హీరో అల్లు అర్జున్ మరో ఘనత సాధించారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య (ఫాలోవర్స్) 25 మిలియన్స్ కు చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించి, తగ్గేదే లే అంటున్నారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్.
అదే విధంగా ఆ మూవీకి ఉత్తమ నటుడి కేటగిరీలో తెలుగులో జాతీయ అవార్డు సాధించిన తొలి హీరోగా అరుదైన ఘనత సాధించారాయన. కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు అల్లు అర్జున్. అందులో భాగంగానే దక్షిణాదిలో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉన్న హీరోగా రికార్డ్‌ను క్రియేట్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో హీరో విజయ్ దేవరకొండ (21.3 మిలియన్లు), మూడో స్థానంలో హీరో రామ్ చరణ్ (20.8మిలియన్లు) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment