తెలుగులో దిగ్గజాలు, అద్భుతమైన నటులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లెవరి వల్ల కానిది అల్లు అర్జున్ చేసి చూపిస్తున్నాడు. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. 'పుష్ప' హిట్ అయిందనో, నేషనల్ అవార్డు వచ్చిందనో ఇలా అనట్లేదు. రియాలిటీలో జరుగుతున్నదే చెబుతున్నాం. రీజనల్ మూవీస్ చేసే ఓ హీరోని.. ఏకంగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో కావడం ఏంటి.. స్పెషల్‌గా ఓ వీడియో రిలీజ్ చేయడం ఏంటి.. అసలు బన్నీకి ఎక్కడ కలిసొచ్చింది. ఇదంతా ఎలా సాధ్యమైంది?
(ఇదీ చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!)
స్టైల్ ప్లస్ గెటప్స్
తండ్రి అల్లు అరవింద్ నిర్మాత. దీంతో టీనేజీలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. తొలి సినిమా 'గంగోత్రి'లో బాగానే నటించాడు. కానీ బన్నీ లుక్స్‌పై విమర్శలు. వీడు హీరో ఏంట్రా? అన్నవాళ్లు కూడా ఉన్నారు. దీంతో రెండో సినిమాకే పూర్తిగా ఛేంజ్ అయ్యాడు. లవర్ బాయ్ 'ఆర్య'గా డిఫరెంట్ మేకోవర్‌తో మెస్మరైజ్ చేశాడు. అప్పటినుంచి మొదలు 'పుష్ప' వరకు ఏ మూవీకి ఆ మూవీకి డిఫరెంట్ స్టైల్- గెటప్స్‌తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. వచ్చారు. యాక్టింగ్ పరంగానూ తనని వేలెత్తి చూపని విధంగా ఇంప్రూవ్ అయ్యాడు.
డ్యాన్సుల్లో టాప్
తెలుగు హీరోల్లో చిరంజీవి తర్వాత బాగా డ్యాన్స్ చేసేవాళ్ల లిస్ట్ తీస్తే అల్లు అర్జున్ కచ్చితంగా ఉంటాడు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కూడా బాగానే చేస్తారు. కానీ బన్నీకి సరైన మాస్ సాంగ్స్ చాలానే పడ్డాయి. సినిమా ఎలా ఉన్నాసరే పాటలు, వాటిలో అల్లు అర్జున్ డ్యాన్సుల వల్ల పాన్ ఇండియా ట్రెండ్ లేని రోజుల్లోనే డబ్బింగ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు.
(ఇదీ చదవండి: అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్)
టర్నింగ్ పాయింట్
అల్లు అర్జున్ అంటే ఓ తెలుగు హీరో మాత్రమే. ఇతడి సినిమాలు ఆంధ్రా, తెలంగాణ వరకే పరిమితం. అయితే 'అల వైకుంఠపురములో' సూపర్ హిట్ అయిన తర్వాత ఆ సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఈ మూవీ వచ్చిన రెండు నెలలకే కరోనా లాక్‌డౌన్ రావడం. అందరూ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలా కొన్ని నెలలపాటు నార్త్ నుంచి విదేశీయుల వరకు ఎక్కడ చూసినా ఈ పాటలకే రీల్స్ తెగ చేశారు. అలా తనకు తెలియకుండానే అల్లు అర్జున్.. గ్లోబల్ వైడ్ ఫేమ్ సొంతం చేసుకున్నాడు.
'పుష్ప' విత్ నేషనల్ అవార్డ్
ముందు అనుకున్న ప్రకారం 'పుష్ప' సినిమాని తెలుగులో మాత్రమే రిలీజ్ అనుకున్నారు. కానీ రాజమౌళి సూచించడంతో ప్రమోషన్స్ చేయకుండానే నార్త్‌లోనూ రిలీజ్ చేశారు. తెలుగులో ఓకే అనిపించుకుంది. కానీ అక్కడ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. నార్త్‌లో కలెక్షన్స్ దుమ్మరేపింది. అల్లు అర్జున్ అంటే ఎవరో దాదాపు ప్రతి ఉత్తరాది ప్రేక్షకుడి తెలిసేలా 'పుష్ప' చేసింది. దీంతో వాళ్లందరూ ఇప్పుడు 'పుష్ప 2' కోసం తెలుగు ఆడియెన్స్ కంటే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా బన్నీకి తాజాగా నేషనల్ అవార్డు రావడం మరో ప్లస్ పాయింట్.
(ఇదీ చదవండి: రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. ఫొటో వైరల్!)
వార్నర్ హెల్ప్!
మిగతా సెలబ్రిటీలు సంగతేమో గానీ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. బన్నీకి గ్లోబల్ వైడ్ గుర్తింపు తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఎందుకంటే లాక్‌డౌన్ టైంలో అల్లు అర్జున్ పాటలకు సరదా కోసం వార్నర్ రీల్స్ చేశాడు. కానీ అవి చాలామందికి రీచ్ అయ్యాయి. అలా కొంతలో కొంత వార్నర్ కూడా అల్లు అర్జున్‌కి ప్లస్ అయ్యాడని చెప్పొచ్చు.
ఇన్ స్టా వీడియోతో
మిగతా హీరోలందరూ పాన్ ఇండియా ట్రెండ్ వెనకాల పడుతుంటే.. బన్నీ మాత్రం గ్లోబల్ వైడ్ పాపులారిటీ ఆల్రెడీ దక్కించేసుకున్నాడు. ఎందుకంటే ప్రఖ్యాత ఇన్‌స్టాగ్రామ్.. బన్నీని ఫాలో అవుతోంది. భారతీయ నటుల్లో ఆ సంస్థ ఫాలో అవుతున్న ఫస్ట్ పర్సన్ అల్లు అర్జున్. తాజాగా ఇతడి దినచర్యని స్పెషల్‌గా ఓ వీడియో తీసి మరీ, తన అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇది చాలదా బన్నీ.. జాక్‌పాట్ కొట్టాడని చెప్పడానికి!
(ఇదీ చదవండి: 48 ఏళ్ల వయసులో పెళ్లిపై స్పందించిన నగ్మా.. త్వరలోనే..)
Comments
Please login to add a commentAdd a comment