Renewals
-
అమెరికాలోనే హెచ్–1బీ వీసాల రెన్యూవల్
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులకు అమెరికా స్టేట్ ఫర్ వీసా సరీ్వసెస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ జూలీ స్టఫ్ట్ శుభవార్త చెప్పారు. హెచ్–1బీ వీసాల రెన్యూవల్ (స్టాంపింగ్) కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని, అమెరికాలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. డిసెంబర్ నుంచి మూడు నెలలపాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కొన్ని కేటగిరీల్లో హెచ్–1బీ వీసాలకు డొమెస్టిక్ రెన్యూవల్ ప్రక్రియ డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో భారత ఐటీ నిపుణులు హెచ్–1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తాజా నిర్ణయంతో వీరికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వ్యయ ప్రయాసలు తప్పుతాయి. అయితే, తొలి దశలో 20,000 మందికే ఈ వెసులుబాటు కలి్పంచనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత దశల వారీగా మరికొంతమందికి అవకాశం కలి్పస్తారు. డిసెంబర్ నుంచి మూడు నెలల్లోగా హెచ్–1బీ వీసా గడువు ముగిసేవారు వీసా రెన్యూవల్ (స్టాంపింగ్)ను అమెరికాలోనే చేసుకోవచ్చు. అమెరికా వీసాలకు భారత్‌లో భారీ డిమాండ్ ఉందని జూలీ స్టఫ్ట్ గుర్తుచేశారు. వీసా కోసం కొన్ని సందర్భాల్లో ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వస్తోందని చెప్పారు. భారతీయులకు సాధ్యమైనంత త్వరగా వీసా అపాయింట్మెంట్లు ఇవ్వాలని భావిస్తున్నామని వివరించారు. ఇందులో ఒక మార్గంగా డొమెస్టిక్ వీసా రెన్యూవల్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. దీనివల్ల భారతీయ టెకీలకు లబ్ధి కలుగుతుందన్నారు మనవారికి 1.4 లక్షల వీసాలు 2022లో భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో 1.4 లక్షలకుపైగా వీసాలు జారీ చేసినట్లు స్టఫ్ట్ వెల్లడించారు. అమెరికా వర్సిటీల్లో తరగతుల ప్రారంభానికి ముందే భారత్‌లో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేయడానికి సిబ్బంది కొన్నిసార్లు వారమంతా పనిచేస్తున్నారని తెలిపారు. -
హెచ్–1బీ, ఎల్1 రెన్యువల్ ఇక అమెరికాలోనే
వాషింగ్టన్: ‘డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్’ ప్రక్రియను పునఃప్రారంభించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, ప్రధానంగా భారతీయులకు ఎక్కువ మేలు జరుగనుంది. హెచ్–1బీ, ఎల్1 వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల గడువు ముగిస్తే స్వదేశానికి తిరిగి వెళ్లి, రెన్యువల్ చేసుకోవాల్సిన పని ఉండదు. అమెరికాలోనే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. 2004 వరకూ నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల రెన్యువల్, ఎక్సటెన్షన్ స్టాంపింగ్‌ను అమెరికాలోనే చేసేవారు. తర్వాత ఈ విధానాన్ని రద్దుచేశారు. ఇప్పుడు పునరుద్ధరించబోతున్నారు. త్వరలోనే ఇది అమల్లోకి రాబోతోంది. -
పదేళ్ళకు ఎంఎస్‌వోల రిజిస్ట్రేషన్ రెన్యువల్
న్యూఢిల్లీ: శాటిలైట్ టీవీ ఎంఎస్‌వోల (మల్టీ–సిస్టం ఆపరేటర్లు) రిజిస్ట్రేషన్‌ను 10 ఏళ్ల వ్యవధికి రెన్యువల్ చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కేంద్రానికి సూచించింది. ఇందుకోసం ప్రాసెస్ ఫీజును రూ. 1 లక్షగా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. కేబుల్ టీవీ నెట్వర్క్స్ నిబంధనల్లో ఎంఎస్‌వోల రిజిస్ట్రేషన్ల రెన్యువల్ నిబంధనలు లేకపోవడంతో తగు సూచనలు చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కోరిన మీదట ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. రెన్యువల్‌కి దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరిగేలా చూడాలని, బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్ ద్వారా పత్రాలన్నీ డిజిటల్ విధానంలో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. అలాగే రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం పెండింగ్‌లో ఉన్న ఎంఎస్‌వోల జాబితాను, నిర్దిష్ట గడువులోగా దరఖాస్తు చేసుకోని వాటి లిస్టును పోర్టల్‌లో పొందుపర్చాలని సూచించింది. ఒకవేళ దరఖాస్తు పరిశీలనలో ఉన్నా, నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచినా తుది నిర్ణయం తీసుకునే వరకూ సదరు ఎంఎస్‌వోలకు పొడిగింపునివ్వాలని పే ర్కొంది. గడువు తేదీ ముగియడానికి ఏడు నుంచి రెండు నెలల ముందు వరకూ రెన్యువల్ కోసం దరఖాస్తులను స్వీకరించవచ్చని ట్రాయ్ సూచించింది. రెండు నెలల కన్నా తక్కువ సమయంలో దరఖాస్తు చేసుకుంటే జాప్యానికి చూపిన కారణాలను పరిశీలించి శాఖ తగు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. -
ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణ ఆఫర్
హైదరాబాద్: వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ మరో విడత కల్పించింది. కరోనాతో జీవిత బీమా కవరేజీకి ప్రాధాన్యం పెరిగిన క్రమంలో పాలసీదారుల ప్రయోజనాల కోణంలో ఎల్ఐసీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకు పాలసీ పునరుద్ధరణ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. లేట్ఫీజులో తగ్గింపును ఇస్తున్నట్టు తెలిపింది. వైద్య పరీక్షలకు సంబంధించి ఎటువంటి రాయితీలు ఉండవు. హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపైనా లేట్ ఫీజులో రాయితీ ఇస్తోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పాలసీదారులు చివరిగా ప్రీమియం కట్టిన తేదీ నుంచి ఐదేళ్లకు మించకుండా ఉంటే పునరుద్ధరించుకునేందుకు అర్హత ఉంటుంది. రూ.లక్ష వరకు బీమాతో కూడిన ప్లాన్ల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుంలో 20 శాతం (గరిష్టంగా రూ.2,000) తగ్గింపు పొందొచ్చు. రూ.1– 3 లక్షల మధ్య పాలసీలకు ఆలస్యపు రుసుంలో 25 శాతం (గరిష్టంగా రూ.2,500), రూ.3లక్షలకు పైన రిస్క్ కవర్‌తో కూడిన పాలసీలకు ఆలస్యపు రుసుంలో 30 శాతం (గరిష్టంగా రూ.3,000) తగ్గింపునిస్తోంది. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు అయితే ఆలస్యపు రుసుంలో పూర్తి రాయితీ ఇస్తోంది. అధిక రిస్క్ కవర్‌తో ఉంటే టర్మ్ ప్లాన ఆలస్యపు రుసుంలో తగ్గింపు ఉండదు. -
నెట్‌ఫ్లిక్స్ మరో ఆప్షన్.. పేమెంట్స్ ఇప్పుడు మరింత ఈజీ
Netflix UPI Payment: కస్టమర్లకు మరింత సుళువుగా మెరుగైన సేవలు అందివ్వడంలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ పేమెంట్ ఆప్షన్స్‌ని సరళతరం చేసింది. తేలికగా, వేగంగా అకౌంట్ రెన్యువల్ చేసుకునేలా కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. 50 లక్షల మంది చందాదారులు ఓవర్ ది టాప్ ఆధారంగా వీడియో కంటెంట్ అందించే నెట్‌ఫ్లిక్స్‌కి ఇండియాలో యాభై లక్షల మందికి పైగా చందాదారులు ఉన్నారు. వివిధ వర్గాల అవసరాలకు తగ్గట్టుగా పలు రకాల ప్లాన్స్‌ని నెట్‌ఫ్లిక్స్ అమలు చేస్తోంది. కనిష్టంగా నెలకు రూ. 200ల నుంచి గరిష్టంగా రూ. 799 వరకు వివిధ రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి,. అయితే కొత్త చందాదారులతో పాటు పాత సబ్స్క్రైబర్లు తమ ఖాతాను రెన్యువల్ చేసుకోవాలంటే క్రెడిట్, డెబిట్ కార్డుల ఆధారంగానే చేసుకోవాల్సి వచ్చేది. ఇటీవలే ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా పేమెంట్ ఆప్షన్స్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) పేమెంట్స్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ పేమెంట్స్ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి యూపీఐ పేమెంట్స్ పెరిగిపోయాయి. గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం తదితర యాప్‌లను ఉపయోగించి రోజువారి లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సంఖ్య పెరిగింది. టీ కొట్టు, పాన్ షాప్‌ల నుంచి బడా మాల్స్ వరకు యూపీఐ పేమెంట్స్ సాధారణ విషయంగా మారింది. అయితే నెట్‌ఫ్లిక్స్ మాత్రం యూపీఐ పేమెంట్స్‌కి ఇంతకాలం అవకాశం లేదు. తాజాగా యూపీఐ పేమెంట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తెచ్చింది. యాక్టివేట్ చేసుకోండిలా నెట్‌ఫ్లిక్స్ పేమెంట్స్‌ని యూపీఐ ద్వారా చేయాలంటే నెట్‌ఫ్లిక్స్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. - నెట్‌ఫ్లిక్స్ ఇండియా వెబ్‌పోర్టల్ లేదా యాప్‌ని ఓపెన్ చేసి అకౌంట్ సెక్షన్లోకి వెళ్లాలి - మేనేజ్ పేమెంట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి - చేంజ్ ది పేమెంట్ మెథడ్‌ని ఎంచుకోవాలి - అక్కడ యూపీఐ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. చదవండి : ఈ మొబైల్ రీఛార్జ్‌తో ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ హట్‌స్టార్ ఉచితం..! -
పాత ప్రభుత్వ వాహనాలకు రిజిస్ట్రేషన్ రెన్యువల్ నిలిపివేత
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో వినియోగిస్తున్న వాహనాలు 15 ఏళ్లకు మించి పాతబడిన పక్షంలో రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేయరాదని భావిస్తోంది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ఈ మేరకు ఒక ప్రతిపాదన రూపొందించింది. 2022 ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ శాఖలు పదిహేనేళ్లు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను రెన్యూ చేసుకోవడానికి ఉండదంటూ ఒక ట్వీట్లో పేర్కొంది. కొత్త నిబంధనల ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ, సంబంధిత వర్గాలు 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మునిసిపల్, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు మొదలైన వాటిల్లో ఉపయోగిస్తున్న వాహనాలకు ప్రతిపాదిత నిబంధనలను ప్రభుత్వం వర్తింప చేయనుంది. 20 ఏళ్లు పాతబడిన వ్యక్తిగత వాహనాలకు, 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుందంటూ 2021–22 బడ్జెట్లో కేంద్రం స్వచ్ఛంద స్క్రాపేజీ (తుక్కు) పాలసీని ప్రకటించిన నేపథ్యంలో తాజా ముసాయిదా నోటిఫికేషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయండి ఇలా
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధార్-ప్రామాణీకరణ ఆధారిత కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించింది. ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడంతో సహా 18 సేవలను ఆన్లైన్ ద్వారా ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆధార్ ప్రామాణీకరణత గల కొన్ని సేవలు ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసిన దాదాపు 3 వారాల తర్వాత తీసుకోని రానున్నారు. ప్రస్తుతం పరివాహన్ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పునరుద్ధరించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. దశ 1: పరివహన్ బోర్డు అధికారిక వెబ్సైట్ పరివాహన్.గోవ్.ఇన్ లేదా మీ రాష్ట్ర సంబంధిత ఆర్టీఓ వెబ్సైట్ కు వెళ్లండి. దశ 2: పోర్టల్‌లోని కనిపించే “ఆన్లైన్ సర్వీస్” విభాగంలో గల “డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు” ఎంచుకోండి. దశ 3: ఇప్పుడు క్రొత్త విండో ఓపెన్ అవుతుంది, అక్కడ మీ రాష్ట్ర పేరును ఎంచుకోవాలి. దశ 4: ఆపై డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ సేవలను ఎంచుకోండి. దశ 5: ఇప్పుడు, మీ దరఖాస్తు ఫారమ్‌ను ఎలా పూరించాలో మీకు సూచనలు వస్తాయి. వాటిని పూర్తిగా చదివిన తర్వాత 'కొనసాగింపు'పై క్లిక్ చేయండి. దశ 6: మీ పుట్టిన తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పిన్‌కోడ్, ఇతర వివరాలు దగ్గర పెట్టుకోండి దశ 7: ఇప్పుడు మీ వ్యక్తిగత లేదా వాహన సంబంధిత వివరాలను నింపండి. దశ 8: తర్వాత మీ ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేయండి. దశ 9: మీరు ఈ ప్రక్రియ పూర్తీ చేశాక మీరు మీ అప్లికేషన్ ఐడిని చూడగలిగే రసీదు పేజీ కనిపిస్తుంది. అలాగే, మీకు అన్ని వివరాలతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. దశ 10: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఛార్జీని ఆన్లైన్ ద్వారా లేదా కార్యాలయానికి వెళ్లి చెల్లించవచ్చు. చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! మొబైల్ టారిప్‌లు పెరుగనున్నాయా? -
ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణకు అవకాశం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలోనూ పాలసీదారులు తమ రిస్క్ కవర్‌ను కొనసాగించుకునేందుకు వీలుగా ఎల్ఐసీ మరోసారి పెద్ద మనసు చేసుకుంది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవచ్చంటూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. మార్చి 6 వరకు ఇది కొనసాగనుంది. కొన్ని షరతుల మేరకు పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన పాలసీలను మార్చి 6 వరకు పునరుద్ధరించుకోవచ్చు. పాలసీదారులు నిర్దేశిత గడువులోపు పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అవి ల్యాప్స్ (రద్దు) అవుతాయి. ఇలా ల్యాప్స్ అయిన పాలసీలను ఇప్పుడు పునరుద్ధరించుకోవడం ద్వారా బీమా కవరేజీ కొనసాగేలా చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎల్ఐసీకి చెందిన 1,526 శాటిలైట్ కార్యాలయాల నుంచి సైతం పాలసీదారులు తమ ల్యాప్స్డ్ పాలసీలను పునరుద్ధరించుకోవచ్చని ఎల్ఐసీ తెలిపింది. ప్రీమియం చెల్లించని ఏడాది నుంచి గరిష్టంగా ఐదేళ్లలోపు ల్యాప్స్ అయిన వాటికి ఈ అవకాశం ఉంటుందని ఎల్ఐసీ స్పష్టం చేసింది. కోవిడ్–19 ప్రశ్నావళికితోడు, తమ ఆరోగ్య స్థితి మంచిగానే ఉందన్న స్వీయ ధ్రువీకరణ తీసుకోవడం ద్వారా పాలసీలను పునరుద్ధరించనున్నట్టు తెలిపింది. ఆలస్యపు ఫీజులో 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు.. లేదా పునరుద్ధరణకు రూ.2,000 చార్జీ తీసుకోనున్నట్టు పేర్కొంది. -
విమాన టికెట్లు క్రెడిట్ షెల్‌లోకి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ నెల 15 నుంచి పరిస్థితులను బట్టి దశల వారీగా విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిందే ఆలస్యం.. అన్ని దేశీయ విమానయాన కంపెనీలు టికెట్ల బుకింగ్స్‌ను ప్రారంభించేశాయి. కానీ, అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైతే మాత్రం లాక్‌డౌన్‌ను పొడిగిస్తామని కేంద్రం ప్రకటించింది. మరి, ఇలాంటి పరిస్థితుల్లో విమాన టికెట్లను బుకింగ్ చేసుకోవాలా? వద్దా? దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమానాలను, మార్చి 25 నుంచి దేశీయ విమాన సర్వీస్‌లను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. 3 వారాల లాక్డౌన్ తర్వాత విమాన సేవల పునరుద్ధ్దరణ నిర్ణయం ఎయిర్‌లైన్స్ కంపెనీలకు ఊరటనిచ్చే అంశమే. ఎవరైతే మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మధ్య టికెట్లను బుకింగ్ చేశారో ఆయా ప్యాసింజర్లకు ఉచిత రీషెడ్యూలింగ్ ఆప్షన్స్‌ను, కొన్ని కంపెనీలైతే ట్రావెల్ ఓచర్లను అందిస్తున్నాయి. ఆయా పీఎన్ఆర్ స్టేటస్ రద్దు కాకుండా కస్టమర్లు ఇతరత్రా తేదీల్లో వినియోగించుకునే వీలుంటుందని స్పైస్‌జెట్‌కు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం స్సైస్జెట్లో రోజుకు 600 విమానాలు తిరుగుతుంటాయి. ఇందులో 10 శాతం వాటా అంతర్జాతీయ విమానాలుంటాయి. నెలకు 50 వేల టికెట్లు బుకింగ్స్ ఉంటాయని ఆయన తెలిపారు. 15 నుంచి క్రెడిట్ షెల్‌లోకి.. ఇండిగో, స్పైస్‌జెట్ వంటి అన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఆయా వెబ్సైట్లలో టికెట్ల బుకింగ్ సమయంలో క్రెడిట్ షెల్ ఆప్షన్‌ను ఇస్తున్నాయి. ఇదేంటంటే.. ఒకవేళ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కాని పక్షంలో కేంద్రం లాక్‌డౌన్‌ను కంటిన్యూ చేస్తే.. మీరు బుకింగ్ చేసిన టికెట్ల తాలుకు నగదు మీ ఖాతాలో జమ కాదు. అది క్రెడిట్ షెల్ రూపంలో నిల్వ ఉంటుంది. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోపు అదే పాసింజర్ ఏ సమయంలోనైనా.. ఎప్పుడైనా వినియోగించుకునే వీలుంటుందన్నమాట. ఒకవేళ కస్టమరే టికెట్లను రద్దు చేసుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం రద్దు చార్జీలను భరించాల్సిందే. ఫిబ్రవరిలో 1.23 కోట్ల దేశీయ ప్రయాణికులు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో దేశీయ విమానాల్లో 1.27 కోట్ల మంది, ఫిబ్రవరిలో 1.23 కోట్ల మంది ప్రయాణికుల ప్రయాణించారు. గతేడాది జనవరిలో 1.25 కోట్లు.. ఫిబ్రవరిలో 1.13 కోట్లుగా ఉంది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో నెలవారీ ట్రాఫిక్ వృద్ధి రేటు 8.98 శాతంగా ఉంది. రద్దీ తాత్కాలికమే.. ఈ నెల 15 నుంచి ఒకవేళ దేశీయ విమానయాన సేవలు పునఃప్రారంభమైతే మాత్రం రద్దీ విపరీతంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే వివిధ నగరాల్లో చిక్కుకున్న ప్రజలు ఇళ్లకు చేరేందుకు ప్రయత్నిస్తారు. ఇది విమానయాన సంస్థలకు మూలధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో కంపెనీ ఉద్యోగుల సామూహిక లే ఆఫ్‌లు కొంత వరకు తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంఖ్య పెరుగుదల తాత్కాలికంగానే ఉంటుందని.. వైరస్ భయాల కారణంగా ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో చాలా వరకు ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు, వేతనాలను తగ్గించిన విషయం తెలిసిందే. -
త్వరలో హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసులు మరో 3 నెలల్లో అత్యంత భద్రతా ఫీచర్లున్న హై సెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు అందుకోనున్నారు. ఉన్నత విద్య, వైద్యం, పర్యాటకం, తాత్కాలిక నివాసం తదితర అవసరాల నిమిత్తం విదేశీ పర్యటనలు చేసేందుకు పాస్‌పోర్ట్‌లు తప్పనిసరి. దీంతో మహానగరం పరిధిలో నెలకు లక్షకు పైగా నూతన పాస్‌పోర్ట్‌ల జారీ, పాతవాటి రెన్యువల్స్ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో హైసెక్యూరిటీ గల ఈ–చిప్‌లు ఉండే పాస్‌పోర్ట్‌లను అందజేసేందుకు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ అనుమతితో దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ల డిమాండ్ అధికంగా ఉన్న నగరాలకు అత్యంత భద్రతా ఫీచర్లతో పాస్‌పోర్ట్‌లను ముద్రించే ప్రింటింగ్ యంత్రాలను సరఫరా చేయనున్నట్లు పాస్‌పోర్ట్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ యంత్రాలను నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఆధ్వర్యంలో నిపుణుల పర్యవేక్షణలో తయారు చేస్తున్నట్లు వివరించారు. మరో 3 నెలల తర్వాత నూతనంగా పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకున్నవారికి, పాతవాటిని రెన్యువల్ చేసుకునేవారికి ఈ–చిప్‌లు ఉన్న అత్యంత భద్రమైన పాస్‌పోర్ట్‌లను అందజేయనున్నారు. నో ట్యాంపరింగ్..: పాస్‌పోర్ట్‌లో అత్యంత కీలకమైన పుట్టినతేదీ, తండ్రి, భార్య, భర్త పేరు, ఆధార్ నంబర్, ప్రస్తుత, శాశ్వత చిరునామా వంటి వ్యక్తిగత వివరాలకు అత్యంత భద్రత కల్పించేందుకే ఈ హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు జారీ చేయాలని విదేశాంగ శాఖ సంకల్పించింది. ప్రస్తుతం జారీ చేస్తున్న 36 పేజీలు లేదా 60 పేజీల బుక్‌లెట్‌లా ఉండే హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లో అత్యంత నాణ్యత ఉండే కాగితాన్ని వినియోగించడంతోపాటు పేజీల్లో అంతర్లీనంగా ఈ–చిప్‌లను పొందుపరచనున్నారు. ఒకవేళ ఇతరుల ఫొటో పెట్టి ట్యాంపరింగ్‌కు ప్రయత్నిస్తే ఈ–చిప్‌ల ద్వారా పాస్‌పోర్ట్ కార్యాలయానికి సందేశం అందుతుందని పాస్‌పోర్ట్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. భద్రత పరంగా ఇవి అత్యంత సురక్షితమని తెలిపారు. ఇక ఈ–చిప్ ఉన్న పాస్‌పోర్ట్‌ల జారీకి ప్రస్తుతమున్న చార్జీలే వర్తిస్తాయని చెప్పారు. -
ప్రీమియం ఏడాదికే... కవరేజీ రెండేళ్లు!
హైదరాబాద్: ఎడెల్వీజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఓ వినూత్నమైన యాడ్ ఆన్ ఫీచర్ ‘హెల్త్ 241’ని ప్రవేశపెట్టింది. కంపెనీ నుంచి కొత్తగా వైద్య బీమా పాలసీ తీసుకునే వారు, ఈ యాడ్ ఆన్‌ను జోడించుకోవచ్చు. దీని వల్ల మొదటి ఏడాది పాలసీ కాల వ్యవధిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే మరుసటి ఏడాది రెన్యువల్‌కు ప్రీమియం చెల్లించక్కర్లేదు. రెండో ఏడాది పూర్తి ఉచితంగా వైద్య బీమా కవరేజీ లభిస్తుందని కంపెనీ తెలిపింది. దేశంలో ఈ తరహా సదుపాయాన్ని తీసుకొచ్చిన తొలి బీమా సంస్థ ఇదే. ‘‘మన దేశంలో బీమాను ఇప్పటికీ అదనపు వ్యయంగానే చూస్తున్నారు. యుక్త వయసులో ఉన్న వారు తాము ఆరోగ్యవంతులమని, క్లెయిమ్ అవసరం పడదు కనుక బీమా పాలసీ అక్కర్లేదనే భావనలో ఉన్నారు. ఈ తరహా కస్టమర్లకు హెల్త్ 241 యాడ్ ఆన్ విలువను అందిస్తుంది. మొదటి ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే, రెండో ఏడాది కూడా మాతోనే కొనసాగుతారు’’అని ఎడెల్వీజ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో అనూప్ తెలిపారు. ఇక రీస్టోరేషన్, క్లెయిమ్ లేకపోతే తదుపరి ఏడాది బీమా మొత్తాన్ని 100 శాతం వరకు పెంచుకునే ఆప్షన్లు కూడా ఉన్నాయి. -
ఆమ్ ఆద్మీకి మంగళం
ఒంగోలు సెంట్రల్ : ప్రభుత్వం వద్ద నిధులు లేవనే సాకుతో మహిళా గ్రూపులకు ఉపయోగకరమైన ఆమ్ఆద్మీ బీమాను నిలిపి వేసింది. ఈ పథకానికి సంబంధించి తక్షణం రెన్యూవల్స్‌ను నిలిపి వేయాలని డీఆర్డీఏ అధికారులకు మంగళవారం ఆదేశించింది. దీంతో ఈ పథకంలో సభ్యులుగా ఉన్న మొత్తం 1,70,735 మంది పరిస్థితి అయోమయంగా తయారైంది. వీరందరినీ రెన్యూవల్ చేయాల్సిందిగా గత నెలలో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటి వరకూ జిల్లాలో కేవలం 27,000 మందిని మాత్రమే రెన్యూవల్ చేశారు. మిగిలిన వారిని కుడా రెన్యూవల్ చేసే హడావుడిలో ఉండగా మంగళవారం ఈ ఉత్తర్వులు విడుదల కావడంతో నిలిపేశారు. 1,70,735 మందికి రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు కలిపి చెల్లించేది సంవత్సరానికి 5,12,20,500, అయితే ప్రస్తుతం రెన్యూవల్ అయిన 27,000 మంది లబ్ధిదారులకు 8,10,000 మాత్రము చెల్లిస్తే సరిపోతుంది. మిగతా సభ్యులకు సాయం అర్ధంతరంగా ఆపేయడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఆమ్ ఆద్మీ పథకం ప్రయోజనం ఇలా... తెల్ల కార్డుదారులు, భూమిలేని వ్యవసాయదారులు ఈ పథకం కింద అర్హులు. రూ.15 సర్వీసు చార్జీలు కింద చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.150, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.150 చెల్లిస్తారు. లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలు, శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.75 వేలు, పాక్షిక వైకల్యానికి రూ.37,500 సాధారణ మరణానికి రూ.30 వేలు బీమాగా చెల్లిస్తారు. ఒక కుటుంబంలో ఒక పాలసీ ఉంటే ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1200 చొప్పున ఉపకార వేతనాలను కుడా అందిస్తారు. సరాసరిన ఏటా జిల్లాలో 2000 మంది మరణిస్తుంటారు. వీరికి ఒక్కొక్కరికి కనీసంగా 30,000 వేలు చెల్లించినా సంవత్సరానికి రూ. 6 కోట్లు అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది. దాదాపు 20,000పైగా విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉపకార వేతనాలకుగానూ రెండున్నర కోట్లు ప్రతి సంవత్సరం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిధులన్నీ ఇక ముందు విడుదలయ్యే అవకాశం లేదు. -
కార్మికుల భద్రతే ధ్యేయం
పరిశ్రమల్లో కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, యంత్రాల పనితీరుపై ప్రత్యేక దృష్టిసారించినట్టు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ (పరిశ్రమల శాఖ)అధికారి కె. రాంబాబు తెలిపారు. పరిశ్రమల యూజమాన్యాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమ నిబంధనలు పాటించాల్సిందేనని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ⇒ సంక్షేమం, యంత్రాల పనితీరుపైనే దృష్టి ⇒ పూర్తిస్థాయిలో జిల్లాలో రెన్యూవల్స్ ⇒ పరిశ్రమల యూజమాన్యాలు నిబంధనలు పాటించాల్సిందే ⇒ ‘సాక్షి’తో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాంబాబు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో ఇప్పటి వరకు 1238 ఫ్యాక్టరీలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వాటిలో విద్యుత్ సమస్య, నష్టాలు, కోర్టుల్లో లావాదేవీల కారణంగా 270 ఫ్యాక్టరీల్లో ఉత్తత్పి నిలిచిపోయింది. మిగిలిన 968 ఫ్యాక్టరీలకూ ఈ ఏడాది పూర్తిస్థాయిలో రెన్యూవల్స్ చేయించామని రాంబాబు తెలిపారు. కొత్తగా ఈ ఏడాది మరో 20 ఫ్యాక్టరీలకు లెసైన్సులు మంజూరు చే శామన్నారు. గతంలో సుమారు 280 ఫ్యాక్టరీలు రెన్యూవల్స్ లేకుండానే నడిచినట్టు తమ దృష్టికి వచ్చిందని, కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం, యంత్రాల పనితీరు పరిశీలించేందుకు యుద్ధ ప్రాతిపదికన పూర్తిస్థాయిలో రెన్యూవల్స్ చేయించామన్నారు. 31 పరిశ్రమలు మూతపడే దిశగా ఉన్నాయన్నారు. సిబ్బంది కష్టాలు తప్పడం లేదు జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల్లో కార్మికుల జీతాలు, వేతనాల అమలు తీరును పరిశీలించేందుకు కార్మికశాఖ చట్టాల్ని అమలు చేస్తుండగా అక్కడి కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. జిల్లా కార్యాలయంలో ఆరు పోస్టులుండగా వాటిలో రెండు పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. వాస్తవానికి వేల సంఖ్యలో ఉన్న పరిశ్రమల తీరును పరిశీలించేందుకు కనీసం పదిమంది సిబ్బంది ఉండాల్సిందేనని రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన వివిధ సమావేశాల్లో జిల్లా పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అలాగే పరిశ్రమల శాఖ నిబంధనల్ని సడలించేందుకు, కాంపౌండింగ్ ఫీజును పెంచే విషయంలో కూడా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వానికి చెల్లించే స్వల్ప ఫీజుల విషయంలో కూడా కొంతమంది కోర్టుల్ని ఆశ్రయిస్తున్నట్టు సమాచారముందన్నారు. అయితే తాము మాత్రం వివిధ పరిశ్రమల అధికారులు, యాజమానుల్ని చైతన్యవంతం చేస్తున్నామని, నిబంధనల్ని పాటించాల్సిందేనని హెచ్చరిస్తున్నట్టు రాంబాబు పేర్కొన్నారు. ఇవీ రిజిస్ట్రేషన్ల కమామిషు 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ సెక్షన్ 2 ఎం (1) ప్రకారం విద్యుత్ వినియోగిస్తూ పదిమంది కంటే ఎక్కువ సంఖ్యలో కార్మికులతో పనిచేయిస్తుంటే దానిని ఓ పరిశ్రమగా (మ్యాన్‌ఫ్యాక్చురింగ్ యూనిట్) గుర్తించొచ్చు. అదే విధంగా విద్యుత్ వినియోగం లేకుండా 20 అంత కంటే ఎక్కువ మందితో ఉత్పత్తి చేయిస్తుంటే సెక్షన్ 2 ఎం (2) ప్రకారం ఓ పరిశ్రమగా గుర్తించొచ్చు. అయితే జిల్లాలో చాలా చోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తూ పరిశ్రమలేర్పాటు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఇకపై స్పెషల్‌డ్రైవ్ ద్వారా పరిశ్రమల్ని గుర్తించేందుకు సిద్ధమయ్యామని రాంబాబు తెలిపారు. సెంట్రల్ యాక్ట్ ప్రకారం (స్పెషల్ యాక్టు కూడా) పోలీసుల సహాయం లేకుండానే ఏదైనా ఓ పరిశ్రమను తనిఖీ చేసేందుకు, నిబంధనలు ఉల్లంఘిచే వారిపై చర్యలు తీసుకునేందుకు తమకు అధికారం ఉందని స్పష్టం చేశారు. 1961 యాక్ట్ ప్రకారం మెటర్నిటీ బెనిఫిట్స్ కింద మహిళలకు సెలవుతో కూడిన వేతనం ఇప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 ప్రకారం సంస్థ యాజమాన్యం సరైన సమయానికి జీతాలివ్వకపోయినా కార్మికులు తమను సంప్రదించవచ్చని రాంబాబు కోరారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు యంత్ర సామగ్రి పెరిగిందని, సాంకేతిక పరిజ్ఞానం భారీగా అందుబాట్లోకి రావడంతో కార్మికుల సంఖ్య తగ్గిందని అభిప్రాయపడ్డారు. అయితే భద్రతను దృష్టిలో పెట్టుకుని సెక్షన్ 7 (ఏ, డీ) ప్రకారం నిబంధనలు పాటించాల్సి ఉందన్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పరిశ్రమల్లో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని స్పష్టం చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌లో కార్మికులు, యాజమాన్యాలు, సంస్థ ఉద్యోగులు తమ ఇబ్బందుల కోసం సంప్రదించవచ్చన్నారు. -
రండి బాబు రండి..
నెల్లూరు(విద్య) : జిల్లా విద్యాశాధికారి కార్యాలయంలో ఎనిమిది నెలలుగా ఎఫ్ఏసీ డీఈఓ పాలనలో ఫైళ్లు ఓ మోస్తారుగా నడిచాయి. కొత్తగా డీఈఓ రానుండడంతో చివరి రెండు రోజుల్లో రేట్లు ఫిక్స్ చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో ఫైళ్లు చకచక కదులుతున్నాయి. అటెండర్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ల వరకు పనులను యుద్ధ ప్రాతిపదికన చక్కబెడుతున్నారు. రెన్యువల్స్‌కు ఒక రేటు.. రికగ్నైజేషన్‌కు ఒక రేటును నిర్ణయించినట్లు తెలిసింది. రెన్యువల్స్ రేటులో అనుకున్న మొత్తం తగ్గితే రెన్యువల్ ఇచ్చే సంవత్సరాలు కూడా తగ్గిపోతున్నాయి. దీర్ఘకాలికంగా కదలని రెన్యువల్ ఫైల్స్ పచ్చనోట్ల గలగలతో పరుగులు తీస్తున్నాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో విధమైన వసూళ్లు జరుగుతుండడంతో డీఈఓ కార్యాలయం వద్ద సోమవారం చిన్నపాటి వాగ్వాదాలు కూడా చోటు చేసుకున్నాయి. 10 ఏళ్ల రెన్యువల్‌కు అనుకున్న మొత్తం వస్తేనే అమ్మగారు సంతకం పెడుతున్నారు. లేకపోతే తగ్గించేస్తున్నారని సిబ్బంది తెగేసి చెబుతున్నారు. ఉన్న రెండు రోజుల్లోనే పెండింగ్‌లో ఉన్న ప్రైవేటు స్కూళ్ల ఫైళ్లన్నిటినీ క్లియర్ చేసి అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఏడు నెలలుగా తిరిగినా కనబడని స్పందన ఈ రోజు కనబడుతుండడంతో ప్రైవేటు స్కూళ్ల యాజమానులు సైతం డబ్బును లెక్కచేయకుండా అడిగిన కాడికి ఇచ్చుకుని పని పూర్తి చేసుకోవాలని పరుగులు తీస్తున్నారు. స్టేషనరీ కొరత డీఈఓ కార్యాలయంలో స్టేషనరీ కొరత విపరీతంగా ఉంది. మెడికల్ బిల్లులు కోసం వచ్చే ఉపాధ్యాయులకు ప్రింటర్లు పనిచేయడం లేదు. క్యాట్రిచ్లు లేవు. అనే సమాధానాలు వస్తున్నాయి. ఉపాధ్యాయులు పదేపదే డీఈఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. స్టేషనరీకి మూడు నెలలకు రూ.45 వేలు వస్తుందని, అది ఏమాత్రం సరిపోవడంలేదని పేర్లు చెప్పడానికి ఇష్టపడని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రైవేటు పాఠశాలల ఫైళ్లను క్లియర్ చేయడంలో చొరవ చూపడంపై పెదవి విరుస్తున్నారు. 20న ఆర్జేడీ తనిఖీ...? ఎఫ్ఏసీ డీఈఓ ఎన్.ఉషా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి విద్యాశాఖలో జరిగిన అక్రమాలపై ఈ నెల 20న ఆర్జేడీ విచారణ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సెక్షన్లలో మార్పులు, సిబ్బందిపై అక్రమంగా వేటు వేయడం, ఇష్టమైన వాళ్లకి అనువైన సీట్లు ఇవ్వడం, స్థాయికి మించి అధికారాలను ఉపయోగించడం తదితర అంశాలపై సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో ఆర్జేడీ తనిఖీ చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది. రొటీన్ ఫైల్సే : ఉషా, ఇన్చార్జి డీఈఓ రొటీన్ ఫైల్సే క్లియర్ చేస్తున్నాం. పెండింగ్ ఫైల్స్ ఎక్కడివి. ఆర్జేడీ విచారణ విషయం కచ్చితమైన సమాచారం నాకు తెలియదు. సాంకేతిక నైపుణ్యంతో భవిష్యత్ కావలి: విద్యార్థులు సాంకేతిక కోర్సుల్లో నైపుణ్యం సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రీజినల్ ఇన్చార్జి కృష్ణన్ తెలిపారు. సోమవారం స్థానిక జేబీ డిగ్రీ కళాశాలలోని ఎస్ఆర్ శంకరన్ హాలులో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి నైపుణ్యంపై అవగాహన సదస్సును నిర్వహించారు. కృష్ణన్ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధి ఉన్న కోర్సులను ఎంచుకోవాలన్నారు. జేబీ డిగ్రీ కళాశాలో విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు కంప్యూటర్ కోర్సులు, ఎలక్ట్రికల్ వైరింగ్, రెఫ్రిజిరేటర్ మెకానిజమ్, హాస్పిటాలిటీ తదితర కోర్సులపై శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తమ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు చదువు పూర్తయిన వెంటనే ఉపాధి దొరకాలనే ఉద్దేశంతో ఈ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.ఆ సంస్థ ఉదయగిరి హబ్ ఇన్చార్జి పురుషోత్తం, కో-ఆర్డినేటర్ వేణుగోపాల్, జేబీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మేజర్ పాల్‌మనోహర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎందుకో ఈ అలక్ష్యం!
ఇచ్చేది గోరంత.. చూపించేది కొండంత అన్నట్లుంది జిల్లాలో వ్యవసాయ రుణాల పరి స్థితి. బ్యాంకర్లు కొత్తగా వ్యవసాయ రుణాలివ్వకున్నా.. లక్ష్యాన్ని చేరుకున్నట్లు చూపించే విషయంలో మాత్రం ముందంజలో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు తొలి అర్ధమాసాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ ప్రాపకం కోసం వారు ఎంత వరకు ఆరాట పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మాఫీ.. కిరికిరి * తక్కువ రుణాలిచ్చినా.. లక్ష్యం చేరినట్లు చూపిస్తున్న బ్యాంకర్లు * రెన్యువల్‌తో కలిపినా 60 శాతం మందికే రుణాలు * తొలి అర్ధ సంవత్సరంలో ఇదీ జిల్లాలో పరిస్థితి ఒంగోలు: రైతు రుణమాఫీ పేరిట అన్నదాతలు గందరగోళంలోకి నెట్టేసిన టీడీపీ ప్రభుత్వం.. ఈ విషయంలో మాఫీ భారం ఎంత తగ్గినా తగ్గినట్టేనని శతథా ప్రయత్నిస్తోంది. ఆర్బీఐ అంగీకరించకపోవడంతో రైతు సాధికారత కార్పొరేషన్ ఏర్పాటుచేసి తద్వారా మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మాఫీని ఎగ్గొట్టేందుకు పలు ఆంక్షలు విధించి రైతు కుటుంబాల్లో తీవ్రమైన సంక్షోభాన్నే తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న బ్యాంకర్లు ఈ ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని చేరుకునేందుకు సరికొత్త ప్లాన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆంక్షల చట్రంలో రైతన్నలు వ్యవసాయ రుణం కావాలని బ్యాంకర్ల వద్దకు వెళ్తే‘పొలం ఏ ఊళ్లో ఉందో అక్కడే రుణం తీసుకోవాల’ని ంటూ సరికొత్త ఆంక్షలు పెడుతున్నారు. ఇవన్నీ తిరగలేక రైతు కాస్తా ప్రైవేటు రుణాలపై ఆధారపడుతున్నాడు. అయినా బ్యాంకర్లు మాత్రం లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం రికార్డుల పరంగా ముందే ఉండడం గమన్హాం. కౌలు రైతులకు రుణాలు నిల్ సాధారణంగా ఈ ఆరు నెలల కాలంలో ఖరీఫ్ సాగే ప్రధానం. కానీ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అంచనాల ప్రకాారం సాగు మొత్తం 64 శాతం మాత్రమే. ఇందులో కౌలుదారులు 20శాతంు. వారికి రుణాలు ఇచ్చిన దాఖలాలే జిల్లాలో లేవు. మిగిలిన 44 శాతంలోనూ చాలామంది రైతులు రుణాల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. రుణం కడతారా.. బంగారం వేలం వేయమంటారా అంటూ బ్యాంకర్లు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. తాము వ్యవసాయ రుణాలిస్తున్నామని చెబుతున్నా.. వాస్తవానికి వ్యవసాయానికి బంగారు ఆభరణాలపై ఇవ్వడాన్ని నిలిపివేశారు. కొత్తగా పట్టుమని 15 శాతం మందికి కూడా రుణాలిచ్చిన దాఖలాలు లేవు. రెన్యువల్స్‌లో మతలబు! ఈ ఏడాది వ్యవసాయ రుణ లక్షాన్ని చేరుకునేందుకు బ్యాంకర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సాధారణంగా గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతు రుణాన్ని రెన్యువల్ చేసి పెద్ద మొత్తంలో రుణాలిచ్చినట్లు లెక్కలు చెప్పేవి. ఇప్పుడు వాణిజ్య, గ్రామీణ బ్యాంకులు కూడా అదే పంథా అనుసరించడం గమనార్హం. దాని ప్రకారం గతంలో రైతులు తీసుకున్న బంగారపు రుణాలను రద్దుచేసి, తాజాగా వాటికి రుణాలు ఇచ్చినట్లుగా బ్యాంకర్లు వారి ఖాతాలను రెన్యువల్ చేశారు. లేని పక్షంలో బంగారాన్ని వేలం వేస్తామంటూ హెచ్చరికలు చేస్తుండడంతో రైతులు వడ్డీ, అసలులో కొంతమొత్తం కట్టి తాత్కాలికంగా ఉపశమనం పొందగా... బ్యాంకర్లు మాత్రం ఈ ఏడాది ఖరీఫ్‌లో 74.67 శాతం ఖరీఫ్ రుణాలిచ్చినట్లు ప్రకటిస్తుండడం విశేషం.