సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు | 'Many prominent Tata&Sons Directors figure in Panama Papers'   | Sakshi
Sakshi News home page

సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు

Published Sat, Dec 16 2017 5:06 PM | Last Updated on Sat, Dec 16 2017 5:06 PM

'Many prominent Tata&Sons Directors figure in Panama Papers'   - Sakshi

వివాదస్పద వ్యాఖ్యలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచే బీజేపీ ఫైర్‌ బ్రాండు, సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. పనామా పేపర్లలో ప్రముఖ టాటా సన్స్‌ డైరెక్టర్లలో చాలా మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. తనకు సమయమిస్తే, అందరి వివరాలను ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. ట్విట్టర్‌ ద్వారా సుబ్రహ్మణ్యస్వామి ఈ ఆరోపణలు చేశారు. పనామా పేపర్ల లీక్‌ ప్రపంచాన్నే కుదిపేసిన సంగతి తెలిసిందే. 

విదేశాల్లో నల్లధనం దాచుకున్న నల్ల కుబేరుల జాబితాను ఈ పేపర్లు బయటపెట్టాయి. చాలా మంది ప్రముఖులే ఈ పేపర్లలో ఉన్నారు.  ఇటీవల పనామా పేపర్ల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తన పదవివే పోగొట్టుకున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో, ప్రభుత్వ పదవులు చేపట్టకుండా ఆయనపై ఆ దేశ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. నేడు సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement