Indra sena reddy
-
ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తా: ఇంద్రసేన్‌రెడ్డి
హైదరాబాద్: ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని నియోజకవర్గ బీజేపీ నేత బొల్లంపల్లి ఇంద్రసేన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తన తండ్రి జస్టిస్ బి.సుభాషిణ్‌రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా కొన్నేళ్లుగా పౌరులకు ఉచిత న్యాయసేవలు అందిస్తున్నాని అన్నారు. ఇప్పుడు అదే ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తానన్నారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి సమస్యలు వింటుంటే ఎంతో బాధేస్తుందన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ బస్తీల్లో పర్యటించినప్పుడు ప్రజలు తనకు ఘన స్వాగతం పలికారని వారి సమస్యలను తెలుసుకున్నాననిన్నారు. కలుషిత నీటి సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామన్నారు. వేళాపాళా లేకుండా నీరు వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్త పైప్‌లైన్ వేసి ప్రెషర్ పెంచితే సమస్య తగ్గుతుందని అధికారులకు సూచించామన్నారు. పింఛన్లు, రేషన్ కార్డుల కోసం జనం ఎదురు చూస్తున్నారన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు జతపరిచే ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందడం లేదన్నారు. -
ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఎందుకు ఎత్తేశారో..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర విధానాలకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తానంటున్న సీఎం కేసీఆర్ ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను ఎందుకు ఎత్తేశారో సమాధానం చెప్పాలని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. ఇది కేసీఆర్ ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా అని ప్రశ్నిం చారు. తనను అరెస్టు చేస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్తున్న ముఖ్యమంత్రి, బెదిరించింది ఎవరో కూడా చెప్పాలన్నారు. ఓటమి భయంతో ఉన్న కేసీఆర్ కేవ లం ప్రజల సానుభూతి కొల్లగొట్టేందుకు ఇలాంటి చవకబారు మాటలు చెబు తున్నారన్నారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేక రుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ బీజేపీని కేసీఆర్ తక్కువ చేసి కామెడీగా మాట్లాడుతున్నారని, కానీ త్రిపురలో వచ్చిన ఫలితం ఇక్కడా వస్తుందని, అప్పు డు ఏం చేస్తారని ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. దేశంలో కేసీఆర్ తన బలమెంతో బేరీజు వేసుకుని ఫ్రంట్‌లాంటి కామెంట్లు చేస్తే మంచిదన్నారు. చలో ప్రగతి భవన్ సందర్భంగా బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేయటాన్ని ఖండిస్తు న్నామన్నారు. కేసీఆర్ నిర్వహించుకున్న సొంత సర్వేల్లో టీఆర్ఎస్ దారుణ ఓటమి తథ్యమని తేలిందని, దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పలు నాటకాలను తెరపైకి తెస్తున్నారని ఇంద్రసేనారెడ్డి ఎద్దేవా చేశారు. -
టీఆర్ఎస్కు కమ్యూనిస్టుల గతే
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ కమిటీల పేరుతో బెంగాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం, పార్టీ నేతలు పబ్బం గడుపుకునేలా చేసి ప్రజల చేతిలో చావుదెబ్బ తిన్నట్టే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దెబ్బతినక తప్పదని బీజేపీ పేర్కొంది. పార్టీ కార్యకర్తల నిరుద్యోగ సమస్య తీరేలా రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టింది. ఇది ప్రజల ఆగ్రహానికి కారణంకాక తప్పదని ఆ పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన పార్టీ నేతలు ప్రకాశ్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సుభాష్, సుధాకరశర్మలతో కలసి విలేకరులతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రైతుల పేరుతో 20 వేలమందిని రంగంలోకి దింపి పార్టీ కార్యకర్తలకు మేలు చేసుకుందని, ఇప్పుడు రైతు సమన్వయ కమిటీ పేరుతో టీఆర్ఎస్ కార్యకర్తల లబ్ధికోసం కేసీఆర్ యత్నిస్తున్నారని, దీనివల్ల రైతులకు జరిగిన ఉపయోగం శూన్యమన్న విషయం ప్రజలు గుర్తిస్తారన్నారు. తన తప్పులు కనిపించకుండా కేంద్రంపై కేసీఆర్ నిందలు మోపుతున్నారని ఆరోపించారు. స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ధర నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వాలే ధాన్యాన్ని సేకరించాలని, అందులో నష్టం వస్తే 45 శాతం కేంద్రం భరిస్తుందంటూ నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించి ఇప్పుడు కేంద్రంపై నిందలు మోపటం ఏంటని ప్రశ్నించారు. ఆధార్ అనుసంధానంలో రాష్ట్రం ముందంజ: కేంద్రమంత్రి చౌదరి కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశవ్యాప్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో మార్పులు వచ్చాయని కేంద్రమంత్రి సీఆర్ చౌదరి పేర్కొన్నారు. కార్డులను ఆధార్‌తో అనుసంధానించటం సత్ఫలితాలిస్తోందని వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆధార్ అను సంధానం విషయంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని సీఆర్ చౌదరి తెలిపారు. -
కాంగ్రెస్ పాలనలోనే మత కలహాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలోనే మత కలహాలు జరిగాయని, వేల మంది దుర్మరణం చెందారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. బీజేపీ పాలనలో అలా జరగలేదని సోమవారం పేర్కొన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందంటూ బీజేపీపై పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ముస్లిం మహిళల హక్కుల గురించి, వారి ఆత్మాభిమానం గురించి మాట్లాడే పరిస్థితి ఉండటం శోచనీయమన్నారు. ఇది ఎవరి నిర్వాకం వల్ల జరిగిందో తెలుసుకోవాలని ప్రశ్నించారు. -
తెలుగుతల్లి ఎవరో తెలిసిందా?
సాక్షి, హైదరాబాద్: తెలుగుతల్లి ఎవరు, ఎవరికి పుట్టిన తెలుగుతల్లి అని ఉద్యమకాలంలో ప్రశ్నించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పుడా తెలుగుతల్లి ఎవరికి పుట్టిందో తెలిసిందా అని బీజేపీ జాతీయ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగుతల్లి అనేది ఆధిపత్యం కోసం కొందరు పుట్టించిన భావన అని, దీనిపై అవమానించే విధంగా మాట్లాడిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో పరోక్ష పద్ధతిని ప్రవేశపెట్టాలనే యోచన వెనుక టీఆర్ఎస్ రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. నిధుల్లేక నీరసపడిపోయిన స్థానిక సంస్థలను మరింత నిర్వీర్యం చేసేందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారన్నారు. అన్ని వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్న కేసీఆర్ దురాలోచన నుంచే సర్పంచును పరోక్షంగా ఎన్నుకోవాలనే చట్టం తెచ్చారని ఆరోపించారు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అంటూ ఎన్నికలప్పుడు చెప్పారని, ఇప్పుడేమో ప్రైవేట్ కాలేజీల ద్వారా భారీగా ఫీజులను వసూలు చేయిస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లను కూడా యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయని, దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. విద్యార్థుల నుంచి ప్రైవేట్ కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజుల్లో కేసీఆర్‌కు కూడా వాటా వెళుతోందని ఆరోపించారు. -
ప్రశ్నిస్తే సస్పెన్షన్లు.. అందుకే కోర్టుకు: ఇంద్రసేనా రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు మూడు వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి తెలిపారు. రైతుల కోసం ఒక కమిషన్ వేసి అది ఇచ్చిన నివేదికను తుచా తప్పకుండా పాటిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పిందన్నారు. చట్టం తెచ్చి ఏడాదిన్నార అయినా కమిటీ వేయలేదని ఆయన విమర్శించారు. అందుకే బీజేపీ తరపున హైకోర్టులో పిల్ వేశానని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేస్తున్నారంటూ అందుకే వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారన్నారు. అసెంబ్లీని సీఎం సరిగా నడిపిస్తే కోర్టుకు ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. కమిటీ ఎందుకు వేయలేదో సీఎం సమాధానం చెప్పాలని నిలదీశారు. జీఎస్టీపై కేంద్రం నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను పంపడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జీఎస్టీ చట్ట సవరణకు అసెంబ్లీలో ఆ రోజు ఆమోదించి ఇప్పుడు జీఎస్టీతో రాష్ట్రానికి నష్టమని సీఎం అంటున్నారు. ఏ రకంగా నష్టం వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూస్తే నిధులను ఎలా పక్కదారి పట్టిస్తున్నావో చెప్పవలసి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేంద్రంపై నెట్టివేయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి కేటీఆర్‌కు నెల రోజుల తర్వాత బాధితులు గుర్తుకొచ్చినందుకు సంతోషమన్నారు. బాధితుల డిమాండ్ ప్రకారం ఎస్పీని సస్పెండ్ చేయాలని, బాధితులకు పరిహారం ప్రకటించి ఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
కేసీఆర్ చిలక పలుకలు పలికిస్తున్నారు
హైదరాబాద్‌సిటీ: మిర్చి రైతుల పరిస్థితికి సీఎం కేసీఆర్ అసమర్థతే కారణమని బీజీపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు సచివాలయం నుంచి అధికారికంగా మాట్లాడితే కేంద్రం నుంచి సరైన జవాబు వచ్చేదన్నారు. రాజకీయం చేయటం కోసమే పార్టీ కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడారని విమర్శించారు. మిర్చి కోసం రైతులు ఆందోళన చేస్తుంటే..కేంద్రం వెంటనే స్పందించిందని తెలిపారు. మంత్రి హరీష్ రావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, హరీష్ రావు ఎందుకు సచివాలయం లో మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజకీయంగా బీజేపీని తిట్టడానికి మాత్రమే పార్టీ కార్యాలయంలో హరీష్ రావు సమావేశం ఏర్పాటు చేశారని మండిడ్డారు. హరీష్ రావు మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ స్కీమ్ గురించి తెలుసుకోవాలని సూచించారు. మార్క్ ఫెడ్ నుంచి కొనటానికి ఎందుకు కష్టమవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ , హరీష్ రావుతో చిలుక పలుకులు పలికిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం వంకరగా మాట్లాడి రైతులను మోసం చేయవద్దని కోరారు. -
సీఎం కుమారుడే రెచ్చగొట్టే మాటలా?
కేటీఆర్ మాటలను ఖండించిన ఇంద్రసేనారెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రతినిధులే ప్రజలను రెచ్చగొట్టడం తీవ్రమైన చర్యగా భావించాలని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ ప్రజలతో మాట్లాడుతూ డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టాలని ఉద్భోదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్య మంత్రి కుమారుడే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎలా అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో విద్వేషాలను రెచ్చగొట్టడం తీవ్రమైన నేరమన్నారు. దాడి చేసిన వారి కంటే చేయమని చెప్పినవారే చట్టం దృష్టిలో మొదటి నేరస్థులని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. ప్రభుత్వ అవినీతిపై ఎవరు ప్రశ్నించినా అభివృద్ధికి అడ్డం వస్తున్నారని అధికారపార్టీ ఎదురుదాడి చేస్తున్న విషయం ప్రజలకు తెలుసన్నారు. కేంద్రం సబ్సిడీలతో ట్రాక్టర్లను అందిస్తే వాటిని టీఆర్ఎస్ కార్యకర్తలకు అందించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన తెలపాలని రాష్ట్ర ప్రజలకు బీజేపీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. -
బీజేపీ పోరు దీక్ష షురూ
వరంగల్ నగర ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నగరశాఖ చేపట్టిన 32 గంటల పోరు దీక్ష కార్పొరేషన్ కార్యాలయ సమీపంలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. రాత్రి దీక్ష శిబిరంలోనే నేతలు నిద్రించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి ఉదయం దీక్షను ప్రారంభించి మాట్లాడారు. వరంగల్ అర్బన్ : నగర సమస్యల పరిష్కారమే ఎజెండా గా బీజేపీ చేపట్టిన 32 గంటల పోరు దీక్ష సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ దీక్షలకు ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు హాజరయ్యారు. అభివృద్ధి పనులపై విచారణ జరిపించాలని, నగర పరిపాలన గాడి తప్పినందున అసమర్థ కమిషనర్‌ను సరెండర్ చేయాలని ఓ వైపు డిమాండ్ చేస్తూనే మరోవైపు ఆరు నెలల రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగట్టారు. కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని శంకర మఠం ఎదుట బీజేపీ నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్ అధ్యక్షతన చేపట్టిన ఈ పోరుదీక్షను ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. వరంగల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిపించాలి : బీజేపీ జాతీయ నేత ఇంద్రసేనారెడ్డి వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు వెంటనే ఎన్నికలు జరిపించాలని జరిపించాలని జాతీ య కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో కమిషనర్, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నా బల్దియా పరిపాలనను గాడిలో పెట్టలేకపోతున్నారని విమర్శించారు. పార్టీ మరో జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ బీజేపీ పేదల పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు. కమిషనర్ జైలుకే : మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్ రావు ఏడాది కాలంగా బల్దియాలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేస్తే కమిషనర్ సువర్ణ పండాదాస్ జైలుకు పోవడం ఖా యమని మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ని ర్లక్ష్యం చేస్తున్న అసమర్థ కమిషనర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసేంత వరకు ఆందోళనలు విరమించేది లేదన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ నగర సమస్యలపై బీజేపీ చేపట్టిన పోరు యాత్ర అంతం కాదని, ఆరంభమేనన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ మాట్లాడుతూ నగర పాలన చెత్తగా మారిందని విమర్శించారు. బీజేపీ నాయకుడు నరహరి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కోసం డివిజన్ క మిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీక్షలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, మం దాడి సత్యనారాయణరెడ్డి, వన్నాల శ్రీరాము లు, పోరుదీక్ష సమన్వయకర్త చాడ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. భూపాలపల్లి నగర పంచాయతీ వైస్ చైర్మన్ గణపతి, పరకాల నగర పంచాయతీ ైవె స్ చైర్మన్ మేఘనాథ్, బీజేపీ నాయకులు రాకేష్‌రెడ్డి, ఎరుకల రఘునారెడ్డి, బాకం హరిశంకర్, రావు అమరేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ సుధారాణి సంఘీభావం బీజేపీ చేపట్టిన పోరుదీక్షకు టీడీపీ నాయకురా లు, ఎంపీ గుండు సుధారాణి సంఘీభావం ప్రకటించారు. ఆమె వెంట టీడీపీ నాయకులు ఆకెన వెంకటేశ్వర్లు, పూర్ణచందర్ ఉన్నారు. వివిధ సంఘాలు, కాలనీ కమిటీల మద్దతు బీజేపీ పోరు దీక్షకు వివిధ సంఘాల నాయకులు, కాలనీ కమిటీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. రిటైర్డ ప్రొఫెసర్ వెంకటనారయణ, ఎమ్మార్పీఎస్ నాయకులు రామకృష్ణ, దామోదర్, ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధి వడికిచర్ల లక్ష్మణ్, రజక హక్కుల సాధన సమితి నాయకుడు కుమారస్వామి, ఏనుమాముల చిల్లర వర్తకుల సంఘం, జిల్లా లారీ ఓనర్స, డ్రైవర్స అసోసియేషన్ ప్రతినిధు లు, నందిహిల్స్, శాంతినగర్ కాలనీ కమిటీల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. -
కేసీఆర్ మాటల మాంత్రికుడు
ఖమ్మం: ఎన్నికల ముందు, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు మాయమాటలు చెప్పి కాలం వెళ్లబుచ్చుతున్నాడని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట మార్చి తానే సీఎం పీఠంపై కూర్చున్నారన్నారు. వ్యవసాయ రుణాల మాఫీలోనూ ఆంక్షలు పెడుతున్నారని తెలిపారు. విద్యుత్ లేక, పంటలు ఎండిపోయి, అప్పుల భారం మోయలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం అవహేళన చేస్తూ మాట్లాడటం దారుణమన్నారు. చివరకు తెలంగాణ అమరుల విషయంలోనూ పూటకో మాట మార్చుతున్నారని, ఉద్యమాన్ని కించపరుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రంపై ఆరోపణలు చేయడమే తప్ప కరెంట్ సమస్యను అధిగమించేందుకు చేసిన ప్రయత్నమేమీ లేదన్నారు. కృష్ణా నీటి వినియోగంపై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నించారు. పెన్షన్లు, తెల్లరేషన్‌కార్డుల్లో కోత పెడుతున్నారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లబ్ధి కోసం సీఎం కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ధర్మారావు, నాగపూరి రాజలింగం, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు!
పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేశారని నమోదైన కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. తన ప్రమేయం లేకుండానే దేనికైనారెఢీ చిత్రంలో నిర్మాత పద్మశ్రీని వాడుకున్నాడని మోహన్ బాబు ఇచ్చిన వివరణను కోర్టు తోసిపుచ్చింది. పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని హైకోర్టు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వదిలివేసింది. ఈ వ్యవహారాన్ని నాలుగు వారాల్లోగా రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖను కోర్టు ఆదేశించింది. పద్మశ్రీ అవార్డును దుర్వినియోగ పరిచారంటూ మోహన్ బాబుపై బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించి హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది.