ఏపీ న్యాయవాదులకు ఆత్మీయ వీడ్కోలు | AP Lawyers And Employes Are Voicate High Court | Sakshi
Sakshi News home page

ఏపీ న్యాయవాదులకు ఆత్మీయ వీడ్కోలు

Published Mon, Dec 31 2018 12:36 PM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

AP Lawyers And Employes Are Voicate High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తులు, లాయర్లు తరలివెళ్లిపోతుండటంతో ఉమ్మడి హైకోర్టు వద్ద వాతావరణం హడావిడిగా ఉంది. ఆంధ్రా ప్రాంతానికి వెళ్తున్న న్యాయమూర్తులకు తెలంగాణ లాయర్లు, న్యాయ సిబ్బంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జనవరి 1వ తేది నుంచి రెండు హైకోర్టులుగా విడిపోవడంతో ఒకవైపు హడావిడి మరోవైపు సహచర సిబ్బంది వెళ్లిపోతుండటంతో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఇన్నేళ్లు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని స్వీయచిత్రాలు తీసుకుంటూ ఆత్మీయ వీడ్కోలు పలుకుతున్నారు.

ఏపీకి సిబ్బందిని, లాయర్లను తరలించేందుకు అమరావతి నుంచి ప్రత్యేక బస్సులను పంపించారు. ఈరోజు సాయంత్రం ఏపీ చేరుకోనున్న న్యాయమూర్తులకు విజయవాడలోని ఓ హోటల్లో బస ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం అమరావతిలో ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్‌చే ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భవన నిర్మాణం పూర్తయ్యేవరకు హైకోర్టు విభజనను నిలిపివేయాలంటూ ఏపీ న్యాయవాదులు దాఖలుచేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారానికి లైక్‌ క్లియరైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement