
ఓటీటీ అనగానే చాలామంది థ్రిల్లర్ సినిమాలకే ఓటేస్తారు. సబ్‌స్క్రిప్షన్ వృథాగా పోకుండా మంచి సినిమాలన్నీ చూసేయాలనుకుంటారు. కొత్తగా రిలీజయ్యే వాటిని ఎలాగోలా చూస్తారు. కానీ, అవైపోయాక ఏం చేయాలో అర్థం కాదు. ఇందుకోసం ఓటీటీలో టాప్ సినిమాల జాబితా కోసం గూగుల్‌లో వెతికేస్తారు. అలాంటివారికోసమే నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన చిత్రాల జాబితాను ఇక్కడ పొందుపరిచాం. నెట్‌ఫ్లిక్స్‌లో.. ఇవి బాగుంటాయ్ అని చెప్పుకునే సినిమాలు బోలెడు. వాటిలో ఓ పది చిత్రాలను మీకోసం అందిస్తున్నాం. అవేంటో చూసేయండి..

డామ్‌సెల్
ఒక యువరాణి తన రాజ్యానికి దూరంగా ఉన్నప్పుడు ఓ గాయపడ్డ డ్రాగన్‌ను కనుగొంటుంది. దానితో ఆమెకు మంచి స్నేహం కుదురుతుంది. ఈ స్నేహితులు ఏం చేశారన్నది నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే!

ద విచ్
ఒక ఫ్యామిలీ అడవిలోని ఓ ప్రదేశంలో తమకంటూ ఓ ఇల్లు నిర్మించుకుని ఆవాసం ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ భయాన సంఘటనలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొన్నారా? లేదా? వీరు దెయ్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారా? అన్నది తెలియాలంటే ద విచ్ చూడాల్సిందే!

ట్రైన్ టు బూసన్
దక్షిణ కొరియాలో జాంబీ వైరస్ వ్యాపిస్తుంది. దీంతో ఓ రైలులో మనుషులు ఉన్నట్లుండి జాంబీలుగా మారిపోతారు. మరి అందులోని హీరో కుటుంబం వీరి బారి నుంచి సురక్షితంగా బయపడ్డారా? లేదా? అన్నదే మిగతా కథ!

వెరోనికా
సరదా ఆటలు కొన్నిసార్లు ప్రాణాపాయంగా మారతాయి. ఓ టీనేజ్ అమ్మాయి ఊజా బోర్డుతో గేమ్ ఆడుతుంది. దాంతో దెయ్యం ఆమె వెంటపడుతుంది. తన కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.

బర్డ్ బాక్స్
ఒక శక్తి.. తన కంటిచూపుతో జనాల్ని సూసైడ్ చేసుకునేలా చేస్తుంది. దాని నుంచి తప్పించుకునేందుకు ఒక తల్లి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని కట్టుబట్టలతో ఇల్లు వదిలేసి వెళ్తుంది. ఈ క్రమంలో వారు కళ్లకు గంతలు కట్టుకుని నది దాటే ప్రయత్నం చేస్తారు. మరి వాళ్లు గండం గట్టెక్కారా? లేదా? అనేది తెలియాలంటే బర్డ్ బాక్స్ చూడాల్సిందే!

ఫ్రాక్చర్‌డ్
యాక్సిడెంట్ తర్వాత ఓ జంట ఆస్పత్రిలో చేరుతుంది. తీరా చూస్తే తన భార్య, కూతురు కనిపించకుండా పోతారు. ఆస్పత్రిలోనే ఏదో జరుగుతోందని హీరో కనుగొంటాడు. తన భార్య, కూతురిని తిరిగి కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.

స్ట్రేంజర్ థింగ్స్
మనకు తెలియని ప్రపంచం మరోటి ఉందని పిల్లలు కనుగొంటారు. ఆ మరో ప్రపంచంలోని రాక్షస జీవులతో పోరడతారు. అదృశ్య శక్తులున్న ఓ అమ్మాయి ఆ రాక్షస జీవులతో పోరాడేందుకు సాయం చేస్తుంది. ఇప్పటికి ఈ వెబ్ సిరీస్ నాలుగు సీజన్లు వచ్చింది. త్వరలో ఐదో సీజన్ రాబోతోంది.

ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్
అమెరికన్ రచయిత ఎడ్గర్ అల్లన్ పో ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ అనే కథ రాశాడు. దీన్ని ఆధారంగా చేసుకుని ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో ఓ కుటుంబాన్ని దెయ్యం వెంటాడుతూ ఉంటుంది.. ఒంట్లో వణుకు పుట్టించే సిరీస్ ఇది.

ట్రూత్ ఆర్ డేర్
మనలో చాలామంది ఆడుకునే సరదా ఆట ఇది. ఈ సినిమాలో కూడా ఫ్రెండ్స్ సరదాగా ట్రూత్ ఆర్ డేర్ ఆడతారు. కానీ ఎవరైనా అబద్ధం చెప్పారంటే ఓ శక్తి వారిని దారుణంగా శిక్షిస్తుంటుంది. ఆటను మధ్యలో వదిలేసినవారిని చంపడానికి కూడా వెనుకాడదు.

మెరైన్
ఓ అమ్మాయి హారర్ కథలు రాస్తుంటుంది. నెమ్మదిగా అవన్నీ నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్రెంచ్ సిరీస్ హారర్ ప్రియులను కచ్చితంగా మెప్పిస్తుంది.
చదవండి: మర్చిపోయారా? సిక్స్ ప్యాక్ ట్రెండ్ మొదలుపెట్టిందే ఆ హీరో!: విశాల్