విదేశాల్లో తనకు ఎటువంటి అక్రమ ఆస్తులు లేవని బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేర్కొన్నారు.
ముంబై: విదేశాల్లో తనకు ఎటువంటి అక్రమ ఆస్తులు లేవని బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేర్కొన్నారు. పనామాలో తాను నల్లధనం దాచినట్టు వచ్చిన వార్తలను ఆమె తోసిపుచ్చారు. బయటకు లీకైన పనామా పత్రాల్లో ఉన్నట్టు చెబుతున్న సమాచారం అసత్యం, అబద్దమని ఐశ్వర్యరాయ్ మీడియా సలహారుదారు పేర్కొన్నారు.
పన్ను ఎగ్గొటి తమ నల్లడబ్బును దాచుకునేందుకు విదేశాల్లో బూటకపు కంపెనీలు, ఫౌండేషన్లు, ట్రస్టులు ఏర్పాటు చేసినవారిలో 500 మంది భారతీయుల పేర్లు ఉండడంతో సంచలనం రేగింది. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ సహా పలువురు ప్రముఖులు పేర్లు ఉన్నట్టు 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' వెల్లడించింది. దీనిపై అమితాబ్ బచ్చన్ ఇంకా స్పందించలేదు.