక్ ఫోనెస్కాకు చెందిన పనామా పేపర్స్ తాజాగా మరో బాలీవుడ్ నటుడి వ్యవహారం బయటపెట్టాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ బ్రిటన్‌లోని వర్జిన్ ఐలాండ్ కు చెందిన మేరిలిబోన్ ఎంటర్ టైన్మెంట్ అనే సంస్థలో దాదాపు వెయ్యి షేర్లు కొనుగోలు చేశారని పనామా బయటపెట్టింది. అజయ్ తన కంపెనీ నిసా యుగ్ ఎంటర్ టైన్ మెంట్ పేరిట ఈ షేర్లు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ కంపెనీలో ఆయన భార్య కాజల్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ కంపెనీకి అజయ్ 2013లో డైరెక్టర్ గా ఉండి.. 2014లో రాజీనామా చేశారు. పనామా బయటపెట్టిన వివరాలపై ఆయన స్పందిస్తూ.. తాను ఆర్బీఐ మార్గదర్శకాలు పాటించే విదేశాల్లోని ఆ కంపెనీలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టానని చెప్పారు. చట్ట ప్రకారం చేయాల్సిన ట్యాక్స్ రిటర్న్స్ కూడా చేశామని, వాటి వివరాలు తన కుటుంబం ఇప్పటికే తెలియజేసిందని అన్నారు. -
‘పనామా’పై సిట్ సమీక్ష
న్యూఢిల్లీ: నల్లధనాన్ని వెలికితెచ్చే విషయమై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం సమావేశమైంది. పన్ను ఎగవేత, మనీ ల్యాండరింగ్ కేసులను సమీక్షించింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘పనామా పేపర్స్’పై ప్రధానంగా చర్చించింది. సిట్ చైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) ఎంబీ షా నేతృత్వంలో జరిగిన భేటీలో ‘పనామా పేపర్స్’పై ఆదాయ పన్ను శాఖ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ), ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమర్పించిన నివేదికలపై సమీక్ష నిర్వహించారని అధికారులు తెలిపారు. పనామా పేపర్స్, రూ. 6 వేల కోట్ల బ్యాంక్ ఆఫ్ బరోడా (ఢిల్లీ బ్రాంచ్) స్కాం కేసుల రికార్డులు, స్థాయీ నివేదిక సమర్పించిన దర్యాప్తు సంస్థలు.. తాము తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. దాదాపు 500 మంది భారతీయుల పేర్లున్న పనామా పేపర్స్ జాబితా లీకేజీ నేపథ్యంలో ఇంటర్నేషనల్ కన్సోర్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్, ఓ జాతీయ దినపత్రిక వెలువరించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేయాలని పలు దర్యాప్తు సంస్థలను సిట్ ఆదేశించిన విషయం తెలిసిందే. -
పనామా ప్రకంపనలపై నోరువిప్పిన ఐశ్యర్య!
పనామా పత్రాల వివాదంపై బాలీవుడ్ హీరోయిన్, అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్యర్యరాయ్ తాజాగా స్పందించింది. పన్ను ఎగ్గొట్టేందుకు విదేశాల్లో బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసిన వ్యవహారంలో ఐశ్యర్య, ఆమె తల్లి తరఫు కుటుంబసభ్యుల పేర్లు ఉన్నట్టు ఇటీవల పనామా పత్రాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించి సహకరిస్తున్నట్టు ఆమె తెలిపారు. 'ఇప్పటికే ఈ విషయమై ఓ ప్రకటన చేశాను. ఈ విషయంలో కుటుంబపరంగా, వ్యక్తిగతంగా కూడా ప్రకటన చేశాం. మీడియాకు కూడా మా వైఖరి తెలియజేశాం. ఇక ఈ విషయంలో అన్ని ప్రశ్నలకు ప్రభుత్వానికి సమాధానం ఇస్తున్నాం. థాంక్యూ' అంటూ ఆమె పేర్కొన్నారు. ఆమెను మంగళవారం విలేకరులు పనామా పత్రాల విషయమై ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చారు. పనామాకు చెందిన మొసాక్ ఫోన్సెకా కంపెనీ ద్వారా విదేశాల్లో బోగస్ కంపెనీలు స్థాపించిన 500 మంది భారతీయ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, ఐశ్యర్యరాయ్ కూడా ఉన్నారని ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన పేరును దుర్వినియోగం చేసి ఈ కంపెనీలు స్థాపించారని, వీటి గురించి తనకు తెలియదని అమితాబ్ వివరణ ఇచ్చారు. ఐశ్యర్య అధికార ప్రతినిధి కూడా ఆమెపై వచ్చిన ఆరోపణలను గతంలో తోసిపుచ్చారు. -
పాకిస్థాన్ కుబేరుడు ఎవరో తెలుసా?
ఇస్లామాబాద్: ఇటీవల పనామా పత్రాల్లో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పేరు వెలుగు చూడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే దేశంలో అత్యంత సంపన్నులైన రాజకీయ నాయకుల జాబితాను పాకిస్థాన్ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఊహించినట్టుగానే ఈ జాబితాలో రూ. 200 కోట్ల ఆస్తులతో ప్రధాని షరీఫ్ మొదటిస్థానంలో నిలిచారు. గత నాలుగు ఏండ్లలో ఆయన ఆస్తులు రూ. వందకోట్లు పెరిగి రూ. 200 కోట్లకు చేరడం గమనార్హం. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది రాజకీయ నాయకులు తమ ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు 2015లో తాను, తన భార్య ఆస్తుల వివరాలను షరీఫ్ వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం విదేశాల్లో ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు. 2011లో రూ. 166 మిలియన్లుగా ఉన్న ఆయన ఆస్తుల విలువ.. 2015కు వచ్చేసరికి ఏకంగా 2 బిలియన్లకు చేరుకుంది. ఆయనకు అత్యధిక మొత్తం విదేశాల్లోని ఆయన కొడుకు హుస్సేన్ నవాజ్ నుంచే అందుతుండటం గమనార్హం. 2015లో నవాజ్ తండ్రికి రూ. 215 మిలియన్లు పోషక ధనంగా పంపించారు. పాక్ పార్లమెంటులో అత్యధిక ఆస్తులున్న రాజకీయ నాయకుడిగా షరీఫ్ మొదటి స్థానంలో ఉండగా, ఆయన తర్వాతి స్థానాల్లో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి షాహిద్ ఖాఖాన్ అబ్బాసి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఎంపీలు ఖయాల్ జమన్, సాజిద్ హుస్సేన్ ఉన్నారు. ఇక ప్రధాని షరీఫ్ ఆస్తుల్లో ఓ టయోటా లాండ్ క్రూజర్ ఉంది. దీనిని గుర్తుతెలియని వ్యక్తులు కానుకగా ఇచ్చారు. అలాగే రెండు మెర్సిడెజ్ వాహనాలు కూడా షరీఫ్ కలిగి ఉన్నారు. నల్లడబ్బును దాచుకోవడానికి విదేశాల్లో బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసిన రాజకీయ నాయకుల జాబితా షరీఫ్ కూడా ఉన్నట్టు పనామా పత్రాలు వెల్లడించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
పనామా ఎఫెక్ట్: 'బ్రాండ్' నుంచి బిగ్ బీ ఔట్!
ముంబై/న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి, ఒకటిరెండు దేశాల్లో ప్రభుత్వాలను సైతం కూలదోసింది పనామా పేపర్ల లీకేజీ వ్యవహారం. ఆ సమాచారాన్నిబట్టి పన్ను ఎగ్గొట్టి నల్లధనాన్ని విదేశాలకు విదేశాలకు తరలించిన 500 మంది భారతీయుల్లో సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. అయితే ఆ వార్తలను ఖండించిన అమితాబ్ 'నా పేరును తప్పుగా వాడి ఉంటారు' అని ప్రకటించారు. అంతటితో సమస్య సమసిపోలేదు.. పనామా పేపర్లలో పేరు వెల్లడయినందుకు అమితాబ్ బచ్చన్ భారీ మూల్యం చెల్లించుకోనున్నారా? తప్పుచేయలేదన్నబింగ్ బీ ప్రకటనతో కేంద్రప్రభుత్వం సంతృప్తి చెందలేదా? అందుకే ఆయనను ఇంకా చేపట్టని ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ హోదా కోల్పోనున్నారా? గడిచిన కొద్ది గంటలుగా జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలివి. ఇంక్రెడిబుల్ బ్రాండ్ హోదాను అమితాబ్ కు కట్టబెట్టే విషయంలో కేంద్రం పునరాలోచనలో పడిందని, మరో సెలబ్రిటీని ఆ హోదాలో నియమించనుందని పలు సంస్థలు వార్తలు ప్రచారం చేశాయి. వీటిపై బిగ్ బీ కూడా ఘాటుగానే స్పందించారు. 'నిజానికి ఆ హోదా (ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్అంబాసిడర్)లో కొనసాగమని నాన్నెవరూ సంప్రదించలేదు. అంబాసిడరేకాని నన్ను ఆ హోదా నుంచి తొలిగించారని మీడియాలో వార్తలు రావటం విడ్డూరం'అని అమితాబ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియా ఊహాగాలు విన్నతర్వాత స్పష్టత ఇచ్చేందుకే ఈ ప్రకట చేస్తున్నట్లు బచ్చన పేర్కొన్నారు. పనామా పేపర్ల వ్యవహారంపై స్పందిస్తూ తాను నేరం చేసిందీ లేనిదీ తేల్చాల్సింది చట్టమేకాని, మీడియా కదని, ఏదో తప్పు జరిగినందువల్లే అమితాబ్ ను బ్రాండ్ హోదా నుంచి తొలిగించారని ప్రచారం చేయటం సరికాదన్నారు. విదేశీ టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ ప్రారంభించిన 'ఇంక్రెడిబుల్ ఇండియా' ప్రచారానికి మొదట్లో ఆమిర్ ఖాన్ అంబాసిడర్ గా ఉన్నారు. అసహనంపై వ్యాఖ్యల అనంతరం ఆమిర్ ను తప్పించిన కేంద్ర ఆ హోదాను అమితాబ్ కు కట్టబెట్టాలనుకుంది. అయితే అధికారికంగా తుదినిర్ణయం ఇంకావెలువడాల్సిఉంది. అంతలోనే పనామా పేపర్లలో బిగ్ బితోపాటు ఆయన కోడలు ఐశ్వర్య పేరు వెలుగులోకి రావటంతో కేంద్రం పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. -
‘పనామా’ ఫొన్సెకాలో సోదాలు
అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పనామా సర్కారు పనామా సిటీ: సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ లీకేజీకి కేంద్రబిందువైన న్యాయ సలహా సంస్థ మొసాక్ ఫొన్సెకా కార్యాలయంలో పనామా పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రపంచంలోని ప్రముఖుల విదేశీ కంపెనీలు, సంపదకు సంబంధించిన రహస్యాల లీకేజీపై ఆర్గనైజ్డ్ క్రైమ్ పోలీసులు ఫొన్సెకా కార్యాలయంతోపాటు ఇతర కార్యాలయాలనూ తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ సంస్థ అక్రమంగా కార్యక్రమాలు చేపట్టిందని నిరూపించే ఆధారాల కోసం వెతుకుతున్నామని వెల్లడించారు. అయితే..తాము తప్పేమీ చేయలేదని, న్యాయబద్ధంగానే కంపెనీలు ఏర్పాటుచేశామని.. తమ కంపెనీ వెబ్సైట్ హ్యాక్ అవటంతోనే పలు పత్రాలు లీక్ అయ్యాయని రామన్ ఫొన్సెకా తెలిపారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి, బ్లాక్‌లిస్టులో పెట్టిన ఫ్రాన్స్ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలోనే పనామా పోలీసులు ఈ సోదాలు నిర్వహించినట్లు అర్థమవుతోంది. ఏడాదిపాటు దీనిపై పనిచేసిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) 40 ఏళ్లుగా మొసాక్ ఫొన్సెకా కంపెనీ న్యాయ సలహాతో నడుస్తున్న 2.14లక్షల విదేశీ కంపనీల రహస్యాల గుట్టు విప్పిన సంగతి తెలిసిందే. -
మొసాక్ ఫోన్సెకా ప్రధాన కార్యాలయంపై దాడి
పనామా పేపర్లు సృష్టించిన సంచలనంతో.. మొసాక్ ఫోన్సెకా సంస్థ ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు. అక్కడి నుంచే భారీ మొత్తంలో వివరాలు లీకవుతుండటంతో పోలీసులు స్పందించారు. పన్నులు ఎగ్గొట్టడానికి విదేశాల్లో ఉన్న బినామీ కంపెనీలలో పెద్దమొత్తంలో నిధులు పెట్టుబడిగా చూపించినవాళ్ల జాతకాలను 'పనామా పేపర్స్' ద్వారా బయటపెట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆ సంస్థ వాదిస్తోంది. తాము హ్యాకింగ్ బాధితులమని, సమాచారాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతోంది. తమ విదేశీ ఆర్థిక పరిశ్రమ విషయంలో మరింత పారదర్శకత తెచ్చేందుకు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని పనామా ప్రెసిడెంట్ జువాన్ కార్లోస్ వారెలా హామీ ఇచ్చారు. వ్యవస్థీకృత నేరాల విభాగం అధికారులతో కలిసి పోలీసులు ఈ దాడి చేశారు. వివిధ పత్రికలలో ప్రచురితమైన కథనాలకు సంబంధఙంచిన సమాచారం, పత్రాలను స్వాధీనం చేసుకోడానికే ఈ దాడులు చేసినట్లు అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది. సంస్థకు చెందిన ఇతర కార్యాలయాల్లో కూడా దాడులు చేస్తామన్నారు. తాము అధికారులకు పూర్తిగా సహకరిస్తామని మొసాక్ ఫోన్సెకా సంస్థ ఒక ట్వీట్ ద్వారా తెలిపింది. విదేశాల్లో ఉన్న సెర్వర్ల ద్వారా తమ కంపెనీని ఎవరో హ్యాక్ చేశారని, దీనిపై ఇప్పటికే తాము పనామా అటార్నీ జనరల్ కార్యాలయంలో ఫిర్యాదుచేశామని మొసాక్ ఫోన్సెకా సంస్థ భాగస్వామి రామన్ ఫోన్సెకా తెలిపారు. ఈయన గతంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేశారు.