కాల్ గర్ల్స్ తనను గుర్తుపట్టకుండా.. | Michael Jackson, doctor Conrad Murray, Emma Watson, this is it book, మైఖెల్ జాక్సన్, డాక్టర్ కన్రాడ్ ముర్రే, ఎమా వాట్సన్, దిస్ ఈజ్ ఇట్ పుస్తకం | Sakshi
Sakshi News home page

కాల్ గర్ల్స్ తనను గుర్తుపట్టకుండా..

Published Sun, Jul 17 2016 4:35 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

కాల్ గర్ల్స్ తనను గుర్తుపట్టకుండా..

కాల్ గర్ల్స్ తనను గుర్తుపట్టకుండా..

చనిపోయి ఏడేళ్లు కావస్తున్నా పాప్ కింగ్ మైఖెల్ జాక్సన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాల వేడి ఇంకా చల్లారడంలేదు. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హాలీవుడ్ హీరోయిన్ ఎమా వాట్సన్ ను, ఓ స్నేహితుడి కూతురు హెరియట్ లిస్టర్ లను జాక్సన్ పెళ్లాడాలనుకున్నాడట. అతనికి ఆ ఆలోచన కలిగినప్పుడు ఎమా, లిస్టర్ ల వయసు ఐదేళ్లు! బాలనటిగా ’హ్యారీ పొట్టర్’ సినిమాలో ఎమా నటన జాక్సన్ ను ముగ్ధుణ్ని చేసిందట. ఆ సినిమా చూసిన తర్వాత ఆ అమ్మాయిని(చిన్నారిని) పెళ్లిచేసుకోవాలని జాక్సన్ భావించాడట. బ్రిటన్ కు చెందిన స్నేహితుడి కూతురైన లిస్టర్ ను మాత్రం ఆమె యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాతే పెళ్లాడాలనుకున్నాడట!

ఈ వివాదాస్సద విషయాలను జాక్సన్ వ్యక్తిగత ఫిజిషియన్ గా పనిచేసిన డాక్టర్ కన్రాడ్ ముర్రే వెల్లడించారు. జాక్సన్ హత్యలో దోషిగా నాలుగేళ్లు జైలు జీవితం పూర్తిచేసుకున్న డాక్టర్ ముర్రే తాజాగా "This is it: laying bare grim" అనే పుస్తకాన్ని రాశారు. అందులో జాక్సన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను వెల్లడించారు. అంతేకాదు స్వయంగా జాక్సనే ’ఎప్పటికైనా ఈ విషయాలను ప్రపంచానికి చెప్పు’  అని తనతో అన్నట్లు ముర్రే పేర్కొన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో తిరగడం, నైట్ క్లబ్ లకు వెళ్లడం, చిన్న చిన్న హోటళ్లలో బసచేయడం లాంటి పనులు మైఖెల్ జాక్సన్ కు ఎంతో ఇష్టమని, అయితే తాను కనబడితే కాల్ గర్ల్స్, అభిమానులు మీదపడిపోతారేమోననే భయంతో జాక్సన్ మారువేషాల్లో ఆయా ప్రదేశాలకు వెళ్లేవాడని డాక్టర్ ముర్రే తన పుస్తకంలో రాశాడు. జాక్సన్ చాలాసార్లు తాను సౌదీ అరేబియా నుంచి వచ్చినవాడినని అరేబియా యాసలో మాట్లాడుతూ జనాన్ని బోల్తా కొట్టించేవాడని, కొన్నిసార్లు పైజామా(సౌదీ సంప్రదాయ దుస్తులు) ధరించేవాడని డాక్టర్ ముర్రే తెలిపారు. ఇంకా విడుదలకాని ముర్రే పుస్తకంలో ఎన్ని విషయాలు బయటికొస్తాయో వేచిచూడాలిమరి.
ఎమా వాట్సన్ అప్పుడు- ఇప్పుడు
 



జాక్సన్ పర్సనల్ ఫిజీషియన్ డాక్టర్ కన్రాడ్ ముర్రే

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement