అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పనామా సర్కారు
పనామా సిటీ: సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ లీకేజీకి కేంద్రబిందువైన న్యాయ సలహా సంస్థ మొసాక్ ఫొన్సెకా కార్యాలయంలో పనామా పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రపంచంలోని ప్రముఖుల విదేశీ కంపెనీలు, సంపదకు సంబంధించిన రహస్యాల లీకేజీపై ఆర్గనైజ్డ్ క్రైమ్ పోలీసులు ఫొన్సెకా కార్యాలయంతోపాటు ఇతర కార్యాలయాలనూ తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ సంస్థ అక్రమంగా కార్యక్రమాలు చేపట్టిందని నిరూపించే ఆధారాల కోసం వెతుకుతున్నామని వెల్లడించారు.
అయితే..తాము తప్పేమీ చేయలేదని, న్యాయబద్ధంగానే కంపెనీలు ఏర్పాటుచేశామని.. తమ కంపెనీ వెబ్‌సైట్ హ్యాక్ అవటంతోనే పలు పత్రాలు లీక్ అయ్యాయని రామన్ ఫొన్సెకా తెలిపారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి, బ్లాక్‌లిస్టులో పెట్టిన ఫ్రాన్స్ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలోనే పనామా పోలీసులు ఈ సోదాలు నిర్వహించినట్లు అర్థమవుతోంది. ఏడాదిపాటు దీనిపై పనిచేసిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) 40 ఏళ్లుగా మొసాక్ ఫొన్సెకా కంపెనీ న్యాయ సలహాతో నడుస్తున్న 2.14లక్షల విదేశీ కంపనీల రహస్యాల గుట్టు విప్పిన సంగతి తెలిసిందే.
‘పనామా’ ఫొన్సెకాలో సోదాలు
Published Thu, Apr 14 2016 2:34 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement