Religious conflicts
-
ఏ దేవుడు చెప్తున్నాడు.. తన్నుకు చావండని?: మంత్రి కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. వీటిపైన చర్చించమంటే ముందుకురాని బీజేపీ నేతలు మతకల్లోలాలు ప్రేరేపించడానికి మాత్రం ఉవిళ్లూరుతున్నారని వ్యాఖ్యానించారు. పేద ప్రజలకు కనీస అవసరాలను కల్పించడంలో పోటీపడాలని మత ఘర్షణలు సృష్టించడంలో కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అర్థం కాని విషయం ఏంటంటే.. ఏ దేవుడు చెప్తున్నాడు తన్నుకు చావండని ఏ మతం దేవుడైనా చెప్పిండా? అని ప్రశ్నించారు. కృష్ణుడు చెప్పిండా? రాముడు చెప్పిండా? యేసుక్రీస్తు చెప్పిండా? అల్లా చెప్పిండా?. నా మనషులను పంపిస్తున్న భూమి మీదకు ఒకరికొకరు తన్నుకు చావండి.. ఎవరి దేవుడు గొప్ప అనే కాంపిటీషన్ పెట్టుకొని తన్నుకు చావండి అని చెప్పిండా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. చదవండి: (Munugodu Politics: మునుగోడు బరిలోకి వైఎస్సార్టీపీ!) -
బీజేపీ అంటేనే చిల్లర: మంత్రి కేటీఆర్
-
బంగ్లాదేశ్‌లో మత కలహాలు
ఢాకా/కోల్‌కతా: దుర్గాపూజల సందర్భంగా దైవదూషణకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌లో మొదలైన మత కలహాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి ఫెని పట్టణంలో హిందువులకు చెందిన ప్రార్థనా మందిరాలు, దుకాణాలపై దాడులు జరిగాయి. విగ్రహాల ధ్వంసం, దుకాణాల లూటీ వేకువజామున 4.30 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో కనీసం 40 మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం పారామిలటరీ బలగాలను రంగంలోకి దించింది. శనివారం దుండగులు మున్షిగంజ్‌లోని కాళీ మందిరంలోని ఆరు విగ్రహాలను ధ్వంసం చేశారని వార్తా సంస్థలు తెలిపాయి. దుర్గా మందిరాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చిట్టగాంగ్‌లోని బంగ్లాదేశ్ హిందు బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనియన్ ఈ నెల 23వ తేదీ నుంచి నిరశన దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. దాడులను నిరసిస్తూ ఢాకాలోని షాబాగ్, చిట్టగాంగ్‌లోని అందర్‌కిల్లాలో ప్రదర్శనలు జరిగాయి. హింసాత్మక ఘటనలకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ అధ్యక్షుడు మిలన్‌దత్తా డిమాండ్ చేశారు. ఇలా ఉండగా, బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వాన్నిఅస్థిరపరిచే కుట్రలో భాగంగానే దుర్గాపూజ ఉత్సవాల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. బంగ్లా ఘటనలపై విదేశాంగ శాఖ స్పందించింది. పరిస్థితులు చేజారకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో బంగ్లా అధికార యంత్రాంగంతో అక్కడి భారత దౌత్య కార్యాలయం టచ్‌లో ఉందని పేర్కొంది. కోల్‌కతాలో ఇస్కాన్ నిరసన బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ ఆదివారం కోల్‌కతాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట రెండు గంటలపాటు ఆందోళన నిర్వహించారు. -
మత కలహాలను రేకెత్తించడమే ఆంధ్రజ్యోతి ఉద్దేశం
సాక్షి, అమరావతి: తిరుమల, తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ప్రతిష్టను దిగజార్చి, సమాజంలో మత కలహాలను రేకెత్తించే ఉద్దేశంతోనే ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం హైకోర్టుకు నివేదించారు. ఆంధ్రజ్యోతి కథనాల వెనుక దురుద్దేశాలున్నాయని చెప్పారు. టీటీడీపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఈ కథనంపై నెలరోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేస్తామని డీజీపీ కౌంటర్ దాఖలు చేశారని, అప్పటివరకు హైకోర్టే పర్యవేక్షించాలని కోరారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. టీటీడీలో అన్యమత ప్రచారమంటూ ఆంధ్రజ్యోతి అసత్య కథనం ప్రచురించిందంటూ టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
నగరంలో ఢిల్లీ తరహా అల్లర్లకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన తరహాలో నగరంలోనూ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకుల్ని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. సిటీలో మత ఘర్షణలు రేపేందుకు వీరు ఓ ప్రార్థన స్థలంపై 3 కిరోసిన్ బాంబులు విసిరారు. అంతకుముందే రెండు ఏటీఎంలకు నిప్పుపెట్టగా, ఆర్టీసీ బస్సు దగ్ధానికి యత్నించారు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఓ వివాదాస్పద వ్యక్తి ప్రసంగాలతో ప్రేరణ పొందిన వీరిద్దరూ ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా వీరిని పట్టుకున్నారు. ప్రసంగాలతో స్ఫూర్తిపొంది.. రియాసత్‌నగర్‌కు చెందిన అర్షద్, హఫీజ్‌బాబానగర్‌కు చెందిన వసీ స్నేహితులు. ఒకరు చిరువ్యాపారి కాగా, మరొకరు విద్యార్థి. వీరిద్దరు స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్లో ఓ వివాదాస్పద వ్యక్తి ప్రసంగాలు చూసేవారు. వాటి ద్వారా స్ఫూర్తి పొంది..తాము ఏదో ఒక సంచలనం సృష్టించాలని ఆలోచించేవారు. ఈ క్రమంలోనే ఓసారి మిథాని డిపోలో ఆర్టీసీ బస్సును దగ్ధం చేయడానికి, ఫిబ్రవరి 11న చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని రెండు ఏటీఎంలకు నిప్పు పెట్టడానికి యత్నించారు. ఇటీవల సీఏఏ, ఎన్నార్సీలపై ఢిల్లీలో జరిగిన ఘర్షణల వంటివి హైదరాబాద్‌లోనూ సృష్టించాలని కుట్రపన్నారు. రెండు వర్గాల మధ్య మత ఘర్షణ సృష్టిస్తేనే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పథకం వేశారు. ఈ క్రమంలో ఈ నెల మొదటి వారం నుంచి వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అనేక ప్రాంతాల్లో రెక్కీ చేశారు. మాదన్నపేటలోని ఓ ప్రార్థన స్థలాన్ని టార్గెట్‌గా చేసుకుని, గత నెల 14 రాత్రి అక్కడకు వెళ్లి మూడు కిరోసిన్ బాంబులు విసిరారు. అవి పేలకపోవడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలపై స్థానిక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి, అనుమానితుల వాహనం నంబర్ గుర్తించారు. దీని ఆధారంగా ప్రత్యేక టీమ్ సోమవారం రాత్రి అర్షద్, వసీని పట్టుకుంది. వీరి నుంచి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతాలకు అర్షద్.. వసీని ప్రేరేపించాడని పోలీసులు గుర్తించారు. -
టీడీపీ కుట్రలన్నీ చిత్తుచిత్తు
సాక్షి, అమరావతి : ఓవైపు ప్రజా సంక్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మరోవైపు అసత్య ప్రచారాలు, పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురదజల్లుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఇదీ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం. తెలుగుదేశం సాగిస్తున్న దుష్ప్రచారం వెనుక దాగి ఉన్న అసలు గుట్టు ఎప్పటికప్పుడు బయట పడుతుండడం, ఆ పార్టీ నేతల దందాలు, అవినీతి బాగోతాలు వెలుగు చూస్తుండడంతో చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మూడోస్థానం దక్కించుకోవడం ప్రజాభిప్రాయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆ బస్సు టిక్కెట్లు బాబు సర్కారు నిర్వాకమే ప్రజల్లో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, పబ్బం గుడుపుకోవడానికి టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడింది. తిరుమల, శ్రీశైలంలో అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు సోషల్ మీడియా వేదికగా కుయుక్తులు పన్నింది. తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక హజ్, జెరూసలేం యాత్రలకు సంబంధించిన ప్రకటనలు ఉండటాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ దుష్ప్రచారానికి తెగబడింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఆ టిక్కెట్లు ముద్రించారని ఆధారాలతో సహా బయట పడడంతో టీడీపీ కుట్రలు చెల్లాచెదురయ్యాయి. శ్రీశైలం దేవస్థానంలో అన్య మతస్తులను చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే నియమించారని దేవాదాయ శాఖ రికార్డులే తేల్చిచెప్పాయి. దాంతో తెలుగుదేశం పార్టీ ఇక నోరు మెదపలేకపోయింది. అమెరికాలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేయలేదని బీజేపీలో చేరిన ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. ఈ అంశాన్ని వివాదాస్పదం చేయాలని యత్నించారు. కానీ, అమెరికాలో ఆ ప్రాంతం ఫైర్ రిస్ట్రిక్ట్ జోన్ కాబట్టే అక్కడ జ్యోతి ప్రజ్వలన చేయడం సాధ్యం కాలేదని నిర్వాహకులు ప్రకటించడం కుట్రదారులకు చెంపపెట్టుగా మారింది. శ్రీవారి సొమ్ముతో చంద్రబాబు డాబు ఢిల్లీలో శ్రీవారి ఉత్సవాల నిర్వహణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేసిన నిధులను దారిమళ్లించారని టీడీపీ మరో తప్పుడు ప్రచారానికి ఒడిగట్టింది. కాగా, శ్రీవారి ఉత్సవాల కోసం కేటాయించిన రూ.5 కోట్లను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఢిల్లీ పర్యటనలు, దీక్షలకే ఖర్చు చేశారని టీటీడీ స్పష్టం చేసింది. దీంతో టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. బెడిసికొట్టిన బురద రాజకీయం కృష్ణా నదికి వరదలు రాగానే టీడీపీ బురద రాజకీయానికి తెరతీసింది. వరదల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో రైతులుగా పేర్కొన్నవారు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కించపరుస్తూ దూషించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఆ వీడియోలో ఉన్నవారు నిజానికి రైతులు కారని, వాళ్లు టీడీపీ ఎన్నికల ప్రచార చిత్రాల్లో నటించిన జూనియర్ ఆర్టిస్టులన్న నిజం బయటపడింది. ఆ వీడియో చిత్రానికి నిర్మాతలు టీడీపీ నేతలేని తేటతెల్లమైంది. కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు ఉంటున్న ఇల్లు సక్రమమేనన్న టీడీపీ వాదన కృష్ణా వరదలతో బెడిసికొట్టింది. చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరడంతో ఆయన ముందుగానే హైదరాబాద్‌కు పలాయనం చిత్తగించారు. వరదల తీవ్రతను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయబోయి బొక్కబోర్లా పడింది. తెలంగాణలో ఆశా వర్కర్లపై పోలీసులు లాఠీచార్జీ చేస్తే, అది ఏపీలో జరిగిందంటూ టీడీపీ సాగించిన అసత్య ప్రచారం నిలువునా నీరుగారిపోయింది. కేరళలో ఓ దేవస్థానం వద్ద పోలీసు అధికారి లాఠీచార్జీ చేస్తే, అది తిరుమల ఆలయం వద్ద జరిగిందంటూ టీడీపీ విసరబోయిన పాచిక పారలేదు. టీడీపీ నేతల అక్రమాలు బట్టబయలు చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు సాగించిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆ పార్టీ నాయకత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం గుంటూరు జిల్లాలో కొనసాగించిన దందాల బాగోతం తెరపైకి రావడం, అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఆయన తన సొంత కార్యాలయానికి తరలించడం విస్మయానికి గురిచేసింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని గుంటూరు జిల్లాలో సాగించిన అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామ వాలంటీర్ల నియామకాలను అడ్డుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలను న్యాయస్థానం తిప్పికొట్టింది. నిరుద్యోగులపై చంద్రబాబు మొసలి కన్నీరు కార్చాలని చూడగా, సీఎం వైఎస్ జగన్ ఒకేసారి 4.15 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టడంతో టీడీపీ నోటికి తాళం పడింది. -
శ్రీలంకలో ‘కనిపిస్తే కాల్చివేత’
కొలంబో: దేశంలోని వాయవ్య ప్రావిన్స్‌సహా పలు పట్టణాల్లో మత ఘర్షణలు చెలరేగడంతో శ్రీలంక దేశవ్యాప్తంగా సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకూ కర్ఫ్యూ విధించింది. నిబంధనలను అతిక్రమించే వారిని కన్పించినచోటే కాల్చిచంపాలని ఆర్మీకి ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండాలనీ, తప్పు డు వార్తలను, వదంతులను నమ్మవద్దని ప్రధాని విక్రమసింఘే విజ్ఞప్తి చేశారు. ‘ముస్లిం’ షాపులు ధ్వంసం శ్రీలంకలోని వాయవ్య ప్రాంతంలో ఉన్న కులియపిటియా, బింగిరియా, దుమ్మలసురియా, హెట్టిపోలా పట్టణాల్లో మెజారిటీ సింహాళీయులు, ముస్లింల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో వదంతులు వ్యాపించకుండా ఫేస్బుక్, వాట్సాప్‌లపై మళ్లీ నిషేధం విధిస్తున్నామని సైన్యం తెలిపింది. ఈస్టర్ ఉగ్రదాడులకు సంబంధించి శ్రీలంక పోలీసులు ఇప్పటివరకూ వెయ్యి మందికిపైగా అనుమానితులను అరెస్ట్ చేశారు. -
బిహార్‌లో మరోసారి మతఘర్షణలు
నవాద: బిహార్‌లో మరోసారి మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. నవాద జిల్లాలోని ఓ గ్రామంలో విగ్రహాన్ని అపవిత్రం చేశారంటూ ఆందోళనకారులు శుక్రవారం అనేక వాహనాలను ధ్వంసం చేశారు. ఓ హోటల్‌కు నిప్పు అంటించారు. గోదాపూర్ గ్రామంలో ఓ విగ్రహం కూలిపోయి ఉండటంతో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకోవడంతో గొడవ ప్రారంభమైందని నవాద జిల్లా కలెక్టర్ కౌశల్ చెప్పారు. ఆ తర్వాత ఆందోళనకారులు జాతీయ రహాదారి–31పైకి వెళ్లి వాహనాలపై రాళ్లు విసిరి వాటిని ధ్వంసం చేశారనీ, వార్తల సేకరణకు వచ్చిన స్థానిక విలేకరులను కొట్టడంతోపాటు ఓ హోటల్‌కు నిప్పు పెట్టారని చెప్పారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. కేంద్రంమంత్రి అశ్వినీ కుమార్ చౌబే కొడుకు అరిజిత్ ఆధ్వర్యంలో ఈ నెల 17న భాగల్పూర్లో దేవుడి ఊరేగింపు వేడుక సందర్భంగా మత ఘర్షణలు చెలరేగాయి. -
కాంగ్రెస్ పాలనలోనే మత కలహాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలోనే మత కలహాలు జరిగాయని, వేల మంది దుర్మరణం చెందారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. బీజేపీ పాలనలో అలా జరగలేదని సోమవారం పేర్కొన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందంటూ బీజేపీపై పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ముస్లిం మహిళల హక్కుల గురించి, వారి ఆత్మాభిమానం గురించి మాట్లాడే పరిస్థితి ఉండటం శోచనీయమన్నారు. ఇది ఎవరి నిర్వాకం వల్ల జరిగిందో తెలుసుకోవాలని ప్రశ్నించారు. -
‘మత ఘర్షణలకు బీజేపీ కుట్ర’
బెంగళూరు: రాష్ట్రంలో మత ఘర్షణలు రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ ఆరోపించారు. తీర్థహళ్లిలో విద్యార్థి నందితా మృతిని ఇందుకు పావుగా వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ...తీర్థహళ్లి విద్యార్థిని నందితా మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, అయినా కూడా ఈ అంశంలో బీజేపీ అనవసర రాద్ధాంతానికి దిగుతోందని విమర్శించారు. ఇక తమ ప్రభుత్వంలోని మంత్రులు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఈ సందర్భంగా కిమ్మనె రత్నాకర్ పునరుద్ఘాటించారు.