![Allu Arjun Pushpa 2 The Rule Movie Shocking New First Look Poster Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/7/pusha.jpg.webp?itok=GgReJb6S)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా పుష్ప-2 ది రూల్. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా వేర్ ఈజ్ పుష్ప పేరుతో ఇంట్రెస్టింగ్ వీడియోను వదిలిన సంగతి తెలిసిందే. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వస్తే పుష్ప వచ్చాడని అర్థం అంటూ కాన్సెప్ట్ టీజర్‌తో దుమ్మురేపిన పుష్ప టీంకు లీకు వీరులు షాక్ ఇచ్చారు.
రేపు(శనివారం)బన్నీ బర్త్‌డే సందర్భంగా పుష్ప-2లోని ఆయన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయాలిని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ టీజర్ విడుదలైన కాసేపటికే అల్లు అర్జున్ మాస్‌లుక్ నెట్టింట లీక్ అయ్యింది. దీంతో చేసేదేమీ లేక అఫీషియల్‌ను పుష్పరాజ్ లుక్‌ను వదిలారు.
అయితే ఇందులో అల్లు అర్జున్ మైండ్ బ్లాక్ అయ్యేలా అమ్మోరు అవతారంలో కనిపించి షాక్ ఇచ్చారు. కండలు తిరిగిన దేహంతో చీరకట్టుకొని చేతిలో తుపాకీ పట్టుకొని కనిపించారు బన్నీ. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఊరమాస్ లుక్‌లో నెవర్ బిఫోర్ అనేలా అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు.
#Pushpa2TheRule Begins!!! pic.twitter.com/FH3ccxGHb8
— Allu Arjun (@alluarjun) April 7, 2023
Comments
Please login to add a commentAdd a comment