rta office
-
ఆర్టీవో ఆఫీసులో దసరా, దీపావళి దందా..!
సాక్షి,విశాఖపట్నం: విశాఖ ఆర్టీవో కార్యాలయంలో దసరా,దీపావళి దందాకు తెరతీశారు. రెండు నెలల నుంచి వేల సంఖ్యలో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ రిజిస్ట్రేషన్లను అధికారులు పెండింగ్ పెట్టారు. ఉద్దేశ్య పూర్వకంగానే రిజిస్ట్రేషన్లను ఆర్టీఏ అధికారులు పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.రిజిస్ట్రేషన్ల పెండింగ్‌కు ఏదో ఒక సాకు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఒకటికి పది సార్లు తిప్పించుకుంటున్నారు.రిజిస్ట్రేషన్ జరగాలంటే 500 నుంచి 1000 వరకు చేతులు తపాలని ఆర్టీఏ సిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పని జరగాలంటే తమ డ్రైవర్లను కలవాలని కొందరు అధికారులు షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు.డ్రైవర్లతో వాట్సాప్ కాల్‌లోనే మాట్లాడాలని ఆ అధికారులు సూచిస్తున్నారు. తమ డ్రైవర్లకు ఎంతోకొంత ముట్టజెప్పిన వారికే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ రవాణా కమిషనర్(డీటీసీ)కి తెలియకుండా కిందిస్థాయి సిబ్బందే ఈ దందా నడుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంతో విసిగిపోయిన టూ వీలర్,ఫోర్ వీలర్ వాహనాల డీలర్లు డీటీసీని మంగళవారం(అక్టోబర్ 29) కలవనున్నారు. గంభీరం నుంచి ఇటీవల బదిలీపై వచ్చిన అధికారి,మరో మహిళా అధికారితో కలిసి ఈ వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు చెబుతున్నారు. ఆర్టీఏ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: బాంబు బెదిరింపులతో హడల్ -
HYD: ఫ్యాన్సీ క్రేజ్.. ఆ నెంబర్‌కు రూ. 21 లక్షలు!
హైదరాబాద్: ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పైగా ఖరీదైన వాహనాలకూ నెలవైన హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో అది ఇంకా ఎక్కువే కనిపిస్తుంటుంది కూడా. సెంటిమెంట్, ఇష్టమైన నంబర్‌ను దక్కించుకునేందుకు వాహనాల యజమానులు ఎంతదాకా అయినా ఖర్చు చేసిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో.. ఇవాళ ఒక్కరోజే ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో కాసుల వర్షం కురిసింది. ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే రూ. 53.34 లక్షల ఆదాయం సమకూరింది. అధికంగా టీఎస్ 09 జీసీ 9999 అనే నంబర్‌కు రూ. 21.60 లక్షలు పలుకగా, ఫ్యాన్సీ నెంబర్ పోటీలో అతి తక్కువగా టీఎస్ 09 జీడీ 0027 నంబర్‌కు రూ. 1.04 లక్షలు పలికింది. ఫ్యాన్సీ నంబర్లు – రేటు – సంస్థలు టీఎస్ 09 జీసీ 9999 – రూ. 21.60 లక్షలు – ప్రైమ్ సోర్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ టీఎస్ 09 జీడీ 0009 – రూ. 10.50 లక్షలు – మెఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ టీఎస్ 09 జీడీ 0001 – రూ. 3 లక్షలు – ఆంధ్రా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ టీఎస్ 09 జీడీ 0006 – రూ. 1.83 లక్షలు – గోయజ్ జ్యువెలరీ టీఎస్ 09 జీడీ 0019 – రూ.1.70 లక్షలు – సితారా ఎంటర్టైన్మెంట్స్ టీఎస్ 09 జీడీ 0045 – రూ.1.55 లక్షలు – సాయి పృథ్వీ ఎంటర్ప్రైజెస్ టీఎస్ 09 జీడీ 0007 – రూ. 1.30 లక్షలు – ఫైన్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ టీఎస్ 09 జీడీ 0027 – రూ. 1.04 లక్షలు – శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ -
ఫిట్'లెస్' బడి బస్సులు... విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్ అయిన స్కూల్ బస్సులు 224 ఉన్నాయి. ఒక్కో బస్ ఫిట్నెస్ పరీక్షకు సంవత్సరానికి ఒకసారి రూ.5వేలు ఖర్చవుతుంది. ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తాయి. ఈ లెక్కన ఒక బస్ సీటింగ్ కెపాసిటీ ఆధారంగా 40 మందికి నెలకు రూ.40 వేలు వసూలు చేస్తారు. కానీ జిల్లా వ్యాప్తంగా 85 బస్సులు ఇప్పటివరకు ఫిట్నెస్ చేయించుకోకుండా వారి స్వలాభం కోసం అలాగే నడుపుతున్నారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసే స్కూలు యాజమాన్యాలు కేవలం ఫిట్నెస్ కోసం రూ.5 వేలు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నాయి. నిర్మల్‌చైన్‌గేట్: విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను తరలించే వాహనాలకు యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. కానీ పాఠశాలలు ప్రారంభమై పది రోజులు కావస్తున్నా యాజమాన్యాలు ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ నెల 12 వరకు అన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. అయినా కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు చెందిన బస్సులు 224 ఉండగా ఈ నెల 22 వరకు 139 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 85 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాల్సి ఉంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం జిల్లాలోని 208 ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 35 వేలకు పైబడి విద్యార్థులు చదువుతున్నారు. పిల్లల ను పాఠశాలల నుంచి తీసువెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన ప్రైవేట్ పాఠశాలల బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వేలకు వేలు ఫీజులు గుంజుతున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలను నడుపుతూ విద్యార్థుల ప్రా ణాలతో చెలగాటమాడుతున్నాయి. జిల్లాలో 224 బ స్సులు ఉండగా 139 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ ధ్రువీకరణ పొందినట్లు సంబంధిత అధికారులు తెలి పారు. పలు ప్రాంతాల్లో కళ్లముందే ప్రమాదాలు కని పిస్తున్నప్పటికీ అటు అధికారులు, ఇటు యాజమాన్యాలు మాత్రం నిర్లక్ష్యం వీడడంలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొనసాగుతున్న దళారుల దందా... అమ్మానాన్నలకు బైబై చెప్పి బడికి బయలుదేరుతు న్న చిన్నారులను భద్రంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలది. ఈ బస్సులకు ‘ఫిట్నెస్’ జారీ చేయాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ) కార్యాలయాల్లో దళా రుల దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వాహనానికి వేలల్లో మామూళ్లు ఇస్తేనే సర్టిఫికెట్ జారీ అవుతోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తాము అధికారులకు కమీషన్లు ముట్టజెప్పాల్సి వస్తోందని దళారులు బాహాటంగానే చెబుతున్నారు. చేతులు తడిపిన యా జమాన్యాల వాహనాలకు సర్టిఫికెట్లు జారీచేస్తుండగా కరోనా కష్టాల నుంచి ఇంకా కోలుకోని కొన్ని స్కూల్ యాజమాన్యాలు ఏజెంట్లు అడిగినంత ఇవ్వలేక అవస్థలు పడుతున్నాయి. ఫలితంగా బడులు ప్రారంభమైనా ఇప్పటివరకు 85 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ కాకపోవడం గమనార్హం. తనిఖీల జాడేది? విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి 11 రోజులు గడుస్తున్నా ఆర్టీఏ అధికారులు మాత్రం తనిఖీలు నిర్వహించడం లేదు. దీంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సులను ఎటువంటి ఫిట్నెస్ లేకుండానే యథేచ్ఛగా తిప్పుతున్నాయి. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇవీ నిబంధనలు.. వాహనాలకు ఫిట్నెస్ పరీక్ష చేయించాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు, డిజిగ్నీషన్, సెల్ నంబర్, బస్సు మోడల్, డ్రైవర్ వివరాలు, అటెండెంట్, ఫొటోలు, బస్సు నడిచే మార్గం, సీట్ల పరిమితి, తదితర విషయాలను నమోదు చేయాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా వాహనంలో మెడికల్ కిట్లు, గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు, సీట్ల మధ్య రాడ్లు అమర్చి ఉండాలి. విద్యార్థులు బస్సులో ఎక్కేందుకు, దిగేందుకు అనుకులంగా 325 మి.మీ ఎత్తు ఉండేలా బస్సు మెట్లు ఉండాలి. ● ఆపద సమయంలో బయటకు దిగేందుకు అత్యవసర ద్వారం తప్పకుండా ఏర్పాటు చేసి ఉండాలి. ● విద్యార్థులు బస్సు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు డ్రైవర్‌కు కనబడేలా రెండు వైపులా సైడ్ అద్దాలు, అన్ని కిటికీలను కలుపుతూ ఇనుప జాలి అమర్చి ఉండాలి. ● వాహనం టైర్లు, బ్రేక్‌లు నాణ్యతతో ఉండేలా చూసుకోవాలి. బస్సుపై ఏ పాఠశాలకు చెందిందో తెలిపేలా పూర్తి వివరాలు రాసి ఉంచాలి. ● పాఠశాల వాహనాలు నడిపే డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి. ● రాత్రి వేళల్లో బస్సులను గుర్తుపట్టేలా నాలుగు వైపులా రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలి. ఫిట్నెస్ లేకుంటే చర్యలు అనుమతులు లేకుండా పాఠశాల యాజమాన్యాలు స్కూల్ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. స్కూల్ యాజమాన్యాలు వారి వాహనాలకు ఫిట్నెస్ చేయించుకోవాలి. అనుభవం ఉన్న వారిని డ్రైవర్‌గా నియమించుకోవాలి. నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తాం. – అజయ్‌కుమార్, జిల్లా రవాణాశాఖ అధికారి -
నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు
సాక్షి, హైదరాబాద్: వాహన బీమాలో కొన్ని సంస్థలు మాయాజాలం చేస్తున్నాయి. ఏకంగా ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టిస్తున్నాయి. సదరు సంస్థల బీమాకు వాహన్ పోర్టల్లోనూ ఆమోదం లభించడం గమనార్హం. సాధారణంగా ఎలాంటి వాహనాలకైనా ఏడాదికోసారి బీమాను తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలి. బీమా సంస్థలు కనీసం ఏడాది ప్రీమియాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం కొన్ని బీమా సంస్థలు నెల రోజుల వ్యవధితో పత్రాలను అందజేస్తున్నాయి. వీటి ఆధారంగానే కొందరు అధికారులు వాహనాలకు అన్ని రకాల పౌరసేవలను అందజేస్తున్నారు. వాహనాల ఫిట్నెస్, బదిలీ, అమ్మకాలు, చిరునామా మార్పు వంటి అంశాల్లో అన్ని రకాల డాక్యుమెంట్లతో పాటు సదరు వాహనానికి ఉన్న బీమా కాలపరిమితిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి. కనీసం ఏడాది పాటు బీమా గడువు ఉన్న వాహనాలకే ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించి వాహన సామర్థ్యాన్ని ధృవీకరించవలసి ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా ఆటో రిక్షాలు, క్యాబ్‌లు వంటి ప్రజా రవాణా వాహనాల్లో ఇది బేఖాతరు అవుతోంది. ప్రయాణికులు, వాహనాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎంతో కీలకంగా భావించే బీమాపత్రాల్లో ఎలాంటి పారదర్శకతను పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇలాంటి బీమా పత్రాలకు వాహన్ పోర్టల్‌లో సైతం ఆమోదం లభించడం విచిత్రంగా ఉంది’ అని ఇబ్రహీంపట్నానికి చెందిన మోహన్ అనే వాహన యజమాని విస్మయం వ్యక్తం చేశారు. తప్పించుకొనేందుకే... నెల రోజుల గడువుతో ఇస్తున్న బీమా పత్రాలు ఇటు వాహనదారులకు, అటు సదరు బీమా సంస్థలకు ఉభయ తారకంగా మారాయి. కొందరు వాహన యజమానులు బీమా భారాన్ని తప్పించుకొనేందుకు కేవలం రూ.1500 చెల్లించి నెల గడువు కలిగిన బీమాను పొందుతున్నారు. ఇది ఆ సంస్థలకు చక్కటి ఆదాయ మార్గంగా మారింది. నిజానికి ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, తదితర వాహనాలకు ఏడాది ప్రీమియం కలిగిన థర్డ్‌పార్టీ బీమా పొందాలంటే రూ.7000 నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. వ్యక్తిగత కార్లకు ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ భారాన్ని తప్పించుకొనేందుకే బీమా సంస్థలు, వాహనదారులు కొత్త ఎత్తుగడను ఎంచుకొన్నాయి. బీమా ప్రీమియం గడువును ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఆర్టీఏ అధికారులు వాహనాలకు ఫిట్నెస్ ఇచ్చేస్తున్నారు. యాజమాన్య మార్పిడి, చిరునామా మార్పు, తదితర రవాణా సేవలను అందజేస్తూ తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. నకిలీల వెల్లువ.. మరోవైపు వాహన బీమాలో నకిలీ పత్రాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆటోరిక్షాలు, ద్విచక్ర వాహనాల రెన్యువల్స్‌లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. కొందరు ఏజెంట్లు ఏడాది విలువ కలిగిన నకిలీ పత్రాలను సృష్టించి రూ.1000 నుంచి రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఇలాంటి పత్రాల ఆధారంగానే వాహనదారులు అధికారులను సంప్రదిస్తున్నారు. కొన్ని చోట్ల అవి నకిలీవో, అసలువో నిర్ధారించుకోకుండానే ఏజెంట్లపై ఆధారపడి అన్ని రకాల అనుమతులు ఇవ్వడం గమనార్హం. చదవండి వార్నీ.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు! -
పవన్ కల్యాణ్ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్..
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన ఆరు వాహనాలను ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాటిలో ఒకటి బెంజ్, మరో రెండు స్కార్పియో కార్లు ఉ న్నాయి. టయోటా వైల్‌ఫైర్ వాహనంతో పాటు ఒక జీప్ ర్యాంగ్లర్, ఒక టాటా యోధ ట్రాన్స్‌పోర్టు వాహనం పవన్‌కల్యాణ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకున్నారు. ఉపరవాణా కమిషనర్ పాపారావు, ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి రాంచందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: (కైకాల సత్యనారాయణ మృతి.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం) -
నయా నకిలీ దందా.. రూ.900కే వెహికిల్ ఆర్సీ..
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఆర్సీలు, ఆధార్ కార్డులను సృష్టించి సొమ్ము చేసుకోవడంతో పాటు కొత్త ఆర్సీ జారీతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారు నకిలీ ఆర్సీ ముఠాను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఓటీ డీసీపీ సందీప్‌తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం వివరాలు వెల్లడించారు. నగరంలోని యూసుఫ్‌గూడ వాసి షేక్ జాంగీర్ బాషా, కిషన్‌బాగ్‌కు చెందిన సయ్యద్ హుస్సేన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి సంపత్.. వీరు ముగ్గురు అత్తాపూర్, భద్రాద్రి కొత్తగూడెం రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కార్యాలయాల్లో ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాలోని లొసుగులను ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. ప్రధాన నిందితుడు శంషాబాద్ రాళ్లగూడకు చెందిన చామన సతీష్, కాటేదాన్‌కు చెందిన డీటీపీ ఆపరేటర్ ఎం గణేష్, వాహన మధ్యవర్తులు అల్వాల్‌కు చెందిన కలిగిడి చంద్రశేఖర్, మదీనాగూడ వాసి సీహెచ్ రమేష్‌లు ముఠాగా ఏర్పడ్డారు. ఆర్టీఏలో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించే సమయంలో ఆర్సీ కార్డు చేతికివ్వరు. వాహనదారు సూచించిన ఇంటి అడ్రస్‌కు కొరియర్ ద్వారా వస్తుంది. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్నా లేదా వాహనదారు ఇల్లు మారినా, మరే కారణంతోనైనా ఆర్సీ తీసుకోని పక్షంలో అది తిరిగి ఆర్టీఏ కార్యాలయానికి వస్తుంది. ఇలా వచ్చిన ఆర్సీలను జాంగీర్ బాషా, సయ్యద్ హుస్సేన్, సంపత్‌లు దొంగిలించి.. ఒక్కో ఆర్సీని రూ.900 చొప్పున సతీష్, చంద్రశేఖర్, రమేష్‌లకు విక్రయిస్తారు. డేటా ఆపరేటర్ గణేష్ ఆయా ఒరిజినల్ ఆర్సీ కార్డులపై ఉన్న యజమాని వివరాలను నెయిల్ పాలిష్ (డాజ్లర్)తో తొలగించి నకిలీ ఆర్సీలను సృష్టిస్తాడు. ఆయా బ్రోకర్ల నుంచి వాహనాలను కొనుగోలు చేసిన వాహనాదారులు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి సందర్శించినప్పుడు కొత్త ఆర్సీలు జారీ కావు. ఎందుకంటే ఒరిజినల్ ఆర్సీని అధికారులు స్వాధీనం చేసుకొని ఆధార్ కార్డును ధ్రువీకరించుకున్న తర్వాతే కొత్త ఆర్సీ జార్సీ చేస్తారు గనక! దీంతో ఆయా వాహన బ్రోకర్లు అంతకుముందే సృష్టించిన నకిలీ ఆర్సీ, ఆధార్ కార్డులను వాహనాదారులకు అందిస్తారు. వీటిని ఆర్టీఏ అధికారులకు సమర్పించి.. వాహనదారులు కొత్త ఆర్సీలను తీసుకుంటారు. ఒడిశా వాహనాలకు నకిలీ ఆర్సీ కాపీలు సృష్టిస్తున్నారని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దృష్టికి రావటంతో రంగంలోకి దిగారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 వేల నగదుతో పాటు 1,200 నకిలీ ఆర్సీలు, 29 రబ్బర్ స్టాంపులు, 75 ఆధార్ కార్డులు, రెండు ల్యాప్‌టాప్‌లు, సీపీయూ లు, ప్రింటర్లు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి గత కొన్ని నెలలుగా ఈ ముఠా నకిలీ ఆర్సీ బాగోతాన్ని నడుపుతోంది. ఒక్కో ఆర్సీ జారీ ద్వారా ప్రభుత్వానికి వచ్చే రూ.1,000 నుంచి 1,200 ఆదాయానికి గండిపడింది. సుమారు వెయ్యి వా హనాలకు నకిలీ ఆర్సీలను సృష్టించారు. ఆయా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. వాహనాలను దొంగతనం చేసే నేరస్తులకు కూడా నకిలీ ఆర్సీలను ఇవ్వాలని ఈ మోసగాళ్లు భావించినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
బాలానగర్ వంతెనపై దారుణం: సేప్టీ గోడకు గుద్దుకుని..
సాక్షి, హైదరాబాద్: అతి వేగం ప్రమాదకరం.. హెల్మెట్ లేని ప్రయాణం వద్దు అని ఎంత ప్రచారం చేసినా పట్టించుకోరు కొందరు. చివరకు ఏం అవుతుంది.. అంటే ఇదిగో ఇలా ఊహించని విధంగా ప్రమాదాలకు గురై మరణించే పరిస్థితులు తలెత్తుతాయి. బాలానగర్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ మీద బైక్‌పై అతి వేగంగా వెళ్తూ.. అదుపుతప్పి సేఫ్టీ గోడకు గుద్దుకుని బుధవారం ఓ యువకుడు మృతి చెందాడు. లైసెన్స్ తీసుకునేందుకు ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్(24) అనే యువకుడు లారీ డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్.. లైసెన్స్ తీసుకునేందుకు బైక్ మీద తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. బాలానగర్ వంతెనపై నుంచి అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఎడమవైపు ఉండే సేఫ్టీ డివైడర్‌ను ఢీ కొట్టాడు. ఇది గమనించిన స్థానికుల వెంటనే 108లో అశోక్‌ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తు కారణంగానే బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
ఖైరతాబాద్‌లో ప్రత్యక్షమైన ప్రభాస్
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రభాస్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డార్లింగ్‌ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. ఆఫీసులో ఉన్న కొంతమంది ఉద్యోగులు, సందర్శకులు సైతం ప్రభాస్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. కరోనా టైమ్ కాబట్టి ప్రభాస్ మాస్కు ధరించే బయటకు వచ్చారు. దీంతో మాస్కులో ఉన్న హీరోతో ఫొటోలు దిగేందుకు అక్కడి జనం ఉత్సాహం ప్రదర్శించడంతో వారిని నొప్పించడం ఇష్టం లేని డార్లింగ్ ఫొటోలకు పోజిచ్చారు. ఇదిలా వుండగా ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నారు. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. తన 21వ చిత్రాన్ని 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే జోడీగా నటించనున్నారు. (దీపిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?) -
ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి యత్నం
సాక్షి,హైదరాబాద్:ఆటో,క్యాబ్‌డ్రైవర్ల యూనియన్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి యత్నించాయి. పెద్దఎత్తున నిరసన తెలుపుతూ యూనియన్ నాయకులు ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించాలని ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 2019 మోటార్ వాహన చట్టం సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలన్నారు. రవాణా రంగ కార్మికులకు రూ. 7,500 ఆర్థిక సహాయం ఇవ్వాలని తెలిపారు. కార్మిక చట్టాలను సవరించాలని కోరారు. ప్రైవేటు అప్పులను 6నెలలు వాయిదా వేయాలన్నారు. అదే విధంగా క్యాబ్ జేఏసీ నాయకుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. ఓల, ఉబర్ డ్రైవర్ల నుంచి యాజమాన్యం తీసుకుంటున్న 20 శాతం కమిషన్ ఆపాలన్నారు. టోల్ టాక్స్, రోడ్ టాక్స్‌లను వెంటనే ఎత్తివేయాలిని డిమాండ్ చేశారు. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ చార్జీలను తగ్గించాలన్నారు. -
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : కేరళ, తమిళనాడు, ఆంద్రప్రదేశ్ బార్డర్ టాక్స్ ఏడాది కాలం పాటు రద్దు చేయడం, తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ స్టేట్ క్యాబ్స్ అండ్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. సోమవారం ఉదయం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బస్సులలో చేరుకొని ధర్నాకు దిగారు. రోడ్డుకు ఇరువైపులా బస్సులు నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆర్టీఏ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మొహరించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ధర్నాను విరమించబోమని తెలంగాణ స్టేట్ క్యాబ్ అండ్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. బార్డర్ టాక్స్ ఏడాది పాటు రద్దు చేయాలి ఆంధ్ర, తమిళనాడు, కేరళకు వేళ్లే వాహనాల బార్డర్ టాక్సులు రద్దు చేయాలని తెలంగాణ స్టేట్ క్యాబ్ అండ్ బస్ ఆపరేటర్ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా బస్సులు రోడ్డు ఎక్కలేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలని కోరారు. -
వాహన కాలుష్యానికి.. ఆన్లైన్ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ : వాహన కాలుష్యానికి ఆన్లైన్ తనిఖీలతో కళ్లెం వేసేందుకు రవాణాశాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటివరకు మనుషుల ద్వారా నిర్వహించే కాలుష్య తనిఖీ పరీక్షలను ఇక నుంచి ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా నిర్వహించనున్నారు.కేంద్రమోటారు వాహన చట్టంలో రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలనే రోడ్లపైకి అనుమతిస్తారు. గ్రేటర్లో వాహన కాలుష్యం రోజు రోజుకు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కొత్త వాహనాలతో పాటు, కాలం చెల్లిన వాహనాలు సైతం రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. పాత వాహనాలు ప్రమాదకరమైన కాలుష్యకారక పదార్ధాలను వెదజల్లుతున్నాయి. వాటికి నిర్వహించే కాలుష్య తనిఖీల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదు. రోడ్లపై అక్కడక్కడా కనిపించే సంచార పరీక్షాకేంద్రాల్లో ఉత్తుత్తి తనిఖీలను నిర్వహించేస్తున్నారు. రూ.యాభయ్యో, రూ.వందో తీసుకొని కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలను ఇచ్చేస్తున్నారు. ఆర్టీఏ అధికారులు వాటినే ప్రామాణికంగా తీసుకొని వాహనాల సామర్థ్యాన్ని ధ్రువీకరిస్తున్నారు. దీంతో యథావిధిగా ఈ వాహనాలు భయంకరమైన కాలుష్యాన్ని చిమ్ముతున్నాయి. రవాణాశాఖ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 55 లక్షల వాహనాలు ఉన్నాయి. బీఎస్ –4 ప్రమాణాల మేరకు ఉన్న కార్లు, బైక్‌లు, తదితర వ్యక్తిగత వాహనాలు మినహాయిస్తే బస్సులు, ఆటోలు, లారీలు, ఇతర ప్రయాణికుల రవాణా వాహనాల్లో లక్షల కొద్దీ పాత వాహనాలే ఉన్నాయి. బీఎస్–2, బీఎస్–3 వాహనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇలాంటి వాటి నుంచి ప్రమాదకరమైన సల్ఫర్, కార్బన్‌మోనాక్సైడ్, కార్బన్డయాక్సైడ్, లెడ్ వంటివి పెద్ద మొత్తంలో విడుదలవుతున్నప్పటికీ ఇప్పుడు ఉన్న మాన్యువల్ పద్ధతిలో సరిగ్గా నిర్ధారించలేకపోతున్నారు. పైగా కాలుష్య తనిఖీ నియంత్రణ స్టేషన్లపైన ఎలాంటి నిఘా లేకపోవడం వల్ల 80 శాతం ఉత్తుత్తి తనిఖీలతోనే వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ‘స్మార్ట్‌చిప్’తో ఒప్పందం... కాలుష్యనియంత్రణపైన రవాణా అధికారులు కొంత కాలంగా తీవ్రంగా దృష్టిసారించారు. ఇప్పుడు ఉన్న పద్ధతిని పూర్తిగా మార్చివేసి మనుషులతో ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే వాహనాల కాలుష్యాన్ని నిర్ధారించాలనే ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా సాంకేతిక సంస్థల నుంచి గతేడాది టెండర్లను ఆహ్వానించారు.పలు సాంకేతిక సంస్థలు పోటీపడ్డాయి. వాటిలో ఢిల్లీకి చెందిన ‘స్మార్ట్‌చిప్’సంస్థను ఎంపిక చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ సంస్థతో ఒప్పదం కుదుర్చుకోనున్నట్లు రవాణాశాఖ ఐటీ విభాగం సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ ‘సాక్షి’ కి చెప్పారు. కేంద్ర మోటారు వాహన చట్టంలో నిర్దేశించిన ప్రమాణాల మేరకు కాలుష్య కారకాలను గుర్తించి సర్టిఫికెట్లను అందజేయడంలో తమకు ఈ సంస్థ సాంకేతిక సాయం అందజేస్తుందన్నారు. నగరంలోని సుమారు 350 కి పైగా ఉన్న కాలుష్య తనిఖీ వాహనాలను, కేంద్రాలను ఆన్లైన్ పరిధిలోకి తేనున్నామన్నారు. రహదారులపై వాహనాలకు కాలుష్య పరీక్షలు నిర్వహించినప్పుడు వాటి కాలుష్యం ఏ స్థాయిలో ఉందనేది ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలోనే ఆన్లైన్లో నిర్ధారించి సర్టి ఫికెట్లను అందజేస్తారు. తనిఖీ కేంద్రాల్లోని ప్రింటర్ల ద్వారా ఈ సర్టిఫికెట్లు వాహనదారుడికి చేరుతాయి. ఎక్కడా మనుషుల ప్రమేయానికి తావు ఉండదు. పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. మరోవైపు ఇప్పుడు ఉన్న తనిఖీ కేంద్రాలను కూడా పెంచుతారు. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం పొందేవిధంగా పర్యవేక్షిస్తారు. పాత పద్ధతికి స్వస్తి.. కేంద్రమోటారు వాహనచట్టం 1988 ప్రకారం కాలుష్య నియంత్రణకు 2002లో తనిఖీ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని పెట్రోల్ బంకులలో ఏర్పాటు చేసిన స్థిరమైన కేంద్రాలు. కాగా. మరికొన్ని సంచార టెస్టింగ్ స్టేషన్లు. ఈ కేంద్రాల్లో గ్యాస్ అనలైజర్లు, స్మోక్ మీటర్లు ఉంటాయి. వాటి సాయంతో వాహనం నుంచి వెలువడే పొగసాంద్రత, దానిలోని కాలుష్య కారక పదార్ధాలను నిర్ధారిస్తారు. కానీ కొన్ని స్టేషన్లలో అనలైజర్లు, స్మోక్మీటర్లు పని చేయడం లేదు. కేవలం ఉత్తుత్తి తనిఖీలతో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు, రవాణా అధికారులు ఈ స్టేషన్ల పై ఎలాంటి తనిఖీలు నిర్వహించపోవడం, చట్టపరమైన చర్యలు లేకపోవడం వల్ల అవి యధేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. వీటికి ఇక కళ్లెం పడనుంది. -
నంబర్ ప్లేట్.. బాగా లేట్
తిరుపతికి చెందిన రామకృష్ణారెడ్డి ఐదు నెలల క్రితం ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశాడు. నంబర్ ప్లేట్ కోసం రోజూ తిరుపతి రవాణాశాఖ కార్యాలయం సమీపంలోని నంబర్ ప్లేట్ విక్రయ కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు. ఫలితం లేదు. కొనుగోలు చేసిన వాహనంపై వెళ్తుండగా శుక్రవారం తనిఖీ అధికారులు ఆపారు. నంబర్ ప్లేట్ లేదని అపరాధ రుసుం వసూలు చేశారు. తాను చేయని తప్పునకు శిక్ష అనుభవించాడు. తిరుపతి అన్నమయ్యసర్కిల్: కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వాహనదారుల జేబులకు చిల్లుపడుతోంది. కొత్తగా వాహనాలను కొనుగోలు చేసి న వారికి సకాలంలో నంబర్ ప్లేట్లు అందడం లేదు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి పరిధిలో ఆరు నెలలుగా వేలాది మంది వాహనాలను కొనుగోలు చేశారు. వాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. నెలలు గడుస్తున్నా నంబ ర్ ప్లేట్లు అందలేదు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రవాణాశాఖ డిజిటలైజేషన్ పేరుతో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు శ్రీకారం చుట్టి న విషయం తెలిసిందే. ఈ ప్లేట్ల తయారీ ప్రక్రియను రవాణాశాఖ ‘లింక్ ఆటో టెక్ ఇండి యా ప్రైవేట్ లిమిటెడ్ ’ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించింది. కాంట్రాక్ట్ తీసుకున్న మొదట్లో నంబర్ ప్లేట్లు సకాలంలోనే అందేవి. కొంత కాలంగా తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసినవారంలోపు నంబర్‌ప్లేట్స్ అందజేయాల్సి ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా 10వేలకుపైగా వాహనాలకు ఆరునెలలుగా నంబర్‌ప్లేట్స్ అందలేదు. ఏపీ03 సీయూ సీరీస్లోనైతే మరీ దారుణంగా ఈ జాప్యం కనబడుతోంది. ఒక్క తిరుపతి పరిధిలోనే ఇప్పటివరకు 6వేల వాహనాలకు నెలలు గడుస్తున్నా నంబర్‌ప్లేట్స్ సరఫరా చేయకపోవడం గమనార్హం. అడుగడుగునా తనిఖీలతో జేబులకు చిల్లు.. కొత్త వాహనాల కొనుగోలుదారులు అధికారుల తనిఖీలతో బెంబేలెత్తుతున్నారు. రోజు నంబర్‌ప్లేట్ విక్రయకేంద్రం వద్దకు వచ్చి తమ వాహనాల నంబర్ప్లేట్స్పై ఆరా తీస్తున్నారు. విక్రయ కేంద్రంలోని సిబ్బందికి సైతం జాప్యంపై సరైన అవగాహన లేకపోవడంతో ఇటు వాహనదారులు... అటు రవాణా శాఖ సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఆర్టీఓ ఆఫీసులోని హెల్ప్ డెస్క్‌ను ఆశ్రయిస్తున్నారు. కంపెనీ జిల్లా ఇన్చార్జికి సైతం ఫిర్యాదు చేసినా సరైన సమాధానం ఇవ్వకపోవటంతో వాహనదారులు మండిపడుతున్నారు. నంబర్ప్లేట్లలో వచ్చిన తప్పులు.. వాటిని అందజేయడంలో జరుగుతున్న జాప్యంపై ఎదురవుతున్న సందేహాల నివృత్తికి హెల్ప్డెస్క్కాని, టోల్‌ఫ్రీ నంబర్కాని అందుబాటులో లేవు. దీనిపై సాక్షి ఆరాతీయగా ఆన్లైన్లో డేటా జాప్యంతో ఈ సమస్య ఏర్పడిందని, ప్రస్తుతం నంబర్ ప్లేట్ తయారీ చురుకుగా కొనసాగుతోందని సమాధానమిచ్చారు. -
ఆర్టీసీ కార్యాలయంలో మసాజ్ సేవలు
ఉప్పల్: ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో ఓ అధికారి కింది స్థాయి సిబ్బందితో మసాజ్ చేయించుకుంటూ బహిరంగంగా దొరికిపోయా డు. లైసెన్స్‌ల కోసం కార్యాలయానికి వచ్చిన వారు దీనిని ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)గా పనిస్తున్న సురేష్‌రెడ్డి తన సీట్లోనే కూర్చుని బనియన్‌పై కిందిస్థాయి సిబ్బందితో మసాజ్ చేయించుకుంటుండటాన్ని గుర్తించిన కొందరు వ్యక్తులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో ఉంచారు. తప్పుగా అర్థం చేసుకోవద్దు : సురేష్‌రెడ్డి గత కొన్నేళ్లుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నా. శుక్రవారం పని ఒత్తిడితో నొప్పి తీవ్రతరం కావడంతో గార్డెన్లో పనిచేసే వ్యక్తికి ఫిజియోథెరపీ తెలుసని చెప్పడంతో డ్యూటీ ముగిసిన తర్వాత మెడనరం వదిలించడానికి మెల్లగా నొక్కాడు. దయచేసి దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఉద్యోగితో మసాజ్ చేసుకునే తత్వంకాదు. -
ఖైరతాబాద్ ఆర్టీఏలో వెంకటేష్
సాక్షి, సిటీబ్యూరో : ప్రముఖ సినీనటుడు వెంకటేష్ బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. తన వాహనం హైపొతికేషన్ రద్దు కోసం ఆయన కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు, రాష్ట్ర రవాణా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి శామ్యూల్ పాల్ నిబంధనల మేరకు వాహనం హైపొతికేషన్ రద్దు ధృవీకరణ చేసి ఇచ్చారు. -
నాగోల్ ఆర్టీఏ స్పెషల్.. వాహనాలకు మురుగు టెస్ట్
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళితే ఏం చేస్తారు..? ముందు వంకరటింకర ట్రాక్‌పై టెస్ట్‌లు పెడతారు. ఎగుడుదిగుడు రోడ్డుపైనా డ్రైవింగ్ నైపుణ్యం పరీక్షిస్తారు. కానీ నాగోల్ ఆర్టీఏ కార్యాలయంలో వీటికి అదనంగా ‘ముగురు టెస్ట్’ కూడా పెడతారు. మోకాల్లోతు నీటిలో వాహనాలను పరుగులు పెట్టించేవారికే లైసెన్స్ ఇస్తారన్నమాట..! లైసెన్స్ లేదనో.. ఇన్సూరెన్ చేయించలేదనో.. లేక సరైన వాహన పత్రాలు లేవనో నాగోల్ ఆర్టీఏ అధికారులు పట్టుకెళ్లిన వాహనాలకుకూడా మురుగు టెస్ట్‌లు చేస్తున్నారు. కావాలంటే ఒక్కసారి నాగోల్ ఆర్టీఏకు వెళ్లి చూడండి.. పట్టుబడిన మీ వాహనాల పరిస్థితిని తెలుసుకోంది. ఎందుకంటే వివిధ కేసుల్లో సీజ్ చేసి నాగోల్ ఆర్టీఏ ప్రాంగణంలో ఉంచిన ఆటోలు, బైకులు, కార్లు నాలుగు రోజులుగా మురుగు నీటిలో నానుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ప్రతి రోజు వందలాది మందికి డ్రైవింగ్ పరీక్షలు పెట్టి లైసెన్సులు జారీ చేసే నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ సైతం నీటిలో మునిగిపోయింది. ట్రాక్‌లు, వాహనాల స్క్రాబ్యార్డు, కొత్తవాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యాలయంతో సహా పలు కేంద్రాలు నాలుగు రోజులుగా నీటోలోనే మునిగి ఉన్నాయి. దీంతో పలు ట్రాక్‌లలో డ్రైవింగ్ పరీక్షలు నిలిపివేశారు. మోటారు వాహన నిబంధనల మేరకు స్వాధీనం చేసుకున్న సుమారు 500 వాహనాల్లో చాలా వరకు నీట మునిగాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, లారీలు, డీసీఎంలు, తదితర ఖరీదైన వాహనాలు సైతం ఇందులో ఉన్నాయి. మరోవైపు ట్రాక్ అంతా దుర్వాసన వ్యాపించింది. నాలా ఉప్పొంగిన ప్రతిసారీ ఇంతే.. హైదరాబాద్‌లోనే అతి పెద్ద పరీక్షా కేంద్రమైన నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌కు చుట్టుపక్కల ఉన్న కాలనీల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతున్నప్పటికీ ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ, అటు రవాణాశాఖ ఉన్నతాధికారులు గానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా ఈ సమ స్యపై ఆర్టీఏ నుంచి ఫిర్యాదు అందని కారణంగా జీహెచ్ఎంసీ పట్టించుకోలేదు. మురుగునీటిని తొలగించడం తమ విధి కాదన్నట్లుగా రవాణా అధికారులు భావించడం వల్ల 12 ఎకరాల విస్తీర్ణంలో 6 డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టించిన నాగోల్ ట్రా క్లో సగానికిపైగా నీటిలో మునిగిపోయింది. ఏటా ఇదే దుస్థితి... శాస్త్రీయమైన పద్ధతిలో, రహదారి భద్రతా నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి వాహనదారులకు లైసెన్సులు జారీచేసేందుకు 2005లో నాగోల్ ట్రాక్‌ను నిర్మించారు. రాష్ట్రంలో ఈ తరహా ట్రాక్ పరీక్షలు మొదట ఇక్కడే మొదలయ్యాయి. రహదారులపై ఉండే మిట్టపల్లాలు, మలుపులు తదితర డ్రైవింగ్ టెస్ట్‌లకు అనుగుణంగా ఇక్కడ ట్రాక్‌లు నిర్మించారు. ఇలాంటి అతి పెద్ద ట్రాక్‌లో చాలాకాలంగా మురుగు నీరు చేరుతూనే ఉంది. అటు ఎల్బీనగర్ నుంచి ఇటు ట్రాక్‌కు దిగువన ఉన్న ఆదర్శనగర్ వరకు కనీసం 10 కాలనీల మురుగునీరు అంతా ఒకే నాలా నుంచి ప్రవహిస్తుంది. ఈ నాలా ఉప్పొంగిన ప్రతిసారీ ట్రాక్ మునిగిపోతుంది. ‘ఎలాంటి భారీ వర్షాలు లేవు. వరదలు లేవు. కానీ మురుగునీరు మాత్రం ట్రాక్‌ను ముంచేస్తుంది’.. అని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఇదే పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ శాశ్వత పరిష్కార చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. నిలిచిపోయిన సేవలు.. ప్రస్తుతం నాగోల్ ట్రాక్‌లో ‘హెచ్’ ఆకృతిలో ఉన్న 2 ట్రాక్‌లు, మరో ద్విచక్ర వాహన ట్రాక్ మురుగుతో నిండిపోయాయి. దీంతో వాహనదారుల డ్రైవింగ్ పరీక్షలు స్తంభించాయి. మొత్తం 6 ట్రాక్‌లలో మూడింటిలో మురుగు చేరడంతో మిగతా ముడూ ట్రాక్లలోనే పరిమితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మలక్‌పేట్ ఆర్టీఏ కార్యాలయానికి చెందిన రిజిస్ట్రేషన్ పనులకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రతి రోజు మలక్‌పేట్‌కు చెందిన సుమారు 200 కొత్త వాహనాలకు నాగోల్‌లో రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాగే పాతవాటికి ఫిట్నెస్ ధృవీకరిస్తారు. ప్రస్తుతం ఆర్సీ కార్యాలయం, వాహనాలకు పరీక్షలు నిర్వహించే షెడ్డు నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు రోజులుగా నాగోల్ ట్రాక్ నీటిలో మునిగి ఉన్న విషయం ఆర్టీఏ ఉన్నతాధికారులకు తెలిసినా పట్టనట్టు వ్యవహరించడం వినియోగదారులకు అందజేసే పౌరసేవల్లోని డొల్లతనాన్ని ప్రతిబింబిస్తోంది. -
ఆ నెంబర్ ప్లేట్.. ఎందుకంత లేట్..
సాక్షి, సిటీబ్యూరో: హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్. వాహనాల భద్రతకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పథకాన్ని ప్రారంభించిన 5 ఏళ్లు గడిచినా లక్షలాది వాహనాలు ఇంకా ఈ పథకానికి దూరంగానే ఉన్నాయి. హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) అమలులో రవాణ శాఖ చేపట్టే చర్యలు పూర్తిస్థాయి ఫలితాలను అందజేయలేకపోతున్నాయి. ఇటీవల కాగ్ నివేదికలోనూ ఇదే అంశం వెల్లడైంది. ఈ పథకం అమల్లోకి వచ్చి ఐదేళ్లయినా ఇంకా 2,92,843 వాహనాలు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు బదులు సాధారణ నెంబర్ ప్లేట్లనే వినియోగిస్తున్నట్లు కాగ్ స్పష్టం చేసింది. ఇక ఈ పథకం అమల్లోకి వచ్చిన 2013 సంవత్సరానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో నమోదైన మరో 30 లక్షల వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ఏర్పాటు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. మొత్తంగా ఈ పథకం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది. భద్రతకు భరోసా ఏదీ...? హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ఏర్పాటు ఒక ప్రహసనంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో ఏ రోజుకు ఆ రోజు నమోదయ్యే కొత్త వాహనాలకు మొదట బిగించి, ఆ తరువాత క్రమంగా పాత వాహనాలకు కూడా ఈ నెంబర్ ప్లేట్లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ కొత్త వాహనాల లక్ష్యమే ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికీ 2.98 లక్షల వాహనాలు పెండింగ్‌లో ఉండటమే ఇందుకు ఉదాహరణ. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2015 డిసెంబర్ నాటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కానీ ఐదేళ్లు గడిచిన తరువాత కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమల్లోని జాప్యంపై కాగ్ అక్షింతలు వేయడం దీని అమల్లోని నిర్లక్ష్యాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిరోజు సుమారు 1,500 వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. ఆర్టీఏ కార్యాలయంలో నమోదయ్యే ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్‌తో పాటు నెంబర్ ప్లేట్ కూడా అప్పటికప్పుడే బిగించే సదుపాయం ఉంటే చాలా వరకు జాప్యం లేకుండా ఉండేది. కానీ వాహనం నమోదుకు, నెంబర్ ప్లేట్ ఏర్పాటుకు మధ్య 15 రోజుల నుంచి నెల వరకు గడవు విధిస్తున్నారు. దీంతో వాహనదారుల్లో నిర్లక్ష్యం నెలకొంటోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు ఖైరతాబాద్‌లో మాత్రం ప్రయోగాత్మకంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. హెచ్ఎస్ఆర్పీ ఉన్న వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ స్మార్ట్ కార్డు అందజేస్తున్నారు. అలాగే ఆదివారం సెలవు దినమైనా హెచ్ఎస్ఆర్పీ కేంద్రాన్ని తెరిచి ఉంచుతున్నారు. ఈ చర్యల వల్ల ఖైరతాబాద్‌లో వీటి అమలు బాగానే ఉంది. కానీ మిగతా ఆర్టీఏల్లో ఇలాంటి ప్రత్యేక చర్యలు లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నాణ్యత డొల్ల... మరోవైపు వాహనాల భద్రతకు ప్రతీకగా భావించే హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లలో నాణ్యత కొరవడింది. విరిగిపోవడం, పూర్తిగా రంగు పోవడం, వాహనదారులు ఆశించిన విధంగా నెంబర్ ప్లేట్లు ఆకర్షణీయంగా లేకపోవడంతో చాలా మంది విముఖత చూపుతున్నారు. హెఎండ్ వాహనదారులు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు కలిగిన వారు, రకరకాల ఫ్యాన్సీ నంబర్లు, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్లు పొందిన వాహనదారులు వాటిని తమకు నచ్చిన విధంగా ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ నాణ్యత లేని, రంగు వెలిసిపోయే హెచ్‌ఎస్‌ఆర్‌పీని మాత్రం కోరుకోవడం లేదు. ఈ పథకం విజయవంతంగా అమలు కాకపోవడానికి ఇదీ ఒక కారణం. కాగ్ నివేదికపై సమీక్ష... కాగ్ నివేదికలో వెల్లడించిన అంశాలపై ఈ నెల 4వ తేదీన రవాణ మంత్రి మహేందర్‌రెడ్డి సమీక్షించనున్నారు. లోపాలను సరిద్దిద్దుకొని హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు, ఇతర అంశాలపైన కూడా చర్చించనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. -
బండి లేకపోయినా..
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ పౌరుడు ఓ వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే... సవాలక్ష ఫార్మాలిటీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ స్లాట్ నుంచి ఆధార్ కార్డు వరకు వివిధ రకాలైన పత్రాలను జత చేసి, వాహ నం తీసుకుని యజమానే స్వయంగా వెళ్లి, కనీసం మూడునాలుగు గంటలు వెచ్చిస్తే తప్ప రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాదు. ఆ తర్వాత ఆర్సీ చేతికి రావడానికి మరో వారం పది రోజులు పడుతుంది. హితేష్ నేతృత్వంలోని ముఠా రంగంలోకి దిగితే కేవలం ‘ఫార్మాలిటీస్’ తప్ప ఇంకేం అవసరం లేదు. వాహనాన్ని, దానికి సంబంధించిన పత్రాలను దాఖలు చేయాల్సిన పని లేదు. కేవలం స్లాట్ బుక్ చేసి, ఫామ్–20 లేదా ఫామ్–25 సమర్పిస్తే చాలు. గంటలోనే ఆర్సీ సిద్ధమైపోయి వీరి చేతికి వచ్చేస్తుంది. అసలు వాహనం లేకపోయినా పర్వాలేదు... భవిష్యత్తులో ‘ఖరీదు చేసే’ ఆలోచన ఉంటే చాలు రిజిస్ట్రేషన్ పూర్తయి ఆర్సీ వీరి చేతిలో ఉంటుంది. బండ్లగూడలోని సౌత్‌జోన్ ఆర్టీఏ కార్యాలయం కేంద్రంగా సాగిన ‘బోగస్ రిజిస్ట్రేషన్ల దందా’ నేపథ్యమిదీ. 2015 నుంచి సాగిన ఈ అడ్డగోలు వ్యవహారంలో ఆర్టీఏ అధికారులకు పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్టీఓ నుంచి క్లర్క్ వరకు మొత్తం నలుగురు అధికారులు/సిబ్బంది దళారి విఠల్‌రావుతో కుమ్మక్కైనట్లు ప్రాథమికంగా నిర్థారించారు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన ఐదుగురు సభ్యుల ముఠా 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 వాహనాలకు రిజిస్ట్రేషన్లు సృష్టించి విక్ర యించింది. ఆలుగడ్డబావికి చెందిన మెకానిక్ వద్ద దొరికిన ‘తీగ’ లాగిన టాస్క్ఫో ర్స్ ఈ ము ఠా గుట్టును రట్టు చేసింది. ఈ రాకెట్ ప్రధాన సూత్రధారి హితేష్ పటేల్ వాహనాన్ని చూసి దాని మోడల్, ఏ ఏడాదిలో తయారయ్యిందో చెప్పగల నేర్పరి కావడం కొసమెరుపు. ఒక్కో వాహనానికి రూ.80 వేలు... ఓఎల్ఎక్స్ ద్వారా కాలం చెల్లిన వాహనాలను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఖరీదు చేసే హితేష్ వాటిని తొలుత మెకానిక్‌లకు అప్పగిస్తాడు. రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేసి వీటిని కొత్తగా తయారు చేయిస్తాడు. ఆపై ఒక్కో వాహనం కోసం ‘వెహికిల్ రిజిస్ట్రేషన్ సెర్చ్’ నుంచి కొన్ని నెంబర్లను ఎంపిక చేసి, ఇంజన్‌తో పాటు ఛాసిస్ నెంబర్లు సృష్టించి ఆర్టీఏ దళారి విఠల్‌రావుకు అందించేవాడు. వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేయించడానికి ఇతను రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఇలా మొత్తమ్మీద గరిష్టంగా ఒక్కో వాహనానికీ రూ.80 వేల వరకు ఖర్చు చేసున్న హితేష్ గ్యాంగ్ దాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 వాహనాలను ఈ పంథాలో విక్రయించగా... వాటిలో అత్యధికం ఎన్ఫీల్డ్, యమహా బైక్‌లే కావడం గమనార్హం. మార్కెట్లో వీటికి ఎక్కువ క్రేజ్ ఉండటంతో హితేష్ వీటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. పత్రాలు ఇస్తే చాలు... ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని విఠల్‌రావు బండ్లగూడలోని సౌత్‌జోన్ ఆర్టీఏ కార్యాలయం కేంద్రంగా సాగిస్తున్నాడు. ఒక్కో వాహనంపై ఆర్సీ సృష్టించడానికి గరిష్టంగా రూ.5 వేలు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆర్టీఓకు రూ.1500, ఎంవీఐకి రూ.1000, సూపరింటెండెంట్‌కు రూ.1000, ఓ మహిళా క్లర్క్‌కు రూ.500లతో పాటు కొందరు కానిస్టేబుళ్లకు రూ.500 చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ మామూళ్లు తీసుకుంటున్న అధికారులు, సిబ్బంది వాహనం, ఇతర పత్రాలు తీసుకురాకపోయినా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. రీ–అసైన్‌మెంట్‌కు ఫామ్–20, రీ–రిజిస్ట్రేషన్‌కు ఫామ్–25 ఇస్తే చాలు ఆర్సీలు జారీ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఎలాంటి వాహనాలు లేనప్పటికీ 14 ఆర్సీలు ఈ ముఠా వద్ద సిద్ధంగా ఉండటం. మరో 75 నెంబర్లను ఆర్సీల జారీ కోసం సిద్ధం చేసి ఉంచడం. అందరూ నకిలీ వ్యక్తులే... ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి యజమాని, వాహనం తప్పనిసరి. అయితే అధికారులను మేనేజ్ చేస్తున్న ఈ ముఠా వాహనాలు అసలే తీసుకువెళ్లట్లేదు. యజమానులుగా పరిచయస్తులైన మెకానిక్‌లతో పాటు ఇతరుల్ని తీసుకువెళ్తోంది. వీరితోనే వేలి ముద్రలు వేయించి, వీరే ఫొటోలు దిగిన తర్వాత డిజిటల్ సంతకాలు సైతం చేయించేస్తోంది. కొన్ని సందర్భాల్లో హితేష్ స్వయంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 35 ఆర్సీల్లో ఆరు హితేష్ పేరుతో, ఐదు అబు నాసిర్, మరో ఐదు రాజ్‌కుమార్, ఐదు మహ్మద్ సలీం పేరుతో మిగిలినవి గుర్తుతెలియని వ్యక్తుల పేర్లతో ఉండటం గమనార్హం. వీరే పదేపదే ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్తూ తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేసుకుని వాహనాలను అమ్మేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్లతో ఎన్నో ఇబ్బందులు... ఈ ముఠా విక్రయించిన వాటిలో కొన్ని కాలం చెల్లిన వాహనాలు, మరికొన్ని చోరీ వాహనాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా జరుగుతున్న రిజిస్ట్రేషన్లతో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఒకటికి మించి వాహనాలు తిరిగేస్తుంటాయి. ఫలితంగా హిట్ అండ్ రన్‌తో పాటు ఇతర నేరాలు జరిగినప్పుడు వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిసినా.. బాధ్యులను పట్టుకోవడంతో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. చిక్కినా వీటికి ఇన్సూరెన్స్ ఉండవు. మరోపక్క చోరీ వాహనాలకు సైతం కొత్త నెంబర్ల వచ్చేస్తున్న నేపథ్యంలో ఎలా దర్యాప్తు చేసినా వీటిని పట్టుకోవడం కష్టం. దీంతో బాధితులు నష్టపోవాల్సి వస్తోంది. చిన్న ఆధారంతో ముందుకు.. మూడేళ్లుగా సాగుతున్న హితేష్ ముఠా దందాపై ఆలుగడ్డబావిలో టాస్క్‌ఫోర్స్‌కు ఆధారం దొరికింది. అక్కడి మెకానిక్ మైఖేల్ మోదీ ఇటీవల ఓ వాహనానికి ఇదే పంథాలో ఆర్సీ సృష్టించి విక్రయించాడు. అవే రిజిస్ట్రేషన్, ఛాసిస్, ఇంజిన్ నెంబర్లు మరో వాహనానికి తగిలించి తిరుగుతున్నాడు. ఈ ‘డబుల్ రిజిస్ట్రేషన్’ వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావుకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా... దందా మొత్తం వెలుగులోకి వచ్చి హితేష్, మోదీ సహా ఐదుగురు కటకటాల్లోకి చేరారు. ఈ ముఠాకు సహకరించిన ఇతర మెకానిక్‌లు ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్న ఆర్టీఏ అధికారులను ఆధారాలతో సహా గుర్తించడానికీ ప్రయత్నాలు చేస్తున్నారు. -
లెర్నింగ్ లైసెన్సా.. అంత వీజీ కాదు
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలు వాహన వినియోగదారులను ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. కఠినమైన, తార్కికమైన ప్రశ్నలతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా వచ్చేవారు ఎలాంటి పరీక్షలు లేకుండానే క్షణాల్లో లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని వెళ్తుండగా నేరుగా వచ్చేవారు మాత్రం ఫెయిల్ అవుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకునేందుకు అవసరమైన సాధారణ పరిజ్ఞానం మేరకు వినియోగదారుల అవగాహనను అంచనా వేయాల్సి ఉండగా అందుకు విరుద్దంగా గందరగోళాన్ని సృష్టించే ప్రశ్నలతోనే ఫెయిల్ అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నేరుగా వచ్చేవారిని ఉద్దేశపూర్వకంగానే గందరగోళానికి గురి చేసి ఫెయిల్ చేస్తూ తప్పనిసరిగా ఏజెంట్లను ఆశ్రయించే పరిస్థితి కల్పిస్తున్నారు. దీంతో రవాణాశాఖలో అన్ని రకాల పౌరసేవలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినా ఏజెంట్లు లేకుండా ఎలాంటి పనులు కావడం లేదు. రోడ్డు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్ నియమాలు, వాహనం నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాలపైనే లెర్నింగ్ లైసెన్స్ ప్రశ్నలు ఉన్నప్పటికీ అభ్యర్ధులను తికమకపెట్టేలా ఉంటున్నాయి. దీంతో చాలామంది మొదటిసారి సరైన సమాధానాలను ఎంపిక చేయలేక ఫెయిల్ అవుతున్నారు. చివరకు ఏజెంట్లను ఆశ్రయించి రెండోసారి పాస్ అవుతున్నారు. గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతి రోజూ సుమారు 1500 మంది లెర్నింగ్ లైసెన్సు పరీక్షలకు హాజరవుతుండగా వారిలో సగటున 350 నుంచి 400 మంది ఫెయిల్ అవుతున్నారు. వీరందరూ దళారులను ఆశ్రయించకుండా నేరుగా వచ్చేవాళ్లే కావడం గమనార్హం. ప్రశ్నలు మిగిలే ఉన్నాయి... శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఒక వ్యక్తి డ్రైవింగ్ నేర్చుకునేందుకు రవాణాశాఖ అందజేసే లెర్నింగ్ లైసెన్స్ 6 నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ గడువులోగా సదరు వ్యక్తులు డ్రైవింగ్ నేర్చుకొని, అన్ని రోడ్లపైన వాహనాలను నడిపేందుకు అనుభవాన్ని గడించాలి. అప్పుడు మరోసారి శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలకు హాజరుకావలసి ఉంటుంది. ఈ క్రమంలో లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు అభ్యర్ధులకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్డు సిగ్నల్స్, రూల్స్ అండ్ రోడ్ రెగ్యులేషన్స్, జనరల్ డ్రైవింగ్ ప్రిన్సిపల్స్, తదితర అంశాలపై ఈ ప్రశ్నలను రూపొందించారు. ఈ కేటగిరీల్లో మొత్తం 450 వరకు ప్రశ్నలతో ఒక క్వశ్చన్ బ్యాంక్‌ను రవాణాశాఖ సిద్ధం చేసింది. ఈ క్వశ్చన్బ్యాంకు నుంచే అభ్యర్ధుల పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. ఇందు లో కొన్ని గందరగోళానికి గురిచేస్తున్నట్లు అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ‘సూర్యోదయానికి ముందు, తరు వాత డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెడ్ లైట్ ఎలా ఉండాలి’. సాధారణంగా దీనికి ప్రతి ఒక్కరు ‘లైటు వెలిగించుకొని’ బం డి నడపాలనే భావిస్తారు. కానీ లైట్ లో భీమ్‌లో ఉండాలనేది సమాధానం. అలాగే రోడ్డు మీద గుంతల్లో నీళ్లు చిమ్ముతూ బండి నడిపితే మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన అవుతుందనే విషయం చాలా మందికి తెలియదు. పరిమితికి మించిన బరువుతో వెళ్లే వాహనాలు ఏ సెక్షన్ ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ’వాయు కాలుష్యం వల్ల వాతావరణంలోని ఓజోన్ పొర దెబ్బతింటే ఏమవుతుంది’ వంటి లెర్నర్కు సంబంధం లేని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. సమయాభావ సమస్యే... లెర్నింగ్ లైసెన్సు కోసం నిర్వహించే ఆన్లైన్ టెస్ట్‌లో 20 ప్రశ్నలకు సరైన జవాబులను ఎంపిక చేసేందుకు 10 నిమిషాల సమయం ఇచ్చారు. ఒక్కో ప్రశ్నకు అరనిమిషం వ్యవధి లో సమాధానం గుర్తించాలి. అభ్యర్ధులు కనీసం 12 ప్రశ్నల కు సరైన సమాధానం గుర్తిస్తే చాలు. ఉత్తీర్ణులైనట్లుగా భావి ంచి లెర్నింగ్ లైసెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. దీంతో వాహ నం నేర్చుకొనేందుకు అనుమతి లభిస్తుంది. అయితే చాలామం ది అభ్యర్ధులు సరైన జవాబులు గుర్తించేందుకు సమ యం చాలడం లేదని అభిప్రాయపడుతున్నారు. ‘‘స్క్రీన్‌పై ఒక ప్రశ్నను చదివి అర్ధం చేసుకొని జవాబును గుర్తించే లోపే మరో ప్రశ్న ముందుంటుంది. దీంతో గందరగోళానికి గురవుతున్నాం.’’ అని మోతీనగర్‌కు చెందిన సంపత్ పేర్కొన్నా రు. లెర్నింగ్ లైసెన్స్ పరీక్షకు సమయాన్ని 15 నిమిషాలకు పెంచాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. ఒక్కసారి చదువుకొని వస్తే చాలు.. చాలామంది ఒక్కసారైనా ప్రశ్నావళిని చూడకుండానే నేరుగా పరీక్షకు హాజరవుతున్నారని, దాంతో వారికి ఆ ప్రశ్నలు కఠినంగా కనిపిస్తున్నాయని సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ ‘సాక్షి’తో తెలిపారు. ‘ కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్న మాట నిజమే. గతంలో ఒక కమిటీ వేసి చాలా వరకు సరళీకరించాం. మార్పులు, చేర్పులు చేశాము. 827 ప్రశ్నలను సగానికి కుదించాము. క్వశ్చన్ బ్యాంకు ప్రింటెడ్ బుక్స్ అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఉన్నాయి. రవాణాశాఖ వెబ్సైట్లో కూడా ఉంది. వెబ్సైట్లో మాక్ టెస్ట్‌కు కూడా హాజరు కావచ్చు. ఎలాంటి కసరత్తు లేకుండా, సన్నద్ధత లేకుండా వచ్చేవాళ్లకు మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. ’’ అని చెప్పారు. సరైన సమాధానాలను గుర్తించిన తరువాత ఫెయిల్ చేయడమంటూ ఉండదన్నారు. -
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అగ్నిప్రమాదం
-
ఆర్డీవో కార్యాలయాల్లో షాడోలు
జిల్లాలో ఆర్డీఓ కార్యాలయాల్లో పాలన గాడితప్పింది. సిబ్బంది చేయాల్సిన పనులకు షోడోలు అడ్డుపడుతున్నారు. పనికి రేట్లను ఫిక్స్ చేసి ప్రజలను దోచేస్తున్నారు. ఈ తంతు మొత్తం ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి ఆఫీసులో ఉన్న అవినీతి తిమింగలం నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షి, అమరావతి బ్యూరో: రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కొంత మంది ఉద్యోగులు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి ఒకరేటు పెట్టి ప్రజలను దోచేస్తున్నారు. కార్యాలయ ఉన్నతాధికారులు సైతం వారికే వత్తాసు పలకడంతో మిగతా సిబ్బంది చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితి దాపురించింది. గుంటూరు కలెక్టరేట్లో సైతం ఓ అధికారి డమ్మీగా మారినట్లు చర్చ సాగుతోంది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారి పలుమార్లు సెలవులో వెళ్లాలని హెచ్చరించినట్లు సమాచారం. గుంటూరు ఆర్డీఓ కార్యాలయంలో.. ఈ కార్యాలయంలో ఓ డీటీ (డిప్యూటీ తహసీల్ధార్)స్థాయి అధికారి హవా నడుస్తోంది. మొత్తం ఆదాయ వనరులుగా ఉన్న సబ్జెక్టులు అతని వద్దనే ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారికి అతను చెప్పిందే వేదం. కార్యాలయంలో ఉండే సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో కూడా పాలన గాడితప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్ధార్ కార్యాలయం.. ఇక్కడ వివిధ హోదాల్లో ఓ అధికారి తిష్ట వేసి, ఇష్టారాజ్యంగా ముడుపులు వసూలు చేస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అడవి తక్కెళ్ల పాడులో అసైన్డ్ భూములకు దొంగపట్టాలు ఇవ్వటంలో సదరు ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. గతంలో తాను చేసిన అవినీతి బయట పడకుండా ఉండేందుకు ఈ కార్యాలయంలోనే ఉండేలా అధికార పార్టీనేతలను ఆశ్రయించి మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. తెనాలి ఆర్డీఓ ఆఫీసులో అన్నీ తానై... తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో ఓ రెవెన్యూ అధికారి పెత్తనానికి అడ్డుఅదుపు లేకుండా పోయిం దని అక్కడి ఉద్యోగులే విమర్శిస్తున్నారు. కార్యాలయ అధికారిని కాదని, ప్రతి వ్యవహారంలో తలదూర్చి, పనికి రేట్లు ఫిక్స్ చేసి వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడు. గతంలో ఇతనిపై వచ్చిన ఆరోపణలతో జిల్లాకు చెందిన ఓ మంత్రి బదిలీ సిఫారసు చేయడంతో ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. మండలకార్యాలయాల్లో తహసీల్ధార్ రాసే రిపోర్టులకు సైతం కొర్రీలు వేసి, వాటిని ఆయనే తయారు చేసి డబ్బులు గుంజుతున్నట్లు చర్చ జరగుతోంది. డీటీలు దండుకుంటున్నారు.. నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఓ డీటీ కనుసన్నల్లోనే వ్యవహారాలు నడుస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. అక్కడ కార్యాలయంలో ఉన్న అధికారి, డివిజన్ స్థాయి ఉన్నతాధికారి ఎక్కడున్నారో చెప్పలేని దుస్థితి. గతంలో రెవెన్యూ ఇన్పెక్టర్గా ఆ డివిజన్‌లోనే పనిచేసిన సదరు అధికారి ప్రస్తుతం భూ వ్యవహారాల సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గురజాలలో గుంజుడెక్కువ.. గతంలో అధికార పార్టీ నాయకుడి వెంట తిరిగిన ఓ అధికారి ప్రస్తుతం వ్యవహారాలు చెక్కబెడుతున్నాడు. ఇతనిపై ఏసీబీ దాడులు జరిగినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఆరోపణలు ఉడటంతో ఉన్నతాధికారి సదరు అధికారిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లాలో ఆర్డీఓ కార్యాలయాల్లో సమాంతర వ్యవస్థ నడుస్తోంది. జిల్లా కలెక్టర్ కోనశశిధర్ ఈ వ్యవహారాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. -
ఆర్టీఏ కార్యాలయంలో మహేష్‌బాబు
హైదరాబాద్: సినీ హీరో మహేష్‌బాబు శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. తన కారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్వయంగా వచ్చిన మహేష్ బాబు వేలిముద్ర పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అరగంట అనంతరం తిరిగి వెళ్లిపోయారు. -
0001కు రూ.8 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ రవాణా శాఖకు కాసుల పంట పండిస్తోంది. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రారంభమైన నూతన సిరీస్‌లోని టీఎస్ 09 ఈవీ 0001 నంబర్ రికార్డు స్థాయిలో రూ.8.02 లక్షల ధర పలికింది. నగరానికి చెందిన రాజీవ్ అనే వ్యక్తి రూ.62.99 లక్షల విలువ గల తన నూతన బెంజ్ కారుకు ఈ నంబర్‌ను దక్కించుకున్నారు. ఇక ఇదే సిరీస్‌లో 0111 నంబర్‌కు రూ.1.20 లక్షలు లభించా యి. ఇక 09 ఈయూ సిరీస్‌లోని నంబర్ 0007 వేలానికి రూ.1.07 లక్షలు లభించాయి. మొత్తంగా నూతన సిరీస్‌ల ప్రారంభంతో ఫ్యాన్సీ నంబర్ల వేలం ప్రక్రియలో ఆర్టీఏకు ఒకేరోజు రూ.14.65 లక్షల ఆదాయం లభించినట్లు జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. -
ఆర్టీఏలో ఆయనంటే హడల్
ప్రతి పనికీ ఒక రేటు.. చేయి తడపనిదే ఫైలు కదలదు రవాణాశాఖలో ఆ కానిస్టేబుల్.. ఫెవిల్కాల్వీరుడు అనంతపురం సెంట్రల్ : అనంతపురం రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో ఆయనో కానిస్టేబుల్. బదిలీకి అతీతుడిగా.. ఫెవికాల్ వీరునిగా స్థిరపడిన ఈయన కార్యాలయంలో ప్రతి పనికీ చేయి తడపనిదే ఫైలు ముందుకు కదలనీయకుండా చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించినట్లు సమాచారం. వివరాల్లోకి వెలితే... ఆర్టీఏ కార్యాలయంలో కిందిస్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్లకు ప్రతి మూడునెలలకోసారి బదిలీ తప్పనిసరిగా ఉంటుంది. దీని వలన అవినీతి అక్రమాలను తగ్గించవచ్చు అని భావించిన ఉన్నతాధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ తరహా నిబంధన పకడ్బందీగా జరుగుతున్నా అనంతపురంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ విషయంలో మాత్రం ఇది జరగడం లేదు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం ఉందని సాకు చూపడంతో ఇతడిని బదిలీ నుంచి మినహాయించారు. దీంతో రెండేళ్లుగా ఇక్కడే పాతుకుపోయాడు. అక్రమ వసూళ్లకు అలవాటుపడటం వల్లే ఇక్కడి నుంచి కదలడం లేదని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం బదిలీలు జరిగినా అధికారులు ఆయనకు పూర్తిగా మినహాయించారు. జిల్లాలోని మిగతా ఆర్టీఏ కార్యాలయాల్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పనిచేయడానికి తాము అనర్హులమా అంటూ నిట్టూరుస్తున్నారు. కానిస్టేబుళ్ల కొరత ఉందనే ఇటీవల జరిగిన బదిలీల్లో సదరు కానిస్టేబుల్‌ను ఇతర ప్రాంతాలకు కాకుండా జిల్లా కేంద్రంలోనే మరొక ఎంవీఐ వద్దకు బదిలీ చేశాం. జిల్లా కేంద్రంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు కానిస్టేబుళ్ల కొరత ఉంది. ఈ సమయంలో బదిలీ చేయడం వలన అధికారులకు ఇబ్బందులు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉద్యోగుల బదిలీ చేశాం. - శ్రీధర్, ఆర్టీఏ, అనంతపురం -
ప్రమాదాలకు లైసెన్స్!
►ఫిట్‌లెస్ పరీక్షలు ►డ్రైవింగ్ ట్రాక్‌లలో మొక్కుబడి తంతు ►డ్రైవర్ల సామర్ధ్యంపై అవగాహన లేకుండా లైసెన్సుల జారీ ►పెరుగుతున్న యాక్సిడెంట్లు గ్రేటర్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. ఎలాంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించకుండానే విచ్చల విడిగా డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేరుకు అధునాతన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు ఉన్నా..వాటిపై ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. రోజుకు మొక్కుబడిగా 20 మందికి పరీక్షల ద్వారా లైసెన్స్‌లు ఇస్తూ... వందలాది మందికి ఎలాంటి పరీక్షలు లేకుండానే జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల సరైన డ్రైవింగ్ నైపుణ్యం లేకుండానే వాహనదారులు రోడ్డెక్కుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. పరిశీలించి లైసెన్సులు అందజేయవలసిన ఈ ట్రాక్‌లో రోజుకు 20 మంది అభ్యర్థులకు కూడా పరీక్షలు నిర్వహించడం లేదు. వందలాది మంది ఈ కార్యాలయం నుంచి డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటారు. కానీ పరీక్షలకు హాజరయ్యేవాళ్లు చాలా తక్కువ మంది. పైగా ఈ డ్రైవింగ్ పరీక్షలు సైతంఅధికారుల పర్యవేక్షణ లేకుండా మొక్కుబడిగా జరిగిపోతాయి. ఒక్క ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయంలోనే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని మరికొన్ని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో కూడా ఇదే పరిస్థితి. వాహనాలు నడిపే వ్యక్తుల డ్రైవింగ్ సామరŠాధ్యనికి ఎలాంటి శాస్త్రీయమైన పరీక్షలు లేకుండానే లైసెన్సులు వచ్చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఒక్కసారి లెర్నింగ్ లైసెన్సు కోసం వస్తే చాలు. ఇక డ్రైవింగ్ లైసెన్సు కోసం మరోసారి పరీక్షలకు హాజరుకావలసిన అవసరమే లేదు. ఇలా లైసెన్సులు తీసుకొని హై వేలలో రవాణా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. రహదారి భద్రతకు అతి పెద్ద సవాల్‌గా మారుతున్నారు. మితిమీరిన వేగం, నిబంధనల పట్ల సరైన అవగాహన లేకపోవడం, వాహనాలను అదుపు చేసే సామర్ధ్యం కొరవడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్ఎఫ్ఐడీ కూడా అంతేసంగతులు... మరోవైపు బెంగళూర్ నగరంలోని 9 డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) పరిజ్ఞానంతో అనుసంధానించినట్లుగానే నగరంలోని ఉప్పల్, నాగోల్ ట్రాక్‌లను అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేశారు. పూనేకు చెందిన ఓ సాంకేతిక సంస్థ సహకారంతో ఉప్పల్ ట్రాక్‌లలో ఆర్ఎఫ్ఐడీ ఏర్పాటు చేశారు. యాంటీన్నా ద్వారా ట్రాక్‌లలో వాహనం కదలికలను కంప్యూటర్లో నమోదు చేసే శాస్త్రీయ పరిజ్ఞానం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అప్పట్లో అనేక రకాల ఆటంకాలు చోటుచేసుకున్నాయి. దీంతోరూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్ఐడీని శాశ్వతంగా వదిలేశారు. ప్రత్యక్ష పరీక్షలకు సెలవ్... డ్రైవర్ల నైపుణ్యాన్ని పరీక్షించేందుకు గతంలో విదేశీ తరహాలో ప్రత్యక్ష పరీక్షా పద్ధతి ఉండేది. ట్రాక్‌లలో కాకుండా ప్రధానరహదారులలో డ్రైవర్ వాహనాన్ని నడిపేటప్పుడు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్.. డ్రైవర్‌తో పాటు వాహనంలో పయనిస్తూ అతన్ని నైపుణ్యాన్ని పరీక్షించేవాడు. అభ్యర్ధులు వాహనం నడిపే తీరు, వేగం, వాహనం కండీషన్, పార్కింగ్ చేసే పద్ధతి, వాహనాన్ని వెనక్కి తీసుకోవడం, ఎత్తైన ప్రాంతాల్లో, కచ్చా రోడ్లపైన, ట్రాఫిక్ రద్దీలో నడిపేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలపైన ఈ పరీక్షలు ఉండేవి. ప్రస్తుతం బ్రిటన్ వంటి యూరోప్ దేశాల్లో కచ్చితంగా అమలవుతున్న ఈ విధానిన్ని ఇక్కడ రద్దు చేశారు. దీంతో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ఎలాంటి పర్యవేక్షణ లేని ఒక ప్రహసనంగా కొనసాగుతోంది. నగరంలోని ట్రాక్‌లు –అందజేసే లైసెన్సులు... గ్రేటర్ హైదరాబాద్‌లో ఉప్పల్, నాగోల్, కొండాపూర్, మేడ్చెల్, ఇబ్రహీంపట్నంలలో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు ఉన్నాయి.ఈ ట్రాక్‌లలో ‘హెచ్’, ‘ఎస్’, ‘రివర్స్ యు’ ‘8’ వంటి ఆకృతులలో ట్రాక్‌లను నిర్మించారు. ఈ ట్రాక్లలోనే ద్విచక్ర వాహనదారులకు, మోటారు వాహనాలకు పరీక్షలు నిర్వహించి లైసెన్సులు ఇస్తారు.సాధారణంగా ఈ పరీక్షలు ఎంవీఐల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగాలి. కానీ మొక్కుబడిగానే ఈ పర్యవేక్షణ ఉంటుంది. నాగోల్, కొండాపూర్‌లలో రోజుకు సుమారు 500 డ్రైవింగ్ లైసెన్సుల చొప్పున జారీ అవుతుండగా, మిగతా చోట్ల 300–350 వరకు ఇస్తున్నారు. జాడలేని వీడియో సెన్సర్లు.... వీడియో ఆధారిత సెన్సర్లను వినియోగించడం ద్వారా శాస్త్రీయమైన పద్ధతిలో డ్రైవింగ్ సామర్ధ్య పరీక్షలను నిర్వహించేందుకు రవాణాశాఖ 2 సంవత్సరాల క్రితం ప్రణాళికలను రూపొందించింది. కేరళలో విజయవంతంగా అమలవుతున్న ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ల తరహాలో నగరంలోని నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను ఆధునీకరించాలని అప్పట్లో ప్రతిపాదించారు. ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం లేకుండా అభ్యర్థుల నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేయవచ్చునని భావించారు. ఈ మేరకు ఆర్టీఏ అధికారులు అప్పట్లో త్రివేండ్రమ్‌తో పాటు మరికొన్ని నగరాల్లోని వీడియో సెన్సర్లే కీలకంగా పనిచేసే ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను పరిశీలించారు. వీడియో సెన్సర్ల ద్వారా డ్రైవింగ్ నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు. కేరళ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను నిర్వహిస్తున్న కెల్ట్రాన్ అనే సంస్థ భాగస్వామ్యంతోనే ఇక్కడ సైతం డ్రైవింగ్ కేంద్రాలను నిర్వహించాలని ప్రతిపాదించినా ఫలితం లేదు. -
ఆర్టీఏ కార్యాలయంలో సినీ హీరో సునీల్ వర్మ
మలక్‌పేట: తెలుగు సినీహీరో సునీల్‌వర్మ రాకతో ఈస్ట్‌జోన్ మలక్‌పేట ఆర్టీఏ కార్యాలయంలో సందడి నెలకొంది. సునీల్‌వర్మ తాను కొనుగోలు చేసిన వైట్ స్కోడా లారిన్ కారును రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆర్టీఏ కార్యాలయానికి సోమవారం వచ్చారు. రూ. 10 వేలు చెల్లించి టీఎస్ 11 ఈజే 2345 నంబర్‌ను తీసుకున్నారు. ఎంవీఐలు నాగరాజు, టీవీరావులు సిబ్బంది సునీల్‌తో కలిసి ఫొటోలు దిగారు.