పనామా లీక్స్ నిందితులకు పేపర్ జైలు
ఏమిటీ షిప్పు.. ఏమిటీ డిజైన్.. కాసింత వెరైటీగానే ఉంది కదూ..ఇది వెరైటీయే.. ఎందుకంటే ఇది ఓ జైలు డిజైన్. ఎవరి కోసమో తెలుసా? గతేడాది సంచలనం సృష్టించిన పనామా పేపర్ల నిందితుల కోసమట! 1.1 కోట్ల పత్రాలు లీకైన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన సంపన్నులు పన్నులు ఎగ్గొట్టి.. తమ సంపదను దాచుకున్న వైనమూ వెల్లడైంది. అలాంటి ఆర్థిక నేరస్తుల కోసమే ఈ జైలు అని దీన్ని రూపొందించిన డిజైనర్లు(ఫ్రాన్స్) చెబుతున్నారు. అందుకే ఈ నౌకకు పనామా పేపర్స్ జైలు అని పేరు పెట్టారు. అంతేకాదు.. పై భాగంలో గడుల్లా కనిపిస్తున్నవి జైలు గదులన్నమాట. వీటిని తయారుచేసేది కూడా పేపర్స్‌తోనే.. అంటే కాగితంతో.. మొత్తం 3300 మంది ఖైదీలను ఉంచొచ్చు.
ఈ నౌకలో సముద్రపు నీళ్లను రీసైకిల్ చేసి.. వినియోగించుకునే సదు పాయంతోపాటు జిమ్, వర్క్‌షాపులు, పంటలను పండించే ఏర్పాట్లు ఉంటా యట. పనామా సిటీకి దగ్గర్లోని సముద్రపు జలాల్లో తిరుగుతూ ఉంటుందట. వన్‌వీక్ వన్ ప్రాజెక్ట్ అనే వెబ్‌సైట్ ప్రతి వారం ఓ వినూత్నమైన కాన్సెప్ట్‌ను విడుదల చేస్తుంది. అందులో భాగంగా ఈ డిజైన్‌ను విడుదల చేసింది.