expensive things
-
Allu Arjun Assets: అల్లు అర్జున్‌కు అన్ని వందల కోట్ల ఆస్తులున్నాయా?
లెజండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య మనువడిగా, చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అల్లు అర్జున్. హీరోగా తెరంగేట్రం చేయడానికి ముందే బాలనటుడిగా నటించి మెప్పించాడు బన్నీ. మొదట్లో యానిమేటర్ని అవుదామనుకున్న అల్లు అర్జున్ సినిమా మీదున్న ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాడు. 2003లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో వెనుతిరిగి చూడలేదు.. ఈ సినిమాతోనే బన్నీకి స్లైలిష్ స్టార్ అనే ట్యాగ్‌లైన్ వచ్చింది. ఆ తర్వాత హ్యాపీ, బన్నీ, పరుగు వంటి సినిమాలతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు. దేశముదురు సినిమా బన్నీకి మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. రేసుగుర్రం, సరైనోడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, మొన్నటి పుష్ప సినిమా వరకు ప్రతి క్యారెక్టర్లో వైవిధ్యం, లుక్‌లో కొత్తదనం సహా తన ఇమేజ్ను అంతకంతకూ పెంచుకుంటూ పోయాడు.ఇక అల్లు అర్జున్ లైఫ్‌స్టైల్ కూడా రిచ్‌గా ఉంటుంది. ఖరీదైన వానిటీ వ్యాన్ దగ్గర్నుంచి ప్రైవేట్ జెట్ వరకు అల్లు అర్జున్ ఆస్తుల వివరాలపై ఓ లుక్కేద్దాం. AA వ్యానిటీ వ్యాన్.. ధరెంతో తెలుసా? అల్లు అర్జున్‌కు చెందిన అత్యంత ఖరీదైన వస్తువుల్లో వ్యానిటీ వ్యాన్ ఒకటి. టీవీ, ఫ్రిజ్, సౌకర్యవంతమైన రిక్లైనర్ సహా పలు విలాసవంతమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. తన అభిరుచికి తగ్గట్లు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఈ వ్యానిటీ వ్యాన్ ధర సుమారు రూ. 7కోట్లు. అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లో సుమారు వంద కోట్ల రూపాయల ఇల్లు ఉంది. ఇప్పటికీ తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నారు బన్నీ. స్విమ్మింగ్ పూల్, జిమ్, హోమ్ థియేటర్ సహా విలాసవంతంగా ఇంటిని ఇంటీరియర్ చేయించుకున్నారు. ఇక బన్నీకి కార్లంటే చాలా ఇష్టం. సొంతంగా లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్లే అల్లు అర్జున్ వద్ద ఖరీదైన హమ్మర్ H2, రేంజ్రోవన్ వోగ్, జాగ్వార్ ఎక్స్జెఎల్ సహా BMW X6 M స్పోర్ట్ కార్లు కూడా ఉన్నాయి. సొంతంగా ప్రైవేట్ జెట్ ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న అతికొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. అల్లు అర్జున్‌కు సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా ఉంది. షూటింగ్స్ లేకపోతే ఎక్కువగా కుటుంబంతో గడిపే అల్లు అర్జున్ ఎక్కువగా ప్రైవేట్ జెట్స్‌లోనే ఫ్యామిలీని తీసుకొని వెకేషన్స్‌కు వెళ్తుంటారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటారు. వామ్మో.. ఒక్కో సినిమాకు అన్ని కోట్లా? ఒక ఒక్కో సినిమాకు రూ.40 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప సక్సెస్‌తో రెమ్యునరేషన్‌ను అమాంతం రూ. 100కోట్లకు పెంచేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు 'పుష్ప ది రూల్'తో పాటు సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న సినిమాకు సుమారు రూ. 100 - 120 కోట్ల వరకు బన్నీ చార్జ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. సినిమాలే కాకుండా పలు హైదరాబాద్‌లో పబ్స్, రెస్టారెంట్స్‌లలో ఆయనకు పలు షేర్స్ ఉన్నాయి. మొత్తంగా రూ. 400-500 కోట్లకు పైగానే ఆయన నికర ఆస్తుల విలువ ఉంటుందని సమాచారం. -
కోట్లలో ఆస్తులున్న కంగనా రనౌత్.. వాటి విలువ ఎంతంటే?
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, వివాదాల బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్‌గా రికార్డుకెక్కింది. ఏ అంశమైన తనదైన స్టైల్లో ఎలాంటి భయం లేకుండా విమర్శలను సంధిస్తుంటుంది. ఎలాంటి సంకోచం లేకుండా తనకు అనిపించింది చెప్పడంతో అభిమానులను కూడా సంపాదించుకుంది ఈ బ్యూటీ. కంగనా ప్రస్తుతం కాంట్రవర్సీ రియాలిటీ షో లాకప్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా ఆమె చేతిలో పలు సినిమా ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో కంగనా ఒకరు. అయితే బుధవారం (మార్చి 23) పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ ఫైర్‌బ్రాండ్ ఖరీదైన ఆస్తులు, వస్తువుల వివరాలు తెలుసుకుందామా ! 2022 ఏడాది వరకు కంగనా నికర ఆస్తి విలువ సుమారు రూ. 95 కోట్లవరకు ఉంటుందని అంచనా. మనాలిలోని ఒక స్టైలిష్ కాటేజ్ బంగ్లాకు కంగనా యజమానురాలు. 7,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 బెడ్రూమ్లు, 7 బాత్రూమ్లతో ఆ కాటేజ్ ఉంది. ఈ విలాసవంతమైన ఇంటి ధర రూ. 30 కోట్లని సమాచారం. కంగనాకు ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో 5 బీహెచ్‌కే ఇల్లు ఉందని తెలుస్తోంది. కంగనా ఈ స్థలాన్ని 2017లో రూ. 20.7 కోట్లకు కొనుగోలు చేసిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇవేకాకుండా కంగనాకు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. అందులో ఆడీ క్యూ3, మెర్సెడీస్ జీఎల్ఈ ఎస్యూవీ, బీఎండబ్ల్యూ 7 సిరీస్ తదితర కార్లు ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనాకు యాక్సెసరీస్ అంటే కూడా చాలా ఇష్టం. ఆమె కలెక్షన్లలో చాలా లగ్జరీ, సూపర్ ఎక్స్పెన్సివ్ హ్యాండ్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు హీర్మేస్ బిర్కిన్ హ్యాండ్‌బ్యాగ్‌లు కంగనా వద్ద ఉన్నాయి. వాటి ఒక్కో ధర రూ. 15 లక్షల వరకు ఉంటుంది. ఇవేకాకుండా ఆమె వద్ద డియోర్, ప్రాడా, లూయిస్ విట్టన్ వంటి లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లు సైతం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కంగనా రనౌత్ ఏప్రిల్‌లో ధాకడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే కాకుండా తేజస్ మూవీలో నటిస్తోంది కంగనా. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. -
ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!!
సాధారణంగా స్నానం చేసే సబ్బు ఖరీదు ఎంత ఉంటుంది. మహా అయితే రూ. 30, 40 ఉంటుంది. మరీ ఖరీదైంది ఐతే వంద రూపాయలు ఉంటుంది. ఐతే ఈ సబ్బు ఖరీదు వందలు కాదు వేలు అస్సలే కాదు ఏకంగా లక్షల్లో ఉంటుందట. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బట కూడా! స్నానం చేసే సబ్బే కదా.. ఏమైనా బంగారంతో తయారు చేశారా? ఎందుకంత ఖరీదని అనుకుంటున్నారా! అవును.. ఇది మామూలు సబ్బు కాదు.. నిజంగానే బంగారంతో తయారు చేస్తారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.. ఎక్కడా తయారు చేస్తారంటే.. లెబానోన్లోని ట్రిపోలీకి చెందిన ఒక కుటుంబం నడిపే సబ్బుల ఫ్యాక్టరీలో ఈ విధమైన సబ్బులు తయారవుతున్నాయి. 15వ శతాబ్ధం నుంచి ఈ విధమైన సబ్బులు వడకంలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఐతే 2013 లో ఈ ఖరీదైన సబ్బులను మొదట తయారు చేశారు. దీనిని ఖతార్ అధ్యక్షుడి భార్యకు బహుమతిగా ఇచ్చినట్లు మీడియా నివేదికలు తెలుపుతున్నాయి. ఈ లగ్జరీ సబ్బు పేరు ‘ఖాన్ అల్ సబౌన్’ సోస్. బాడర్ హసీన్ అండ్ సన్స్ కంపెనీ కేవలం చేతులతోనే ఈ సబ్బులను తయారు చేస్తుందట. ప్రత్యేకమైన నూనెలు, సహజ సువాసనలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడంలో ఈ కంపెనీ ప్రసిద్ధి. ఈ కంపెనీ ఉత్పత్తులు కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రత్యేక షాపుల్లో మాత్రమే అమ్ముతారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! బంగారం, వజ్రాల పొడితో తయారీ.. ఈ ఖరీదైన సబ్బుకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఒక ఖాన్ అల్ సబౌన్ సబ్బు తయారీకి 17 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, 3 గ్రాముల వజ్రాల పౌడర్‌లో సహజమైన నూనెలు, సహజసిద్ధమైన తేనె, ఖర్జూరం కలిపి తయారు చేస్తారట. చూడ్డానికి అచ్చం జున్ను ముక్కలా ఉంటుందీ లగ్జరీ సబ్బు. దీని ధర కూడా చుక్కల్లో ఉంటుంది. ఒక సబ్బు ఖరీదు అక్షరాల 2 లక్షల 7 వేల రూపాయలు. ఈ సబ్బు ప్రత్యేకత అదే.. ఈ సబ్బు వాడిన వారికి ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కలుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉంది. ఐతే దీనిని రుజువుచేసే ఆధారాలేవీ లేవు. అంత ఖరీదైన సబ్బు వాడేవారు కూడా ఉంటారా? అని అనుకుంటే పొరపాటే. ముఖ్యమైన విఐపీలు, సెలబ్రెటీలు మాత్రమే వీటిని వాడుతారట. ముఖ్యంగా దుబాయ్‌లో నివసించే సంపన్న కుటుంబాలు ఎక్కువగా ఈ సబ్బులను వాడుతారు. ఆ మధ్య ఖరీదైన వాటర్ బాటిల్ ధర రూ. 45 లక్షల రూపాయలని విన్నాం. ఇప్పుడు రెండున్నర లక్షల స్నానం సబ్బు.. రోజూ వాడే మామూలు వస్తువులకు కూడా ఇంత ధర పలుకుతుందంటే నమ్మలేకపోతున్నాం కదా! చదవండి: Viral Video: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్!!.. ఆగండి..! -
అమెరికాలో ఏవి ఖరీదు, ఏవీ చౌక
ప్రస్తుత ప్రపంచంలో ఏ మనిషికైనా కనీస అవసరాలు ఏముంటాయి? తిండి, ఇల్లు, వైద్యం, విద్య.. ఇవేకదా! మరి ఇలాంటి కనీస అవసరాల ధరలు కొండెక్కి కూర్చున్నవేళ.. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఆటబొమ్మల లాంటి అదనపు అవసరాల ధరలు అతి తక్కువగా ఉన్నాయంటే ఆ ఆర్థిక వ్యవస్థ ఎలాంటిదనుకోవాలి? అమెరికాలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. కనీస అవసరాలు పొందాలంటే అక్కడి ప్రజలు డాలర్లు కుమ్మరించాల్సి వస్తోంది. అదే లగ్జరీ వస్తువులు మాత్రం డెడ్‌చీప్‌గా దొరుకుతున్నాయి. అమెరికాలో ఏ వస్తువులు చౌక? ఏ వస్తువులు ఖరీదు? అనే విషయంపై ప్రముఖ సామాజికవేత్త, క్వీన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోసఫ్ కొహెన్ వెల్లడించిన అభిప్రాయానికి రుజువులుగా అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఆర్థిక శాస్త్రవేత్త మార్క్ పెర్రీ మరింత సమాచారాన్ని క్రోడీకరించారు. 1996 నుంచి పెరుగుతున్న వివిధ సరుకులు, వస్తువుల ధరల సరళిని పెర్రీ ఇలా వివరించారు.. 1996 నుంచి ఇప్పటివరకు అమెరికాలో ఆహార పదార్థాలు, ఇళ్ల ధరలు 60 శాతం పెరగ్గా, వైద్య సౌకర్యాలు రెండు రెట్లు, ఉన్నత విద్య, పిల్లల పుస్తకాల ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఈ పెరుగుదల దేశ ద్రవ్యోల్బణం పెరుగుదల కన్నా వేగంగా ఉంది. మరోపక్క మొబైల్ ఫోన్ సర్వీసులు, సాఫ్ట్వేర్, టీవీలు, బొమ్మల ధరలు రాకెట్ వేగంతో పడిపోతున్నాయి. మరో మాటలో చెప్పాలంటే సగటు అమెరికన్ పౌరులు టీవీలను సులభంగానే కొనగలుగుతున్నారు. బతకడానికి అవసరమైన ఆహార పదార్థాలను, వైద్య సౌకర్యాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఫ్యాక్టరీలు ఉత్పత్తిచేసే వస్తువుల ధరలే దశాబ్దాల కాలంగా పడిపోతున్నాయని, అందుకు సాంకేతిక రంగంలో రోజురోజుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు, ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడటమే కారణమని మార్క్ పెర్రీ తెలిపారు. ఆహార దినుసుల ఉత్పత్తిలోనూ, వైద్య సౌకర్యాలను కల్పించడంలో అంతగా అంతర్జాతీయ పోటీ లేదని ఆయన చెప్పారు. వైద్య సౌకర్యాలకు ఎక్కువగా బీమా సౌకర్యాలు అందుబాటులో ఉండటం కూడా పోటీతత్వం పెరగకపోవడానికి ఒక కారణమని ఆయన అన్నారు. ఇక అమెరికా యూనివర్సిటీల్లో ఉన్నత విద్యారంగానికి వస్తే ప్రపంచపోటీ తక్కువేనని కూడా పెర్రీ తెలిపారు. పైగా ఇక్కడి విద్యార్థులకు రుణ సౌకర్యం ఎక్కువ లభించడం కూడా విద్యను ఖరీదుగా చేస్తోందని ఆయన అన్నారు. రుణసౌకర్యం ఎక్కువగా లభించే రంగాల్లో ధరలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అమెరికాలో ప్రస్తుతం ఒక్కో విద్యార్థి 1.20,000 డాలర్ల చొప్పున మొత్తం విద్యార్థులు 13వేల కోట్ల డాలర్లు రుణపడి ఉన్నారని పేర్కొన్నారు. ఈ ట్రెండ్‌ను సామాజిక కోణంలో విశ్లేషిస్తే.. ప్రజలు తమకు అవసరమైన సరకులను కొనలేరని, అవసరం లేని సరకులను కొనగలరని చెప్పారు.