సరికొత్త లుక్‌లో యూట్యూబ్
సరికొత్త లుక్‌లో యూట్యూబ్
Published Wed, Aug 30 2017 2:41 PM | Last Updated on Sun, Sep 17 2017 6:09 PM
శాన్‌ఫ్రాన్సిస్కోః గూగుల్ నేతృత్వంలోని యూట్యూబ్ కొత్త హంగులతో ముందుకొచ్చింది. సరికొత్త లోగోతో పాటు తన డెస్క్‌టాప్, మొబైల్ యాప్స్ డిజైన్‌లో భారీ మార్పులు చేపట్టింది. గతంలో చిన్నపాటి మార్పులు చేసినా ఇటీవల యూట్యూబ్ లోగోలో అతిపెద్ద మార్పు ఇదే కావడం గమనార్హం. ఈ మార్పులతో యూట్యూబ్ లోగో వివిధ డివైజ్‌లు..చిన్నపాటి స్ర్కీన్‌లపై కూడా మెరుగ్గా ఉంటుందని గూగుల్ పేర్కొంది.
డెస్క్‌టాప్ పనితీరు, వ్యూయర్లకు సరికొత్త ఫీల్‌ను ఇచ్చేలా పలు మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఈ ఏడాది ఆరంభంలో యూట్యూబ్ తన డెస్క్‌టాప్ వెబ్‌సైట్‌లో క్లీనర్ ఇంటర్‌ఫేస్‌తో పాటు రాత్రివేళల్లో వీడియోలు చేసేందుకు డార్క్‌మోడ్ వంటి నూతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Advertisement
Advertisement