'పుష్ప 2'(Pushpa 2) సినిమా థియేటర్లలో భారీ రికార్డ్స్ అందుకుంది. ప్రస్తుతం రీలోడెడ్ వర్షన్‌ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పటికే రూ.1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ భారీగానే వస్తున్నాయి. పుష్ప2 విడుదల అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. దీంతో పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్(Netflix) సంస్థ.. 'పుష్ప 2' డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. సుమారు రూ. 200 కోట్లకు ఈ చిత్రం రైట్స్‌ను దక్కించుకుందని సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, నాలుగు వారాలకే డీల్ మాట్లాడుకున్నట్లు ఓ న్యూస్ అయితే వైరల్ అయింది. కానీ, ఇప్పుడు ఏడు వారాల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానుంది. అంటే జనవరి 29న లేదా 31న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీ అని తెలుస్తోంది. పుష్ప2 రీలోడెడ్ వర్షన్ 3:40 నిమిషాల నిడివి ఉంది. ఓటీటీలో ఈ కొత్త వర్షన్‌ను విడుదల చేయనున్నారు.
పుష్ప 2 చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్లు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై బాహుబలి2 రికార్డ్స్‌ను దాటేసింది. కేవలం హిందీలో రూ.800 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్స్ పుష్ప2 క్రియేట్ చేసింది.
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా 2024 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీగా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment