ఖైరతాబాద్‌లో రామ్ చరణ్ సందడి.. కొత్త కారు నంబర్‌ ఎంతంటే? | Ram Charan Papped At Khairatabad RTO Office For New Car Registration | Sakshi
Sakshi News home page

Ram Charan: ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీసులో రామ్ చరణ్.. కొత్త కారుకు ఫ్యాన్సీ నంబర్!

Published Tue, Oct 22 2024 7:11 PM | Last Updated on Tue, Oct 22 2024 7:35 PM

Ram Charan Papped At Khairatabad RTO Office For New Car Registration

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీసులో సందడి చేశారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్‌ కోసం ఆయన రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన చెర్రీకి అధికారులు నంబర్‌ను కేటాయించారు. ఇటీవల కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్‌ లగ్జరీ కారుకు టీజీ 09 2727 అనే ఫ్యాన్సీ నంబర్‌ తీసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో రామ్ చరణ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనాతో రామ్ చరణ్ జతకట్టనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement