ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
భాష ఏదైనా భావం ముఖ్యమన్న నానుడి ‘కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమాకి సరిగ్గా సరిపోతుంది. ఒకటి రెండు పాత్రల మినహా పూర్తిగా చింపాంజీలు నటించిన సినిమా ఇది. ఈ సినిమాకి వెస్ బాల్ దర్శకుడు. ‘కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా మునుపటి ఏప్స్ సిరీస్‌కు కొనసాగింపుగా తీసింది. సీజర్ అనే ప్రధాన పాత్రధారి తదనంతరం జరిగే కథ ఇది.
సీజర్‌కు వారసుడిగా ప్రకటించుకుని తనకు తానుప్రాక్సిమస్ సీజర్‌గా ప్రకటించుకుంటాడు ఓ నాయకుడు. మోవా, అతని సమూహం పై దాడి చేసి బందీలుగా తన రాజ్యానికి తెచ్చుకుంటాడుప్రాక్సిమస్ సీజర్. తన రాజ్యంలో మనుషులకు సంబంధించిన ఓ బంకర్‌ను మందీ మార్బలంతో తెరవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో బంకర్‌కు సంబంధించిన ఓ మనిషితో కలిసిప్రాక్సిమస్ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు మోవా.
తరువాత కొన్ని ట్విస్టులతోప్రాక్సిమస్ సీజర్‌ను మోవా ఎలా అంతమొందించాడు అన్నది హాట్ స్టార్ ఓటీటీ వేదిక మీద చూడాలి. కథ పరంగా చూస్తే మనకు పాత తెలుగు సినిమా కథ వాసనలు రావచ్చు. టెక్నాలజీని ఉపయోగించి టాలీవుడ్ నుండి హాలీవుడ్ దాకా ఈగ నుండి డైనాసరస్ వరకు అన్ని జంతువులను మన కథకు తగ్గట్టుగా మలుచుకుంటున్నారు నేటి దర్శకులు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి.
ఇంతటి సాంకేతికత అందుబాటులోకి రాని 80వ దశకంలోనే ‘మాకు స్వాతంత్య్రం కావాలి’ అన్న పేరుతో తెలుగులో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో పూర్తిగా జంతువుల మీద తీసిన సినిమా అది. నాటి ప్రేక్షకులకు అదో వింత, నేటి ప్రేక్షకులకు ‘కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా అనేది ఓ పెద్ద వండర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జంతువులలో కూడా మనిషి భావాలు స్పష్టంగా చూపించడం, అలాగే అద్భుతమైన టేకింగ్ విత్ విజువల్ ఫీస్ట్ స్క్రీన్ల్‌పేతో ‘కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా వర్త్ టూ వాచ్. – ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment