నగరంలో అజహరుద్దీన్
సాక్షి, సిటీబ్యూరో: మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కోసం వచ్చిన ఆయనను జేటీసీ రఘునాథ్ సాదరంగా ఆహ్వానించారు. నిబంధనలకు అనుగుణంగా అధికారులు వేలిముద్ర, ఫొటో, డిజిటల్ సంతకం తీసుకొని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌ను అందజేశారు. జేటీసీతో పాటు ఆర్టీఓలు జీపీఎన్ ప్రసాద్, లక్ష్మి తదితరులు ఉన్నారు.