రికార్డుల రంగమ్మ.. మంగమ్మ.. | Rangamma Mangamma Song Creates Record With 100 Million Views | Sakshi
Sakshi News home page

రికార్డుల రంగమ్మ.. మంగమ్మ..

Published Tue, Sep 18 2018 12:46 AM | Last Updated on Tue, Sep 18 2018 12:46 AM

Rangamma Mangamma Song Creates Record With 100 Million Views - Sakshi

సమంత

‘రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు...’ పాట వినగానే మనకు టక్కున ‘రంగస్థలం’ సినిమా గుర్తుకు రాక మానదు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై ఘన విజయం సాధించింది. అంతేకాదు.. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది.

ఈ చిత్రంలోని ‘రంగమ్మ మంగమ్మ’ పాట బాగా పాపులర్‌ అయింది. ఇప్పుడీ పాట యూ ట్యూబ్‌లో ఓ రికార్డు క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకూ ఈ పాటను 100 మిలియన్లు (10 కోట్లు) మందికి పైగా వీక్షించారు. ఈ ఏడాది తక్కువ టైమ్‌లో 10 కోట్ల మార్క్‌ను దాటిన తొలి దక్షిణాది పాటగా ‘రంగమ్మ మంగమ్మ’ పాట రికార్డు సృష్టించడం విశేషం. చంద్రబోస్‌ రాసిన ఈ పాటను మానసి పాడగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement