
అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా మెప్పించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 రూపొందిస్తున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.
తాజాగా పుష్ప టీమ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పుష్ప సినిమాతో పోలుస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ టీమ్ తన రికార్డ్‌ను తానే అధిగమించింది. ముంబయిపై 277 పరుగుల అత్యధిక స్కోరు చేసిన ఎస్ఆర్‌హెచ్.. మరోసారి బెంగళూరుపై 287 రన్స్ చేసి తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టింది. దీంతో మొదటి మ్యాచ్‌ను పుష్ప పార్ట్-1గా.. రెండో మ్యాచ్‌ను పుష్ప-2గా పోలుస్తూ పోస్ట్ చేసింది. రెండుసార్లు అత్యధిక స్కోరు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు అభినందనలు తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది చూసిన కొందరు అభిమానులు పుష్ప డైలాగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రపంచలో ఎక్కడా లేని సరకు మన దగ్గరే ఉండాది అనే డైలాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఏ టీమ్ సాధించని రికార్డ్‌ను రెండుసార్లు సన్‌రైజర్స్ అధిగమించడం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోనుంది.
HUPPPP!!! 💥💥
277/3 - SRH: The Rise 😎
287/3 - SRH: The Rule 🤙
Congratulations on scoring the Highest-ever IPL team totals twice in this season! 🔥 @SunRisers https://t.co/kcfJBj5E0Z pic.twitter.com/co0o1zIw7T— Pushpa (@PushpaMovie) April 16, 2024