![Senior Actor Mohan Babu Fires On Chandrababu Naidu On Twitter - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/4/chandra-babu.jpg.webp?itok=lbOzHVDd)
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సీనియర్ సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు మోహన్‌బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను క్రమశిక్షణలేని వ్యక్తి అని చంద్రబాబు నోట రావడం ఆశ్చరాన్ని కలిగించిదని అన్నారు. క్రమశిక్షణ, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే అని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విటర్ వేదికగా తన అసంతృప్తి వ్యక్తంచేశారు.
‘చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుంచి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నా మనసును గాయపరిచావు. అన్న ఎన్.టి.ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు, సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయచేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా!’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment