![Religious strife in Congress rule - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/2/indra.jpg.webp?itok=SDgSD-VZ)
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలోనే మత కలహాలు జరిగాయని, వేల మంది దుర్మరణం చెందారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. బీజేపీ పాలనలో అలా జరగలేదని సోమవారం పేర్కొన్నారు.
మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందంటూ బీజేపీపై పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ముస్లిం మహిళల హక్కుల గురించి, వారి ఆత్మాభిమానం గురించి మాట్లాడే పరిస్థితి ఉండటం శోచనీయమన్నారు. ఇది ఎవరి నిర్వాకం వల్ల జరిగిందో తెలుసుకోవాలని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment