సాక్షి, హైదరాబాద్: కేంద్ర విధానాలకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తానంటున్న సీఎం కేసీఆర్ ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను ఎందుకు ఎత్తేశారో సమాధానం చెప్పాలని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. ఇది కేసీఆర్ ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా అని ప్రశ్నిం చారు. తనను అరెస్టు చేస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్తున్న ముఖ్యమంత్రి, బెదిరించింది ఎవరో కూడా చెప్పాలన్నారు. ఓటమి భయంతో ఉన్న కేసీఆర్ కేవ లం ప్రజల సానుభూతి కొల్లగొట్టేందుకు ఇలాంటి చవకబారు మాటలు చెబు తున్నారన్నారు.
సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేక రుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ బీజేపీని కేసీఆర్ తక్కువ చేసి కామెడీగా మాట్లాడుతున్నారని, కానీ త్రిపురలో వచ్చిన ఫలితం ఇక్కడా వస్తుందని, అప్పు డు ఏం చేస్తారని ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. దేశంలో కేసీఆర్ తన బలమెంతో బేరీజు వేసుకుని ఫ్రంట్‌లాంటి కామెంట్లు చేస్తే మంచిదన్నారు. చలో ప్రగతి భవన్ సందర్భంగా బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేయటాన్ని ఖండిస్తు న్నామన్నారు. కేసీఆర్ నిర్వహించుకున్న సొంత సర్వేల్లో టీఆర్‌ఎస్ దారుణ ఓటమి తథ్యమని తేలిందని, దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పలు నాటకాలను తెరపైకి తెస్తున్నారని ఇంద్రసేనారెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment