
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన ఆరు వాహనాలను ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాటిలో ఒకటి బెంజ్, మరో రెండు స్కార్పియో కార్లు ఉ న్నాయి.
టయోటా వైల్‌ఫైర్ వాహనంతో పాటు ఒక జీప్ ర్యాంగ్లర్, ఒక టాటా యోధ ట్రాన్స్‌పోర్టు వాహనం పవన్‌కల్యాణ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకున్నారు. ఉపరవాణా కమిషనర్ పాపారావు, ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి రాంచందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
చదవండి: (కైకాల సత్యనారాయణ మృతి.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం)