హైదరాబాద్‌లో ఫైట్ చేస్తున్నాడు పుష్ప రాజ్. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’ తెరకెక్కుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ‘‘పుష్ప: ది రైజ్’ సూపర్ హిట్ కావడంతో ‘పుష్ప: ది రూల్’ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో భారీ ఖర్చుతో వేసిన సెట్‌లో జరుగుతోంది. హీరోతో పాటు సినిమాలోని కీలక నటీనటులపై పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ సీన్స్ హైలైట్‌గా ఉంటాయి. డిసెంబరు 6న మా చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని యూనిట్ పేర్కొంది. సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment