ఇంటిల్లిపాదీ కలిసి చేసుకునే పండగ సంక్రాంతి. ఈ పండక్కి ఎవరెక్కడ, ఏ మూలన ఉన్నా సరే ఎలాగోలా వీలు చేసుకుని మరీ ఇంటికి చేరుకుంటారు. అమ్మ చేసే అరిసెలు, చెల్లి వేసే ముగ్గులు, హరిదాసు కీర్తనలు, స్నేహితులతో గాలిపటాలు ఎగరేయడాలు.. కోడిపందేలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కుటుంబ బంధాల్ని రెట్టింపు చేస్తూ ఏడాదికి సరిపడా జ్ఞాపకాల్ని పోగుచేసిస్తుంది సంక్రాంతి.
గతేడాది కన్నులపండగ్గా..
ఈ పండగను మెగా ఫ్యామిలీ (Mega Family) కూడా ఎప్పుడూ ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరూ ఒక్కచోట చేరుతుంటారు. గతేడాదైతే మెగా కుటుంబమంతా కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు. బెంగళూరులోని ఫామ్ హోస్‌లో మెగా అల్లు ఫ్యామిలీ జాలీగా పండగను ఎంజాయ్ చేశారు. చిరంజీవి (Chiranjeevi Konidela), నాగబాబు కుటుంబంతో పాటు అల్లు అరవింద్ కుటుంబం కూడా అక్కడే ఉంది. అల్లు అర్జున్.. భార్య స్నేహ, పిల్లలు అర్హ, అయాన్‌తో కలిసి ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యాడు.
గతేడాది మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అల్లు కుటుంబం
చదవండి: గేమ్ ఛేంజర్ మూవీకి నా మనసులో ప్రత్యేక స్థానం: రామ్ చరణ్
ఈసారి ఎవరింట్లో వారే..
కానీ ఈసారి మాత్రం ఎవరింట్లో వారే పండగ జరుపుకున్నట్లు తెలుస్తోంది. అటు చిరంజీవి తన ఇంట్లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. ఇటు అల్లు అర్జున్ (Allu Arjun) తన కుటుంబంతో పండగ జరుపుకున్నాడు. ట్రెడిషనల్ డ్రెస్‌లో ముస్తాబైన దిగిన ఫ్యామిలీ ఫోటోను అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదంతా చూసిన అభిమానులు రెండు కుటుంబాలు కలిసి పండగ చేసుకుంటే ఎంత చూడముచ్చటగా ఉండేదోనని నిట్టూర్పు విడుస్తున్నారు.
క్రిస్‌మస్ పార్టీకి చరణ్..
గతంలో అల్లు అర్జున్ క్రిస్‌మస్ పార్టీ ఇస్తే దానికి రామ్‌చరణ్- ఉపాసన, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి, శ్రీజ, నిహారిక, వైష్ణవ్‌తేజ్ ఇలా అందరూ హాజరయ్యారు. అలా ఎవరింట్లో ఏ పార్టీ ఉన్నా రెండు కుటుంబాలు కలుసుకునేవి. ఇప్పుడేమో వీరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ దూరం ఇలాగే కొనసాగుతుందా? అని పలువురూ చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment