తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ (Income Tax Officer) అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. సంక్రాంతి రేసులో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదలయ్యాయి. రీసెంట్‌గా మేత్రీ మేకర్స్ నిర్మించిన పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.
ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్‌లను తాజాగా ఐటీ అధికారులు విచారించారు. వారు నిర్మించిన పుష్ప2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలను రాబట్టినట్లు ఐటీ గుర్తించింది. అయితే, వసూళ్లు తగ్గట్టుగా ఆదాయ పన్ను చెల్లింపులు జరగలేదని అధికారులు కనుగొన్నారు. అందుకోసం మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను వారు పరిశీలిస్తున్నారు.
నిర్మాత దిల్ రాజ్, కూతురు హన్సితా రెడ్డి, సోదరుడు నర్సింహ రెడ్డి , నిర్మాత శిరీష్ ఇంట్లో కూడా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వారి నిర్మాణ సంస్థ నుంచి భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యాయి. రెండు మూవీల ఆదాయ వ్యయాలపై ఐటీ అధికారలు విచారిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసినట్లు గుర్తించారు. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment