KHAIRATABAD rta Office
-
లైసెన్స్‌కు అప్లై చేసిన బన్నీ.. అందుకోసమేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో సందడి చేశారు, ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే బన్నీ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇతర దేశాల్లో రోడ్ ట్రిప్ వెళ్లేవారు తప్పనిసరిగా ఈ లైసెన్స్ తీసుకుంటారు. కానీ అల్లు అర్జున్ ఎందుకు తీసుకుంటున్నారన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. విదేశాల్లో పుష్ప-2 షూటింగ్ కోసమే లైసెన్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో జపాన్‌లో పుష్ప-2 షూటింగ్ జరగనుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసమే దరఖాస్తు చేసి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ నంద్యాల జిల్లాలోని యాగంటి క్షేత్రంలో జరుగుతోంది. అక్కడ ఆలయంలో రష్మిక మందన్నాపై ముఖ్యమైన సీన్స్ తెరకెక్కించారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక ఇన్‌స్టాలో పంచుకున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ లైసెన్స్ అప్లై చేయడం చూస్తే త్వరలోనే విదేశాల్లో షూటింగ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికే పుష్ప-2 సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. ఈ మూవీ వాయిదా పడే ఛాన్స్ లేదని గతంలోనే చెప్పారు. -
పవన్ కల్యాణ్ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్..
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన ఆరు వాహనాలను ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాటిలో ఒకటి బెంజ్, మరో రెండు స్కార్పియో కార్లు ఉ న్నాయి. టయోటా వైల్‌ఫైర్ వాహనంతో పాటు ఒక జీప్ ర్యాంగ్లర్, ఒక టాటా యోధ ట్రాన్స్‌పోర్టు వాహనం పవన్‌కల్యాణ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకున్నారు. ఉపరవాణా కమిషనర్ పాపారావు, ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి రాంచందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: (కైకాల సత్యనారాయణ మృతి.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం) -
ఆర్టీఏ ఆన్లైన్ బిడ్డింగ్‌లో గందరగోళం
► ఇటీవల నగరంలోని ఓ ఆర్టీఏ కేంద్రం పరిధిలో కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఓ వాహనదారు తనకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం వేలం నిర్వహించే సమయానికి మొబైల్ ఫోన్‌కు ఎలాంటి సమాచారం అందకపోవడంతో పోటీలో పాల్గొనలేకపోయారు. దీంతో నచ్చిన నంబర్‌ను కోల్పోయారు. ► బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన మరో వాహనదారుకు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రధానంగా ‘9999’, ‘9’, ‘1111’, ‘6666’, ‘1234’ వంటి నంబర్లకు ఎంతో డిమాండ్ ఉంటుంది. గతంలో ఆల్‌నైన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో ఏకంగా రూ.10 లక్షల వరకు వేలంలో పోటీపడి సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నచ్చిన నంబర్లను సొంతం చేసుకొనేందుకు పెద్ద మొత్తంలోనే చెల్లించేందుకు సిద్ధపడతారు. కానీ ఆన్లైన్ బిడ్డింగ్‌లో పోటీ తగ్గుముఖం పట్టినట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ప్రత్యేక నంబర్లపై నిర్వహించే ఆన్లైన్ బిడ్డింగ్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బిడ్డింగ్‌లో ప్రదర్శించే నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోటీలో పాల్గొనలేకపోతున్నట్లు వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని నంబర్లపై ఎలాంటి పోటీలు కూడా నిర్వహించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాహనదారులు తమకిష్టమైన నంబర్ల కోసం రూ.లక్షలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆన్లైన్లో సరైన సమాచారం లేకపోవడంతో ఇందులో పాల్గొనలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్) అప్పుడలా.. ► మూడేళ్ల క్రితం అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రత్యేక నంబర్లకు ప్రత్యక్షంగా వేలం నిర్వహించేవారు. వాహనదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మధ్యాహ్నం 3 గంటలకు పోటీ నిర్వహించేవారు. ఈ పోటీలో వాహనదారులంతా స్వయంగా పాల్గొనేందుకు అవకాశం ఉండడంతో ఏ వాహనదారు ఎంత మొత్తానికి బిడ్డింగ్‌లో పాల్గొని నంబర్‌ను సొంతం చేసుకున్నాడనేది స్పష్టంగా తెలిసిపోయేది. (చదవండి: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు) ► మరోవైపు నంబర్ల బిడ్డింగ్ నిర్వహణలో పారదర్శకత కోసం అధికారులు సైతం ఎలాంటి దాపరికానికి తావు లేకుండా బహిరంగంగా వేలం నిర్వహించేవారు. దీంతో ప్రత్యేక నంబర్లపైనే రవాణా శాఖకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం లభించింది. నంబర్ల సీరిస్‌లో ‘9’ అంకెతో మొదలయ్యే ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రతి ప్రత్యేక నంబర్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. రూ.30 వేల ఫీజు ఉన్న నంబర్లకు పోటీలో రూ.5 లక్షలు డిమాండ్ ఉండేది. సింగిల్ నైన్, ఆల్‌నైన్స్ కోసం ప్రతి సిరీస్‌లో కనీసం 10 మంది వాహనదారులు పోటీపడేవారు. (చదవండి: ఐఐటీ హైదరాబాద్.. నియామకాల్లో జోరు) ఇప్పుడిలా.. ► ప్రత్యేక నంబర్లపై నిర్వహించే బిడ్డింగ్‌ను మూడేళ్ల క్రితం ఆన్‌లైన్‌లోకి మార్చారు. మొదట హైదరాబాద్ ఆర్టీఏలో అమలు చేసి ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు విస్తరించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది. ► సాంకేతిక వైఫల్యాల కారణంగా వాహనదారులకు సకాలంలో సరైన సమాచారం లభించడం లేదు. దీంతో ఎక్కువ మంది పోటీలో పాల్గొనలేకపోతున్నారు. దీనిపై కొంతమంది వాహనదారులు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. -
డ్రైవింగ్ నేర్చుకునేవారికి సిమ్యులేటర్ శిక్షణ
సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా... అయితే మొదట సిమ్యులేటర్స్‌పైన తప్పనిసరిగా శిక్షణ పొందాల్సిందే. రోడ్డుపై వాహనాన్ని నడిపేందుకు ముందు సిమ్యులేటర్ ద్వారా డ్రైవింగ్ మెళకువలను తెలుసుకోవాల్సిందే. ఇందుకోసం రవాణాశాఖ స్వయంగా సిమ్యులేటర్ శిక్షణకు శ్రీకారం చుట్టింది. లెర్నింగ్ లైసె న్సు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను సిమ్యులేటర్ శిక్షణకు ప్రోత్సహించేందుకు ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో సిమ్యులేటర్లను ఏర్పాటు చేశారు. మరో వారం రోజుల్లో దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ తెలిపారు. అనంతరం దశల వారీగా అన్ని ఆర్టీఏ కార్యాలయాలకు విస్తరించాలని భావిస్తున్నామన్నారు. మరోవైపు నామమాత్రపు శిక్షణ ఇస్తూ వినియోగదారుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న డ్రైవింగ్ స్కూళ్లకు అడ్డుకట్టవేయడంపై రవాణాశాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రతి డ్రైవింగ్ స్కూల్లో సిమ్యులేటర్ శిక్షణ తప్పనిసరి చేయనున్నారు. తద్వారా ప్రాథమిక దశలోనే వాహనదారులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపైన అవగాహన ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డుపైన వాహనాన్ని నడపడం కంటే ముందే డ్రైవింగ్ లో మెళకువలను నేర్పించడం వల్ల రెట్టింపు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ప్రతి డ్రైవింగ్ స్కూల్ సిమ్యులేటర్‌ను ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు జేటీసీ రమేష్ పేర్కొన్నారు. డొల్ల శిక్షణకు చెల్లు... ప్రస్తుతం నగరంలో వందలకొద్దీ డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 80 శాతానికి పైగా మొక్కుబడి అవగాహన కల్పిస్తూ వినియోగదారుల నుంచి రూ.వేలల్లో దండుకుంటున్నాయి. ఆయా స్కూళ్లలో శిక్షణ పొందిన వారు రోడ్డుపైకి వచ్చిన తరువాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ రద్దీలో గందరగోళానికి గురవుతుండటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని స్కూళ్లు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా కేవలం డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించేందుకే పరిమితమయ్యాయి. ఈ మేరకు ఆర్టీఏ అధికారులతో ఒప్పందం చేసుకొని దళారీ పాత్రను పోషిస్తున్నాయి. మొత్తంగా ఎలాంటి శాస్త్రీయత లేకుండా, నాణ్యమైన పద్ధతులు లేకుండా లభిస్తోన్న శిక్షణ స్థానంలో సిమ్యులేటర్లు శాస్త్రీయమైన పద్ధతులకు దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. సిమ్యులేటర్లతో ప్రయోజనాలు... ⇒ డ్రైవింగ్ పట్ల భయం తొలగిపోతుంది. ట్రాఫిక్ రద్దీ, వాహనాల రొద వంటి పరిస్థితుల్లో గందరగోళం లేకుండా వాహనం నడిపే అవగాహన ఏర్పడుతుంది. ⇒ క్లచ్, గేర్,ఎస్కలేటర్, స్టీరింగ్, ఇండికేటర్, హెడ్‌లైట్, వైపర్లను ఎలా వినియోగించాలో, ఏ సమయంలో ఏం చేయాలనేది నేర్చుకోవచ్చు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డుపైన ఏ ట్రాక్‌లో వాహనం నడపాలనే అంశం తెలుస్తుంది. ట్రాఫిక్ రద్దీ తీవ్రతకు అనుగుణంగా ట్రాక్‌లలో మార్పులు చోటు చేసుకుంటాయి. ⇒ కుడి, ఎడమ ఇండికేటర్స్ ఎలా విని యోగించాలో తెలుసుకోవచ్చు. ‘యు’ టర్న్ తీసుకొనేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. ⇒ ఘాట్‌రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వాహనం నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపైన సిమ్యులేటర్లు అవగాహన కల్పిస్తాయి. వర్షాకాలం, మంచుకురిసే సమయాల్లో హెడ్లైట్లను తప్పనిసరిగా వేయాలి. వైపర్ల కండీషన్ ముఖ్యం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సిమ్యులేటర్ శిక్షణ డ్రైవింగ్‌తో ముడిపడిన ప్రతి అంశంపైన అవగాహన కల్పిస్తుంది. ⇒ సిగ్నల్ పడిన సమయంలో ఎంత దూరంలో వాహనం నిలపాలి. పార్కింగ్ సమయంలో ఎలాంటి మెళకువలు పాటించాలి వంటి అన్ని అంశాలపైన యానిమేషన్ చిత్రాల ద్వారా అవగాహన కల్పిస్తారు. ⇒ వివిధ రకాల రోడ్లు, సైన్‌బోర్డులు, జాగ్రత్తలు, హెచ్చరికల సూచీకలపైన అవగాహన కలుగుతుంది. ⇒ ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. మూడు గంటలు – ఆరు క్లాసులు సిమ్యులేటర్‌లో మొత్తం 6 క్లాసులు ఉంటాయి. దశలవారీగా 3 గంటల సమయంలో ఈ శిక్షణ ఇస్తాం. ఈ శిక్షణ తరువాత వినియోగదారుడికి డ్రైవింగ్ పైన భయం పూర్తిగా తొలగిపోతుంది. అన్ని విషయాలపైన స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఆ తరువాత రోడ్డుపైన ఎలాంటి గందరగోళం లేకుండా తాపీగా నేర్చుకోగలుగుతాడు. ఖైరతాబాద్ ఆర్టీఏలో మరో వారం లో ఈ శిక్షణ ప్రారంభం కానుంది. – మగ్బుల్ ఫలక్, సిమ్యులేటర్ శిక్షకులు రోడ్డు భద్రతపై అవగాహన పెరుగుతుంది సిమ్యులేటర్ ద్వారా శిక్షణ పొందేవారికి అనేక అంశాలపైన కచ్చితమైన అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా రోడ్డు భద్రతా నిబంధనలు తెలుస్తాయి. వాతావరణం, ట్రాఫిక్ రద్దీలో వచ్చే మార్పులకు అనుగుణంగా వాహనం నడిపే తీరు, వేగనియంత్రణ, వివిధ రకాల విడిభాగాలను వినియోగించే పద్ధతిని ముందుగానే తెలుసుకొని ఆ తరువాత వాహనం స్టీరింగ్ పట్టుకోవడం వల్ల డ్రైవింగ్ పైన అపోహలు, ఆందోళన తొలగిపోతాయి. అన్ని డ్రైవింగ్ స్కూళ్లు సిమ్యులేటర్లను ఏర్పాటు చేయాలి. – రమేష్, జేటీసీ -
వేగమే తొలి శత్రువు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర పరిధిలో ఉన్న రహదార్లపై రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా రోడ్డు విస్తరణలు జరుగుతున్నా.. మితిమీరిన వేగం ప్రమాదాలకు ముఖ్యకారణం అవుతోంది. తర్వాతి స్థానాల్లో డ్రంకెన్ డ్రైవ్, నిర్లక్ష్యంగా ఉండటం గమనార్హం. మనదేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఏ వాహనానికైనా గరిష్ట వేగ పరిమితి 80 కి.మీ. మాత్రమే. కానీ ఇక్కడ కార్లు, ఇతర వాహనాలు 120 కిలోమీటర్లు దాటి కూడా వెళుతున్నాయి. రోడ్డు రవాణా, హైవే శాఖ 2016 నివేదిక ప్రకారం ఏటా దేశవ్యాప్తంగా 4,80,652 ప్రమాదాలు జరుగుతుండగా 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన వేగం కారణంగానే 68 శాతం ప్రమా దాలు జరగడం గమనార్హం. తెలంగాణలో దాదాపు 5 వేలకు పైగా మరణాలు జరిగాయి. కాగితాల్లోనే రోడ్ సేఫ్టీ కమిటీ! రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలని ఏడాది కింద ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మెడికల్, రవాణా, పోలీసు, ఆర్ అండ్ బీ అధికారులు భాగస్వామ్యం కావాలి. అయితే ఇదింకా తుదిరూపు దాల్చలేదు. దీనికి ఎవరు నేతృత్వం వహించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నిరంతర నిఘా అవసరం మితిమీరిన వేగం, డ్రంకెన్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల నియంత్రణకు రహదారులపై నిరంతర డ్రైవ్‌లు చేపట్టాలి. కెమెరాలతో పర్యవేక్షణ అవసరం. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీగా జరిమానాలు విధించాలి. – పాండురంగ్ నాయక్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్,ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం -
రసవత్తరంగా ఫ్యాన్సీ నంబర్ల వేలం..
సాక్షి, హైదరాబాద్ : కారు ఖరీదు ఎంతన్నదేకాదు.. రిజిస్ట్రేషన్ నంబర్ ఏమిటన్నది కూడా కొందరికి ప్రెస్టేజ్ ఇష్యూనే! అందుకే, లక్షలు పోసిమరీ ఫ్యాన్సీ నంబర్లు సొంతం చేసుకుంటారు!! ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయం సోమవారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం రసవత్తరంగా ముగిసింది. వేలం ద్వారా రవాణా శాఖకు రూ. 24,96,953 ఆదాయం సమకూరింది. కోటి రూపాయల కారుకు 7.5 లక్షల నంబర్ : TS 09 EW 0001 నంబర్‌కు గానూ ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ మున్నా యునైటెడ్ అక్షరాల రూ. 7,56,695 చెల్లించింది. సంస్థ ఇటీవలే కొనుగోలు చేసిన జాగ్వర్ ఎక్స్‌జే 3.0ఐడీ మోడల్ కారు కోసం వారు ఈ నంబర్‌ను కొనుగోలుచేశారు. కారు ధర రూ.1,00,63,502 అని అధికారులు పేర్కొన్నారు. మెగా మళ్లీ : ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ యజమాని భారీ ధరకు ఫ్యాన్సీ నంబర్ కొనుగోలుచేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తాను కొనుగోలుచేసిన బెంజ్ కారు కోసం ఫ్యాన్సీ నంబర్ TS 09 EW 0009ను రూ.4,70,00కు దక్కించుకున్నారు. ఆ కారు ధర రూ.1,63,50,000. గతంలోనూ ఫ్యాన్సీ ధరను కోట్‌చేసి ఫ్యాన్సీ కారు కొన్న మెగా ఓనర్ మరోసారి అదేపని చేశారు. 0006 @1.6 లక్షలు : వై. కామేశ్ అనే వ్యక్తి తన ఫోర్డ్ ఎండీవర్ కారు కోసం TS 09 EW 0006 నంబర్‌ను రూ.1,61,899 చెల్లించి కొన్నారు. -
ఆర్టీఏ కార్యాలయంలో మహేష్ బాబు
సాక్షి, హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు శుక్రవారం ఖైరతాబాదులోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఆయన తన కారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్వయంగా వాహనాన్ని డ్రైవ్ చేసుకుని వచ్చారు. అనంతరం మహేష్ బాబు వేలిముద్ర పెట్టి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగా ప్రిన్స్ ఆర్టీఏ కార్యాలయానికి రావడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. మరోవైపు మహేష్ బాబు ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చాడని తెలుసుకొని పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఇక ఆర్టీఏ ఉద్యోగులు కూడా మహేష్‌తో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. -
ఆర్టీఏ కార్యాలయంలో మహేష్ బాబు
-
ఆర్టీఏ ఆఫీస్‌లో యువ హీరోల హల్చల్
హైదరాబాద్ : హఠాత్తుగా తమ అభిమాన నటులు కళ్ల ముందు ప్రత్యక్షం అయితే చూసేవాళ్లకు పండుగే. జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ శనివారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యక్షమై అందరినీ అశ్యర్యపరిచారు. తాము కొత్తగా కొన్న లగ్జరీ కార్ల రిజిష్ట్రేషన్ కోసం వచ్చిన వారిని చేసేందుకు అక్కడ జనం ఎగబడ్డారు. తన బీఎండబ్ల్యూ కారుకు ఫ్యాన్సీ నెంబర్ TS 09 EL 9999 అనే దాని కోసం జూనియర్ ఎన్టీఆర్ రికార్డ్ స్థాయిలో 10 లక్షల 50 వేల రూపాయలు చెల్లించగా, అఖిల్ తన బెంజ్ జీపు కోసం 41, 500 రూపాయలు చెల్లించి ఫ్యాన్సీ నెంబర్ TS 09 EL 9669 ను సొంతం చేసుకున్నాడు. -
అన్నిటికీ అడ్వాన్స్ బుకింగే
రవాణా శాఖలో అన్ని సేవలకు స్లాట్ విధానం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం.. వివిధ పనుల కోసం వారం కింద ఒకే రోజు 779 మంది ఇక్కడికి వచ్చారు. అదే మూడు రోజుల కింద కేవలం 49 మంది వచ్చారు. జనం భారీగా ఉన్న రోజు తొక్కిసలాట పరిస్థితి.. అదే మామూలు రోజుల్లో సిబ్బంది గోళ్లు గిల్లుకునే పరిస్థితి.. దీనంతటికీ కారణం ఓ పద్ధతి అంటూ లేకుండా ఆర్టీఏ కార్యాలయాలకు జనం రావడమే. దీని వల్ల ప్రజలకు అందించే సేవలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆర్టీఏ అధికారులు సరికొత్త ఆలోచన చేశారు. తేదీ, సమయం ముందుగానే ఫిక్స్ చేసుకునేలా ‘స్లాట్’ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. ఆర్టీఏ వెబ్సైట్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయం ప్రకారం వచ్చిన వారికే సిబ్బంది పనిచేసిపెడతారు. లేదంటే తిప్పి పంపుతారు. దీంతో పనులు సజావుగా జరగడమే కాకుండా, సిబ్బందికి కూడా రద్దీ బాధ తప్పుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలే వాహనాల లెసైన్సుల జారీకి ఈ విధానం ప్రవేశపెట్టగా, ఇప్పుడు అన్ని రకాల సేవలకు విస్తరించనున్నారు. దాదాపు 17 రకాల సేవలను స్లాట్ విధానం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీని అమలు, ఉపయోగాలు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఆదివారం సదస్సు నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి సిబ్బంది హాజరయ్యారు. అంతా పకడ్బందీగా.. : ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ ద్వారా జరిగిపోతుంది. కార్యాలయానికి ఏ పని మీద వెళుతున్నారో ఆర్టీఏ వెబ్సైట్ (telangana. transport.gov.in)లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి దరఖాస్తు ఫార్మాట్ కూడా వెబ్సైట్లో ఉంటుంది. ఈ ప్రకారం దరఖాస్తుదారుడికి వీలైన రోజు, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రోజు కనుక ఖాళీ లేకుంటే మరో రోజును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న రోజు, సమయంలో దరఖాస్తుదారుడు సంబంధిత రవాణా కార్యాలయానికి వెళ్లి పని పూర్తి చేసుకోవాలి. ఆ రోజు వెళ్లలేని పరిస్థితి ఉంటే మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాలి. అదే రోజు ఎంచుకున్న సమయానికి వెళ్లలేకపోతే చివర్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు. అవినీతికి అడ్డుకట్ట పడేనా...! ఆర్టీఏ కార్యాలయాల్లో డబ్బులు ముట్టజెప్పనిదే పనులు జరగవనేది బహిరంగ రహస్యమే. చేతులు తడిపితే పనులు ఆగమేఘాల మీద జరుగుతాయి. బ్రేకులు లేని వాహనాలకు కూడా డబ్బులిస్తే ఫిట్నెస్ సర్టిఫికెట్లు నిమిషాల్లో సిద్ధమవుతాయి. ఇపుడు ఈ స్లాట్ బుకింగ్ విధానంతో లంచాలను కట్టడి చేయడం సాధ్యమా అనేది అనుమానమే. అత్యవసర పనుల మీద స్లాట్ బుకింగ్ చేసుకోకుండా వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేసే అవకాశం కూడా ఉంది. మరి ఈ రకమైన సిబ్బందిని ఎలా నియంత్రిస్తారో వేచి చూడాల్సిందే. -
ఆర్టీఏ కార్యాలయానికి సమంత
కొత్త కారు రిజిస్ట్రేషన్‌కు వచ్చిన కథానాయిక హైదరాబాద్: సినీనటి సమంత బుధవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా విచ్చేశారు. రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగారు. డిజిటల్ ప్యాడ్‌పై సంతకం చేశారు. ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్ ‘టీఎస్ 09 ఈహెచ్ 3888’ నంబర్‌ను కేటాయిస్తూ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించారు. హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్, ఆర్టీఓలు, ఉద్యోగులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆమెతో కలసి ఫొటో దిగేందుకు పోటీపడ్డారు. -
ఆర్టీఏ కార్యాలయానికి రామ్‌చరణ్
హైదరాబాద్ సిటీ : మెగాస్టార్ చిరంజీవి తనయుడు, టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ తేజ్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన రూ.1.14 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ వాహనం రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన రామ్‌చరణ్‌కు ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్ ఆహ్వానం పలికారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే ముగించారు. రిజిస్ట్రేషన్ అనంతరం రాంచరణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
రవాణా శాఖలో ‘డబుల్ రిజిస్ట్రేషన్’
సాక్షి, హైదరాబాద్: ఒకే వాహనాన్ని ఇద్దరి పేరిట రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యమేనా? సాధారణంగా అయితే సాధ్యం కాదు. కానీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. రవాణా శాఖ అధికారులు, కొంత మంది ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కై ఈ దందా నడుపుతున్నారని సమాచారం. వాహనాన్ని చూసి, దాన్ని ఛాసిస్ నంబర్‌ను కాపీ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకసారి రిజిస్టర్ చేసిన వాహనాన్ని అదే నంబర్‌తో మరో వ్యక్తి పేరిట రిజిస్టర్ చేయడం సాధ్యం కాదు. అయినా, అధికారుల అండదండలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేయించడం పరిపాటిగా మారింది. ఫైనాన్స్ కంపెనీల నుంచి అక్రమంగా రుణాలు తీసుకోవడం, వాహనం అసలు యజమానిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేయడం జరుగుతోంది. అక్రమార్కులు సంపాదించిన అవినీతి సొమ్ములో నుంచి రవాణా అధికారులకు వాటాలు అందుతున్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు బాధితులు వాపోతున్నారు. ఒకే రోజు ఇద్దరి పేర్లతో రిజిస్ట్రేషన్! మారుతి ఆల్టో కారును జ్యోతి కిరణ్మయి ‘మిత్ర ఏజన్సీ’లో 2008 డిసెంబర్ 23న కొన్నారు. 2009 జనవరి 12న ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించగా ‘ఏపీ 09 బీఎస్ 3044’ నంబర్‌ను కేటాయించారు. ఇటీవల కారును విక్రయించడానికి ఆమె ప్రయత్నించగా కారు ఆమె పేరిట లేదని బ్రోకర్ చెప్పడంతో అవాక్కయ్యారు. ఆన్లైన్లో చూస్తే, ఈ నంబరు కారు యజమాని కిరణ్‌కుమార్‌గా రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించారు. కారు కొనడానికి జ్యోతి కిరణ్మయి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రుణం తీసుకున్నారు. కానీ.. కిరణ్‌కుమార్ ‘విష్ణుప్రియ ఆటో ఫైనాన్స్’ నుంచి రుణం తీసుకున్నట్లు రవాణా శాఖ వెబ్సైట్ చెబుతోంది. ఆమె రిజిస్ట్రేషన్ చేయించిన రోజే రెండో రిజిస్ట్రేషన్ కూడా జరిగినట్లు వెబ్సైట్లో నమోదై ఉండటం గమనార్హం.