
ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు,ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్‌లకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల సమయంలో మోహన్ బాబు ఆయన కుమారులతో కలిసి తిరుపతిలో ధర్నాకు దిగారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తిరుపతి పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణను నిలుపుదల చేయాలంటూ మోహన్‌బాబు ఇటీవలె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల పాటు విచారణను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment