అల్లు అర్జున్‌ 'పుష్ప-2'.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌! | Pushpa 2 TheRule shooting Update as spectacular action episode for the climax | Sakshi
Sakshi News home page

Pushpa2 TheRule: బన్నీ 'పుష్ప-2 ది రూల్‌'.. మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది!

Published Mon, Aug 5 2024 2:52 PM | Last Updated on Mon, Aug 5 2024 3:14 PM

Pushpa 2 TheRule shooting Update as spectacular action episode for the climax

ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్‌- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ పెండింగ్‌లో ఉండడంతో డిసెంబర్‌కు వాయిదా పడింది. దాదాపు మరో నెల రోజుల పాటు షూటింగ్‌ పూర్తి కావాల్సి ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన యాక్షన్‌ సీన్స్‌ షూట్ చేస్తున్నట్లు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. డిసెంబర్ 6న తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తామంటూ మరోసారి రిలీజ్‌ తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఇటీవల పుష్ప-2 మరోసారి వాయిదా పడుతుందన్న వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అందువల్లే పుష్ప టీమ్ షూటింగ్‌ అప్‌డేట్‌ను ప్రేక్షకులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. 

ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్‌ పుష్ప-2 కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. పుష్ప పార్ట్‌-1 సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement