భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న తొలి బయోపిక్
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ‘మైఖేల్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ సోదరుడు జెర్మైన్ జాక్సన్ తనయుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్నారు. ‘‘జాఫర్ అచ్చం మైఖేల్ జాక్సన్‌లానే ఉన్నాడు. జాఫర్ నడక.. డ్యాన్స్... ఇలా అన్నీ మైఖేల్‌లానే ఉంటాయి. అందుకే మైఖేల్‌పాత్రకు జాఫర్ తప్ప వేరే ఎవరూ నప్పరు’’ అని ఈ చిత్రదర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా, నిర్మాత గ్రాహం కింగ్ అన్నారు.
ఇప్పటికే విడుదలైన జాఫర్ లుక్ చూసి, ‘మైఖేల్ తిరిగి వచ్చాడా అన్నట్లు ఉంది’ అని అభిమానులు సైతం పేర్కొన్నారు. కాగా, మైఖేల్ జీవితంలో ఉన్న వివాదాల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకుపాల్పడ్డారన్నది ఒకటి. అయితే మైఖేల్ అమాయకుడని, చిన్నారులను వేధించలేదనే కోణంలో ‘మైఖేల్’ చిత్రాన్ని ఆంటోయిన్ తెరకెక్కిస్తున్నారని సమాచారం.
ఇప్పటివరకూ హాలీవుడ్‌లో రూపొందిన బయోపిక్స్‌లో ‘మైఖేల్’ అత్యంత భారీ బడ్జెట్ బయోపిక్ అంటోంది హాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్. రూ. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ అని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ‘మైఖేల్’ చిత్రం పెట్టిన పెట్టుబడికి రెండింతలు... అంటే రూ. రెండువేల కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. ఇక 2009 జూన్ 25న మైఖేల్ కన్ను మూసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment