Bollywood Hero Arjun Kapoor Likely To Act In Allu Arjun Pushpa 2 Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Allu Arjun Pushpa 2 Movie Update: పుష్ప-2లో బాలీవుడ్‌ హీరో..!

Published Thu, Oct 6 2022 5:32 PM | Last Updated on Thu, Oct 6 2022 6:42 PM

Bollywood Hero Arjun Kapoor Acts In Allu arjun Pushpa-2 Movie - Sakshi

స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల భామ రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కీలక పాత్రలో నటించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

(చదవండి: క్రేజీ అప్‌డేట్‌.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్‌ షూటింగ్‌!)

బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ పుష్ప-2లో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపంచనున్నారని టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం. అదే నిజమైతే అర్జున్ కపూర్ నటించే తొలి టాలీవుడ్ చిత్రంగా పుష్ప-2 నిలవనుంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప భారీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని యూత్‌ను ఊర్రూతలూగించాయి. ఇటీవల జరిగిన సైమా అవార్డుల్లోనూ పుష్ప పలు అవార్డులను కైవసం చేసుకుంది. గతంలో పుష్ప సినిమా చూసిన అర్జున్‌ కపూర్ బన్నీ నటనను కొనియాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement