rto office
-
ఖైరతాబాద్‌లో రామ్ చరణ్ సందడి.. కొత్త కారు నంబర్ ఎంతంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సందడి చేశారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన చెర్రీకి అధికారులు నంబర్‌ను కేటాయించారు. ఇటీవల కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ లగ్జరీ కారుకు టీజీ 09 2727 అనే ఫ్యాన్సీ నంబర్ తీసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో రామ్ చరణ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనాతో రామ్ చరణ్ జతకట్టనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.#GlobalStar @AlwaysRamCharan garu at Khairatabad RTO office for the registration of New Rolls-Royce Car.#GameChanger #Ramcharan #GlobalStarRamCharan pic.twitter.com/1muxaJk3XS— SivaCherry (@sivacherry9) October 22, 2024 -
గుడ్ న్యూస్: ఆర్టీవో టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్!
డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (RTO) వెళ్లి ఆర్టీఓ వద్ద డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. మరి ఇవేమి చేయకుండా లైసెన్స్ ఎలా వస్తుందని అనుకుంటున్నారా. ఇకపై గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల నుండి పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు అమలులోకి రాగా, ప్రస్తుత విధానంతో పాటు ఇది కూడా కొనసాగనుంది. కొత్త విధానాన్ని కొన్ని నెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. పరీక్ష లేకుండా లైసెన్స్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు నుంచి శిక్షణను పూర్తి చేయాలి. ఆపై డ్రైవింగ్‌లో అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్‌లను సదరు శిక్షణా సంస్థ జారీ చేయనుంది. ఆపై వారు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, శిక్షణా కేంద్రం సర్టిఫికేట్ జారీ చేస్తుంది. సర్టిఫికేట్ పొందిన తర్వాత, అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆపై ఆర్టీఓ వద్ద ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా ఈ శిక్షణ సర్టిఫికేట్ ఆధారంగా లైసెన్స్ పొందవచ్చు. వీటిని కేంద్ర లేదా రాష్ట్ర రవాణా శాఖలు ఈ శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తాయి. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్‌ను ప్రైవేటీకరించే అవకాశం ఉన్నందున డ్రైవర్ శిక్షణా కేంద్రాలను తెరవడంపై కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సరైన వెరిఫికేషన్లు, తనిఖీలు లేకుండానే ఇలాంటి కేంద్రాలు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తారనే భయం కూడా నెలకొంది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు ఎంత వరకు సత్పలితాలను ఇస్తాయని తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
ఫాన్సీ నెంబర్లపై ఇంత మోజా! 0001 ధరెంతో తెలుసా?
ఇండోర్: ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లపై ఉన్న క్రేజ్ మామూలుదికాదు. తమ ముచ్చటైన వాహనానికి లక్కీ నెంబర్ దక్కించుకునేందుకు వాహనదారులు ఎంత సొమ్మైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. వీఐపీ నంబర్లంటే అంత మోజు! అందుకే వీటిని ఈ-వేలంలో అత్యధిక ధరకు సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ వ్యామోహమే రవాణా కార్యాలయాలకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. తాజాగా ఇండోర్ ఆర్టీఓ కార్యాలయం కూడా వీఐపీ నంబర్ల విక్రయం ద్వారా బంపర్ ఆదాయన్ని సాధించింది. ‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్ 5 లక్షల 21 వేల అమ్ముడుబోయింది. అలాగే 0009 నంబర్ లక్షా 82 వేలకు విక్రయించింది. ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ప్రజలు తమ ఆసక్తి కనబర్చడం ఇదే మొదటిసారి కాదు. ఆ స్పెషల్ నంబర్లు గతంలో కూడా రికార్డు ధరకు అమ్ముడు బోయాయి. ఉదాహరణకు, 2017 లో "0001" నంబరు ఢిల్లీలో రూ .16 లక్షలకు వేలం వేయగా, ఈ సిరీస్ 2014 లో రూ .12. 50 లక్షలకు, 2015 ఏడాదిలో రూ.12.05 లక్షలకు విక్రయించబడింది. పుట్టినరోజు, ఇతర ముఖ్యమైన రోజులతోపాటు, ఇంకా వారి వారి జాతకం ఆధారంగా కొందరు కొన్ని లక్కీ నెంబర్లను ఎంచుకుంటారు. -
తిరుపతిలో ఎన్నికల కోడ్ ని ఉల్లంగిచిన బీజేపీ నేతలు
-
ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయండి ఇలా
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధార్-ప్రామాణీకరణ ఆధారిత కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించింది. ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడంతో సహా 18 సేవలను ఆన్లైన్ ద్వారా ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆధార్ ప్రామాణీకరణత గల కొన్ని సేవలు ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసిన దాదాపు 3 వారాల తర్వాత తీసుకోని రానున్నారు. ప్రస్తుతం పరివాహన్ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పునరుద్ధరించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. దశ 1: పరివహన్ బోర్డు అధికారిక వెబ్సైట్ పరివాహన్.గోవ్.ఇన్ లేదా మీ రాష్ట్ర సంబంధిత ఆర్టీఓ వెబ్సైట్ కు వెళ్లండి. దశ 2: పోర్టల్‌లోని కనిపించే “ఆన్లైన్ సర్వీస్” విభాగంలో గల “డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు” ఎంచుకోండి. దశ 3: ఇప్పుడు క్రొత్త విండో ఓపెన్ అవుతుంది, అక్కడ మీ రాష్ట్ర పేరును ఎంచుకోవాలి. దశ 4: ఆపై డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ సేవలను ఎంచుకోండి. దశ 5: ఇప్పుడు, మీ దరఖాస్తు ఫారమ్‌ను ఎలా పూరించాలో మీకు సూచనలు వస్తాయి. వాటిని పూర్తిగా చదివిన తర్వాత 'కొనసాగింపు'పై క్లిక్ చేయండి. దశ 6: మీ పుట్టిన తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పిన్‌కోడ్, ఇతర వివరాలు దగ్గర పెట్టుకోండి దశ 7: ఇప్పుడు మీ వ్యక్తిగత లేదా వాహన సంబంధిత వివరాలను నింపండి. దశ 8: తర్వాత మీ ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేయండి. దశ 9: మీరు ఈ ప్రక్రియ పూర్తీ చేశాక మీరు మీ అప్లికేషన్ ఐడిని చూడగలిగే రసీదు పేజీ కనిపిస్తుంది. అలాగే, మీకు అన్ని వివరాలతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. దశ 10: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఛార్జీని ఆన్లైన్ ద్వారా లేదా కార్యాలయానికి వెళ్లి చెల్లించవచ్చు. చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! మొబైల్ టారిప్‌లు పెరుగనున్నాయా? -
వాహనదారులకు కేంద్రం శుభవార్త!
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీఓ కార్యాలయాలు అందించే ముఖ్యమైన సేవలను ఇప్పుడు ఆన్లైన్లో ద్వారా పొందవచ్చు అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు 18 రకాల సేవలను ఆధార్ అనుసంధానం ద్వారా వినియోగించుకునేలా మార్పులు చేసింది. ఈ సేవల కోసం ఆర్టీఓ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు. ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులో అడ్రస్ మార్పు, ఆర్ సీ రిజిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ వంటివి ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఆన్లైన్లో పొందవచ్చు. ఆన్లైన్లో లభించే ఇతర సేవలలో డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎన్ఓసి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు, మోటారు వాహన యాజమాన్య బదిలీ నోటీసు, మోటారు వాహన యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి దరఖాస్తు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో చిరునామా, డ్రైవర్ శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు, గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రం, దౌత్య అధికారి మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు, దౌత్య అధికారి మోటారు వాహనం తాజా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు, లీజు-కొనుగోలు ఒప్పందానికి ఆమోదం, లీజు-కొనుగోలు ఒప్పందాన్ని వంటివి ఉన్నాయి. ఈ ప్రక్రియలను మరింత సౌకర్యవంతంగా చేయడానికి, ఆర్టీఓల వద్ద రద్దీని తగ్గించడానికి ఆన్లైన్లో సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్రం తెలిపింది. కొత్త డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేయడంలో ఆధార్ ధృవీకరణ తప్పనిసరని మంత్రిత్వ శాఖ ఇంతకుముందు విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. చదవండి: రికార్డ్ స్థాయిలో పెరిగిన ఐటీ నియామకాలు అమెజాన్.. వెనక్కి తగ్గాలి -
‘అనంత’ ఆర్టీఏలో ప్రకంపనలు..
అనంతపురం సెంట్రల్: రవాణా శాఖలో జరిగిన నయా మోసం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ప్రభుత్వానికి లైఫ్‌ట్యాక్స్ చెల్లించకుండా వాహనాల రిజిస్ట్రేషన్లు చేసిన వ్యవహారంలో ఇన్చార్జ్ ఆర్టీఓ మహబూబ్‌బాషా, సీనియర్ అసిస్టెంట్ మాలిక్‌బాషాలపై సస్పెన్షన్ వేటు పడింది. మూడు రోజుల క్రితం ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన ఇన్నోవా కార్లు, ఓ షిఫ్ట్ కారు నిబంధనలకు విరుద్ధంగా లైఫ్ ట్యాక్స్ చెల్లించకుండానే ఇతరులపై రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా గమనించిన ఆర్టీఏ ఉన్నతాధికారులు మొత్తం ఐదు వాహనాలను గుర్తించారు. అనంతపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, కర్నూలు జిల్లా అవుకు ప్రాంతాల్లో వీటి యజమానులు ఉన్నట్లు తెలుసుకున్నారు. సదరు వాహనాలను సీజ్ చేసిన అధికారులు అక్రమ బాగోతంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే అంశంపై లోతుగా విచారణ చేపట్టారు. ఏజెంట్లు మాత్రమే కాకుండా కొందరు అధికారులకు తెలిసే ఈ తతంగం జరిగిందని ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో లైఫ్ ట్యాక్స్ చెల్లించకుండానే వాహనాలను రిజి్రస్టేషన్ చేసిన సీనియర్ అసిస్టెంట్ మాలిక్‌బాషా, ఇన్చార్జ్ ఆర్టీఓ మహబూబ్‌బాషాలను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆర్టీఏ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. -
9999 @ రూ.8,66,116
రాజేంద్రనగర్: ఉప్పర్‌పల్లి ఆర్టీఓ కార్యాలయంలో బుధవారం 9999 నంబర్‌కు అత్యధిక ధర పలికింది. టీఎస్ 07 హెచ్ఈ 9999 నంబర్‌కు ఆన్లైన్లో వేలం వేయగా శేరిలింగంపల్లి కొత్తగూడ అపర్ణ టవర్స్‌కు చెందిన జి.శివరామకృష్ణ రూ. 8,66,116కు కోట్ చేసి దక్కించుకున్నారు. ఈ నంబర్ కోసం ముగ్గురు పోటీపడగా అత్యధికంగా కోడ్ చేసి న శివరామకృష్ణకు కేటాయించారు. ఆయన కొత్తగా కొనుగోలు చేసిన రేంజ్‌రోవర్ కారు కోసం డబ్బు వెచ్చించి దక్కించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆల్‌లైన్‌లో నంబర్‌కు అత్యధిక ధర పలకడం ఇదే మొదటిసారి. -
పైసలివ్వందే ఇక్కడ పని జరగదు!
సాక్షి, నంద్యాల : నంద్యాల పట్టణ శివారులోని కర్నూలు–కడప జాతీయ రహదారి పక్కనున్న రవాణా శాఖ (ఆర్టీఓ) కార్యాలయంలో పైసలివ్వందే ఏ పనీ జరగడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ మొదలుకుని ప్రతి పనికీ ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసినప్పటికీ ఇక్కడి అధికారులు అనధికారికంగా ఏజెంట్లను నియమించుకుని వసూళ్ల దందా సాగిస్తున్నారు. వారి ఆగడాలు శ్రుతిమించడంతో వ్యవహారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాకా వెళ్లింది. దీంతో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి..క్లర్క్‌తో పాటు నలుగురు అనధికారిక ఏజెంట్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.39 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన క్లర్క్ దత్తాత్రేయ నంద్యాల పట్టణానికి చెందిన కరీం అనే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం అనధికారిక ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా దరఖాస్తు చేసుకున్నాడు. అతను అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పని కాలేదు. చివరకు కార్యాలయంలో క్లర్క్‌గా పని చేస్తున్న దత్తాత్రేయను కలిశాడు. డబ్బు ఇస్తేనే పని అవుతుందని ఆయన కరాఖండీగా చెప్పాడు. రూ.2,500 ఇవ్వడానికి అతను అంగీకరించగా.. అది చాలదని, అదనంగా ఇవ్వాలని క్లర్క్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు వల పన్ని పట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో బుధవారం కార్యాలయంలోకి బాధితుడిని పంపారు. అతను క్లర్క్ దత్తాత్రేయను కలిసి రూ.2,500 ఇచ్చాడు. మిగతా డబ్బు ఏదని క్లర్క్ అడగ్గా.. బయటకు వెళ్లి తీసుకొని వస్తానని చెప్పాడు. ఇంతలోనే ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వచ్చి క్లర్క్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలోకి ఎవరినీ రానివ్వకుండా, లోపలున్న వారిని బయటకు పంపించకుండా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్టీఓ కార్యాలయ అధికారులు అనధికారికంగా నియమించుకున్న ఏజెంట్లు నరసింహ, సోమేశ్వరరెడ్డి, రమేష్, బాషాలను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి వద్ద రూ.39,020 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో బాషా అనే ఏజెంట్ ఏసీబీ అధికారుల కన్నుగప్పి బయటకు పారిపోయాడు. క్లర్క్‌తో పాటు మిగతా ముగ్గురిని తమ అదుపులో ఉంచుకున్నారు. సోమేశ్వరరెడ్డి అనే ఏజెంట్ స్వయాన బ్రేక్ ఇన్స్పెక్టర్ వాహన డ్రైవర్ కావడం గమనార్హం. -
రాజధానికి చేరిన ‘ఆర్టీఓ’ పంచాయితీ
సాక్షి, మెదక్: జిల్లా రవాణా శాఖకు సంబంధించిన బాగోతం రాష్ట్ర రాజధానికి చేరింది. నెలరోజు లుగా ఓ సంఘం నేత, ఏజెంట్ల మధ్య కొనసాగుతున్న వార్ హోంమంత్రితోపాటు డీజీపీ కార్యాలయం దృష్టికి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీఓ కార్యాలయంలో ఇటీవల వరకు ఏజెంట్ల విధానం కొనసాగిన విషయం తెలిసిందే. లైసె న్స్‌లు, రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్, పత్రాల మార్పిడి వంటి వివిధ పనుల నిమిత్తం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే వాహనదారుల నుంచి ఏజెంట్లు అనధికార వసూళ్లకు తెగబడ్డారు. అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు, సిబ్బందితో కుమ్మక్కై వాహనదారులను నిలువు దోపిడీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించి అవినీతి బాగోతంపై ఓ సంఘం నేత పలు ఆధారాలతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఏజెంట్లు, ఆ సంఘం నేత మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. సదరు సంఘం నేతను అంతమొందించేందుకు ఏజెంట్లు ప్లాన్ వేసినట్లు బయటకు పొక్కడం వేడిపుట్టించింది. ఇదే సమయంలో తమను డబ్బులు డిమాండ్ చేసినట్లు సదరు సంఘం నేతపై ఏజెంట్లు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తనను, తనకుటుంబాన్ని అంతమొందించేందుకు ఏజెంట్లు ప్రయత్నించారని సంఘం నేత సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏజెంట్లపై సెక్షన్ 341, 506 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదయ్యాయి. సంఘం నేతపై సెక్షన్ 384 కింద కేసు నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు సంఘం నేత మంగళవారం హైదరాబాద్‌లో హోంమంత్రి మహమూద్ అలీని కలిసి ఫిర్యాదు చేశాడు. డీజీపీ కార్యాలయంలో సైతం ఫిర్యాదు చేశాడు. ఏజెంట్లు తప్పుడు ఆరోపణలు చేశారని.. ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించిన అవినీతిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. అయినా పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. తనపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారని.. ఏజెంట్లపై పిటీ కేసు మాత్రమే నమోదు చేశారని అందులో వివరిం చారు. వెంటనే సమగ్ర విచారణ చేపట్టి నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. మెదక్ ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించిన లొల్లి హోంమంత్రి పేషీ, డీజీపీ కార్యాలయానికి చేరడంతో ఏం జరుగుతుందనే అంశం జిల్లాలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. -
మహిళా అటెండర్ ఆత్మహత్య
అనంతపురం , కళ్యాణదుర్గం: ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న కవిత (24) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. తల్లి గౌరమ్మ తెలిపిన సమాచారం మేరకు.. కుటుంబ సభ్యులు నౌకరు పనిచేస్తూ చనిపోవడంతో పదో తరగతి చదువుకున్న కవితకు ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం లభించింది. ఈమె స్వస్థలం బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర. ఉద్యోగం రావడంతో కవిత తన తల్లితో కలిసి కళ్యాణదుర్గం పట్టణంలోని మారెంపల్లిలో నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి యథావిధిగానే ఇద్దరూ బయట గదిలో పడుకున్నారు. తల్లి గాఢ నిద్రలో ఉండగా కవిత లోపలి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని పైకప్పు కడ్డీకి చీరతో ఉరివేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో తల్లి లేచిచూడగా కుమార్తె పక్కన కనిపించలేదు. లోపలి గది తలుపులు మూసి ఉండటంతో గట్టిగా అరుచుకుంటూ బయటకు వచ్చింది. స్థానికులు వచ్చి లోపలికెళ్లి చూడగా కవిత ఉరికి వేలాడుతూ కనిపించింది. పెళ్లి సంబంధం కుదరకపోవడం, కడుపునొప్పితో బాధపడుతుండటంతో జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని కవిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ రవీంద్రలు మృతురాలి కుటుంబానికి ఆర్థికసాయం అందజేశారు. -
దరఖాస్తు చేయకుండానే డ్రైవింగ్ లైసెన్సులు..!
మథుర: అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. మరి అడగకుండానే.. అసలు దరఖాస్తు చేయకుండానే డ్రైవింగ్ లైసెన్స్ మంజూరుచేసేవాళ్లను ఏమంటారు? అదికూడా చనిపోయినవారికి!! ఉత్తరప్రదేశ్‌లో ఘనత వహించిన మథుర రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి కార్యాలయం చేసిన బిత్తిరిపని ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొన్నేళ్ల కిందట ఇదే మథుర ఆర్టీఏ.. పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ పేరు, ఫొటోతో డ్రైవింగ్ లైసెన్స్ జారీచేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. జైసింగ్‌పూర్‌లో నివసించిన ఛెత్రామ్ జాదన్ అనే వ్యక్తి 2017, జూన్9న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మొహల్లా మసాని ప్రాంతానికి చెందిన వీరేంద్ర అనే మరో వ్యక్తి 2017, నవంబర్26న లారీ ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, వీరిద్దరి పేర్లమీద మథుర అసిస్టెంట్ ఆర్టీఏ కార్యాలయం నుంచి డ్రైవింగ్ లైసెన్సులు జారీ అయ్యాయి. స్థానికంగా కలకలం రేపిన ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా మథుర ఏఆర్టీఏను ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, ఆ ఏఆర్టీఏ మాత్రం తప్పందా క్లర్క్‌దేనని వాదిస్తున్నాడు. చివరికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. -
వాహనం ఎక్కడో...రిజిస్ట్రేషన్ ఇక్కడే...
యానాం: ఆ శాఖలో అంతా ఇష్టారాజ్యం. ఉద్యోగుల ముసుగులో కొంతమంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆమ్యామ్యాలతో తతంగమంతా నడిపిస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తుంటారు. ఇష్టారాజ్యంగా లైసెన్సులు జారీ చేస్తుంటారు. వారి దగ్గరే సంబంధిత ఆఫీసు తాళం కూడా ఉండటంతో ఇక ప్రతిదీ వారిష్టమే. సంబంధిత శాఖ అధికారులు సిటిజన్ చార్టర్ పెట్టరు. ఫీజుల వివరాలు బహిర్గతం చేయరు. అన్నిటా గోప్యతే. దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే ఉద్యోగులు ఎదురు తిరిగి కొట్టేంత పని చేస్తున్నారంటే వారి బరితెగింపును అర్థం చేసుకోవచ్చు. అక్రమాలకు అడ్డాగా.. : పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కన్నా పుదుచ్చేరిలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్లు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో పలు ఇతర రాష్ట్రాల వాహనాలకు యానాంలో తప్పుడు చిరునామాలు, డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు పలు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఈ నెల 20న హర్యానాలో రూ.2.32 కోట్లతో కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారుకు ఇక్కడ తప్పుడు చిరునామాలు సృష్టించి రూ.1.22 లక్షలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో అయితే 14 శాతం చొప్పున రూ.7.28 లక్షలు అయ్యేది. ఇక్కడ అద్దెకు ఉంటున్నట్లు అడ్రస్సులు సృష్టించి, తదనంతరం ఎల్ఐసీ పాలసీ సంపాదించి, రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మార్చి 2న రేంజ్ రోవర్ చిన్న మోడల్ కారును గుంటూరులో కొనుగోలు చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే ప్రతి నెలా సుమారు 30 హర్యానాకు చెందిన బస్సులను యానాంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 18 హర్యానాకు చెందిన ఏసీ బస్సులకు రిజిస్ట్రేషన్లు జరిగాయంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 60 వేల జనాభాకు అన్ని బస్సులా? యానాం జనాభా కేవలం 60 వేలు. ఇక్కడ బస్సులు కొనుగోలు చేసేవారు చాలా తక్కువమంది ఉన్నా రిజిస్ట్రేషన్లు మాత్రం గణనీయంగానే జరుగుతున్నాయి. 2016 నుంచి ఇప్పటివరకూ ఇక్కడ 70 బస్సులకు రిజిస్ట్రేషన్లు చేశారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతున్న బస్సులేవీ యానాంలో ఉండడం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కనుసన్నల్లోనే.. యానాం రవాణా శాఖలో పని చేస్తున్న ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఇటీవల డ్రైవింగ్ స్కూల్‌ను తన తండ్రి పేరిట బదిలీ చేయించి, ఆ స్కూల్ లైసెన్సులను సహితం ఇష్టారాజ్యంగా ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్రైవింగ్ స్కూల్ నడుపుకునే ఆ వ్యక్తి, చాలా సంవత్సరాలపాటు ఆర్టీవో ఆఫీసుకు బ్రోకర్‌గా వ్యవహరించేవాడు. తదనంతరం మెల్లగా ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా రవాణా శాఖ కార్యాలయంలో తిష్ట వేసిననాటి నుంచీ అంతా తానై నడిపిస్తున్నాడు. ఇతడికి ఏళ్ల తరబడి బదిలీ లేకుండా అక్కడే ఉంటున్న ఒక యూడీసీ స్థాయి ఉద్యోగి సహకారం తోడవడంతో ఇక్కడి అక్రమాలకు అడ్డు లేకుండా పోతోందనే ఆరోపణలు వస్తున్నాయి. సదరు ఔట్సోర్సింగ్ ఉద్యోగి పని కేవలం సంబంధిత పత్రాలు ప్రింటింగ్ తీయడమే. కానీ ఇష్టానుసారం వసూళ్లు చేస్తూ, షాడో అధికారిగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక గది కేటాయించినప్పటికీ అతను ప్రధాన గదిలోనే ఉంటూ తతంగమంతా నడిపిస్తుంటాడు. టూ వీలర్ లైసెన్సుకు రూ.1015 తీసుకోవాల్సి ఉండగా రూ.1220 తీసుకుంటున్నాడు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1560గా నిర్ణయిస్తే రూ.2,100, ఆర్డినరీ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.9 వేలు ఉంటే రూ.12,500 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు... యానాం రీజినల్ ట్రాన్స్పోర్ట్ యూనిట్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీకి ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసా యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కోన వెంకటరత్నం, సుంకర స్వామినాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సుంకర కార్తీక్ తెలిపారు. అంతా సక్రమమే.. యానాం ఆర్టీవో కార్యాలయంలో అన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని ఆర్టీవో రవిచంద్రన్ చెప్పారు. దీనిపై ప్రశ్నించిన ‘సాక్షి’ విలేకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాగితాల కష్టాలు!
మణుగూరు : అతి పెద్ద వైశాల్యం గల భద్రాద్రి జిల్లాలో నూతన వాహనాల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కోసం పాట్లు పడాల్సి వస్తోంది. జిల్లాలో ప్రస్తుతం కొత్తగూడెం, భద్రాచలంలో మాత్రమే ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు, నంబర్ ప్లేట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం ఈ కార్యాలయాల్లో ఏదో ఒక చోటకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోని 23 మండలాల్లో నెలకు సుమారు 2 వేల వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. దీంతో పనుల్లో జాప్యంతో పడిగాపులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. రిజిస్ట్రేషన్లతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకునేవారు, గతంలో తీసుకున్నవి రెన్యూవల్ చేయించుకునే వారు.. ఇలా నిత్యం ఎంతోమంది వస్తుంటారు. వీటి ద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.30 లక్షల మేర ఆదాయం కూడా సమకూరుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, టాటా ఏస్‌లు, లారీలు, జీపులు, గూడ్స్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు 9 నుంచి 14 శాతం మేర పన్ను వసూలు చేస్తారు. ప్రయాణం.. ఆపై పడిగాపులు... జిల్లాలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, లారీలతో పాటు నాన్‌ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, మిషన్లు భారీస్థాయిలో కొనుగోళ్లు జరుగుతుంటాయి. నూతన వాహనం కొనుగోలు చేయడం ఒక ఎత్తయితే, ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించడం మరో ఎత్తుగా మారింది. ముఖ్యంగా పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల వారు కొత్తగూడెం లేదా భద్రాచలం వెళ్లాలంటే ప్రయాణం భారంగా మారుతోంది. కరకగూడెం, పినపాక, గుండాల, ఆళ్లపల్లి మండలాల వారికి మరీ ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఒకసారి వెళ్తే ఆన్లైన్ సమస్య ఏర్పడితే మరోసారి వెళ్లాల్సి ఉంటుంది. వస్తుంది. కరకగూడెం మండలం నుంచి భద్రాచలానికి సుమారు 75 కిలోమీటర్లు, ఆళ్లపల్లి నుంచి 40 కిలోమీటర్లు, గుండాల నుంచి 65 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇక అశ్వారావుపేట నుంచి కొత్తగూడేనికి 70, దమ్మపేట నుంచి 50 కిలోమీటర్లు వెళ్తేనే రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుంది. మణుగూరులో ఏర్పాటు చేయాలి... పినపాక నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మణుగూరులో ఆర్టీఏ కార్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పారిశ్రామిక ప్రాంతమైన మణుగూరులో ద్విచక్ర వాహనాల, ఆటోలు, కార్లు, ట్రాక్టర్ల వినియోగం ఎక్కువ. పినపాకలో బీటీపీఎస్, మణుగూరులో సింగరేణి గనులు, అశ్వాపురంలో హెవీవాటర్ ప్లాంట్, సారపాకలో ఐటీసీ పరిశ్రమలు ఉండడంతో రవాణాకు ఉపకరించే వాహనాలతో పాటు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం అధికంగా ఉండటంతో మూలంగా ట్రాక్టర్ల వంటివి కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణంలో భాగంగా ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, సింగరేణిలో గనుల విస్తరణతో భారీ యంత్రాల వినియోగం పెరుగుతోంది. వీటన్నింటి రిజిస్ట్రేషన్‌కు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మణుగూరులో రవాణా శాఖ యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
బస్సులు రెండు..నంబర్ ఒకటే
దొడ్డబళ్లాపురం: ఒకే రిజిస్ట్రేషన్ నెంబరుతో రెండు బస్సులు తిప్పుతున్న ఘరానా మోసం దొడ్డలో వెలుగు చూసిం ది. పోలీ సులు బుధవారం ఉదయం తనిఖీలు చేస్తుండగా కేఏ–16,ఈ3369 రిజిస్ట్రేషన్ సంఖ్యతో కూడిన బస్సులు ఆ వైపుగా వచ్చాయి. వాటిని పరిశీలించగా రెండు బస్సులకు ఒకే నంబర్ ఉండటాన్ని గుర్తించారు. డ్రైవర్లను ఆరా తీయగా బస్సులను దొడ్డబళ్లాపురం నుం,చి తుమకూరుకు తిప్పుతున్నట్లు తేలింది. వెంటనే ఆర్టీఓ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బస్సుల యజమాని హర్షిత్‌ను అరెస్టు చేశారు. -
ఆర్టీఏ కార్యాలయంలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆర్టీఏ కేంద్ర కార్యాలయం(పాతభవనం)లో బుధవారం మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. రెండురోజుల క్రితం కూడా స్వల్పంగా మంటలు రావడంతో హైదరాబాద్ జేటీసీ చాంబర్‌తోపాటు అన్ని గదులను ఖాళీ చేశారు. తాజాగా భవనం పైఅంతçస్తులోని రికార్డు రూంలో ఉదయం 9.30 గంటలకు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పేశారు. ఆరు ఫైరింజన్లతో మంటలార్పేందుకు గంటకుపైగా సమయం పట్టింది. రికార్డురూంలోని ఫైళ్లన్నీ దగ్ధమయ్యాయి. రెండు రోజుల క్రితమే అధికారులు, సిబ్బంది భవనాన్ని ఖాళీ చేయడంతో ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిజాం కాలం నాటి ఈ భవనంలో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని, ఏడాది క్రితమే సిబ్బందిని మరోచోటకు తరలించామని మంత్రి చెప్పారు. రికార్డ్‌రూంలో 40 ఏళ్లకుపైగా భద్రపరిచిన ఫైళ్లు దగ్ధమయ్యాయని, వాటివల్ల ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అన్నిరకాల ఫైళ్లను కంఫ్యూటర్లో భద్రపరిచినట్లు మంత్రి పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, ఇతర ఫైళ్లు చాలావరకు కాలిపోయాయన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే... విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. ప్రమాదంపై జేటీసీ రమేశ్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు మిగతాప్రాంతాల్లో ఆర్టీఏ కార్యాలయాలను పరిశీలించి నివేదిక అందజేస్తుందన్నారు. ఖైరతాబాద్‌లోని ఈ భవనం ఏ మాత్రం సురక్షితం కాదని రోడ్లు, భవనాల శాఖ 10 ఏళ్ల క్రితమే హెచ్చరించింది. భవనంలో కొన్నిచోట్ల పెచ్చులూడాయి. మరికొన్నిచోట్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. గత సంవత్సరం పైకప్పు నుంచి పెద్ద సిమెంట్ దిమ్మె విరిగిపడడంతో ఉద్యోగులు ఆ భవనాన్ని ఖాళీ చేశారు. వర్షాల కారణంగా ఏ సమయంలో కూలుతుందో తెలియని స్థితి నెలకొందని అధికారులు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో నిజాం నవాబు కూతురు నూర్జహాన్ కోసం నాలుగు ఎకరాల్లో ఈ భవనాన్ని కట్టించారు. స్వాతంత్య్రానంతరం ఈ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. -
లైసెన్స్ దందా!
దళారీల జోక్యానికి అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు బేఖాతరు అవుతున్నాయి. పేరుకు ఆన్లైన్ అన్న మాటే కానీ.. వ్యవహారం అంతా ఏజెంట్ల కనుసన్నల్లోనే సాగుతోంది. క్యూలో నిల్చొన్నా.. కొర్రీలతో కాలయాపన చేస్తుండటంతో ప్రజలు కూడా చేయి తడపక తప్పని పరిస్థితి. ఆన్లైన్ పుణ్యమా అని ‘వ్యాపారం’ తగ్గిపోయింది కాబోలు.. అధికారులు కూడా ‘మధ్యే’మార్గం ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. హిందూపురం ఆర్టీఓ కార్యాలయం వద్ద కనిపించిన దృశ్యాలే ఇందుకు సాక్ష్యాలు. హిందూపురం అర్బన్: ‘‘రవాణా శాఖ కార్యాలయాల్లో దళారీలకు ప్రవేశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో బయటి వ్యక్తుల ప్రమేయాన్ని సహించబోం. కార్యాలయాల్లోకి పనుల కోసం వచ్చే వారిని పరిశీలించి మరీ లోనికి అనుమతిస్తాం. ప్రజలకు సహాయం చేసేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తాం. దళారీల అక్రమాలపై నిఘాను పటిష్టం చేస్తాం.’’ – ఇదీ రవాణా శాఖ కమిషనర్ నిర్ణయం కొద్దిరోజుల పాటు ఈ ఆదేశాలు అమలయినా.. ఆ తర్వాత షరా మామూలే. ఆర్టీఓ కార్యాలయంలో దళారీలు లేనిదే పని జరగదనే విషయం అర్థమయ్యేందుకు ప్రజలు ఎన్నో రోజులు పట్టలేదు. చదువుకున్న వారైనా.. నిరక్షరాస్యులైనా మధ్యవర్తులను ఆశ్రయిస్తే తప్ప పని జరగని పరిస్థితి. ఈ నెల 11న హిందూపూర్‌కు చెందిన ప్రకాష్ కొత్త బండి రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నంబర్ కోసం.. రవాణా శాఖ కార్యాలయంలో నేరుగా వెళ్లి కలిశాడు. బిల్లులు.. పత్రాలు.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్.. ఇలా చాంతాడు నిబంధనలు చెప్పగా మూడు రోజుల పాటు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఫ్రెండ్ సలహా మేరకు ఏజెంట్‌ను కలిసి రూ.7,500 చేతిలో పెట్టడంతో ఇట్టే పనైపోయింది. అదేవిధంగా ఈనెల 5వ తేదీన చోళూరు గ్రామానికి చెందిన చరణ్ లెర్నింగ్ లైసెన్సు కోసం రూ.260 చలానా కట్టి, లైసెన్సు కోసం రూ.1200 మరో చలానా కట్టి ఆఫీసు సిబ్బంది చెప్పిన ఆధార్, దరఖాస్తు, ఫొటోలు అందజేసి ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యాడు. డిగ్రీ పూర్తిచేసిన ఇతను ఆన్లైన్ పరీక్ష పాస్ కాలేకపోయాడు. అతనితో పాటు పరీక్షకు హాజరైన పదవ తరగతి పాసైన బీడీ బంకు అబ్దుల్ పాసయ్యాడు. ఇతను దళారీకి రూ.5వేలు చెల్లించడంతో పని పూర్తయినట్లు తెలుసుకున్న ప్రకాష్.. తిరిగి ఆ ఏజెంట్‌ను కలిసి చలానాతో పాటు రూ.2వేలు సమర్పించుకోవడంతో ఎల్ఎల్ఆర్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. ఇలా.. ఆర్టీఓ కార్యాలయంలో ఎలాంటి పనైనా దళారీల ద్వారానే సాగుతోంది. ఏజెంట్ల దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కార్యాలయం పరిసరాల్లోని టీ బంకులు, జిరాక్సు షాపుల్లో ఏజెంట్లు పాగా వేసి పని కానిచ్చేస్తున్నారు. కార్యాలయం ప్రారంభానికి ముందు.. సాయంత్రం వేళల్లో ప్రయివేట్ వ్యక్తులు నేరుగా వెళ్లి పలు విభాగాల్లో చక్రం తిప్పుతుండటం గమనార్హం. దస్తూరి, ఇనిషియల్ కోడ్‌తో చేపట్టిన రిజిస్ట్రేషన్లు, ఇతరత్రాల లెక్కింపు రిజిస్ట్రేషన్, లైసెన్సు, నెంబర్ ఇలా ఏ పనికోసం వచ్చిన దరఖాస్తులనైనా చేతిరాత.. లేదంటే కోడ్ ఆధారంగా దందా సాగుతోంది. ఇలాంటి దరఖాస్తులకు ఎలాంటి అభ్యంతరాలు పెట్టడం లేదని.. నేరుగా వచ్చే దరఖాస్తుల విషయంలోనే కొర్రీలు వేస్తున్నట్లు తెలుస్తోంది. సవాలక్ష ప్రశ్నలతో విసిగించడం.. అవసరమైన కాగితాలన్నీ పూర్తిస్థాయిలో లేవని చెప్పి పంపుతుండటంతో దరఖాస్తుదారులు విధిలేని పరిస్థితుల్లో దళారీలను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తులు పూరించడం మొదలు.. క్యూలైన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా దళారీలు అన్ని పనులు సవ్యంగా చేసి పెడుతుండటంతో మధ్యవర్తులతోనే పని కానిచ్చేస్తున్నారు. జేబుకు చిల్లు పడుతుందనే విషయం తెలిసినా తప్పదన్నట్లు చేయి తడుపుతున్నారు. కనిపించని హెల్ప్‌డెస్క్ దళారీలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ఆర్టీఓ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ ప్రకటించినా.. హిందూపురంలో ఆ ఊసే కరువయింది. దరఖాస్తులు పూరించడం.. ఎలాంటి పత్రాలు సమర్పించాలి.. ఎక్కడ వీటిని అందజేయాలి? ఇతరత్రా సమస్యలకు ఇక్కడ సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. ఇక్కడి సెక్యూరిటీ గార్డులు కనీసం లోపలికి వెళ్లనివ్వకపోవడం చూస్తే దళారీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. మరో నాలుగు రోజుల్లో ఆర్టీఓ కార్యాలయం సొంత భవనంలోకి మారుతున్న నేపథ్యంలో అక్కడైనా దళారీల దందాకు అడ్డుకట్ట వేసి కమిషనర్ ఆదేశాలను పాటించాలని స్థానికులు కోరుతున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం కార్యాలయం వద్ద సాధ్యమైనంత వరకు దళారీలు, మ«ధ్యవర్తులను నియంత్రిస్తున్నాం. గతంతో పోలిస్తే.. నేను బా«ధ్యత తీసుకున్న తర్వాత చాలా వరకు తగ్గింది. వారి జోక్యాన్ని పూర్తిగా అడ్డుకుంటాం. ప్రయివేట్ బిల్డింగ్ కావడంతో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు కష్టమయింది. కొత్త కార్యాలయంలోకి వెళ్లాక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసి మరింత కఠినంగా వ్యవహరిస్తాం. – మల్లికార్జున, ఇన్చార్జి ఆర్టీఓ, హిందూపురం -
రవాణాశాఖలో దిద్దుబాటు చర్యలు
– అవినీతి ఆరోపణల నేపథ్యంలో నంబర్ ప్లేట్ల విభాగం మూసివేత అనంతపురం సెంట్రల్ : రోడ్డు రవాణాశాఖ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. రవాణా వ్యవస్థ మొత్తం ఆన్లైన్ అవుతున్నా అవినీతి ఆరోపణలు మాత్రం తగ్గలేదు. దీంతో అవినీతికి కళ్లెం వేసేందుకు పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏఎంవీఐ సంతకం ఫోర్జరీతో వాహనాలను విడుదల చేశారనే కారణంతో ఓ హోంగార్డును పోలీసు శాఖకు సరెండర్ చేశారు. దీంతో ఆ శాఖ ఉద్యోగుల్లో మొత్తం కలవరం మొదలైంది. తాజాగా కార్యాలయ ఆవరణలో నంబర్ ప్లేట్ల విభాగాన్ని బయటకు తరలించాలని నిర్ణయించారు. దీంతో గురువారం ఆ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. నిబంధనల ప్రకారం వాహన రిజిస్ట్రేషన్ తర్వాత నంబర్ ప్లేట్లను వాహనదారులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించే రిజిస్ట్రేషన్ ఫీజులోనే నంబర్ ప్లేట్స్ కూడా వాహనదారులు చెల్లించి ఉంటారు. ప్లేట్లు అమర్చేటప్పుడు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. రూ.50 నుంచి రూ.300 వరకూ వాహనం ఆధారంగా తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రైవేటు కంపెనీ దీని టెండర్‌ను దక్కించుకుంది. దీంతో ఆ అంశం మాది కాదు అనే భావన వ్యక్తం చేశారు. అయితే వాహనదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తుండటంతో కొంతమంది సమాచార హక్కు చట్టం ద్వారా రవాణాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నంబర్ ప్లేట్ల విభాగాన్ని బయటకు తరలించాలని నెలాఖరు వరకూ గడువు విధించారు. -
99 @ లక్షా 92 వేలు
అనంతపురం సెంట్రల్ : ఫ్యాన్సీ నంబర్లకు వాహనదారులు భారీగా పోటీ పడుతున్నారు. ఇటీవల 9999 నంబర్ రూ.1.61 లక్షలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం 99 నంబర్‌కు వాహనదారుల మధ్య పోటీ ఏర్పడింది. ఐదుగురు పోటీలో పాల్గొనగా ఓ వ్యక్తి రూ.1.92 లక్షలకు 99 నంబరు దక్కించుకున్నారు. ఫ్యాన్సీ నంబర్ రూపంలో రవాణా శాఖకు రూ.లక్షలు ఆదాయం సమకూరుతుండటం గమనార్హం. -
నిబంధనలు తూచ్!
* రాజధాని జిల్లాలో ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ * వీఐపీలు, రాజకీయ నేతలకు తక్కువ ధరకే కేటాయింపు * పోటీకి ఎవరూ రాకుండా బెదిరింపులకు దిగుతున్న వైనం * 9999 నంబర్‌ను రూ. 50 వేలకే దక్కించుకున్న తారకరత్న సాక్షి, గుంటూరు: అక్కడ సామాన్యులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయి... ఉన్నతాధికారులు, వీఐపీలు, రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రం నిబంధనలు అడ్డురావు. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ అధికంగా ఉంటున్న విషయం తెలిసిందే. గతంలో ఈ నంబర్లను లక్షల్లో వేలం ద్వారా దక్కించుకున్న దాఖలాలున్నాయి. ఫ్యాన్సీ నంబర్లకు వేలం లేకుండా అసలు ధరకే ఇవ్వాలంటూ ఆర్టీఏ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తుండడంతో అడ్డుచెప్పలేక మిన్నకుండిపోతున్నారు. గుంటూరు డీటీసీ కార్యాలయంతోపాటు నరసరావుపేటలోని ఆర్టీవో కార్యాలయం, తెనాలి, పిడుగురాళ్ల యూనిట్ కార్యాలయాల్లో మాత్రం ఫ్యాన్సీ నంబర్లు కేటాయిస్తారు. జిల్లాలో నూతన రాజధాని నిర్మాణం జరుగనున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీలు, ఉన్నతాధికారులు సైతం ఇక్కడే తమ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు మక్కువ చూపుతున్నారు. ఒక మోస్తరు ఫ్యాన్సీ నంబరుకు సైతం పోటీ అధికంగా ఉండడంతో లక్షలు వెచ్చించి వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. ఇది సామాన్యులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రతి నెంబరును ఆన్లైన్ ద్వారా‡ నిబంధనల ప్రకారం కేటాయిస్తామని చెబుతున్న ఆర్టీఏ అధికారులు పలుకుబడి ఉన్నవారికి మాత్రం నిబంధనలు పక్కన బెట్టి నిర్ణయించిన ధరకే కేటాయిస్తున్నారు. నిర్ణయించిన ధరకే ఫ్యాన్సీ నంబర్.. గుంటూరులో కొన్ని నెలలుగా పోటీ ఎక్కువగా ఉన్న ఫ్యాన్సీ నంబర్లు సైతం నిర్ణయించిన ధరకే పోతున్నాయి తప్ప, అధిక ధరలకు ఎవరూ తీసుకోవడం లేదు. ఖర్చుపెట్టేందుకు ఆసక్తికనబర్చడం లేదనుకుంటే పొరబడినట్లే. ఫ్యాన్సీ నంబర్ల మీద కన్నేసిన ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు, వారి బంధువులు తమ పలుకుబడి ఉపయోగించి ఎవరినీ పాటకు రాకుండా బెదిరిస్తూ నిర్ణయించిన ధరకే తమకు కావాల్సిన నంబరును దక్కించుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం జిల్లాకు చెందిన ఓ ఉన్నతస్థాయి అధికారి తన వాహనానికి ఫ్యాన్సీ నంబ రును కేటాయించాలంటూ ఆర్టీఏ అధికారులకు హుకుం జారీ చేయడంతోపాటు, తన కార్యాలయ పరిపాలన అధికారిని అక్కడ ఉంచి ఎవరూ పోటీకి రాకుండా చేసి తక్కువధరకు దక్కించుకున్నారు. నగరానికి చెందిన ఓ నాయకుడు సైతం ఫ్యాన్సీ నంబరును నిర్ణయించిన ధరకే దక్కించుకున్నాడు. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్లకు పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం రాకపోవడం చూస్తుంటే అధికారులు ఏస్థాయిలో నిబంధనలకు పాతర వేస్తున్నారో అర్ధమవుతోంది. రూ. 50 వేలకు.. ముఖ్యమంత్రి బంధువు, హీరో నందమూరి తారకరత్న తన వాహనానికి నరసరావుపేట ఆర్టీవో కార్యాలయంలో ఏపీ07 సీడబ్ల్యూ 9999 నంబరును కేవలం రూ. 50వేలకు దక్కించుకున్నారు. స్థాని కంగా నివాసం ఉండనప్పటికీ ఓ బ్యాంకులో ఖాతా తెరిచి, దాన్ని ఆర్టీవో కార్యాలయంలో అడ్రస్సు ప్రూఫ్‌గా చూపించి నంబరును దక్కించుకున్నారు. ఈ నంబరుకు మరికొందరు పోటీకి వచ్చినప్పటికీ అధికారులు నచ్చజెప్పి వారిని విరమించుకునేలా చేసినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కార్డు 15 రోజుల తరువాత పోసులో పంపుతారు. తారకరత్నకు మాత్రం నిమిషాల్లో కార్డు తయారు చేయించి చేతికిచ్చి పంపి ఆర్టీఏ అధికారులు తమ స్వామిభక్తి చాటుకున్నారు. -
20న వాహనాల వేలం
ప్రొద్దుటూరు క్రైం: ఈ నెల 20న ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో వాహనాల వేలం నిర్వహిస్తున్నట్లు ఆర్టీఓ అబ్దుల్‌రవూఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్యాక్స్‌కట్టకుండా, బకాయిలు చెల్లించకుండా పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 34 వాహనాలు ఉన్నాయని, వాటిలో లైట్ గూడ్స్ వాహనాలు 25, హెవీగూడ్స్ 1, మోటార్ క్యాబ్ 1, ఆటోలు 7 ఉన్నాయని చెప్పారు. వేలంలో పాల్గొనదలిచిన వారు అసిస్టెంట్ సెక్రటరి ఆర్టీఓ పేరు మీద రూ.5 వేలు డీడీ తీసి దరఖాస్తు ఫారంతో పాటు అందజేయాలన్నారు. ఇతర వివరాలకు కార్యాలయంలోని 9848528645 అనే ఏఓ ఫోన్ నెంబర్‌కు సంప్రదించాలని ఆర్టీఓ తెలిపారు. -
పైసలిస్తేనే పని
ఆర్టీఓలో వాహన పర్మిట్ల దందా జిల్లా దాటాలంటే చేయి తడపాల్సిందే చక్రం తిప్పుతున్న దళారులు రిజిస్ట్రేషన్‌కు వెళితే జేబుకు చిల్లే.. అధికారుల అండతోనే వ్యవహారం సాక్షి, హన్మకొండ : క్యాష్‌లెస్ సేవలంటూ ఆర్భాటంగా ప్రకటించినా.. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డబ్బు ముటజెప్పకుండా ఫైలు ముందుకు కదలడం లేదు. ఇతర జిల్లాల్లో వాహనం నడిపేందుకు అనుమతి (పర్మిట్) రావాలంటే తొలుత ఆర్టీఓ కార్యాలయంలో దళారుల చేయి తడపాల్సిందే. ఆర్టీఓ కార్యాలయం అడ్డాగా ప్రతీ పనికి ఓ ధర నిర్ణయించి వాహన యజమానులను నిలువుదోపిడీ చేస్తున్నారు. పర్మిట్ రాజాదే పెత్తనం.. బస్సులు, లారీలు తదితర భారీ వాహనాలు జిల్లా దాటి వెళ్లాలంటే తప్పనిసరిగా రవాణాశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. జిల్లాకు చెందిన లారీలు, బస్సులు, ట్రాలీలు నిత్యం ప్రయాణికులు, సరుకులు తీసుకుని ఇతర జిల్లాలకు వెళ్తుంటాయి. ఇందుకోసం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సంబంధిత దరఖాస్తు పత్రాలు నింపి, నిర్దేశిత రుసుము చెల్లిస్తే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. వరంగల్ ర వాణాశాఖ కార్యాలయంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ పర్మిట్ రాజాగా పేరొందిన దళారీ చెంతకు వెళ్లిన వాహన యజమానులకు సకాలంలో అనుమతులు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు నమ్ముకున్న వారిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. రిజిస్ట్రేషన్లకూ ఇబ్బందే.. నూతన వాహనాలకు జిల్లా రవాణాశాఖ కా ర్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే దళారులను కాదని నేరు గా దరఖాస్తు చేసుకుంటే పనులు కావడం లేదు. ముఖ్యంగా నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ మరీ ఇబ్బందిగా మారుతోంది. ఇక్కడ చక్రం తిప్పుతున్న పర్మిట్ రాజాను ఆశ్రయిస్తే పని అయిపోయినట్టే. అధికారుల అండదండలతోనే.. ఆర్నెళ్ల కిత్రం దళారులకు ప్రవేశం లేదని చెప్పిన కార్యాలయంలోనే అడుగడుగునా దళారులు విజృంభిస్తున్నారు. అయినా అధికా రులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వాహనాల రిజిషే్టష్రన్లు, పర్మిట్ల వ్యవహారం చూస్తు న్న దళారులు ఇతర దళారులపైనే పెత్తనం చెలాయిస్తున్నారు. వీరికి ఉన్నతాధికారులు అండదండలు ఉన్నాయనే ఆరోపణలు విని పిస్తున్నాయి. దళారులు తప్పుడు లెక్కలు చెప్పకుండా ఉండేందుకు రోజుకు ఎన్ని వాహనాలకు పర్మిట్ ఇచ్చారు, ఎన్ని వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయో చూసేందుకు అనధికారికంగా ఒకరు ఇక్కడ పని చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యక్తి అందించే లెక్కల ఆధారంగా అధికారులు, సిబ్బంది, దళారులు వాటాలు పంచుకుంటున్నారు. -
బోగస్ బీమా
వెలుగులోకి వచ్చిన నకిలీ వాహన ఇన్సూ్యరెన్స్ కుంభకోణం పోలీసు అదుపులో ప్రధాన సూత్రధారి ఆర్టీవో కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు నరసరావుపేట టౌన్ : పేటలో నకిలీల మకిలీ రోజురోజుకు పెరిగిపోతోంది. నేరాలను అదుపుచేసేందుకు ఎన్నో సాంకేతిక మార్గాలు అన్వేషిస్తున్నా నరసరావుపేట వ్యాపారులు వాటిని అధిగమించి తమ నకిలీ వ్యాపారాలు .. కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్నా మొన్నటి వరకు నూనె, పాలు, ఎరువులు, పురుగుమందుల్లో నకిలీలు హల్చల్ చేసిన వైనం విధితమే. ఇటీవల చోటుచేసుకొన్న మూడు కోట్ల వే బిల్లులు.. రూ.30 లక్షల మనియార్డర్ల కుంభకోణం మరువక ముందే తాజాగా నకిలీ బీమా పత్రాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లో కెళితే వాహన బీమాకు సంబంధించి ఓ వ్యక్తి సాంకేతిక పరంగా ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను సష్టించి అనేక మందికి విక్రయించాడు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీవో) కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకొని గత కొన్నేళ్ళుగా తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించాడు. ఆర్టీవో కార్యాలయం వద్ద ఉండే ఏజెంట్ల వద్ద వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని నకిలీ బీమా పత్రాలను వారికి అందిస్తున్నాడు. వేలల్లో నకిలీ బీమా పత్రాలు వాహనదారులకు ఇప్పటికే చేరాయి. యజమానులు తమ వాహనాలకు బీమా కట్టామని మురిసిపోయారేకానీ ఏ మేరకు మోసపోయరన్నది గ్రహించలేకపోవడంతో ఈ తంతు కొనసాగింది. బయట పడింది ఇలా.. నరసరావుపేట ఆర్టీవో కార్యాలయ ఏజెంట్ వద్ద విజయవాడకు చెందిన ఓ వ్యక్తి వాహనానికి సంబంధించి బీమా చేశాడు. ఇటీవల అధికారుల దాడుల్లో నకిలీ బీమాపత్రంగా దాన్ని గుర్తించారు. దీంతో కంగుతిన్న వాహన యజమాని విషయాన్ని ఏజెంట్‌కు తెలిపాడు. దీంతో ఏజెంట్ ఇచ్చిన సమాచారంతో నరసరావుపేట రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ బీమా కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన బరంపేట చాకిరాలమెట్టకు చెందిన శ్రీనివాస్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వేలల్లో బాధితులు.. లక్షల్లో మోసం.. కొన్నేళ్ళుగా నరసరావుపేట, గుంటూరు, పిడుగురాళ్ళ, ఆర్టీవో కార్యాలయాల వద్దకు వెళ్లి వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్‌లు చేస్తామని ఏజెంట్లతో ఒప్పందం కుదుర్చుకొని శ్రీనివాస్ తన కార్యకలాపాలను చక్కబెడుతున్నట్లు పోలీస్ విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అతను ఇచ్చిన సమాచారంతో బీమా పత్రాల తయారీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఓ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి లెటర్ ప్యాడ్లు, స్టాంపులు, పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి. విషయం కొంతమంది వాహనదారులకు తెలియటంతో లబోదిబో మంటున్నారు. ఇప్పటివరకు నరసరావుపేట పరిధిలో 400 వాహనాల వరకు నకిలీ ఇన్సూ్యరెన్స్‌లు చేసినట్లు ప్రాథమికంగా తేలింది. -
చెట్లతోనే కాలుష్య నివారణ సాధ్యం
హరితహారంలో పాల్గొనేందుకు పోటీ పడుతున్నారు ఆఫీసులో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాము రిజిస్ట్రేషన్‌కు అధికంగా వసూలు చేస్తే డీలర్లపై చర్యలు రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా తిమ్మాపూర్: చెట్లతోనే కాలుష్యాన్ని నివారించడం సాధ్యమవుతుందని, అందుకే విరివిగా మొక్కలు నాటి వాటిని కాపాడాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా కోరారు. తిమ్మాపూర్‌లోని ఆర్టీఏ ఆఫీసులో బోరుమోటార్‌ను గురువారం ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. హరితహారంలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటూ పోటీపడి మెుక్కలు నాటుతున్నారన్నారు. తమశాఖ ఆధ్వర్యంలో 15వేల వరకు మొక్కలు నాటుతున్నామని చెప్పారు. ఆఫీస్‌లు ఫారెస్టులుగా మారాలని సూచించారు. సీఎం ఆదేశించిన తర్వాత హరితహారంలో ప్రతీ డిపార్ట్మెంట్ పాల్గొంటుందని, కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉద్యోగులు పాల్గొంటున్నారని తెలిపారు. ఉత్సాహంగా నాటిన మరచిపోకుండా మొక్కలను కాపాడుకోవాలని, ఆరునెలలపాటు వాటిని శ్రద్ధగా చూడాలని సూచించారు. మొక్కల ఆవశ్యకతపై విద్యార్థులను ప్రశ్నిస్తూ మాట్లాడించారు. కార్యక్రమంలో జేటీసీ పాండురంగరావు, డీటీసీ వినోద్‌కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ ప్రేమలత, వైస్ ఎంపీపీ భూలక్ష్మి, సర్పంచ్ స్వరూప, ఎంవీఐలు కొండాల్‌రావు, శ్రీనివాస్, రమాకాంత్‌రెడ్డి, రవీందర్, వేణు, కిషన్‌రావు, ఏవోలు శ్రీనివాస్, మస్లియొద్దీన్, ఏఎంవీఐలు, ఉద్యోగులు, ఆల్ఫోర్స్, పారమిత, గౌతమీ ఈ టెక్నో పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరిస్తున్నాం.. రవాణాశాఖపరంగా ఆన్లైన్ విధానంలో సమస్యలు వస్తుంటే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని కమిషనర్ సుల్తానియా తెలిపారు. డీటీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్యాలయాల్లో ఉద్యోగులు తక్కువున్నా తమ చేతిలో ఏమీ లేదని, ఉన్న వారితో పనులు చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 45 మంది ఏఎంవీఐలు, 160 మంది కానిస్టేబుళ్ల నియామాకాలు జరుగుతున్నాయని చెప్పారు. జీరో రశీదు సమస్యలపై స్టడీ చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 2నుంచి దరఖాస్తులన్నీ ఆన్లైన్లోనే చేసుకోవాలని, ఈ–సేవా, ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందులోని సమస్యలను పరిష్కరించడానికి 15రోజుల గడువు తీసుకుని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి షోరూమ్‌ల్లో అధిక డబ్బులు వసూలు చేస్తే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు ఎంవీఐల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్లక్ష్యంతో పేరుతో తీసిన సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆఫీసులో కౌంటర్లను పరిశీలించి దరఖాస్తుదారులతో మాట్లాడారు. -
చేయి తడిపితే నేపని....!
ఆర్టీఓ కార్యాలయంలో ఆగని దందా అనంతపురం సెంట్రల్ : ఇతని పేరు నాగరాజు. పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామం. ఇటీవల ఐచర్ వాహనం(ఏపీ02 టీఏ 6789) కొనుగోలు చేశాడు. తనపేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆల్ ఇండియా పర్మిట్ అనుమతి కోసం ఈనెల 8న ఆర్టీఓ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. రూ. 2150 కట్టి అదే రోజు చలానా( నెంబర్ 5133396) తీశాడు. రెండ్రోజుల్లో అనుమతి వస్తుందని భావించి కర్ణాటక మార్కెట్‌కు పత్తి తీసుకుపోయేందుకు లోడ్ చేశాడు. ఇప్పటికి 20 రోజులు గడిచింది. అనుమతి ఇవ్వరాలేదు. విసిగి వేసారిన ఆయన బుధవారం ఆర్టీఓ కార్యాలయంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. వారు అది మా పని కాదు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ తేల్చిచెప్పారు. దీంతో నిరాశతో వెనుతిరిగాడు. 20 రోజుల నుంచి తిరుగుతున్నా పని కాలేదు. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనం నిలబడిపోయింది అని నాగరాజు వాపోయాడు. జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో నేరుగా ఎవరైనా పనులు చేసుకోవాలంటే నాగరాజుకు ఎదురైన పరిస్థితి తప్పదు. దళారీ వ్యవస్థను నిర్మూలించేశామని పైపైకి చెబుతున్నా... చాపకింద నీరులా దళారీ వ్యవస్థ కొనసాగుతోంది. ఏజెంట్లు- అధికారులు కుమ్మక్కు రవాణాశాఖలో ఏజెంట్ల వ్యవస్థ ఎప్పటి నుంచో వేళ్లూనుకొని పోయింది. ఒకప్పుడు 15 మందితో ప్రారంభమైన ఏజెంట్లు ప్రస్తుతం దాదాపు 75 మందికి పైగా ఉన్నారు. ఎలాంటి సాయం కావాలన్నా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించవచ్చు. కానీ హెల్ప్‌డెస్క్ అలంకార ప్రాయంగా మారింది. ఏజెంట్లలో సీనియర్లుగా చొప్పుకునే ముగ్గురు వ్యక్తులు నేటికీ ఆర్టీఓ కార్యాలయం వద్ద తిష్ట వేస్తున్నారు. ఓ జిరాక్స్ సెంటర్ కేంద్రంగా మంత్రాంగం నడుపుతున్నారు. అక్కడ ప్రత్యేకంగా కోడ్ భాషను ఏర్పాటు చేసుకున్నారు. కొందరు ఎంవీఐలతో ఒప్పందం కుదుర్చుకొని తమ దందాను కొనసాగిస్తున్నారు. డెరైక్ట్ వెళితే 20 రోజులైనా కాని పని... వీరిని కలిస్తే మాత్రం గంటలోనే అవుతుండటం విశేషం. మొత్తం లావాదేవీలన్నీ ఇక్కడి నుంచే నడిపిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
ప్రొద్దుటూరు ఆర్టీవో కార్యాలయం వద్ద కలెక్షన్ కింగ్ అవినీతిపై కరపత్రాలు వేసిందెవరూ.. దళారుల మధ్య విభేదాలే కారణమా? పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా.. పట్టించుకోని అధికారులు సాక్షి, కడప : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీవో కార్యాలయంలో అవినీతి పేరుతో వేసిన కరపత్రాల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మల్లేపల్లె బసిరెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రహస్యంగా సమాచారం తెప్పించుకున్నట్లు తెలిసింది. ప్రత్యేకంగా ఆర్టీవో కార్యాలయ ఆవరణలోనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల కార్యాలయం ఉండటం.. అలాగే కొంత మంది సిబ్బంది వ్యవహార శైలి వల్ల వసూళ్ల పర్వం సాగుతోందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇది కరెక్టు కాదని చెప్పే అధికారులు లేకపోవడంతో కొంత మంది సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడుస్తోంది. దీంతో వాహనదారులు పెద్ద ఎత్తున సొమ్ము ముట్టజెప్పాల్సి వస్తోంది. అయితే కరపత్రాల వ్యవహారంపై డీటీసీ బసిరెడ్డి తెప్పించుకున్న సమాచారం మేరకు స్థానికంగా ఉన్న ఒక డ్రైవింగ్ స్కూలుకు చెందిన వ్యక్తే ఇదంతా చేయిస్తున్నట్లు తెలియ వచ్చినట్లు భోగట్టా. కొంత మంది అధికారులపై ఎందుకు కరపత్రాలు వేయాల్సి వచ్చిందన్న ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది. కొంత మంది దళారులను అధికారులు ప్రోత్సహిస్తుండటం.. మరి కొంత మందిని దూరంగా పెడుతున్న నేపథ్యంలోనే కరపత్రాలు వేసినట్లు తెలుస్తోంది. అధికారులు సమావేశం పెట్టుకొని సిబ్బంది పని తీరును ప్రశ్నించడమో.. లేక ఏమి జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకుని ఉంటే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు. ఆర్టీవో కార్యాలయ గేటు బయటనే కొంత మంది దళారులు వాహనదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ‘లెసైన్స్ పరీక్ష పాస్ చేయిస్తాం.. ఆర్సీలు ఇప్పిస్తాం.. ఎఫ్‌సీలు తెప్పిస్తాం.. అధికారులను మ్యానేజ్ చేస్తాం’ అంటూ దళారులు వాహనదారులతో భారీగా వసూలు చేస్తున్నారు. ‘కరపత్రాల కలకలం’ పేరుతో సాక్షిలో ఇటీవల కథనం ప్రచురితం కావడంతో ఆర్టీవో రవూఫ్ దళారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. దీంతో రవూఫ్ పని నిమిత్తం బయటకు వెళ్లగానే.. సమయం చూసుకొని దళారులు లోపలికి వస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది క్లర్క్‌ల వద్ద అసిస్టెంట్ల రూపంలో ఉన్న దళారులు కూడా సాయంత్రం పూట లోపలికి వెళ్తున్నట్లు తెలియవచ్చింది. ఏదిఏమైనా దళారుల బెడదనుంచి వాహనదారులను రక్షించాలంటే అధికారులు సీరియస్‌గా తీసుకుంటే తప్ప న్యాయం జరగదని పలువురు పేర్కొంటున్నారు. కొన్నేళ్లుగా చక్రం తిప్పుతున్న దళారి ప్రొద్దుటూరు ఆర్టీవో కార్యాలయాన్ని వేదికగా చేసుకొని ఓ బ్రోకర్ కలెక్షన్ కింగ్‌గా మారాడు. అటు అధికారులకు పని చేసిపెట్టడంలో దిట్టగా మారడంతోపాటు.. కొంత మంది అధికారులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు భోగట్టా. ప్రస్తుతం ఎఫ్‌సీలు ఇప్పించడంతోపాటు ఇతర వ్యవహారాల్లో పెద్ద ఎత్తున తీసుకుంటున్న ఆర్ అక్షరంతో మొదలయ్యే పేరు గల బ్రోకర్ కావాల్సినంత స్థాయిలో దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆర్టీవో కార్యాలయ డ్రైవర్‌గా 30 ఏళ్ల క్రితం పని చేసిన ఇతను కొన్ని కారణాల వల్ల మానుకొని తర్వాత దళారి అవతారం ఎత్తాడు. ఇటీవలే కుమారుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఒక కారు గిఫ్టుగా ఇచ్చినట్లు బయట ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా అతని సతీమణి కూడా ఒక శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తోంది. ఇతను మాత్రం పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు పట్టణంలోని పలువురు ఏజెంట్ల నుంచి మొత్తాలు సేకరించి పనులు చేసిన అధికారుల పనులను చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్లుగా కార్యాలయ పరిసరాలను నమ్ముకొని జీవితం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. -
చంద్రబాబు రైతు ద్రోహి..!
► రైతు మహా ధర్నాలో...వైఎస్సార్ సీపీ నాయకులు ► సుజయ్ కృష్ణ రంగారావు... ► ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా... పార్వతీపురం: చంద్రబాబు రైతు ద్రోహి అని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌ఎస్‌ఆర్‌కే సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. సోమవారం పార్వతీపురంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో జరిగిన రైతు మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కూడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ తేడా చూపిస్తూ రైతులను అవస్థలకు గురి చేస్తున్నారన్నారు. పండగ సమీపిస్తున్న తరుణంలో కూడా రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పండిన పంటను సైతం అమ్ముకోలేని దౌర్భాగ్యంలో టీడీపీ పాలన సాగుతోందని మండిపడ్డారు. ఓవైపు వర్షం భయం, మరో వైపు అగ్గి భయాలతో పొలాలు, కళ్లాల్లో పంటను కాపలా కాయలేక మంచు, చలికి రైతన్నలు అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ రైతు పక్షపాతి టీడీపీ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అన్నదాతలకు అండగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అన్నారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని వైఎస్సార్ సీపీ ఎదిరించి పోరాడుతుందన్నారు. భవిష్యత్‌లో రైతుల పట్ల ప్రభుత్వం ఇదే పరిస్థితి కనబరిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జమ్మాన ప్రసన్నకుమార్‌తోపాటు ఆ పార్టీ నాయకులు ప్రసంగించారు. రైతు సంఘం, సీపీఎం, ఎస్ఎఫ్ఐ నాయకులు రెడ్డి శ్రీరామమూర్తి, బంటు దాసు తదితరులు సభా ప్రాంగణానికి వచ్చి ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా వారు వైఎస్సార్ సీపీ మహా ధర్నాకు మద్దతు తెలిపారు. అనంతరం తహశీల్దారు కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు వంగపండు ఉష, మజ్జి వెంకటేష్, గర్భాపు ఉదయభాను, బోను రామినాయుడు, సాలా హరిగోపాల్, పెనుమత్స సత్యనారాయణ రాజు, ఆర్వీఎస్ కుమార్, వలిరెడ్డి జగదీష్, గుర్రాజు, జొన్నాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం ఆర్టీవో కార్యాలయంపై ఏసీబీ దాడులు
-
అనంత ఆర్టీఓ లో అవినీతి బాగోతం
అనంతపురం: అనంతపురం ఆర్టీఓ కార్యాలయంలో అవినీతి బాగోతం బయటపడింది. ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నట్టు మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. స్ధానికంగా ఉండే ఆజాద్ అనే వ్యక్తి బైక్ ను అధికారులు సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన బైక్ ను ఆజాద్ కు తెలియకుండానే మరొకరికి విక్రయించారు. అనంతరం అదే బైక్ ను రవాణా శాఖ అధికారులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేశారు. అయితే విషయం తెలుసుకున్న బాధితుడు అధికారులకు సంప్రదించగా వారు స్పందించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆజాద్ ఆరోపిస్తున్నాడు. -
ఆర్టీఏ కార్యాలయంలో వెంకీ
ప్రముఖ సినీనటుడు వెంకటేష్ సోమవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. డ్రైవింగ్ లెసైన్సు రెన్యువల్ కోసం రావడంతో హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్, ఆర్టీఓలు దశరథం, జీపీఎన్ ప్రసాద్‌లు సాదరంగా ఆహ్వానించి డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేశారు. - సాక్షి,సిటీబ్యూరో -
టిఎస్07ఈకె 1111 ఫ్యాన్సీ నంబర్‌కు భారీ ధర
హైదరాబాద్ సిటీ (రాజేంద్రనగర్): ఉప్పర్‌పల్లి ఆర్టిఓ కార్యాలయంలో మంగళవారం టిఎస్07ఈకె1111 నంబర్‌కు భారీ ధర పలికింది. టెండర్ ద్వారా ఆర్డిపి వర్క్స్ స్టేషన్ ప్రైవేట్ లిమిటేడ్ సంస్థ 91700 రూపాయలకు ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను దక్కించుకుంది. టెండర్లను ఆర్టిఓ దుర్గదాస్ నిర్వహించి అత్యధిక ధర కోడ్ చెసిన వారికి అందజేశారు. ప్రస్తుతం ఉప్పర్‌పల్లి ఆర్టిఓ కార్యాలయంలో టీ07ఈకె సిరిస్ కొనసాగుతుంది. -
ప్రభుత్వం మొండిపట్టువీడాలి
ఒంగోలు సబర్బన్ : ప్రభుత్వం మొండిపట్టువీడి ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకోవాలని దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మీసేవ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం చేపట్టిన ఆందోళనను శనివారం రెండోరోజు కొనసాగించారు. జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముందుగా స్థానిక జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఆర్టీవో కార్యాలయం, నెల్లూరు బస్టాండ్ మీదుగా సంతపేటలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. డీఐజీ శ్రీనివాసరావుకు సమస్యపై వినతిపత్రం అందించారు. మీసేవ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తే తలెత్తే సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను ఆయన నివాసంలో కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించా రు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో దస్తావేజు లేఖ రుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు మోపర్తి హరిబాబు, జాయింట్ సెక్రటరీ గోపిశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస చక్రవర్తి, కార్యదర్శి ఆత్మకూరి చంద్రశేఖర్, కోశాధికారి గోగూలమూడి బ్రహ్మానందరావు, కార్యవర్గ సభ్యులు పెళ్లూరి మాలకొండ నరసింహారావు, మహంకాళి వీరబ్రహ్మాచారి, పాల్గొన్నారు. -
ల్యాండ్ రికార్డులను అప్డేట్ చేయండి : జేసీ
అమలాపురం : భూ సంబంధిత రికార్డులన్నింటినీ నవంబరు 30వ తేదీలోపు అప్డేట్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తహశీల్దారులను ఆదేశించారు. ల్యాండ్ రికార్డులపై అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం డివిజన్లోని అన్ని మండలాల తహశీల్దార్లతో జేసీ సమీక్షించారు. ల్యాండ్ రికార్డులన్నీ పక్కాగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా అప్డేట్ చేయాలన్నారు. వెబ్ ల్యాండ్ అడంగళ్‌లో తప్పిదాలకు తావులేకుండా సరిచూడాలని ఆదేశించారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూములకు సంబంధించిన మార్పులు ఉంటే తహశీల్దార్లు ప్రొసీడింగ్సతో ల్యాండ్ రికార్డులను డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. మరణించిన భూ యజమానుల స్థానే వారి వారసులు వెబ్ ల్యాండ్ రికార్డుల్లో నమోదయ్యేందుకు మీ-సేవా కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెబ్ ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలను సరిచేసుకునేందుకు రెక్టిఫికేషన్ మాడ్యూల్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఆర్డీఓ టీవీఎస్‌జీ కుమార్, డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు పాల్గొన్నారు. -
ఆర్టీవో కార్యాలయంపై ఏసీబీ దాడులు
ఖమ్మం క్రైం: అది నగరంలోని ఆర్టీవో కార్యాలయం... గురువారం సాయంత్రం 5 గంటలు కావస్తోంది.... సిబ్బంది తమ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది సిబ్బంది తమకు వచ్చిన కలెక్షన్లను లెక్కించుకుంటుండగా.. మరికొందరు కలెక్షన్లు ఇచ్చే ఏజెంట్ల రాకకోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో ఉరుములేని పిడుగులా మూడు వాహనాలు వచ్చి కార్యాలయం ఎదుట ఆగాయి. అందులోనుంచి దిగిన అధికారులు లోపలికి వచ్చి ‘ఎవరూ కదలవద్దు... మేము ఏసీబీ నుంచి వచ్చాము...’ అనడంతో సిబ్బంది గుండెలు గుభేలుమన్నాయి. ఎటూ తప్పించుకోవడానికి వీల్లేకుండా కార్యాలయం తలుపులు వేసి ఏసీబీ అధికారులు తమ పని ప్రారంభించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నుంచి వచ్చిన ఏసీబీ సిబ్బంది ఏకకాలంలో కార్యాలయంపై దాడులు చేశారు. కార్యాలయంలో ఇటీవలి కా లంలో అవినీతి బాగా పేరుకుపోయిం దని, ఏజెంట్ల ఇష్టారాజ్యం నడుస్తోం దనే ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ సాయిబాబా నేతృత్వంలో కార్యాలయ సిబ్బందికి అర్ధరాత్రి దాటేంతవరకూ ముచ్చెమటలు పోయించారు. దాడుల సమయంలో ఏజెంట్లు కార్యాలయ ఆవరణలోనే ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద అనధికారికంగా ఉన్న నగదుతోపాటు లెసైన్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలోని ప్రతి కౌంటర్‌ను తనిఖీ చేసి అందులో ఉన్న డబ్బు, రిజిస్ట్రేషన్ కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆర్టీవో మొహిమిన్ తన చాంబర్లోనే ఉండగా, దాడులు ముగిసేంతవరకూ బయటకు వెళ్లవద్దని ఏసీబీ అధికారులు చెప్పడంతో ఆయన అక్కడే ఉండిపోయారు. డీఎస్పీ సాయిబాబా ఆయన చాంబర్లో ఉన్న రిజిస్ట్రేషన్ కాగితాలను పరిశీలించి పలు విధాలుగా ప్రశ్నించారు. మొదట వాహనాల ఫిట్నెస్లు చూసే కేంద్రం వద్దకు రాగా... అప్పటికే ఇద్దరు ఎంవీఐలు, మరో ఇద్దరు అసిస్టెంట్ ఎంవీఐలు ఇంటికి వెళ్లిపోయారు. వారి సహాయకులు గదిలోనే ఉండగా, వారిని బయటకు వెళ్లకుండా తలుపులు వేసి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కాగితాలు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీవో కార్యాలయంలో ఏవోలతోపాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఏజెంట్లను కూడా ఎంతకాలం నుంచి ఈ ప్రాంతంలో పని చేస్తున్నారని ప్రశ్నించారు. దాడులు పూర్తయ్యేంతవరకు వారిని కూడా బయటకు వెళ్లవద్దని సూచించారు. రూ.1.46 లక్షలు స్వాధీనం... ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించిన దాడుల్లో ఏజెంట్ల నుంచి రూ.1.20,890తోపాటు కౌంటర్లలో అనధికారికంగా ఉన్న రూ.26 వేలు, రిజిస్ట్రేషన్ కాగితాలను స్వాధీన పరుచుకున్నట్లు డీఎస్పీ సాయిబాబా విలేకరులకు తెలిపారు. గోడ దూకి పారిపోయిన ఎంవీఐ ప్రైవేట్ అసిస్టెంట్ ఏసీబీ దాడులు నిర్వహిస్తుండగా.. ఫిట్నెస్ కేంద్రంలో ఉన్న ఒక ఎంవీఐ అసిస్టెంట్ జోషి ఏసీబీ అధికారుల కళ్లు కప్పి వారిని గదిలో ఉంచి బయటకు వచ్చి గడియ పెట్టి పరుగు లంకించుకుని ప్రహరీ దూకి పారిపోవడం సంచలనం కలిగించింది. తేరుకున్న సిబ్బంది వెంటనే బయటకు వచ్చి అతని వెంట పడి రోడ్లపై పరుగులు పెట్టారు. జోషి తప్పించుకుని పోవడంతో అతని కోసం ఏసీబీ సిబ్బంది వెదికారు. మూతపడిన ఏజెంట్ల దుకాణాలు... వాహనదారులతో రాత్రి 9 గంటల వరకు కిటకిటలాడే ఏజెంట్ల దుకాణాలు ఏసీబీ దాడులతో మూతపడ్డాయి. ఆరుగురు ఏజెంట్లను ఏసీబీ సిబ్బంది పట్టుకున్నారని తెలిసి మిగిలిన వారంతా షట్టర్లకు తాళాలు వేసి పారిపోయారు. ఏసీబీ దాడులతో వాహనాలను రిలీజ్ చేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొద్దిసేపు ఆర్టీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఉదయం ఎప్పుడో కార్యాలయానికి వచ్చామని, ఆర్టీవో సిబ్బంది తమతో జరిమానా కట్టించుకుని కూడా ఇప్పటి వరకు వాహనాలను రిలీజ్ చేయలేదని వారు విలేకరుల ముందు వాపోయారు. ఈ ఏసీబీ దాడులలో డీఎస్పీ సాయిబాబాతోపాటు సీఐలు వెంకటేశ్వర్లు, కొమరయ్య, రమణమూర్తి, సాంబయ్య, ఏఎస్ఐ ప్రభాకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రా... మజాకా
సాక్షి ప్రతినిధి, కడప: ట్రాన్సుపోర్టు శాఖలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కోరుకున్నంత అప్పగిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులిస్తున్నారు. ఆర్టీఓ అవసరం ఉన్నచోట పోస్టింగ్ ఇవ్వకపోగా డిప్యూటీ c ఉన్న చోటే అదనంగా ఆర్టీఓను నియమిస్తూ సరికొత్తగా ఆదేశించారు. ఇందుకు ఓఎమ్మెల్యే సంపూర్ణ సహకారం అందించారు. ఉన్న పోస్టులో ఎలాగైనా కొనసాగాలనే లక్ష్యంతో ఓ అధికారి లకారాలను సమర్పించుకుని పనిచక్కబెట్టుకున్నారు. జిల్లా కేంద్రమైన కడపలో డీటీసీ ప్రొద్దుటూరులో ఆర్టీఓ కార్యాలయం ఉన్నాయి. ప్రొద్దుటూరు ఆర్టీఓ ఆనందరాజు నవంబర్ 31న పదవీవిరమణ చేశారు. ఆస్థానంలో రవీంద్రకుమార్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులో ఆర్టీఓ పోస్టు కీలకం. ప్రొద్దుటూరుతోబాటు బద్వేల్, పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతాలు ఆర్టీఓ కార్యాలయ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ వార్షిక ఆదాయం రూ.6.5కోట్లు పైబడి ఉంది. అలాంటి కీలకమైన కార్యాలయంలో ఇన్‌ఛార్జి అధికారి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆస్థానాన్ని భర్తీ చేయాల్సిన యంత్రాంగం మిన్నకుండిపోతోంది. అందుకు కారణం రాజకీయ పైరవీలేనని పలువురు పేర్కొంటున్నారు. మనోడే కదిలించొద్దు.... ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జి ఆర్టీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రవీంద్రకుమార్‌ను తొలగించవద్దని రాజకీయ పైరవీలు ముమ్మరం అయినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతో బాటు, మరో ఎమ్మెల్యే సంబంధిత మంత్రిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇటీవలే అదనపు బాధ్యతలు తీసుకున్నారు,. ఎలాగైనా కదిలించవద్దు అంటూ అభ్యర్థించినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా కేంద్రంలోని డీటీసీ కార్యాలయంలో ఆర్టీఓ పోస్టును భర్తీ చేసినట్లు సమాచారం. ముందుగా ఖాళీ ఉన్న స్థానాన్ని భర్తీ చేయాలనే నిబంధనలు ఉన్నా ట్రాన్స్పోర్ట్ కమిషనరేట్ కార్యాలయం మంత్రి ఒత్తిడికి తలొగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అస్లాంబాష ఆర్టీఓగా కడపలో నే డు బాధ్యతలు చేపట్టనున్నారు. అనుకున్న లక్ష్యం నెరవేర్చుకునేందుకు, అధికార పార్టీ నేతల మద్దతు కూడగట్టడంలో ప్రొద్దుటూరు అధికారి సఫలం కావడంతో ఈ ఉత్తర్వులు వెలుబడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో అధికారపార్టీ నేతలకు లకారాలు సమర్పించుకున్నట్లు సమాచారం. -
లెర్నర్ లెసైన్స్ మరింత సులువు
ముంబై: ఆన్లైన్లోనే లెర్నింగ్ డ్రైవింగ్ లెసైన్స్‌కు దరఖాస్తు చేయడానికి రవాణాశాఖ ప్రారంభించిన కొత్త పథకాన్ని అనూహ్య స్పందన కనిపిస్తోంది. పథకం మొదలైన వారంలోపే ఏకంగా 25 వేల మంది ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) వెబ్‌సైట్‌ను సందర్శించారు. అంతేకాదు ఆన్లైన్లో లెర్నింగ్ లెసైన్స్ పొందేందుకు అంధేరీ ఆర్టీఓ కార్యాలయంలో అపాయింట్మెంట్ల కోసం 1,700 దరఖాస్తులు వచ్చాయి. తమ వెబ్సైట్లో ప్రతినిత్యం 350 స్లాట్లు దరఖాస్తుదారుల కోసం అందుబాటులో ఉంటాయని డీప్యూటీ ప్రాంతీయ రవాణా అధికారి భరత్ కలాస్కర్ తెలిపారు. ‘సోమవారం కోసం 325, మంగళవారం కోసం 350.. ఇలా మొత్తం 1,700 అప్పాయింటుమెంట్లు ఇచ్చాం. నిజంగా ఇది ఊహించని స్పందన. కొత్త విధానం గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు’ అని కలాస్కర్ వివరించారు. లెర్నర్ లెసైన్సు పొందడానికి ఆన్లైన్లో వివరాల నమోదు, అపాయింటుమెంట్లు తీసుకొనే కొత్త విధానాన్ని ఆర్టీఓ అధికారులు గత వారమే ప్రారంభించారు. ఇందులో పూర్తి పారదర్శకత ఉంటుందని, సులువుగా వినియోగించుకోవచ్చని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ వీఎన్ మోరే అన్నారు. వడాలా, తాడ్‌దేవ్, ఠాణే, వసై, వాషీ, కళ్యాణ్, పన్వేల్ ఆర్టీఓల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. దరఖాస్తుదారులు ఎక్కడ ఉన్నా లెర్నర్ లెసైన్సుకు దరఖాస్తు చేసుకోగలగడం ఈ విధానం ప్రత్యేకత. ఫలితంగా దళారుల ప్రమేయానికి అవకాశం ఉండదు. దరఖాస్తు ఫారాలు నింపడానికి కూడా దళారులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నందున, వారి ప్రమేయానికి అడ్డుకట్ట వేస్తున్నామని ఆర్టీఓల అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి ఏ ఒక్కరిపైనా వివక్ష చూపించకుండా దరఖాస్తుదారులందరికీ డ్రైవింగ్ పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తామని మోరే అన్నారు. ఏజెంట్ల ద్వారా వచ్చేవారికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. వీటికితోడు అంధేరీ ఆర్టీఓ లెర్నర్ లెసైన్సును కేవలం పదే నిమిషాల్లో జారీ చేస్తోంది. అంతేకాదు డ్రైవింగ్టెస్టు నిర్వహణ కోసం అత్యాధునిక ట్రాక్‌ను నిర్మిస్తోంది. దీని చుట్టూ సీసీటీవీ కెమెరాలను బిగిస్తారు. ఆటోమేటెడ్ విధానంలో పరీక్షలు నిర్వహించడం వల్ల కంప్యూటరే దరఖాస్తుదారుడి డ్రైవింగ్ నైపుణ్యాలను పరీక్షించి నివేదిక ఇస్తుందని మోరే వివరించారు. డ్రైవర్లకు ఆరోగ్యశిబిరాలు వాషి: ప్రజారవాణా వాహనాల డ్రైవర్ల కోసం వాషి ఆర్టీఓ జనవరి 3-17 తేదీల్లో ‘పెహ్లే ఆప్’ పేరుతో రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈసారి ఆరోగ్య సంరక్షణపై డ్రైవర్లకు అవగాహన కలగించడంపైనా అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. రక్తపోటు, కంటిచూపు, శారీరక దృఢత్వం వంటి పరీక్షలు చేస్తారు. డ్రైవర్‌కు ఆరోగ్యవంతమైన శరీరం, కంటిచూపు అత్యవసరం కాబట్టి ఈ రెండింటిపై తాము దృష్టి సారిస్తామని వాషి డిప్యూటీ ఆర్టీఓ సంజయ్ ధయ్గుడె అన్నారు. వ్యసన రహిత జీవితం ప్రాధాన్యం, ఎయిడ్స్‌పై అవగాహన వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. భద్రత వారోత్సవం సందర్భంగా ట్రాఫిక్ అధికారుల బృందాలు కూడా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాయని వెల్లడించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ మాట్లాడినా, కార్లకు టింటెడ్ ఫిల్మ్‌లు అంటించినా భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు.