ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో బన్నీ. ఐకాన్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. బన్నీ విషయానికోస్తే ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఇప్పటికే ఇన్‌స్టాలో ఆయనకు 21.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇటీవల ట్విటర్‌కు పోటీగా కొత్తగా థ్రెడ్స్ యాప్‌ను జుకర్ బర్గ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!)
ఈ యాప్‌లోను ఐకాన్ రికార్డ్ సృష్టించాడు. ఇండియాలోనే వన్ మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్న తొలి నటుడిగా నిలిచారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. యాప్ ఏదైనా ఐకాన్ స్టార్ తర్వాతే ఎవరైనా అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: టాలీవుడ్ హీరోకు పెద్ద ఫ్యాన్.. ధోని భార్య సాక్షి కామెంట్స్ వైరల్!)
Icon star @alluarjun is ruling threads as he becomes the first Indian actor to hit 1 Million followers on the app. Not only is he setting the silver screen on fire with his incredible performances, but he's also ruling the digital world and has managed to create a deep connection… pic.twitter.com/sejrIV8Nv5
— Sarath Chandra Naidu (@imsarathchandra) July 24, 2023
Comments
Please login to add a commentAdd a comment