కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ భామకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఛలో మూవీతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్‌గా చెలరేగిపోతుంది.
చదవండి: నటి వనితా విజయ్ కుమార్ మాజీ భర్త కన్నుమూత
ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉండే రష్మిక తరచూ సినిమాలు, తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది.తాజాగా రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో మరో మైలురాయిని చేరుకుంది. 38 మిలియన్ ఫాలోవర్స్‌తో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా రష్మిక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ మార్క్‌ను చేరుకున్న తొలి హీరోయిన్‌గానూ క్రేజ్ దక్కించుకుంది. సమంతకు 26.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, కాజల్‌కు 25.4, తమన్నాకు 20.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: ఉదయ భాను కొత్తంటిని చూశారా?భలే రిచ్‌గా ఉందే!
Comments
Please login to add a commentAdd a comment