లెజండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య మనువడిగా, చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అల్లు అర్జున్. హీరోగా తెరంగేట్రం చేయడానికి ముందే బాలనటుడిగా నటించి మెప్పించాడు బన్నీ. మొదట్లో యానిమేటర్‌ని అవుదామనుకున్న అల్లు అర్జున్ సినిమా మీదున్న ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాడు. 2003లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో వెనుతిరిగి చూడలేదు..
ఈ సినిమాతోనే బన్నీకి స్లైలిష్ స్టార్ అనే ట్యాగ్‌లైన్ వచ్చింది. ఆ తర్వాత హ్యాపీ, బన్నీ, పరుగు వంటి సినిమాలతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు. దేశముదురు సినిమా బన్నీకి మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. రేసుగుర్రం, సరైనోడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, మొన్నటి పుష్ప సినిమా వరకు ప్రతి క్యారెక్టర్‌లో వైవిధ్యం, లుక్‌లో కొత్తదనం సహా తన ఇమేజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోయాడు.ఇక అల్లు అర్జున్ లైఫ్‌స్టైల్ కూడా రిచ్‌గా ఉంటుంది. ఖరీదైన వానిటీ వ్యాన్ దగ్గర్నుంచి ప్రైవేట్ జెట్ వరకు అల్లు అర్జున్ ఆస్తుల వివరాలపై ఓ లుక్కేద్దాం.
AA వ్యానిటీ వ్యాన్.. ధరెంతో తెలుసా?
అల్లు అర్జున్‌కు చెందిన అత్యంత ఖరీదైన వస్తువుల్లో వ్యానిటీ వ్యాన్ ఒకటి. టీవీ, ఫ్రిజ్, సౌకర్యవంతమైన రిక్లైనర్ సహా పలు విలాసవంతమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. తన అభిరుచికి తగ్గట్లు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఈ వ్యానిటీ వ్యాన్ ధర సుమారు రూ. 7కోట్లు.
అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లో సుమారు వంద కోట్ల రూపాయల ఇల్లు ఉంది. ఇప్పటికీ తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నారు బన్నీ. స్విమ్మింగ్ పూల్, జిమ్, హోమ్ థియేటర్ సహా విలాసవంతంగా ఇంటిని ఇంటీరియర్ చేయించుకున్నారు. ఇక బన్నీకి కార్లంటే చాలా ఇష్టం. సొంతంగా లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్లే అల్లు అర్జున్ వద్ద ఖరీదైన హమ్మర్ H2, రేంజ్‌రోవన్ వోగ్, జాగ్వార్ ఎక్స్‌జెఎల్ సహా BMW X6 M స్పోర్ట్ కార్లు కూడా ఉన్నాయి.
సొంతంగా ప్రైవేట్ జెట్
ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న అతికొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. అల్లు అర్జున్‌కు సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా ఉంది. షూటింగ్స్ లేకపోతే ఎక్కువగా కుటుంబంతో గడిపే అల్లు అర్జున్ ఎక్కువగా ప్రైవేట్ జెట్స్‌లోనే ఫ్యామిలీని తీసుకొని వెకేషన్స్‌కు వెళ్తుంటారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటారు.
వామ్మో.. ఒక్కో సినిమాకు అన్ని కోట్లా?
ఒక ఒక్కో సినిమాకు రూ.40 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప సక్సెస్‌తో రెమ్యునరేషన్‌ను అమాంతం రూ. 100కోట్లకు పెంచేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు 'పుష్ప ది రూల్'తో పాటు సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న సినిమాకు సుమారు రూ. 100 - 120 కోట్ల వరకు బన్నీ చార్జ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. సినిమాలే కాకుండా పలు హైదరాబాద్‌లో పబ్స్, రెస్టారెంట్స్‌లలో ఆయనకు పలు షేర్స్ ఉన్నాయి. మొత్తంగా రూ. 400-500 కోట్లకు పైగానే ఆయన నికర ఆస్తుల విలువ ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment