‘పుష్ప’ మళ్లీ షురూ | Pushpa 2 The Rule release on 15 August 2024 | Sakshi
Sakshi News home page

Pushpa 2 Release Date: ‘పుష్ప’ మళ్లీ షురూ

Published Fri, Jan 19 2024 1:09 AM | Last Updated on Fri, Jan 19 2024 9:42 AM

Pushpa 2 The Rule release on 15 August 2024 - Sakshi

మళ్లీ యాక్షన్‌ షురూ చేశాడు పుష్పరాజ్‌. తనకు ఎదురొచ్చిన శత్రువుల బెండు తీస్తున్నాడు. అది ఏ రేంజ్‌లో అనేది ఆగస్టు 15న థియేటర్స్‌లో చూడాలి. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌ పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్‌. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’కి మలి భాగంగా ‘పుష్ప: ది రూల్‌’ రూపొందుతోంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్‌. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు. కాగా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌ శివార్లలోని ఓ స్టూడియోలో ప్రారంభమైందని తెలిసింది. పదిహేను రోజులకు పైగా ఈ షెడ్యూల్‌ సాగుతుందట. అల్లు అర్జున్‌ పాల్గొనగా ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్‌లోనే కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్‌ చేశారట. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement