
వాషింగ్టన్: పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ ఇక లేరు. ప్రఖ్యాత జాక్సన్5 పాప్ గ్రూప్ సభ్యుడైన 70 ఏళ్ల టిటో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి కారణం తెలియరాలేదు. మైకేల్‌తో పాటు ఇతర సోదరులు జాకీ, జర్మైన్, మార్లోన్‌లతో కలిసి జాక్సన్5 పేరిట టిటో పలు పాప్ ప్రదర్శనలిచ్చారు. జాక్సన్5 ఖాతాలో ఏబీసీ, ద లవ్ యూ సేవ్, ఐ వాంట్ యూ బ్యాక్ వంటి పలు హిట్లున్నాయి.
1964లో ఏర్పాటైన ఈ గ్రూపు ప్రేక్షకులను ఉర్రూతలూపింది. 1980లో ప్రతిష్టాత్మక హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అందుకుంది. 1997లో రాక్ అండ్ రోల్ హాలాఫ్ ఫేమ్‌లో చోటుచేసుకుంది. గ్రూప్‌లో టిటో వయోలిన్ వాయించేవారు. ఆయన చివరిదాకా ప్రదర్శనలిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 10న జర్మనీలో తుది ప్రదర్శన ఇచ్చారు. టిటో ముగ్గురు కుమారులు కూడా 3టీ గ్రూప్ పేరిట పాప్ సంగీతంలో ప్రసిద్ధులే.
Comments
Please login to add a commentAdd a comment