శాన్‌ఫ్రాన్సిస్కో: వీడియోలు చూసే వారి సంఖ్యకు సంబంధించి యూట్యూబ్ కీలకమైన మార్పులు చేసింది. కొంతమంది కళాకారులు కృత్రిమ పద్ధతుల ద్వారా వీడియో వ్యూస్ సంఖ్యను మార్చుకుంటున్నట్లు గుర్తించిన నేపథ్యంలో తామీ మార్పులు చేసినట్లు యూట్యూబ్ తెలిపింది. వీడియోల్లోని ప్రకటనలను ఎంతమంది చూశారన్న అంశంపై కాకుండా వేర్వేరు ఇతర పద్ధతుల ఆధారంగా ఎంత మంది చూశారన్న లెక్క తేలుస్తామని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నట్లు ‘ద వర్జ్’అనే వెబ్‌సైట్ తెలిపింది. అంతేకాకుండా 24 గంటల్లో రికార్డు వ్యూస్ అన్న అంశంలోనూ కొన్ని మార్పులు చేశామని, డైరెక్ట్‌గా లింక్‌లు షేర్ చేసుకోవడం, సెర్చ్ ద్వారా వీడియోలను చూడటం వంటి సహజసిద్దమైన ప్రక్రియల ఆధారంగా వ్యూస్ లెక్కపెడతామని తెలిపింది. ఈ ఏడాది జూలైలో భారతీయ ర్యాప్ సింగర్ వీడియో ఒకటి ఒక రోజులోనే 7.5 కోట్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఈ సంఖ్య తప్పుడు మార్గాల్లో పెంచుకున్నదని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment