ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో సందడి చేశారు, ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే బన్నీ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇతర దేశాల్లో రోడ్ ట్రిప్ వెళ్లేవారు తప్పనిసరిగా ఈ లైసెన్స్ తీసుకుంటారు. కానీ అల్లు అర్జున్ ఎందుకు తీసుకుంటున్నారన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. విదేశాల్లో పుష్ప-2 షూటింగ్ కోసమే లైసెన్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో జపాన్‌లో పుష్ప-2 షూటింగ్ జరగనుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసమే దరఖాస్తు చేసి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ నంద్యాల జిల్లాలోని యాగంటి క్షేత్రంలో జరుగుతోంది. అక్కడ ఆలయంలో రష్మిక మందన్నాపై ముఖ్యమైన సీన్స్ తెరకెక్కించారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక ఇన్‌స్టాలో పంచుకున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ లైసెన్స్ అప్లై చేయడం చూస్తే త్వరలోనే విదేశాల్లో షూటింగ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికే పుష్ప-2 సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. ఈ మూవీ వాయిదా పడే ఛాన్స్ లేదని గతంలోనే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment