మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు!
పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేశారని నమోదైన కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. తన ప్రమేయం లేకుండానే దేనికైనారెఢీ చిత్రంలో నిర్మాత పద్మశ్రీని వాడుకున్నాడని మోహన్ బాబు ఇచ్చిన వివరణను కోర్టు తోసిపుచ్చింది. పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని హైకోర్టు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వదిలివేసింది.
ఈ వ్యవహారాన్ని నాలుగు వారాల్లోగా రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖను కోర్టు ఆదేశించింది. పద్మశ్రీ అవార్డును దుర్వినియోగ పరిచారంటూ మోహన్ బాబుపై బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించి హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది.