హైదరాబాద్: ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని నియోజకవర్గ బీజేపీ నేత బొల్లంపల్లి ఇంద్రసేన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తన తండ్రి జస్టిస్ బి.సుభాషిణ్‌రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా కొన్నేళ్లుగా పౌరులకు ఉచిత న్యాయసేవలు అందిస్తున్నాని అన్నారు.
ఇప్పుడు అదే ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తానన్నారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి సమస్యలు వింటుంటే ఎంతో బాధేస్తుందన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ బస్తీల్లో పర్యటించినప్పుడు ప్రజలు తనకు ఘన స్వాగతం పలికారని వారి సమస్యలను తెలుసుకున్నాననిన్నారు. కలుషిత నీటి సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామన్నారు.
వేళాపాళా లేకుండా నీరు వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్త పైప్‌లైన్ వేసి ప్రెషర్ పెంచితే సమస్య తగ్గుతుందని అధికారులకు సూచించామన్నారు. పింఛన్లు, రేషన్ కార్డుల కోసం జనం ఎదురు చూస్తున్నారన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు జతపరిచే ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment