Here's What Kangana Ranaut's Most Expensive Things - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: బ్రాండెడ్‌ వస్తువులున్న ఫైర్‌బ్రాండ్‌ కంగనా.. వాటి ధరంతంటే ?

Published Wed, Mar 23 2022 4:16 PM | Last Updated on Wed, Mar 23 2022 5:16 PM

Kangana Ranaut Most Expensive Assets Things - Sakshi

బాలీవుడ్​ ఫైర్‌బ్రాండ్‌​, వివాదాల బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్​ మీడియాలో కామెంట్స్​ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్​గా రికార్డుకెక్కింది. ఏ అంశమైన తనదైన స్టైల్​లో ఎలాంటి భయం లేకుండా విమర్శలను సంధిస్తుంటుంది. ఎలాంటి సంకోచం లేకుండా తనకు అనిపించింది చెప్పడంతో అభిమానులను కూడా సంపాదించుకుంది ఈ బ్యూటీ. కంగనా ప్రస్తుతం కాంట్రవర్సీ రియాలిటీ షో లాకప్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా ఆమె చేతిలో పలు సినిమా ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్‌ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో కంగనా ఒకరు. అయితే బుధవారం (మార్చి 23) పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ ఫైర్‌బ్రాండ్‌ ఖరీదైన ఆస్తులు, వస్తువుల వివరాలు తెలుసుకుందామా ! 

2022 ఏడాది వరకు కంగనా నికర ఆస్తి విలువ సుమారు రూ. 95 కోట్లవరకు ఉంటుందని అంచనా. మనాలిలోని ఒక స్టైలిష్‌ కాటేజ్‌ బంగ్లాకు కంగనా యజమానురాలు. 7,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 బెడ్‌రూమ్‌లు, 7 బాత్‌రూమ్‌లతో ఆ కాటేజ్‌ ఉంది. ఈ విలాసవంతమైన ఇంటి ధర రూ. 30 కోట్లని సమాచారం. కంగనాకు ముంబైలోని పాలి హిల్‌ ప్రాంతంలో 5 బీహెచ్‌కే ఇల్లు ఉందని తెలుస్తోంది. కంగనా ఈ స్థలాన్ని 2017లో రూ. 20.7 కోట్లకు కొనుగోలు చేసిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇవేకాకుండా కంగనాకు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. అందులో ఆడీ క్యూ3, మెర్సెడీస్‌ జీఎల్‌ఈ ఎస్‌యూవీ, బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ తదితర కార్లు ఉన్నట్లు సమాచారం. 




 

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనాకు యాక్సెసరీస్‌ అంటే కూడా చాలా ఇష్టం. ఆమె కలెక్షన్లలో చాలా లగ్జరీ, సూపర్‌ ఎక్స్‌పెన్సివ్‌ హ్యాండ్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు హీర్మేస్‌ బిర్కిన్‌ హ్యాండ్‌బ్యాగ్‌లు కంగనా వద్ద ఉన్నాయి. వాటి ఒక్కో ధర రూ. 15 లక్షల వరకు ఉంటుంది. ఇవేకాకుండా ఆమె వద్ద డియోర్, ప్రాడా, లూయిస్‌ విట్టన్‌ వంటి లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లు సైతం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కంగనా రనౌత్‌ ఏప్రిల్‌లో ధాకడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే కాకుండా తేజస్ మూవీలో నటిస్తోంది కంగనా. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement