khairatabad
-
ఖైరతాబాద్ : జలవిహార్‌లో లో ఘనంగా లోహ్రి మేళా వేడుక (ఫొటోలు)
-
ఖైరతాబాద్‌లో రామ్ చరణ్ సందడి.. కొత్త కారు నంబర్ ఎంతంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సందడి చేశారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన చెర్రీకి అధికారులు నంబర్‌ను కేటాయించారు. ఇటీవల కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ లగ్జరీ కారుకు టీజీ 09 2727 అనే ఫ్యాన్సీ నంబర్ తీసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో రామ్ చరణ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనాతో రామ్ చరణ్ జతకట్టనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.#GlobalStar @AlwaysRamCharan garu at Khairatabad RTO office for the registration of New Rolls-Royce Car.#GameChanger #Ramcharan #GlobalStarRamCharan pic.twitter.com/1muxaJk3XS— SivaCherry (@sivacherry9) October 22, 2024 -
కేబీఆర్ పార్కులో ‘ప్రజా సంబరాలు’ నగరవాసుల సందడి..(ఫొటోలు)
-
Khairatabad ganesh : ఘనంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం (ఫొటోలు)
-
నిఘా నీడలో.. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
-
మహా గణపతి నిమజ్జనానికి కదలిన భక్తజన సందోహం (ఫొటోలు)
-
ఖైరతాబాద్ గణేష్ వద్దకు భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)
-
Ganesh immersion: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న జరిగే గణేశ్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతోంది. ఎప్పటి మాదిరిగానే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్ఎండీఏ, వాటర్‌బోర్డు, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్‌సరీ్వసెస్, ఆర్టీసీ, ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, టూరిజం విభాగాలతోపాటు 108 ఈఎంఆర్ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పను లు చేయనున్నారు. జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్ల పరిధుల్లోనూ నిమజ్జనాలు జరిగే ప్రాంతాలవారీగా ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దారి పొడవునా దాదాపు కిలోమీటరుకు ఒక గ్రూపుచొప్పున పారిశుద్ధ్య కార్మికులతో గ్రూపులు ఏర్పాటు చేశారు. గణేశ్ యాక్షన్ టీమ్స్ పేరిట ఇవి మూడు షిఫ్టుల్లో పని చేస్తాయి. ఒక్కో టీమ్‌లో ప్రాంతాన్ని, అవసరాన్ని బట్టి అయిదుగురు నుంచి పన్నెండు మంది వరకు కారి్మకులుంటారు. దాదాపు మూడు వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధుల్లో పాల్గొంటారు. ఇబ్బందులు తలెత్తకుండా: ఆమ్రపాలి శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేందుకు భక్తులు సహకరించాలని కోరారు. మండపాల నుంచి నిమజ్జనాలు జరిగే చెరువులు, కొలనుల దాకా భక్తులకు సమస్యలు లేకుండా రహదారి మరమ్మతులు, వీధి దీపాలు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర పనులకు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, విద్యుత్ సిబ్బంది, జీవవైవిధ్య విభాగం, ఇంజినీర్లు కమిటీగా ఏర్పడి మండపాల నిర్వాహకుల సూచనల మేరకు తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 73 కొలనుల్లో ఏర్పాట్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడి ప్రజలక్కడే నిమజ్జనాలు చేసేందుకు వీలుగా 73 కొలనుల్లో నిమజ్జనాలకు ఏర్పాటు చేసినట్లు ఆమ్రపాలి పేర్కొన్నారు. వాటిలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 22 తాత్కాలిక కొలనులు ఉన్నాయన్నారు. వీటితోపాటు 5 పెద్ద చెరువుల (సరూర్ నగర్, జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్‌పురా మీరాలం చెరువు, కాప్రా ఊర చెరువు) వద్ద ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. నిమజ్జన ప్రదేశాల వద్ద విద్యుత్, 24 గంటల పాటు తాగునీరు అందుబాటులో ఉండేలా, పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగేలా అవసరమైన సిబ్బంది, సామగ్రి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో భోజన సదుపాయాలు కలి్పంచనున్నట్లు పేర్కొన్నారు. నమో.. మహా గణనాథా ఒక్కరోజే 4 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్: మహా గణపతి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తడంతో ప్రాంగణమంతా జనసంద్రాన్ని తలపించింది. సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచి్చనట్లు అంచనా. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్ల నుంచి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఖైరతాబాద్ రైల్వేగేట్ రోడ్డంతా కిక్కిరిసిపోయింది. మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతుండటంతో సోమవారం దర్శనం ఉండదని సైఫాబాద్ ఏసీపీ ఆర్.సంజయ్‌కుమార్ తెలిపారు. నిర్వాహకులు మాత్రం సోమవారం భక్తులు మహా గణపతిని దూరం నుంచి దర్శించుకోవచ్చన్నారు.బాలాపూర్ నుంచి.. ట్యాంక్‌బండ్ వరకు నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన డీజీపీ, సీపీలు చాంద్రాయణగుట్ట/పహాడీషరీఫ్: ఈ నెల 17న జరిగే బాలానగర్ వినాయక నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని డీజీపీ డాక్టర్ జితేందర్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం శనివారం ప్రధాన మార్గాన్ని పరిశీలించింది. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సి.వి.ఆనంద్, సు«దీర్ బాబు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు సీపీలు (శాంతి భద్రతలు) విక్రం సింగ్, పి.విశ్వప్రసాద్ (ట్రాఫిక్)లు ఇతర శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు. అంతకుముందు బాలాపూర్ గణనాథుడికి పూజలు చేశారు. అనంతరం నిమజ్జనం రూట్లోని రాయల్ కాలనీ, గుర్రం చెరువు కట్ట, బార్కాస్, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఇంజన్‌లి, శంషీర్‌గంజ్, అలియాబాద్, సయ్యద్ అలీ చబుత్రా, లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, చారి్మనార్, గుల్జార్‌హౌజ్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ట్యాంక్‌బండ్ వరకు 19 కిలోమీటర్ల రూట్‌ను పరిశీలించారు. అధికారులతో మహేశ్వరం, సౌత్, సౌత్ ఈస్ట్ డీసీపీలు సునీతా రెడ్డి, స్నేహ మెహ్రా, కాంతిలాల్ సుభాష్ పాటిల్, బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత ్డ ఉన్నారు. 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 👉 రహదారులపై వ్యర్థాలు తొలగించేందుకు గణేశ్ యాక్షన్ టీమ్‌లు 160. 👉 అందుబాటులో ఉంచిన మినీ టిప్పర్లు 102, జేసీబీలు 125. 👉 మొబైల్ టాయ్‌లెట్స్ 309 👉 తాత్కాలిక వీధి దీపాలు 52,270. 👉 రోడ్ల మరమ్మతులు, ప్యాచ్‌వర్క్స్‌కు సంబంధించిన పనులు 172. 👉 వీటికి చేసిన వ్యయం రూ.12.77 కోట్లు. 👉 రవాణాకు సంబంధించిన పనులు 36. వ్యయం రూ.16.35 కోట్లు. పనులన్నీ పూర్తయినట్లు జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు దర్శనమిస్తున్నాయి. ప్యాచ్‌వర్క్ పనులు పూర్తి కాలేదు. -
ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫోకస్.. 285 మంది పోకిరీలు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణపతి నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మహిళల పట్ల కొందరు ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో, పోకిరీలకు షీ టీమ్స్ చెక్‌పెడుతున్నాయి. గణేష్ ఉత్సవాల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన 285 మంది అకతాయిలను షీ టీమ్స్ పట్టుకున్నారు.కాగా, గణేష్ ఉత్సావాల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణపతి వద్దకు వేలాది సంఖ్యలో మహిళలు, యువతులు హాజరయ్యారు. ఈ క్రమంలో వారి పట్ల కొందరు ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తించారు. గడిచిన ఏడు రోజుల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన 285 మందిని అరెస్ట్ చేసినట్టు షీ టీమ్స్ తెలిపాయి. ఇక, గణేష్ ఉత్సవాల్లో మహిళల భద్రతపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ఖైరతాబాద్‌లో కిక్కిరిసిన భక్త సందోహం -
ఖైరతాబాద్‌లో కిక్కిరిసిన భక్తులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం మంగళవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి దర్శించుకునేందుకు శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తుల తాకిడితో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కాగా, ఖైరతాబాద్‌లో బగా గణేష్ దర్శనం భక్తులు బారులు తీరారు. వీకెండ్, నవ రాత్రి ఉత్సవాలు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో గణపతిని దర్శించుకునే వారి సంఖ్య పెరిగింది. శనివారం మధ్యాహ్నం నుంచి గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో, దర్శనానికి వచ్చే భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు.. విగ్రహం వద్ద భక్తుల సంఖ్య పెరగడంతో కేటుగాళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేకమంది సెల్ ఫోన్ పోగుట్టుకున్నారని తెలుస్తోంది. బంగారం, పర్సులు, తమ విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో దొంగలు సంచరిస్తున్నారని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను పోలీసులు హెచ్చరించారు. ఇక, రేపు ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, ఖైరతాబాద్ రూట్లో వచ్చే మెట్రో సర్వీసులు కూడా ఫుల్ అయిపోయాయి. మెట్రోలో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. ఇది కూడా చదవండి: హైడ్రాపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు -
ఖైరతాబాద్ గణేష్ తొలి పూజలో సీఎం రేవంత్ రెడ్డి
-
ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు
-
#VinayakaChavithi : రేపటి నుండి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం (ఫొటోలు)
-
అడుగుతో మొదలై.. లడ్డూతో ఘనమై.. ఖైరతాబాద్ మహాగణపతికి తుది మెరుగులు (చిత్రాలు)
-
ఖైరతాబాద్ : గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో తెప్పోత్సవం (ఫొటోలు)
-
ఖైరతాబాద్‌లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్స సృష్టించింది. ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్ వైపు అతి వేగంతో వెళ్తూ.. ఓ బీఎండబ్ల్యూ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావటంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 7.30 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారును జితేష్ బుగాని అనే యువకుడు నడిపినట్లు పోలీసులు తెలిపారు. జితేష్ బుగాని తండ్రి ప్రభుత్వంలో ఒక ఉన్నత అధికారి అని సమాచారం. కేసు నమోదు చేసిన ఖైరతాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మద్యం మత్తులో కారు ప్రమాదం జరిగిందా? లేదా నిర్లక్ష్యమా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఖైరతాబాద్ నియోజకవర్గంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంపై కేసు నమోదు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–52లోని నందగిరిహిల్స్ హుడా లేఅవుట్లో ప్రభుత్వ స్థలం చుట్టూ నిరి్మంచిన ప్రహరీగోడను పక్కనే ఉన్న గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు దౌర్జన్యంగా కూలి్చవేయడం జరిగిందని, ఇందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రోత్సాహం ఉందని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ ఇన్‌ఛార్జి వి.పాపయ్య ఇచి్చన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దానం నాగేందర్‌పై కేసు నమోదు చేశారు. నందగిరిహిల్స్ లేఅవుట్లో 850 గజాల జీహెచ్ఎంసీ ఓపెన్ స్పేస్ ఉందని, ఇది ప్రభుత్వానికి చెందినదని, దీనిని కాపాడే యత్నంలో భాగంగా చుట్టూ ప్రహరీ నిరి్మంచడం జరిగిందన్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు ఇక్కడికి వచ్చి జీహెచ్ఎంసీ స్థలం చుట్టూ నిరి్మంచిన ప్రహరీని కూలి్చవేశారన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలంలోనే ఉండి బస్తీవాసులను ప్రోత్సహించారని, బస్తీ నేతలు గోపాల్‌నాయక్, రాంచందర్‌లను ప్రోత్స హించి ఈ కూలి్చవేతలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కూలి్చవేతల వల్ల రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దానం, గురుబ్రహ్మనగర్ బస్తీ నేతలు గోపాల్‌నాయక్, రాంచందర్‌లపై బీఎన్ఎస్ 189 (3), 329 (3), 324 (4), రెడ్‌విత్ 190, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఖైరతాబాద్‌కు ఉపఎన్నికలొస్తే మనదే గెలుపు: కేటీఆర్
బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, బీఆర్ఎస్ను గెలిపించేందుకు నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతో శుక్రవారం ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నియోజకవర్గానికి తప్పనిసరిగా ఉప ఎన్నిక వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం కార్యకర్తలు సమాయత్తం కావాలని సూచించారు. కార్యక్రమంలో మన్నె గోవర్ధన్‌రెడ్డి, జెజొల్ల రాజు ముదిరాజ్, కొమ్ము విజయ్‌కుమార్, విజయ్‌కృష్ణ, అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
70 ఏళ్లు.. 70 అడుగులు
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఖైరతాబాద్‌లో 1954లో అడుగు ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగణపతి.. ఈ ఏడాదితో 70 ఏళ్లయిన సందర్భంగా.. 70 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మహాగణపతి నమూనాను శుక్రవారం ఆవిష్క రించారు. ‘శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి’గా 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో స్వామి దర్శనమివ్వనున్నారు.నిల్చున్న ఆకృతిలో ఉండే గణపతి తలకు ఇరువైపులా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు, రెండు వైపులా 14 చేతులు, కుడివైపు చేతుల్లో చక్రం, అంకుశం, పుస్తకం, త్రిశూలం, కమలం, శంఖం, ఎడమ వైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉన్నాయి.మహాగణపతి పక్కన కుడివైపు పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాల రాముడి విగ్రహం, ఎడమవైపు రాహుకేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు.వినాయకుడి పాదాల చెంత 3 అడుగుల మేర మూషిక వాహనం ఉంటుంది. మహాగణపతి కుడివైపు 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణం విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పై వరుస ప్రమాదాలు
ఖైరతాబాద్: స్నేహితుడిని సొంత ఊరిలో వదిలిపెట్టి సరదాగా గడిపి తిరిగి హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనాలపై వస్తుండగా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పైకి రాగానే ముందు ఉన్న యాక్టీవా డివైడర్‌కు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేటలో నివాసముండే సోఫియాన్ అహ్మద్(20), మహ్మద్ సమీ, సయ్యద్ సైఫ్ ముగ్గురు యాక్టివా వాహనంపై, మరో ద్విచక్రవాహనంపై సయ్యద్ నుమాన్, మహ్మద్ అహ్మద్ అలీ, మూడో వాహనంపై మహ్మద్ తాహెర్ అలీ, ఆదిల్ కలిసి సోమవారం ఉదయం 5.30గంటల ప్రాంతంలో మెదక్‌లో ఉండే ఆదిల్‌ను దింపడానికి వెళ్లారు. అతడిని అక్కడ దింపి అక్కడే సరదాగా గడిపి తిరిగి రాత్రి 10.30 గంటలకు నగరానికి బయల్దేరారు. అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో వీరి ముగ్గురి ద్విచక్రవాహనాలు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ మధ్యలోకి రాగానే సోఫియాన్ అహ్మద్ నడుపుతున్న యాక్టీవా ఢివైడర్‌కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో డివైడర్ మధ్యలో ఉన్న పూలకుండీ బలంగా సోఫియాన్ అహ్మద్‌కు తగిలింది. యాక్టివాపై ఉన్న ముగ్గురు కిందపడిపోయారు. వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోఫియాన్ అహ్మద్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిచెందిన సోఫియాన్ అహ్మద్ పాన్‌షాపు నిర్వహిస్తుండగా వీరిలో మరో ఇద్దరు చదువుకుంటున్నారు. అర్ధరాత్రి వర్షంతో పాటు వాహనం స్పీడ్‌గా ఉండటం వల్లే అదుపు తప్పి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సయ్యద్ సైఫ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సందీప్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై ఆదివారం ద్విచక్రవాహనంపై స్పీడ్‌గా వెళ్తూ అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి చనిపోగా, మరో వ్యక్తి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే అదే ఫ్లై ఓవర్‌పై మరో ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడం అందరినీ కలిచివేసింది. -
ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
సాక్షి,హైదరాబాద్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈసారి 70 అడుగుల వినాయకుడి విగ్రహాన్నిపెట్టనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సోమవారం(జూన్17) గణేశ్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్‌లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహ ఏర్పాటు ప్రారంభించామని చెప్పారు. గతంలో కంటే మెరుగ్గా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారన్నారు. ఈసారి ఖైరతాబాద్ గణేశుడిని సందర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రౌడీషీటర్లపై ఉక్కుపాదం
బంజారాహిల్స్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు వీలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు దృష్టిసారించారు. స్వేచ్ఛాయుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేస్తూ ప్రతిరోజూ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. గత మూడు వారాలుగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, బీసీ పెట్రోలింగ్ పోలీసులు రౌడీషీటర్ల కదలికలను గమనిస్తూ వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడితే రౌడీషీట్ కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. వివిధ పారీ్టల అభ్యర్థులతో తిరిగినా, ప్రచారంలో పాల్గొన్నా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. రౌడీషీటర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, రాత్రి పూట ఇంటికి వస్తున్నారో లేదో దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో రౌడీషీటర్ల భయంతో వణికిపోతున్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలో... ఖైరతాబాద్ నియోజక వర్గ పరిధిలోని బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నారాయణగూడ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సెక్రటేరియట్, దోమల్‌గూడ, సైఫాబాద్, ఆబిడ్స్, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 45 మంది రౌడీషీటర్ల ఉండగా ఇప్పటికే 100 శాతం బైండోవర్లు పూర్తయ్యాయి. ఇందులో కొందరు జైలులో ఉండగా మిగతావారికి నిత్యం రాత్రివేళల్లో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహస్తున్నారు. గత ఎన్నికల సమయంలో వివిధ ఘటనలకు పాల్పడిన 182 మందికి కూడా బైండోవర్ పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలో.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, సనత్‌నగర్, హుమాయన్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 101 మంది రౌడీషీటర్ల ఉండగా వీరందరికీ 100 శాతం బైండోవర్లు పూర్తి చేసినట్లు నియోజక వర్గ ఎన్నికల నోడల్ అధికారి, జూబ్లీహిల్స్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ తెలిపారు. అలాగే గత ఎన్నికల సమయంలో వివిధ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ మరో 300 మందిని కూడా బైండోవర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. రౌడీïÙటర్లకు నిత్యం కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. -
ఆస్తులకు మించిన అప్పుల్లో ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయగా అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. దానం నాగేందర్ పేరిట మొత్తం ఆస్తుల విలువ రూ. 41,33,50,000గా పేర్కొన్నారు. కాగా వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 47.63 లక్షలు ఉండగా ఆయన భార్య దానం అనిత పేరు మీద 78.17 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. కుమార్తె సాయి ప్రియ పేరిట 9.55 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. ఈక్విటీ షేర్లు, పెట్టుబడుల రూపంలో భాగ్యలక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థలో రూ. 16.16 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్పీ. ఇండెన్ సంస్థ నుంచి తనకు రూ. 2.74 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. తనకు వరంగల్ జిల్లా నిరుకులలో 6.09 ఎకరాలు, కళ్ళం గ్రామంలో 18.29 ఎకరాలు, నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో 9 ఎకరాలు, జనగాం జిల్లా పల్లగుట్ట గ్రామంలో 16 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లా మల్యాల గ్రామంలో 4.11 ఎకరాలు ఉన్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని 1432 గజాల్లో ఇల్లు ఉందని దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. తనకు రూ. 47.55 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భార్య పేరిట రూ. 2 కోట్ల అప్పు ఉందని కాగా తన చేతిలో రూ. 1.50 లక్షల నగదు మాత్రమే ఉందని అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. ఆభరణాల విలువ రూ. 27కోట్లు దానం నాగేందర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ. 27 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో దానం పేరిట 1297 క్యారెట్ల వజ్రాలు(రూ.2.99 కోట్లు), 80 తులాల బంగారం(21.6లక్షలు), పది కేజీల వెండి(రూ.4.4 లక్షలు) ఉండగా ఆయన భార్య అనితకు 1350 క్యారెట్ల వజ్రాభరణాలు(3.39కోట్లు), 225 తులాల బంగారం(60.75లక్షలు) ఉన్నాయి. రూ. 10.82 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. -
కలలో కూడా ఈ పరిస్థితి వస్తుందనుకోలేదు: పీవీఆర్
సాక్షి, హైదరాబాద్: పీజేఆర్ కొడుకు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటికి మంత్రి హరీష్‌రావు వెళ్లారు. హైదరాబాద్‌లోని విష్ణు నివాసంలో సోమవారం ఆయన్ను కలిసి బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారు. కాగా కాంగ్రెస్ జూబ్లీహిల్స్ టికెట్‌ను తనకు కాకుండా అజారుద్దీన్‌కు ఇవ్వడంతో విష్ణువర్దన్‌రెడ్డి అసహానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. దీంతో విష్ణు బీఆర్ఎస్లో చేరడం లాంఛనంగా మారింది. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి వస్తుందని కలలోకూడా ఊహించలేదని పేర్కొన్నారు. మా నాన్న(పీజేఆర్) 35 ఏళ్లు, తాను 17 ఏళ్లు కాంగ్రెస్‌కు సేవ చేశామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో గాంధీభవన్‌ను అమ్మేసే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. అతి త్వరలోనే తాను బీఆర్ఎస్లో చేరనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీలో విష్ణుకు సరైన గౌరవం కల్పిస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. విష్ణును బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నామని, ఆయనకు బీఆర్ఎస్ మంచి భవిష్యత్తును ఇస్తుందని చెప్పారు. తెలంగాణ కోసం నిలబడిన వ్యక్తి విష్ణు అని, బీఆర్ఎస్లో చేరేందుకు సుముకుత వ్యక్తం చేశారని తెలిపారు. తాము, విష్ణు అయిదేళ్లు శాసనసభ సభ్యులుగా ఉన్నామని, అనేక ఉద్ధమాల్లో ఆయన తమతో కలిసి పోరాడినట్లు ప్రస్తావించారు. తెలంగాణ వాదులకు, ద్రోహులకు మధ్య యుద్ధం జరుగుతోందని హరీష్ రావు విమర్శించారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరకిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 5 కోట్లకు ఒక్కో ఎమ్మెల్యే టికెట్ అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారని మండిపడ్డారు. పీసీసీ పదవిని కూడా కొనుక్కున్నారని ఆ పార్టీ నేతలే చెప్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి జరగుతోందని, సీఎం పాలనలో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదని తెలిపారు.