స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు పరిశ్రమలో ఉన్న క్రేజే వేరు. స్టైలిష్ లుక్, యాక్టింగ్‌లో బన్నీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో అభిమానులను కట్టిపడేస్తాడు. కాగా బన్నీ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ గతేడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ మూవీ బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్‌లుక్, ట్రైలర్, పాటలు విడుదలైనప్పటి నుంచి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో బుట్టబోమ్మ పాట సంచలనం సృష్టించగా.. ఈ మూవీ ట్రైలర్ సైతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షకులను సంపాదించి టాప్ 20లో నిలిచింది.
తాజా ఈ మూవీలోని ‘రాములో రాములా’ పాట మరో అరుదైన రికార్డు తెచ్చిపెట్టింది. ఈ ఫుల్ వీడియో సాంగ్ ఇప్పటి వరకూ 300 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతూ యూట్యూబ్ సెన్సేషనల్ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీతో ఎన్నో రికార్డు కొల్లగొట్టిన బన్ని తాజాగా ‘రాములో రాములో’ పాటతో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణీ, మంగ్లీలు ఆలపించారు.
Comments
Please login to add a commentAdd a comment