ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయండి ఇలా | How To Renew Driving License Online, Telangana, AP, in Telugu | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయండి ఇలా

Published Fri, Mar 5 2021 8:30 PM | Last Updated on Sat, Mar 6 2021 10:31 AM

How To Renew Driving License Online, Telangana, AP, in Telugu - Sakshi

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధార్-ప్రామాణీకరణ ఆధారిత కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించింది. ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడంతో సహా 18 సేవలను ఆన్‌లైన్‌ ద్వారా ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆధార్ ప్రామాణీకరణత గల కొన్ని సేవలు ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసిన దాదాపు 3 వారాల తర్వాత తీసుకోని రానున్నారు. ప్రస్తుతం పరివాహన్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పునరుద్ధరించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

దశ 1: పరివహన్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ పరివాహన్.గోవ్.ఇన్‌ లేదా మీ రాష్ట్ర సంబంధిత ఆర్టీఓ వెబ్‌సైట్ కు వెళ్లండి.
దశ 2: పోర్టల్‌లోని కనిపించే “ఆన్‌లైన్ సర్వీస్” విభాగంలో గల “డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు” ఎంచుకోండి.
దశ 3: ఇప్పుడు క్రొత్త విండో ఓపెన్ అవుతుంది, అక్కడ మీ రాష్ట్ర పేరును ఎంచుకోవాలి.   
దశ 4: ఆపై డ్రైవింగ్ లైసెన్స్ ‌రెన్యువల్ సేవలను ఎంచుకోండి.
దశ 5: ఇప్పుడు, మీ దరఖాస్తు ఫారమ్‌ను ఎలా పూరించాలో మీకు సూచనలు వస్తాయి. వాటిని పూర్తిగా చదివిన తర్వాత 'కొనసాగింపు'పై క్లిక్ చేయండి.
దశ 6: మీ పుట్టిన తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పిన్‌కోడ్, ఇతర వివరాలు దగ్గర పెట్టుకోండి
దశ 7: ఇప్పుడు మీ వ్యక్తిగత లేదా వాహన సంబంధిత వివరాలను నింపండి.
దశ 8: తర్వాత మీ ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.   
దశ 9: మీరు ఈ ప్రక్రియ పూర్తీ చేశాక మీరు మీ అప్లికేషన్ ఐడిని చూడగలిగే రసీదు పేజీ కనిపిస్తుంది. అలాగే, మీకు అన్ని వివరాలతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. 
దశ 10: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఛార్జీని ఆన్‌లైన్‌ ద్వారా లేదా కార్యాలయానికి వెళ్లి చెల్లించవచ్చు.

చదవండి:

వాహనదారులకు కేంద్రం శుభవార్త!

మొబైల్ టారిప్‌లు పెరుగనున్నాయా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement