panama leaks
-
దమ్ముంటే వైఎస్ జగన్ సవాల్ స్వీకరించండి
-
'టీడీపీకి దమ్ముంటే జగన్ సవాల్ స్వీకరించాలి'
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ నేతలకు దమ్ముంటే వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్‌ను స్వీకరించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ప్యారడైజ్ పేపర్లపై వైఎస్ జగన్ నేరుగా సవాల్ విసిరినా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేబినెట్ మంత్రులు ఆ సవాల్‌ను ఎందుకు స్వీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో బుగ్గన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్యారడైజ్ పేపర్ల లీకుల్లో హెరిటేజ్ పేరు వచ్చినా.. దాని గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారని అభిప్రాయపడ్డారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారని, అందుకే వాస్తవాలు దాచిపెట్టి జగన్‌పై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నారని బుగ్గన విమర్శించారు. 'ఏపీలో జరిగినంత అవినీతి దేశంలో మరెక్కడా జరగలేదు. పోలవరం, ప్రత్యేక హోదా లాంటి కీలకాంశాలను పక్కనపెట్టి కేవలం కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడుతున్నారు. రాజధాని, పట్టిసీమ, పుష్కరాలు, సదావర్తి భూములు, ఇసుక సహా అన్నింటిలోనూ అవినితీ, దోపిడిలకు పాల్పడ్డారు. ఓటుకు కోట్లు కేసు అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుగా ఉంది. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణకు చూసి భయపడుతున్న చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సహా పరిటాల కుటుంబ సభ్యులు తెలంగాణ సర్కార్‌తో కుమ్మక్కై ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం వాస్తవం కాదా? మీ అవినీతిపై సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐతో విచారణ జరిపించుకుంటే వాస్తవాలు వెలుగుచూస్తాయి. అవినీతిలో కూరుకుపోయిన ఏపీ సీఎం, మంత్రులు జగన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ముందుగా పార్టీ మారిన మంత్రులను డిస్మిస్ చేసి, ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలి. ఆర్థిక మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న యనమలకు న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌కు డాక్యుమెంట్‌కు తేడా తెలియదా అని' సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. -
ప్రధానికి షాక్.. కోర్టుకు హాజరు కావాలని ఆదేశం
ఇస్లామాబాద్: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. తన కుటుంబ ఆస్తులకు సంబంధించి పనామా పేపర్స్ లీక్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని అధినేతను జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం (జేఐటీ) ఆదేశించింది. ఈనెల 15న ఉదయం 11 గంటలకు ఇస్లామాబాద్‌లోని ఫెడరల్ జ్యుడీషియల్ అకాడమీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని జేఐటీ ఈనెల 8న సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకూ ఏ పాక్ ప్రధాని న్యాయ విచారణ ఎదుర్కొనలేదు. దీంతో విచారణ కమిటీ ముందు హాజరయ్యే మొదటి ప్రధాని నవాజే అవుతారని పాక్ వార్తా సంస్థ డాన్ న్యూస్ తెలిపింది. అంతేకాకుండా ఆర్థిక మంత్రి ఇషాక్ దర్‌ను కూడా కమిటీ ప్రశ్నించే అవకాశం ఉందని డాన్ న్యూస్ తెలిపింది. జూన్ 2న షరీఫ్ రెండో కుమారుడు ఆరుగురు సభ్యుల విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. ఆయన పెద్ద కుమారుడు హుస్సేన్ నవాజ్ కూడా విచారణ కమిటీ ముందు మూడోసారి హాజరయ్యారు. -
పనామా లీక్స్ నిందితులకు పేపర్ జైలు
ఏమిటీ షిప్పు.. ఏమిటీ డిజైన్.. కాసింత వెరైటీగానే ఉంది కదూ..ఇది వెరైటీయే.. ఎందుకంటే ఇది ఓ జైలు డిజైన్. ఎవరి కోసమో తెలుసా? గతేడాది సంచలనం సృష్టించిన పనామా పేపర్ల నిందితుల కోసమట! 1.1 కోట్ల పత్రాలు లీకైన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన సంపన్నులు పన్నులు ఎగ్గొట్టి.. తమ సంపదను దాచుకున్న వైనమూ వెల్లడైంది. అలాంటి ఆర్థిక నేరస్తుల కోసమే ఈ జైలు అని దీన్ని రూపొందించిన డిజైనర్లు(ఫ్రాన్స్) చెబుతున్నారు. అందుకే ఈ నౌకకు పనామా పేపర్స్ జైలు అని పేరు పెట్టారు. అంతేకాదు.. పై భాగంలో గడుల్లా కనిపిస్తున్నవి జైలు గదులన్నమాట. వీటిని తయారుచేసేది కూడా పేపర్స్‌తోనే.. అంటే కాగితంతో.. మొత్తం 3300 మంది ఖైదీలను ఉంచొచ్చు. ఈ నౌకలో సముద్రపు నీళ్లను రీసైకిల్ చేసి.. వినియోగించుకునే సదు పాయంతోపాటు జిమ్, వర్క్‌షాపులు, పంటలను పండించే ఏర్పాట్లు ఉంటా యట. పనామా సిటీకి దగ్గర్లోని సముద్రపు జలాల్లో తిరుగుతూ ఉంటుందట. వన్‌వీక్ వన్ ప్రాజెక్ట్ అనే వెబ్సైట్ ప్రతి వారం ఓ వినూత్నమైన కాన్సెప్ట్‌ను విడుదల చేస్తుంది. అందులో భాగంగా ఈ డిజైన్‌ను విడుదల చేసింది.